Search
  • Follow NativePlanet
Share
» » గోదారమ్మ పుట్టుకకు కారణం ఓ ఆవు, ఆ ఘటన జరిగింది మన ఆంధ్రలోనే

గోదారమ్మ పుట్టుకకు కారణం ఓ ఆవు, ఆ ఘటన జరిగింది మన ఆంధ్రలోనే

గోదావరి నదికి సంబంధించిన కథనం

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా వర్షాలు బాగా పడుతున్నాయి. దీంతో నదీ జలాలలన్నీ పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తున్నాయి. ఇందుకు దక్షిణ భారత దేశంలోని రాష్ట్రాలు కూడా అతీతం కాదు. ముఖ్యంగా దక్షిణ భారత దేశంలోని రాష్ట్రాలను సస్యస్యామలం చేసే నదుల్లో గోదావరి కూడా ముందు వరుసలో ఉంటుంది. మహారాష్ట్రలోని త్రయంబకేశ్వరంలో గోదావరి జన్మస్థలం అన్న విషయం తెలిసిందే. అయితే గోదావరి పుట్టుకకు కారణం మన తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన ఆంధ్రప్రదేశ్ లోని కొవ్వూరు కారణమని తెలుసా. ఈ కొవ్వూరు ప్రధాన పుణ్యక్షేత్రంగా కూడా విరాజిల్లుతోంది. ఇందుకు సంబంధించిన కథనం మీ కోసం...

గోదారమ్మ

గోదారమ్మ

P.C: You Tube

ప్రస్తుత పశ్చిమ గోదావరి జిల్లాలోని కొవ్వూరును పూర్వం గోష్పాదం, గోవూరు అనిపిలిచేవారు. ఇక్కడ గౌతమ మహర్షి తపస్సు చేసుకొంటూ అనేక గోవులను పోషిస్తూ ఉండేవాడు. ఆయన గోవుల పాద ముద్రలు ఆ ప్రదేశమంతటా ఉండేవి. అందువల్లే ఆ ప్రాంతాన్ని గోష్పాద క్షేత్రమని పిలిచేవారు. ఇక గోవులన్నీ ఇక్కడ ఉండేవి కాబట్టి దానికి గోవూరు అని కూడా పిలిచేవారు.

గోదారమ్మ

గోదారమ్మ

P.C: You Tube


అదే కాల క్రమంలో కోవూరు, కొవ్వూరుగా మారిపోయింది. ఇక స్థలపురాణాన్ని అనుసరించి ఈ ప్రాంతంలో ఒకసారి పెద్ద కరువు వచ్చి పడింది. ప్రజలు తిండి లేక నానా అవస్తలు పడసాగారు. దీంతో గౌతమ మహర్షి తన తప:శక్తిని ఉపయోగించి అదరికీ ప్రతి రోజూ మూడు పూటల భోజనం పెట్టేవారు. దీంతో ఆయన కీర్తి నలు దిశలా వ్యాపించింది.

గోదారమ్మ

గోదారమ్మ

P.C: You Tube

ఇది సహించలేని ఇంద్రుడు ఓ మాయ ఆవును స`ష్టించి గౌతముడి పొలాన్ని నాశనం చేయమని పంపిస్తాడు. ఆ మాయ ఆవు కొవ్వూరు చేరుకొని గౌతముని పొలాన్ని నాశనం చేస్తుంది. ఇది తెలియని గౌతముడు ఆ మాయ ఆవును ఒక దర్భతో అదిలిస్తాడు. దీంతో ఆ ఆవు చనిపోతుంది. దీంతో గౌతముడికి గో హత్యా పాతకం చుట్టు కొంటుంది.

గోదారమ్మ

గోదారమ్మ

P.C: You Tube

దీంతో తోటి బ్రాహ్మణులు ఎవరూ ఆయన ఇంట భోజనం చేయరు. పాప పరిహారం కోసం గౌతముడు నారదముని సూచనమేరకు పరమశివుడి గురించి మహారాష్ట్ర వద్ద ఉన్న బ్రహ్మగిరి శిఖరం చేరుకొని త్రయంబకేశ్వరం వద్ద శివుడి గురించి తపస్సు చేస్తాడు. ఆయన కోరికను మన్నించి శివుడు తన జఠాజూటం నుంచి గంగమ్మను కిందికి వదులుతాడు.

గోదారమ్మ

గోదారమ్మ

P.C: You Tube

అలా వచ్చిన గంగమ్మ చనిపోయిన గోవు మీద నుంచి పారడంతో గోదావరి అని పేరు వచ్చింది. అదే విధంగా గౌతముడు వల్ల గంగ భూమి పైకి వచ్చింది కాబట్టి దీనినికి గౌతమి అని పేరు కూడా వచ్చింది. అదే విధంగా గోష్పాద క్షేత్రం ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా మారింది. ఇక్కడే గోదావరి వశిష్ట, గౌతమి అనే రెండు పాయలుగా చీలుతుంది.

గోదారమ్మ

గోదారమ్మ

అటు పై మరో ఐదు చిన్న పాయలుగా చీలుతుంది. ఈ పాయలను సప్త గోదావరిగా పిలుస్తారు. ఇక పశ్చిమ గోదావరిలో ఈ గోదావరి తీరం వెంబడి అనేక పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. అందులో అచంట, నరసాపురం, కొండాలమ్మ దేవాలయం, కపిల మల్లేశ్వరస్వామి దేవాలయం, రాజగోపాలస్వామి దేవాలయం, మదన గోపాల స్వామి దేవాలయం, లలితాంబ గుడి వంటి ఆలయాలు ఉన్నాయి. ఇవన్నీ ప్రముఖ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రాలుగా విరాజిల్లుతున్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X