» »మీకు తెలియని ఎలగందల్ కోట రహస్యాలు?

మీకు తెలియని ఎలగందల్ కోట రహస్యాలు?

ఎలగందల్ కోట విదేశీయుల కోటను పోలివుండటం విశేషం.అయితే పూర్వం ఇక్కడ కందులు బాగా పండించేవారట. అందుకే ఈ ప్రాంతాన్ని తెల్లకందుల అని కాలక్రమేణా ఈ ప్రాంతం ఎలాగందులగా మారిందని స్థలపురాణం చెబుతుంది.మరి ఈ కోట ఎక్కడుంది?ఈ కోటలో దాగియున్న రహస్యాలు ఏంటనేది ఈ వ్యాసంద్వారా తెలుసుకుందాం. తెలంగాణా రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాలో ఎలగందల్ అనే గ్రామం గలదు.ఈ గ్రామం కరీంనగర్ కు 16కిమీ ల దూరంలో కామారెడ్డిరోడ్డు మార్గంలో మానేరు నదీతీరంలో వున్న చారిత్రికగ్రామం. కాకతీయులకాలం నాటి సామంతుల పాలనలో వైభవాన్ని చాటుకుంది. నిర్మల్ పాలకుడు శ్రీనివాస్ కాలంలో ఇది అతని ఆధీనంలో వుండేది.1754లో ఎలగందల్ కోటకు ధ్వంస అధిపతిగా వున్నప్పుడు అసఫ్జాహ్ ఆజ్ఞ మేరకు శ్రీనివాసరావుని బంధించి అతను పాలకుడయ్యాడు.

ఎవరికీ తెలియని ఎలగందల్ కోట రహస్యాలు

మీకు తెలియని ఎలగందల్ కోట రహస్యాలు?

మీకు తెలియని ఎలగందల్ కోట రహస్యాలు?

ఎక్కడ వుంది?

ఎలగందల్ కోట తెలంగాణ రాష్ట్రం లోని కరీంనగర్ జిల్లా లో ఉంది. కరీంనగర్‌కు 10 కిలోమీటర్ల దూరంలో కామారెడ్డి రోడ్డు మార్గంలో మానేరు నదీతీరంలో తాటిచెట్ల మధ్య సుందర ప్రకృతిక నేపథ్యంలో ఈ కోట నిర్మించబడి ఉంది. ఒకప్పుడు ఈ కోట కుతుబ్ షాహీ వంశం, మొఘల్ సామ్రాజ్యం మరియు హైదరాబాద్ నిజాములు నియంత్రణలో ఉండేది.

PC:youtube

మీకు తెలియని ఎలగందల్ కోట రహస్యాలు?

మీకు తెలియని ఎలగందల్ కోట రహస్యాలు?

నిజాం పాలనలో ఈ కోట కరీంనగర్ కు ప్రధాన కార్యాలయంగా ఉండేది. కరీంనగర్ జిల్లాలో చారిత్రకంగా ఈ ప్రదేశం అయిదు సామ్రాజ్యాల చేత పాలించబడింది. పురాతన జ్ఞాపక చిహ్నాలు కొండశిఖరాన ఉన్న కోట, తూర్పు ద్వారానికి వెలుపల ఉన్న బృందావన సరసు 1774 ఎ డి ఫాఫర్ -ఉద్ - దౌలా చేత నిర్మించబడింది.

PC:youtube

మీకు తెలియని ఎలగందల్ కోట రహస్యాలు?

మీకు తెలియని ఎలగందల్ కోట రహస్యాలు?

ముస్లిమ్ సన్యాసులైన సైయద్ షాహ్ మునావర్ క్వాద్రి సాహెబ్, దూలా షాహ్ సాహెబ్, సయద్ మరూఫ్ సాహెబ్, షాహ్ తాలిబ్ బిస్మిల్లా సాహెబ్ మరియు వాలి హైదర్ సాహెబ్ సమాధులు కదిలించినప్పుడు అక్కడ ఉన్న మినార్లు ఉఉగుతాయి. ఉన్నత పాఠశాల వద్ద మరోరెండు మీనార్లు ఉన్నాయి. ఈ మీనార్లు ఎక్కడానికి లోపలి నుండి మెట్లు ఉన్నాయి.

PC:youtube

మీకు తెలియని ఎలగందల్ కోట రహస్యాలు?

మీకు తెలియని ఎలగందల్ కోట రహస్యాలు?

కరీంనగర్-వేములవాడ రహదారిలో ఎలగందల్ కోట నుండి మానకొండూర్ వరకు 9 కిలోమీటర్లు మేర రహస్య సొరంగం ఉందని నమ్ముతారు.ఎలగందల్ కోట కు వెలగందుల అని కూడా పిలుస్తారు. దీనిని కాకతీయుల (1083-1323) కాలంలో నిర్మించారు.

PC:youtube

మీకు తెలియని ఎలగందల్ కోట రహస్యాలు?

మీకు తెలియని ఎలగందల్ కోట రహస్యాలు?

యోధులైన ముసునూరి నాయక్ మరియు రాచర్ల పద్మనాయక్ లు దీనిని ధృడంగా చేశారు. 16 వ శతాబ్దంలో కుతుబ్ షాహి వంశస్తులు ఈ కోటను ఆక్రమించుకొని, క్యుయినముల్ ఉల్ ను కమాండర్ గా నియమించారు. తదనంతరం, మొఘల్ సామ్రాజ్య ఆధీనంలోకి వెళ్లింది.

PC:youtube

మీకు తెలియని ఎలగందల్ కోట రహస్యాలు?

మీకు తెలియని ఎలగందల్ కోట రహస్యాలు?

హైదరాబాద్ నిజాం ఉల్ ముల్క్ నిజాం అసఫ్జాహ్ I (1724-1748) మరియు ముగర్రాబ్ ఖాన్ హయాంలలో, అమిన్ ఖాన్ ఎలగందల్ కు ఖిలేదార్ గా నియమించబడ్డాడు. నవాబ్ సలాబత్ జంగ్ హయాంలో మిర్జా ఇబ్రహీం దంసా ఖిలేదార్ అయ్యాడు.

PC:youtube

మీకు తెలియని ఎలగందల్ కోట రహస్యాలు?

మీకు తెలియని ఎలగందల్ కోట రహస్యాలు?

సికందర్ ఝా (1803-1823) హయాంలో 1754 లో దంసా ఈ కోటను పునర్నిర్మాణం చేశాడు. బహదూర్ ఖాన్ మరియు కరీముద్దీన్ లు తరువాతికాలంలో ఖిలేదార్లుగా పనిచేశారు. కరీముద్దీన్ పేరుమీద కరీంనగర్ గా మారింది. 1905 లో జిల్లాల పునర్వ్యవస్థీకరణ సందర్భంగా, ఆరవ నిజాం మహబుబ్ ఆలీ ఖాన్ జిల్లా కేంద్రంను ఎలగందల్ నుండి కరీంనగర్ కి మార్చారు.

PC:youtube

మీకు తెలియని ఎలగందల్ కోట రహస్యాలు?

మీకు తెలియని ఎలగందల్ కోట రహస్యాలు?

శత్రువుల నుండి దాడులను నిరోధించడానికి ఎలగందల్ పాలకులు కోట చుట్టూ సుమారు 5 మీటర్లు (16 అడుగులు) వెడల్పు మరియు 4 మీటర్లు (13 అడుగులు) లోతైన నీటి కందకాన్ని ఏర్పాటుచేసి అందులో మొసళ్లను వదిలేవారు.ఈద్ ప్రార్థనల కొరకు ప్రత్యేక మసీదు ను కూడా ఈ కోటలో నిర్మించారు.

PC:youtube