» »ఒకే కొండ మీద 1000కి పైగా దేవాలయాలు ఎక్కడ వున్నాయో మీకు తెలుసా ?

ఒకే కొండ మీద 1000కి పైగా దేవాలయాలు ఎక్కడ వున్నాయో మీకు తెలుసా ?

By: Venkata Karunasri Nalluru

మన భారతదేశంలో కొండలు లేదా పర్వతాలపైన దేవాలయాలు వుండటం సాధారనమైన విషయం. అయితే ఒకే ఒక విశాలమైన కొండ మీద 1000కి పైగా దేవాలయాలు వుండటం ఆశ్చర్యం కలిగించే విషయం ! కానీ ఇది నిజం. అవును గుజరాత్ రాష్ట్రంలో భావ్‌నగర్ జిల్లాలో పాలిటానా అనే నగరంలో శత్రుంజయ అనే కొండ మీద ఈ అరుదైన ఆలయాలను చూడవచ్చును. ఈ పర్వతాలు జైనుల పంచక్షేత్రాలలో ఒకటి..

నీటిలో తేలియాడే 15 కిలోల బరువు వున్న మహిమ గల రాయి

ఈ ఆలయాలలో ముఖ్యమైనది ఆదీశ్వరాలయం. పాలరాతితో నిర్మించిన ఈ ఆలయంలోని శిల్పాలు అత్యంత ఆకర్షణీయంగా ఉంటాయి. చాలా దేవాలయాలు ఇక్కడ జైన మందిరాలుగా మార్పు చెందాయి. 11వ శతాబ్దం నాటి ఇక్కడి ఆలయాల్లో శిల్ప నైపుణ్యం చాలా అద్భుతంగా వుంటుంది. ఈ ప్రాంతంలో అనేక బౌద్ధ గుహలు కన్పిస్తాయి. అప్పట్లో జైన, బౌద్ధమతాలు గొప్పగా విరాజిల్లిన ప్రాంతం పాలిటానా. పాలిటానా 219 అడుగుల ఎత్తులో ఉంది.

గిన్నీసు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కెక్కిన మర్రి చెట్టు

జైన దేవాలయాలు

1. పాలిటానా దేవాలయాలు

1. పాలిటానా దేవాలయాలు

జైన మతంలో పాలిటానా దేవాలయాలు అత్యంత పవిత్రమైన తీర్థయాత్రా స్థలంగా కొనియాడబదుతున్నవి.

చిత్రకృప: Malaiya

2. పాలరాతితో చెక్కిన 3000 ఆలయాలు

2. పాలరాతితో చెక్కిన 3000 ఆలయాలు

ఈ ప్రాంతంలో అద్భుతంగా పాలరాతితో చెక్కిన 3000 ఆలయాలు శత్రుంజయ కొండపై ఉన్నాయి. ఆ ఆలయాలలో ప్రధాన ఆలయం జైన తీర్థంకరులలో మొదటి వాడైన స్వామి అధినాథ్ (రిషభదేవుడు) కి అంకితం ఈయబడింది.

చిత్రకృప: Bernard Gagnon

3. జైన ఆలయాల సమూహం

3. జైన ఆలయాల సమూహం

శత్రుంజయ కొండ పైభాగంలో జైన ఆలయాల సమూహం ఉంది. దీనిని 11 వ శతాబ్దం నుండి 1900 సంవత్సరంలో జైన తరాలవారు నిర్మించారు.

చిత్రకృప: Bernard Gagnon

4. 3800 ల రాతిమెట్లు

4. 3800 ల రాతిమెట్లు

కొండ దిగువ భాగం నుండి పై భాగానికి పోవుటకు 3800 రాతిమెట్లు బేసి స్థానాలలో అమరి ఎక్కుటకు వీలుగా యున్నవి.

చిత్రకృప:Nirajdharamshi

5. పాలరాతి చిత్రాలు

5. పాలరాతి చిత్రాలు

దేవాలయాలు అద్భుతంగా ఉన్నాయి. ఇవి పాలరాతితో కూడి రాతిపై యధార్థ ప్రార్థనా చిత్రాలు కలిగి ఉన్నాయి.

చిత్రకృప:Bernard Gagnon

6. రిషభదేవుని ఆలయం

6. రిషభదేవుని ఆలయం

ఈ దేవాలయాలలో అతి ముఖ్యమైన దేవాలయం మొదటి తీర్థంకరుడైన రిషభదేవుని ఆలయం. ఇది అలంకృతమైన శిల్పకళా ఆకృతులను కలిగియుంది. ఇతర దేవాలయాలలో కుమార్‌పాల్, విమల్‌షా మరియు సంప్రీతి రాజా ముఖ్యమైనవి.

చిత్రకృప:Bernard Gagnon

7. కుమారపాల్ సోలంకీ

7. కుమారపాల్ సోలంకీ

కుమారపాల్ సోలంకీ ఒక గొప్ప జైన్ పోషకుడు. ఇతను అతి ప్రాచీన దేవాలయం నిర్మించారు. ఈ ప్రాచీన ఆలయంలో ఒక అద్భుతమైన నగల సేకరణను చూడవచ్చును. దీనిని ప్రత్యేక అనుమతితో సందర్శించాలి. ఈ దేవాలయాలయం 11 వ శతాబ్దం నుండి 20 వ శతాబ్దం మధ్యకాలం నాటిది.

కదిలే శివలింగం ఎక్కడ వుందో మీకు తెలుసా?

చిత్రకృప:Nirajdharamshi

8. కొండపై అనేక దేవాలయాలు

8. కొండపై అనేక దేవాలయాలు

ఈ కొండపై అనేక దేవాలయాలున్నాయి. ఈ దేవాలయాలు పవిత్రమైనవి కాబట్టి జైన మత విశ్వాసం గల ప్రతి జైనుడు తన జీవిత కాలంలో ఒకసారైనా ఈ పర్వతం పైకి అధిరోహిస్తాడు.

చిత్రకృప:Shaileshpatel

9. జైన సాంప్రదాయం

9. జైన సాంప్రదాయం

ఈ పర్వతం పై గల రాళ్ళను మెట్లలా తొలిచి వేసిన రహదారి గుండా ప్రయాణించినపుడు గంటన్నర కాలం పడుతుంది. ఈ పర్వతం పైకి ఎక్కుట సాధ్యం కాని వ్యక్తులు ఎవరైనా ఉంటే వారికి స్లింగ్ కుర్చీలు అందుబాటులో వున్నాయి. జైన సాంప్రదాయం ప్రకారం, వీటి పవిత్రత పర్వతం పైనుండి క్రిందికి ఎక్కువ నుండి తక్కువకు ఉంటుంది. ఈ పర్వత ప్రయాణం కఠినమైనది.

చిత్రకృప:Trinidade

10. ఆలయ పవిత్రత

10. ఆలయ పవిత్రత

అధిరోహకుల కోసం జైన మత సంప్రదాయాల ప్రకారం నియమాలు విధించడం కఠిన తరంగా ఉంది. పర్వతారోహణ సమయమందు ఆహారం తినడం గానీ, తనతో తీసుకొని వెళ్లడం కానీ చేయరాదు. ఈ ఆలయ పవిత్రత సాయంత్ర సమయం లోపుగానే ఎక్కువగా ఉంటుందని విశ్వాసం.

చిత్రకృప:Kalpeshzala59

11. ఆంగర్ పీర్

11. ఆంగర్ పీర్

రాత్రి సమయంలో ఏ ఆత్మ కూడా ఉండదని నమ్మకం. పైన ఉండగా "ఆంగర్ పీర్" అనే ముస్లిం విగ్రహాన్ని దర్శించవచ్చు.

చిత్రకృప:Bernard Gagnon

12. పీర్ యొక్క దీవెనలు

12. పీర్ యొక్క దీవెనలు

పిల్లలు లేని స్త్రీలు పిల్లల కోసం పీర్ యొక్క దీవెనలు కోరుకుంటారు. వారు పీర్ కు చిన్న ఊయలలను అందించి, వాటి ద్వారా చల్లడం ఆచారం.

చిత్రకృప:Bernard Gagnon

13. వాయుమార్గం

13. వాయుమార్గం

పాలిటానా నుండి 51 కిలోమీటర్ల దూరంలో గల భావ్‌నగర్ వద్ద ఒక విమానాశ్రయం ఉంది. ఈ విమానాశ్రయంలో ప్రతిరోజూ రెండు విమానాలు బొంబాయికు మరియు అహ్మదాబాదుకు ఉన్నాయి. పాలిటానాకు 215 కి.మీ. దూరంలో ఒక అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. ఇచట అనేక ప్రాంతాలకు వివిధ విమాన సర్వీసులు ఉన్నాయి.

చిత్రకృప:Bernard Gagnon

14. రైలు మార్గం

14. రైలు మార్గం

పాలిటానాలో చిన్న రైల్వేస్టేషను ఉంది. ఇది సొంగథ్ మరియు భావ్‌నగర్ లను కలిపే రైలు మార్గం. అనేక రైళ్ళు సిహోర్ వద్ద ఆగుతాయి. ఈ స్టేషను అహ్మదాబాద్ మరియు గాంధీనగర్ లను కలిపే మార్గంలో ఉంది.

చిత్రకృప:Cakothari

15. రోడ్డు మార్గం

15. రోడ్డు మార్గం

భావ్‌ నగర్ నుండి పాలిటానాకు ప్రతి గంటాకూ బస్ సౌకర్యం ఉంది. అహ్మదాబాద్, టాలాజ, యున మరియు డియు ల నుండి రెగ్యులర్ బస్సులు కూడా ఉన్నాయి. యున లేదా డియు నుండి పాలిటానాకు వెళ్ళుటకు 6 గంటల సమయం పడుతుంది. పాలిటానాకు భావ్‌నగర్, అహ్మదాబాద్ లేదా వడోదర నుండి టాక్సీ సౌకర్యం కూడా ఉంది. పాలిటానా రైల్వేస్టేషను నుండి 800 మీటర్ల దూరంలో బస్ స్టేషను ఉంది.

చిత్రకృప:wikimedia.org