
సత్ధార జలపాతపు అందాలను కనులారా ఆస్వాదించాల్సిందే
హిమాచల్ ప్రదేశ్‌లోని డల్హౌసీ ప్రాంతంలో ఉన్న సుందరమైన పర్యాటక ప్రదేశం సత్ధార జలపాతం. చంబా లోయలోని గంభీరమైన పర్వత శ్రేణుల శిఖరాలను దాటి 2036 మీటర్ల ఎత్తు నుండి ప్రవహించే ఏడు అందమైన నీటి పాయల కారణంగా ఈ సత్ధార జలపాతం పేరు వచ్చింది. ఈ అద్భుతమైన జలపాతం డల్హౌసీలో చాలా ఆహ్లాదకరమైన పరిసరాల మధ్య నిలిచింది.
ఈ ప్రదేశం మంచుతో కప్పబడిన పర్వతాల అందమైన దృశ్యాలను అందిస్తుంది. చుట్టూ పైన్ మరియు దేవదార్ చెట్లతో సందర్శకులను ఎంతగానో ఆకర్షిస్తుంది. ప్రకృతి ప్రేమికులు, ట్రెక్కింగ్ అభిమానులు మరియు ఫోటోగ్రఫీ అభిమానులు తరచుగా ఈ ప్రదేశంలో విహారానికి వస్తుంటారు. ఇది స్నేహితులు, కుటుంబం సభ్యులతో హాయిగా గడిపేందుకు సుందరమైన పిక్నిక్ స్పాట్ అనే చెప్పాలి.

గొప్ప చికిత్సా గుణాన్ని కలిగి ఉందని..
డల్హౌసీలో పర్యాటకులకు మరొక ఇష్టమైన ప్రదేశం అయిన పంచపులకు వెళ్లే మార్గంలో సత్ధార జలపాతం ఉంది. ఈ జలపాతం గొప్ప చికిత్సా గుణాన్ని కలిగి ఉందని విశ్వసిస్తారు. ఇది అన్ని వ్యాధులను నయం చేస్తుందని నమ్ముతారు. ప్రధానంగా చర్మ సంబంధిత వ్యాధులు. దీని వెనుక ఉన్న శాస్త్రీయ వివరణ ప్రకారం ఇక్కడి నీటిలో మరియు ఈ ప్రదేశంలో కనిపించే మైకా. ఇది నీటికి ఔషధ గుణాలను అందిస్తుంది. స్థానిక మాండలికంలో, దీనిని గంధక్ అంటారు. ఈ సుందరమైన జలపాతం చుట్టుపక్కల ప్రకృతి అందాలను ఆస్వాదించాలంటే మాత్రం నడక మార్గం మంచి ఎంపిక.
ఎక్కుమంది పర్యాటకులు ఈ సుందరమైన ప్రదేశానికి నడిచి, ఇక్కడి నుండి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న పంచపుల వైపు వెళతారు. అందుకే సౌకర్యవంతమైన బూట్లు మరియు దుస్తులు ధరించడం మర్చిపోకూడదు. అలాగే, నీటి సీసాలు, మెడికల్ కిట్ మరియు టోపీలను తీసుకెళ్లాలి. హిమాచల్ ప్రదేశ్‌లోని అద్భుతమైన పర్వతాల గుండా ఉదృతంగా ప్రవహించే ఏడు అందమైన నీటి పాయల నుంచి ఉప్పొంగే సత్ధార జలపాతపు అందాలను మాటల్లో వర్ణించడం కాస్త కష్టమే.

అనేక సందర్శనాకర్షణలు..
మంచుతో కప్పబడిన కొండలు, పచ్చని లోయల అందాలను ఆస్వాదిస్తూ ప్రకృతి ప్రపంచంలో సేదదీరే అనుభూతిని చేరువ చేస్తుంది ఈ ప్రాంతం. చుట్టుపక్కల కొండలలో ట్రెక్ చేస్తూ, పచ్చదనంలో నడుస్తూ ముందుకు సాగాలి. జలపాతాల అడుగుభాగంలో ఏర్పడిన కొలనులో స్నానం చేయడం మర్చపోకండి. సత్ధార ఫాల్ సమీపంలో అనేక సందర్శనాకర్షణలు ఉన్నాయి. చమేరా సరస్సు, పంచపుల, రంగ్ మహల్,
దైకుండ్ శిఖరం, కలాతోప్ వన్యప్రాణుల అభయారణ్యం, బక్రోటా కొండలు లాంటి ప్రదేశాలను అస్సలు మిస్సవ్వొద్దు.

సందర్శించడానికి ఉత్తమ సమయం
ఇక్కడి వాతావరణం ఏడాది పొడవునా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. రుతుపవనాలు జలపాతాల ప్రవాహాన్ని పెంచడానికి సహాయపడతాయి. వర్షాకాలంలో ఈ ప్రదేశం గంభీరంగా కనిపిస్తుంది. ఇక్కడికి రావడానికి ఉత్తమ సమయం పగటిపూట ఉదయం 8 నుండి సాయంత్రం 6 గంటల వరకు.

ఎలా చేరుకోవాలి
పంచపుల మార్గంలో సత్ధార జలపాతం వస్తుంది. ఇక్కడికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రధాన నగరం నుండి బస్సులు, టాక్సీలు మరియు ప్రైవేట్ వాహనాలను ఉపయోగించవచ్చు. ఇది గాంధీ చౌక్ నుండి ఒక కిలోమీటరు దూరంలో ఉంది.