Search
  • Follow NativePlanet
Share
» »ద్వారపూడి అయ్యప్ప స్వామి పుణ్య క్షేత్రం !!

ద్వారపూడి అయ్యప్ప స్వామి పుణ్య క్షేత్రం !!

ద్వారపూడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న ఒక గ్రామం. ఈ గ్రామం రాజమండ్రి నగరానికి 18.6 కిలోమీటర్ల దూరంలో ఉండి, కేవలం అర్ధగంటలో(30 నిమిషాల్లో) చేరుకొనే విధంగా ఉంటుంది.

ఇది అయ్యప్ప స్వామి దీక్షల సమయం. భక్తులు అయ్యప్ప స్వామి వారి అనుగ్రహం కొరకు నిష్టగా దీక్షలు చేసి సంక్రాంతి సమయంలో కేరళలోని మకరజ్యోతి దర్శనం తో దీక్ష విరమిస్తుంటారు. మన రాష్ట్రంలో భక్తులు ఆలయాల్లో భజనలు, కీర్తనలు చేస్తుంటారు. కేరళ లోనేనా అయ్యప్ప స్వామి ఆలయం ఉంది మన రాష్ట్రంలో లేదా అనే వారికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే ..! కేరళ రాష్ట్రంలో ఉన్న ఆలయం మాదిరిగానే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఒక ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని విశాలమైన మైదానంలో నిర్మించినారు. ఇంతకీ ఈ ఆలయం ఎక్కడ ఉందనేగా మీ సందేశం ..

ఇది కూడా చదవండి : రాజమండ్రి నగరంలోని సందర్శనీయ ప్రదేశాలు !

ద్వారపూడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న ఒక గ్రామం. ఈ గ్రామం రాజమండ్రి నగరానికి 18.6 కిలోమీటర్ల దూరంలో ఉండి, కేవలం అర్ధగంటలో(30 నిమిషాల్లో) చేరుకొనే విధంగా ఉంటుంది. రాజమండ్రి నుండి ద్వారపూడి కి ఏ పి ఎస్ ఆర్ టీ సి బస్సులు నిత్యం తిరుగుతుంటాయి. ద్వారపూడి గ్రామంలో ఫెమస్ ఏంటిది అంటే ఆది అయ్యప్ప స్వామి ఆలయమనే చెప్పాలి. అందుకే ద్వారపూడి అయ్యప్ప స్వామి పుణ్య క్షేత్రం గా వెలుగొందుతుంది. ఇక్కడున్న అయ్యప్ప ఆలయం గర్భగుడి, కేరళ లోని శబరిమలై తరహాలో అచ్చుగుద్దినట్టు ఉంటుంది. ఇక్కడున్న ఆలయ విశేషాలు మరియు పరిసరాలు ఎలా ఉంటాయో ఒకసారి వీక్షిస్తే ..

అయ్యప్ప స్వామి ఆలయం, ద్వారపూడి

అయ్యప్ప స్వామి ఆలయం, ద్వారపూడి

ద్వారపూడి లో ఉన్న అయ్యప్ప స్వామి ఆలయాన్ని కేరళలో ఉన్న శబరిమలై ఆలయం వలె కట్టినారు. ఈ ఆలయానికి వెళ్లే మార్గం పచ్చని పంట పొలాలతో, తోటలతో కనువిందు చేస్తుంది.

చిత్ర కృప : sarat_dasaka

ఆలయం బయట, ద్వారపూడి

ఆలయం బయట, ద్వారపూడి

గుడి బయట పూజసామాగ్రి, దేవుళ్ళ ఫోటోలు, పిల్లలు ఆడుకొనే బొమ్మలు వంటి ఆమ్మే దుకాణాలు, ఆకలి వేస్తే తినటానికి హోటళ్ళు వున్నాయి.

చిత్ర కృప : India Photos

ఆలయ ముఖద్వారం, ద్వారపూడి

ఆలయ ముఖద్వారం, ద్వారపూడి

గుడి ముఖ ద్వారం కు చేరుకోగానే ఎదురుగా 30 అడుగులకు పైగా ఎత్తైన హరహరి (సగం శివరూపం, సగం విష్ణు రూపం) విగ్రహం కనపడుతుంది. విగ్రహం పాదపీఠం సమీపంలో వినాయక మూర్తికి చిన్న ఆలయము కూడా ఉంది.

చిత్ర కృప : Palagiri

ఆలయం లోపలికి వచ్చే భక్తులు, ద్వారపూడి

ఆలయం లోపలికి వచ్చే భక్తులు, ద్వారపూడి

గుడి లోపలికి వచ్చే భక్తులు మొదట గణపతి ఆలయాన్ని, ఆతరువాత హరహరి విగ్రహాన్ని దర్శించుకుంటారు. ఈ విగ్రహాల వెనుకగా అయ్యప్పస్వామి గుడి వున్నది .

చిత్ర కృప : Kalanadhabhatla Ramasastry

అయ్యప్ప గుడి(ప్రధాన ఆలయం), ద్వారపూడి

అయ్యప్ప గుడి(ప్రధాన ఆలయం), ద్వారపూడి

అయ్యప్పగుడి రెండు అంతస్తులగా ఉంటుంది. పై అంతస్తులో అయ్యప్పస్వామి మందిరం ఉన్నది. క్రింది అంతస్తులో వున్న మందిరంలోకి ప్రవేశమార్గం తెరచుకున్న సింహముఖరూపంలో నిర్మించారు.

చిత్ర కృప : Kalanadhabhatla Ramasastry

ప్రధాన ఆలయంలోకి ఎలా వెళ్ళాలి?

ప్రధాన ఆలయంలోకి ఎలా వెళ్ళాలి?

పై అంతస్తులో వున్న అయ్యప్పస్వామి మందిరంకు వెళ్ళుటకు రెండు మార్గాలున్నాయి ఒకటి మాల ధారణ చేసిన భక్తులు వెళ్ళుటకు 18 మెట్లున్న దారి, మాములు భక్తులు వెళ్ళూటకు మరో మార్గం వున్నది.

చిత్ర కృప : Kalanadhabhatla Ramasastry

గర్భగుడి, ద్వారపూడి

గర్భగుడి, ద్వారపూడి

అయ్యప్ప విగ్రహం వున్న మందిరం అదేనండి గర్భగుడి పైభాగంలో గోపురం ఉన్నది. పై అంతస్తులోని మందిరం గోడలపై అయ్యప్ప స్వామి జీవితంలోని ముఖ్యఘట్టాలను బొమ్మలరూపంలో నిర్మించబడివున్నాయి.

చిత్ర కృప : Kalanadhabhatla Ramasastry

ద్వారపూడి మరిన్ని దృశ్యాలతో ..

ద్వారపూడి మరిన్ని దృశ్యాలతో ..

అయ్యప్ప స్వామి వారి దేవాలయం మొదటి అంతస్తు

చిత్ర కృప : Palagiri

ఆంజనేయ విగ్రహం, ద్వారపూడి

ఆంజనేయ విగ్రహం, ద్వారపూడి

ఆయ్యప్ప స్వామి మందిరానికి ఎదురుగా ఆంజనేయ స్వామి భారీ విగ్రహం ఉన్నది. అయ్యప్పగుడిలో నిత్యాన్నదానం జరుగుతుంది. శబరిమలై వెళ్లెలేని కొందరు భక్తులు ఇక్కడే ఇరుముడులు సమర్పిస్తారు.

చిత్ర కృప : Kalanadhabhatla Ramasastry

సాయిబాబా ఆలయం ,ద్వారపూడి

సాయిబాబా ఆలయం ,ద్వారపూడి

ప్రధాన ఆలయమైన అయ్యప్ప స్వామి ఆలయానికి ఎడమవైపు కింది భాగాన సాయిబాబా ఆలయం ఉన్నది. ఇక్కడ ప్రతి గురువారం భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. అయ్యప్ప స్వామి ఆలయ దర్శనానికి వచ్చే భక్తులు సాయిబాబా ఆలయాన్ని కూడా దర్శించుకుంటారు.

చిత్ర కృప : Kalanadhabhatla Ramasastry

శివాలయం , ద్వారపూడి

శివాలయం , ద్వారపూడి

అయ్యప్ప స్వామి ఆలయానికి పక్కనే శివాలయం కలదు. దేవాలయ ముఖద్వారం లో ఏనుగులు తోండంతో పూలహారాన్ని పట్టుకొని నిలబడి ఉన్న బొమ్మలు ఉన్నాయి. శివాలయానికి ఒక పక్క నంది విగ్రహం, ఎదురుగా నటరాజ విగ్రహం మరియు వెనకవైపున యగ్ఞాలు, యాగాలు నిర్వహించుకొనేందుకు యాగశాల ఉన్నాయి.

చిత్ర కృప : rammohan kandlakunta

వెంకటేశ్వర స్వామి వారి ఆలయం, ద్వారపూడి

వెంకటేశ్వర స్వామి వారి ఆలయం, ద్వారపూడి

వెంకటేశ్వర స్వామి ఆలయం అయ్యప్ప స్వామి ఆలయం పక్కనే ఉన్నది. ఈ ఆలయం చాలా వైవిధ్యంగా ఉంటుంది. ఆలయ గోపురాలకు నలువైపుల ఉన్న గోడలకు రంగు అద్దాలను బిగించి కట్టారు. ఈ వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఒక పక్క గుండె చీల్చి సీతారాముల ను చూపిస్తున్న ఆంజనేయుని విగ్రహం ఉంది.

చిత్ర కృప : ravisankarprasad polisetty

ద్వారపూడి మరిన్ని దృశ్యాలతో ..

ద్వారపూడి మరిన్ని దృశ్యాలతో ..

శివాలయం, వేంకటేశ్వరుని ఆలయం ఒకే చోట ఉన్నాయని చెప్పే దృశ్యం

చిత్ర కృప : Palagiri

ద్వారపూడి మరిన్ని దృశ్యాలతో ..

ద్వారపూడి మరిన్ని దృశ్యాలతో ..

ముగ్ధమనోహరమైన ప్రకృతి మధ్యలో ఉన్న ఆలయం

చిత్ర కృప : Bhaskaranaidu

షాపింగ్, ద్వారపూడి

షాపింగ్, ద్వారపూడి

ద్వారంపూడి బట్టల వ్యాపారానికి ఫెమస్. ఇక్కడికి పక్కనున్న జిల్లాల నుండి వ్యాపారులు వచ్చి బట్టల వ్యాపారం చేస్తుంటారు. ఇక్కడ భక్తులు, యాత్రికులు బట్టలను కొనుగోలు చేసుకోవచ్చు.

చిత్ర కృప : ramareddy vogireddy

ద్వారపూడి కి ఎలా చేరుకోవాలి ?

ద్వారపూడి కి ఎలా చేరుకోవాలి ?

వాయు మార్గం

ద్వారపూడి కి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజమండ్రి విమానాశ్రయం దగ్గరలో గలదేశీయ విమానాశ్రయం. ఇక్కడి నుండి దేశంలోని అన్ని నగరాలకు ప్రయాణించవచ్చు. క్యాబ్ వంటి ప్రవేట్ వాహనాల మీద ద్వారపూడి చేరుకోవచ్చు

రైలు మార్గం

ద్వారపూడి లో రైల్వే స్టేషన్ ఉంది. కానీ ఇక్కడ ప్యాసింజర్ రైళ్లు మాత్రమే ఆగుతాయి. ఎక్స్‌ప్రెస్ రైళ్లలో వచ్చే ప్రయాణీకులు రాజమండ్రి లేదా సామర్లకోట రైల్వే స్టేషన్ లలో దిగి ఆటో లు, ప్రభుత్వ బస్సుల్లో ప్రయాణించి చేరుకోవచ్చు.

రోడ్డు మార్గం

ద్వారపూడి చక్కటి రోడ్డు సదుపాయాన్ని కలిగి ఉంది. రాజమండ్రి, సామర్లకోట, కాకినాడ వంటి సమీప పట్టణాల నుండి నేరుగా ప్రభుత్వ బస్సులు నడుస్తుంటాయి. బస్సులు ఆగేందుకై ఇక్కడ బస్సు షెల్టర్ కూడా నిర్మించడం జరిగింది.

చిత్ర కృప : Adityamadhav83

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X