Search
  • Follow NativePlanet
Share
» »కృష్ణమ్మ పుట్టింటికి సంబంధించిన ఈ వివరాలు మీకు తెలిసి ఉండవు...

కృష్ణమ్మ పుట్టింటికి సంబంధించిన ఈ వివరాలు మీకు తెలిసి ఉండవు...

మహారాష్ట్రలోని మహాబలేశ్వర్ గురించి కథనం.

మహాబలేశ్వరం పర్వత మీద గోముఖం నుంచి సన్నని ధారలాగా కృష్ణానది జన్మిస్తుంది. అక్కడ నుంచి దాదాపు 1400 కిలోమీటర్లు సాగే కృష్ణానది తూర్పు తీరంలోని ఆ నది పేరుతో ఏర్పడిన కృష్ణాజిల్లా హంసల దీవి వద్ద సాగరంలో కలుస్తుంది. ఇదిలా ఉండగా ఈ కృష్ణమ్మ పుట్టిల్లు అనేక ఆధ్యాత్మిక క్షేత్రాలకు కూడా నెలవు. ఇక్కడ ప్రకృతి అందాలు మనలను మైమరిపింపజేస్తాయి. ఈ పవిత్రమైన పుణ్యక్షేత్రం ఒకప్పుడు ఖైదీలను ఖైదు చేసే జైలు. ఈ నేపథ్యంలో ఆ కృష్ణమ్మ పుట్టింటి గురించిన క్లుప్త సమాచారం మీ కోసం...

కృష్ణమ్మ పుట్టిల్లు విశేషాలు ఇవే

కృష్ణమ్మ పుట్టిల్లు విశేషాలు ఇవే

P.C: You Tube

మహారాష్ట్రలోని సతారా జిల్లాలో పశ్చిమ కనుమల్లోని ఓ పర్వత ప్రాంతమే మహాబలేశ్వర్. మహాబలేశ్వర్ సముద్రపట్టానికి 4718 అడుగుల ఎత్తలో ఉంటుంది.

కృష్ణమ్మ పుట్టిల్లు విశేషాలు ఇవే

కృష్ణమ్మ పుట్టిల్లు విశేషాలు ఇవే

P.C: You Tube

ఇక్కడ ఐదు నదులు జన్మిస్తాయి. అవి వేణి, గాయిత్రీ, సావిత్రి, కోయినా, కృష్ణమ్మ. మహాబలేశ్వర్ పట్టణాన్ని రాజా సింఘన్ నిర్మించినట్లు చెబుతారు.

కృష్ణమ్మ పుట్టిల్లు విశేషాలు ఇవే

కృష్ణమ్మ పుట్టిల్లు విశేషాలు ఇవే

P.C: You Tube

ఆయనే ఇక్కడ మహాబలేశ్వర్ దేవాలయాన్ని కూడా కట్టించాడు. ఛత్రపతి శివాజీ ఇక్కడ ప్రతాప్ ఘడ్ కోటను నిర్మించాడు. అయితే ఈ కోట అటు పై బ్రిటీష్ వారి ఆధీనంలోకి వచ్చింది.

కృష్ణమ్మ పుట్టిల్లు విశేషాలు ఇవే

కృష్ణమ్మ పుట్టిల్లు విశేషాలు ఇవే

P.C: You Tube

ఇక ఈ ప్రాంతంలో 30 దాక దర్శనీయ స్థలాలు ఉనక్నాయి. ముఖ్యంగా ఇక్కడ విల్సన్ పాయింట్ నుంచి సూర్యోదయం, సూర్యాస్తమయం చూడటానికి చాలా అందంగా కనిపిస్తుంది.

కృష్ణమ్మ పుట్టిల్లు విశేషాలు ఇవే

కృష్ణమ్మ పుట్టిల్లు విశేషాలు ఇవే

P.C: You Tube

అందువల్లే ఇక్కడకు ఎక్కువగా ప్రేమ జంటలు వస్తుంటారు. ఇక ఇక్కడ అనేక పురాతన ఆలయాలు ఉన్నాయి. అందులో ముఖ్యమైనది పంచగంగ ఆలయం.

కృష్ణమ్మ పుట్టిల్లు విశేషాలు ఇవే

కృష్ణమ్మ పుట్టిల్లు విశేషాలు ఇవే

P.C: You Tube

ఇక్కడే ఐదు నదీమ తల్లులు పుట్టాయని చెబుతారు. ఆలయం లోపల పెద్ద మంటపం ఉంటుంది. అందులో కొంచెం ఎత్తుగా పక్కపక్కనే ఐదు చిన్న తూములు ఉంటాయి.

కృష్ణమ్మ పుట్టిల్లు విశేషాలు ఇవే

కృష్ణమ్మ పుట్టిల్లు విశేషాలు ఇవే

P.C: You Tube

ఆ ఐదు తూముల నుంచే ఐదు నదులు పుట్టుకు వస్తాయి. ఈ ఐదు నదులు తర్వాత కలిసి పోయి సన్నటి నీటి ధారగా ఏర్పడుతుంది. ఈ నీటి ధార ఒక గోముఖం నుంచి వస్తుంది.

కృష్ణమ్మ పుట్టిల్లు విశేషాలు ఇవే

కృష్ణమ్మ పుట్టిల్లు విశేషాలు ఇవే

P.C: You Tube

ఆ నీటిని ప్రజలు పవిత్రంగా భావించి ఇంటికి తీసుకువెలుతారు. ఇక్కడ మరో రెండు పురాణ ప్రాధాన్యత కలిగిన ఆలయాలు ఉన్నాయి. ఇవి మహాబలేశ్వర్, అతి బలేశ్వర్ శివాలయాలు.

కృష్ణమ్మ పుట్టిల్లు విశేషాలు ఇవే

కృష్ణమ్మ పుట్టిల్లు విశేషాలు ఇవే

P.C: You Tube

ఇవి చాలా ప్రాచీనమైనవి. ఇంత పవిత్రమైన ప్రదేశంలో చాలా కాలం క్రితం చెరశాలగా వాడేవారు. అప్పుడు అక్కడ ఖైదీలు స్ట్రాబెర్రీలను పండించేవారు. అదే విధానం ఇప్పటికీ కొనసాగుతూ ఉంది.

కృష్ణమ్మ పుట్టిల్లు విశేషాలు ఇవే

కృష్ణమ్మ పుట్టిల్లు విశేషాలు ఇవే

P.C: You Tube

ఇక్కడికి వెళ్లినవారు తప్పకుండా ఆ స్ట్రాబెర్రీల రుచులను తప్పక చూస్తారు. ఇదిలా ఉండగా మహారాష్ట్రలో కృష్ణమ్మ నదీ తీరంలో ఉన్న ఆలయాల్లో సాంగ్లిలోని గణపతి ఆలయం ముఖ్యమైనది. ఇది పీష్వాల కాలంలో నిర్మించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X