Search
  • Follow NativePlanet
Share
» »రోగాలను నయం చేసే శివుడు ఎక్కడున్నాడో మీకు తెలుసా?

రోగాలను నయం చేసే శివుడు ఎక్కడున్నాడో మీకు తెలుసా?

మహారాష్ట్రలోని ఉన్కేశ్వర్ లోని శివలింగాన్ని శ్రీరాముడు ప్రతిష్టించాడట. ఈ దేవాలయం మహారాష్ట్ర, ఆదిలాబాద్ సరిహద్దులో వున్నది. ఇక్కడి వేడినీటి కుంటలో స్నానం ఆచరిస్తే సర్వ రోగాలు నయమవుతాయి.

By Venkata Karunasri Nalluru

ఉన్కేశ్వర్ శివాలయం మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కిన్వాట్ తాలూకా మాండ్వి దండకారణ్యం సమీపంలో వుంది. సాధారణంగా శివుడ్ని రోగనాశకుడు అని చెబుతారు.

మహారాష్ట్రలోని ఉన్కేశ్వర్ లోని శివలింగాన్ని శ్రీరాముడు ప్రతిష్టించాడట. ఈ దేవాలయం మహారాష్ట్ర, ఆదిలాబాద్ సరిహద్దులో వున్నది. ఇక్కడి వేడినీటి కుంటలో స్నానం ఆచరిస్తే సర్వ రోగాలు నయం అయ్యి శరీరం ఆరోగ్యవంతం అవుతుందట.

ఇది కూడా చదవండి: ఒకే కొండ మీద 1000కి పైగా దేవాలయాలు ఎక్కడ వున్నాయో మీకు తెలుసా ?

ఉన్కేశ్వర్ శివాలయం

1. వాల్మీకి రామాయణంలో ఉన్కేశ్వర్ ప్రస్తావన

1. వాల్మీకి రామాయణంలో ఉన్కేశ్వర్ ప్రస్తావన

వాల్మీకి రామాయణంలో ఉన్కేశ్వర్ క్షేత్రాన్ని ప్రస్తావించాడు. పురాణం ప్రకారం శర్భంగుడు అనే మహర్షి ఈ ప్రాంతంలోని అడవులలో శ్రీరాముని జపం చేస్తుండేవాడట. కానీ ఈ మహర్షి చర్మవ్యాధులతో అస్వస్థతకు లోనయ్యాడు. అయినా కూడా శ్రీరామ నామాన్ని వదలకుండా స్మరిస్తూనే వున్నాడు.

pc:Youtube

2.మహాశివ లింగ ప్రతిష్ఠాపన

2.మహాశివ లింగ ప్రతిష్ఠాపన

అంతట శ్రీరాముడు దయతలచి శర్భంగుడ్ని కలవాలనుకున్నాడట. అయితే చర్మవాధులతోనున్న తన రూపంతో శ్రీరాముడిని దర్శించుకొనుటకు శర్భంగుడికి ఇష్టం లేదు. ఈ విషయాన్ని గ్రహించిన రాముడు రెండు బాణాలు ఉన్కేశ్వర్ వైపు సంధించాడు. అందులో ఒకటి వ్యాధులను మటుమాయంచేసే సరోవరస్థాపనకూ, మరొకటి మహాశివ లింగ ప్రతిష్ఠాపనకూ కారణమయ్యాయి.

pc:Youtube

3.వేడినీటి సరోవరం

3.వేడినీటి సరోవరం

అంతట శ్రీరామచంద్రుడు శర్భంగరుషికి దర్శనమిచ్చి ఈ విధంగా చెప్పాడు. మొదట వేడినీటి సరోవరంలో స్నానమాచరించి మహా శివలింగాన్ని పూజించమని చెప్పాడు. అలాచేసిన శర్భంగరుషి వ్యాధులన్నీ మటుమాయమయ్యాయి. తర్వాత శర్భంగరుషి ఎందరికో ప్రకృతి వైద్యం అందజేసి జీవసమాధి అయ్యాడు. ఇప్పుడున్న దేవాలయం శర్భంగరుషి సమాధి దగ్గరే నిర్మించారు.

pc:Youtube

4. రోగవిముక్తి

4. రోగవిముక్తి

ఆలయ సరోవరంలో వరుసగా కొన్నిరోజులు స్నానమాచరిస్తే ఎంతటి చర్మవ్యాధులైనా నయమవుతాయన్నది భక్తుల నమ్మకం. కానీ శాస్త్రవేత్తలు ఈ నీళ్లలో సల్ఫర్‌ వుండటం వలన ఇలా అవుతుందని అంటారు.

pc:Youtube

5.ఎంతోమంది వ్యాధిగ్రస్తులు

5.ఎంతోమంది వ్యాధిగ్రస్తులు

అందుకే ఎక్కడెక్కడనుంచో ఎంతోమంది వ్యాధిగ్రస్తులు ఇక్కడికొస్తుంటారు. దేవస్థానం వారే ఇక్కడ ప్రకృతి వైద్యశాలను నిర్వహిస్తున్నారు. దాదాజీ అనే ప్రకృతి వైద్యుడు చాలా కాలంగా ఇక్కడ సేవలందిస్తున్నారు.

pc:Youtube

6.వసతి సదుపాయం

6.వసతి సదుపాయం

ఆలయానికి సంబంధించిన ఆశ్రమంలో రోగులు ఉండేందుకు వసతి సదుపాయం ఉంది. ఈ సేవలన్నీ ఉచితమే. ప్రస్తుతం ఈ ఆశ్రమంలో 100 మందికిపైగా రోగులు వైద్యం పొందుతున్నారు. వీరంతా రోజూ ఇక్కడి వేడినీటి సరోవరంలోని నీటితో స్నానమాచరించి, దైవదర్శనం చేసుకున్న తర్వాత దాదాజీ ఆధ్వర్యంలో యోగా, ధ్యానం, తదితర వ్యాయామాలు చేస్తారు. తెల్లమచ్చలు, సొరియాసిస్‌, పక్షవాతం, స్కెలిరోడర్మ తదితర వ్యాధులవారు ఎక్కువగా ఇక్కడికి వస్తుంటారు.

ఇది కూడా చదవండి:రోజులో కాసేపు మాత్రమే కనిపించే దేవాలయం ! ఎక్కడుందో మీకు తెలుసా?

pc:Youtube

7. శైవ సంప్రదాయం

7. శైవ సంప్రదాయం

శైవ సంప్రదాయం ప్రకారం ఆలయంలో నిత్య పూజలు నిర్వహిస్తారు. తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో హారతితో పూజ మొదలవుతుంది.

pc:Youtube

8. గాయత్రి మంత్ర జపం

8. గాయత్రి మంత్ర జపం

ఆలయంలో గాయత్రి మంత్ర జపం జరుగుతుంది. ప్రతి రోజూ భజన కార్యక్రమాలు కూడా జరుగుతాయి. ఈ ఆలయంలో దత్తాత్రేయుడి విగ్రహం కూడా వుంది. మహాశివరాత్రి, దత్తజయంతి, రామనవమి, వినాయక చవితి పండుగలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు.

pc:Youtube

9. జాతరలు

9. జాతరలు

ఇక్కడ జాతరలు కూడా జరుగుతాయి. సరిహద్దు ప్రాంతం కావడం వల్ల మరాఠాలతో పాటు తెలుగు భక్తులూ పెద్ద ఎత్తున ఆలయానికి వస్తారు.

pc:Youtube

10. అన్నదానం

10. అన్నదానం

రోజూ ఇక్కడికి వచ్చే భక్తులతోపాటు, వైద్యం పొందేవారికి అన్నదానం జరుగుతుంది.

pc:Youtube

11. ఎలా చేరుకోవాలి

11. ఎలా చేరుకోవాలి

ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రం నుంచి ఉదయంపూట నిరంతరం బస్సులూ, ఇతర వాహనాలూ తిరుగుతుంటాయి. మాహోర్‌ వెళ్లే ప్రతి ఆర్టీసీ బస్సూ ఉన్కేశ్వర్‌ మీదుగా వెళ్తుంది. నాందేడ్‌ నుంచి గంటగంటకూ బస్సు ఉంటుంది. నాందేడ్‌ నుంచి 124 కిలోమీటర్లు, ఆదిలాబాద్‌ నుంచి 56 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయానికి వెళ్లడానికి బస్సు, రైలు సౌకర్యాలున్నాయి.

pc:Youtube

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X