Search
  • Follow NativePlanet
Share
» »విదేశీ కలెక్టర్‌కు ఎవరు ప్రత్యక్షమయ్యారో తెలుసా?

విదేశీ కలెక్టర్‌కు ఎవరు ప్రత్యక్షమయ్యారో తెలుసా?

మధురాంతంకం లోని రామాలయం గురించి కథనం.

దేవుడికి కుల, మత, ప్రాంతం భేదం లేదని చెప్పడానికి ఈ దేవాలయం ప్రత్యక్ష ఉదాహరణ. ఇక్కడ శ్రీరామచంద్రుడు తన సోదరుడైన లక్ష్మణుడి సమేతంగా ఒక మంచివాడైన ఆంగ్లేయుడికి దర్శనమిచ్చాడు. ఈ పుణ్యక్షేత్రంలో కాలుపెడితేనే మోక్షం లభిస్తుందని చెబుతారు. ఇక్కడ రామచంద్రుడి సన్నిధిలో ఆంజనేయుడి విగ్రహం మనకు కనబడదు. ఇన్ని విశిష్టతలు ఉన్న ఆ ఆలయం గురించిన పూర్తి వివరాలు నేటివ్ ప్లానెట్ పాఠకులైన మీ కోసం...

ఏరి కథ రామార్ దేవాలయం, మధురాంతకం

ఏరి కథ రామార్ దేవాలయం, మధురాంతకం

P.C: You Tube
శ్రీమన్నారాయణుడిచే బ్రహ్మపుత్రులకు ఇవ్వబడ్డ విగ్రహం కరుణాకరమూర్తిది. శారు శ్రీమన్నారయణుడి ఆదేశం ప్రకారం విభాండక మహర్షి ఆశ్రమంలో శ్రీ కరుణాకరమూర్తిని స్థాపించి తపస్సుచేసి మోక్షం పొందారు.

ఏరి కథ రామార్ దేవాలయం, మధురాంతకం

ఏరి కథ రామార్ దేవాలయం, మధురాంతకం

P.C: You Tube

శ్రీరామచంద్రుడు తన వానవాస సమయంలో విభాండకాశ్రమానికి వచ్చి శ్రీ కరుణాకరుని అర్చించాడు. అక్కడ కొంతకాలం ఉన్న తర్వాత తిరిగి సీతాన్వేషణకు బయలుదేరాడు. అటు పై తిరిగి అయోధ్యకు తిరిగి వచ్చే సమయంలో ఇక్కడ కొంత కాలం ఉంటానని విబాండక మహర్షికి చెబుతాడు.

ఏరి కథ రామార్ దేవాలయం, మధురాంతకం

ఏరి కథ రామార్ దేవాలయం, మధురాంతకం

P.C: You Tube

రామ, రావణ యుద్ధం జరగడం అందులో రాముడు విజయం సాధించడం తెలిసిందే. అటు పై పుష్పకవీమానంలో రాముడు సీతాసమేతంగా అయోధ్య బయలుదేరుతూ మధురాంతంకం వస్తాడు.

ఏరి కథ రామార్ దేవాలయం, మధురాంతకం

ఏరి కథ రామార్ దేవాలయం, మధురాంతకం

P.C: You Tube

దీంతో రాముడు మొదట కిందికి దిగి సీత దిగడానికి చేయిని అందిస్తాడు. ఇందుకు నిదర్శనంగా ఆలయంలోని మూల విగ్రహాల్లో శ్రీరాముడు సీతాదేవి చెయ్యి పట్టుకొని ఉన్న విగ్రహాలు మనకు దర్శనమిస్తాయి.

ఏరి కథ రామార్ దేవాలయం, మధురాంతకం

ఏరి కథ రామార్ దేవాలయం, మధురాంతకం

P.C: You Tube

వైష్ణవులకు అత్యంత గౌరవనీయుడైన శ్రీరామనుజాచార్యులవారికి ఈ క్షేత్రంతో గల సంబంధం వ్ల కూడా ఈ క్షేత్రం వైష్ణవులకు అతి ముఖ్యపుణ్యక్షేత్రమయ్యింది. శ్రీ రామానుజాచార్యుల వారు తన ఆధ్యాత్మిక దీక్షను పెరియనంబి దగ్గర తీసుకొన్నది ఇక్కడే.

ఏరి కథ రామార్ దేవాలయం, మధురాంతకం

ఏరి కథ రామార్ దేవాలయం, మధురాంతకం

P.C: You Tube

ఇక్కడ ఉన్న వకుళ చెట్టు వద్దకు రామానుజాచార్యలను తీసుకువెళ్లి ఆయనకు పంచ సంస్కారాలను ప్రబోధించాడు. ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధీనంలో ఈ మధురాంతకం ఉన్నప్పుడు లియనాల్డ్ ప్లేస్ అనే ఆంగ్లేయుడు కలెక్టరుగా ఉన్నాడు.

ఏరి కథ రామార్ దేవాలయం, మధురాంతకం

ఏరి కథ రామార్ దేవాలయం, మధురాంతకం

P.C: You Tube

ఆయన చాలా మంచివాడు. అన్ని ధర్మాలను ఆరాధించేవాడు. ఈ క్రమంలో ఈ మధురాంతకంలోని రామాలయం పై భాగంలోని చెరువు ప్రతి ఏడాది వర్షాలకు తెగి అపార పంట, ధన, ప్రాణ నష్టం కలిగించేది.

ఏరి కథ రామార్ దేవాలయం, మధురాంతకం

ఏరి కథ రామార్ దేవాలయం, మధురాంతకం

P.C: You Tube

అయితే మంచివాడైన లియనాల్డ్ ప్లేస్ ప్రతి ఏడాది దానిని మరమత్తులు చేయించేవాడు. ఒక ఏడాది ఆ ఊరి ప్రజలంతా కలిసి ఈ దేవాలయం ప్రాంగణంలో దుర్గదేవి ఉపాలయం కట్టించాలనుకొన్నాడు.

ఏరి కథ రామార్ దేవాలయం, మధురాంతకం

ఏరి కథ రామార్ దేవాలయం, మధురాంతకం

P.C: You Tube

అయితే ఇందుకు కలెక్టర్‌ను ధన సహాయం కోరుతాడు. అయితే కలెక్టర్ దేవుడి మీద భక్తి మంచిదే. అయితే దేవాలయం నిర్మించే సొమ్ముతో మీ పంటలకు ఆధారమైన చెరువును బాగు చేసుకోవచ్చుకదా అని చెబుతారు.

ఏరి కథ రామార్ దేవాలయం, మధురాంతకం

ఏరి కథ రామార్ దేవాలయం, మధురాంతకం

P.C: You Tube

దీంతో స్థానికులు తమకు ఆ రాముడి పై అచంచలమైన భక్తి ఉందని అందువల్ల ఆయనే ఆ ఈ చెరువును మరమత్తు చేయిస్తాడని చెబుతారు. వారు చెప్పినట్టుగానే ఆ రోజు రాత్రి చెరవును రామలక్ష్మణులు మరమత్తులు చేస్తూ ఆ కలెక్టర్‌కు కనిపిస్తారు.

ఏరి కథ రామార్ దేవాలయం, మధురాంతకం

ఏరి కథ రామార్ దేవాలయం, మధురాంతకం

P.C: You Tube

అయితే ఆ రామలక్ష్మణులు మిగిలిన ఎవరికీ కనిపించరు. దీంతో ఆ కలెక్టర్ తన భాగ్యానికి పొంగిపోయి దేవాలయంలోని ఉపాలయాన్ని తన సొంత ఖర్చులతో నిర్మిస్తాడు. ఈ కథనం ఆలయం ప్రాంగణంలో తమిళం, కన్నడ, తెలుగు భాషలో రాతిశాసనం రూపంలో మనకు ఇప్పటికీ కనిపిస్తుంది.

ఏరి కథ రామార్ దేవాలయం, మధురాంతకం

ఏరి కథ రామార్ దేవాలయం, మధురాంతకం

P.C: You Tube

ఈ ప్రసిద్ధ ఆలయంలో శ్రీరామనవమికి 10 రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయి. జూన్, జులై నెలల్లో బ్రహోత్సవాలు జరుగుతాయి. ఆలయాన్ని చేరుకోవడానికి రైలు, రోడ్డు మార్గాలు కూడా ఉన్నాయి.

ఏరి కథ రామార్ దేవాలయం, మధురాంతకం

ఏరి కథ రామార్ దేవాలయం, మధురాంతకం

P.C: You Tube

ఈ ఆలయం ఉదయం 7.30 గంటల నుంచి 12 గంటల వరకూ సాయంత్రం 4.30 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకూ అందుబాటులో ఉంటుంది. ఇక ఈ ఆలయంలోని మరో విశేషం రామచంద్రుల వద్ద ఆంజనేయుడి విగ్రహం లేకపోవడం.

ఏరి కథ రామార్ దేవాలయం, మధురాంతకం

ఏరి కథ రామార్ దేవాలయం, మధురాంతకం

P.C: You Tube

సీతాదేవిని చెరవిడిపించి లంక నుంచి సీతా సమేతంగా అయోధ్యకు రాముడు తిరిగి వస్తుంటాడు. ఈ విషయాన్ని భరతుడికి తెలియజేయడానికి ఆంజనేయుడు వెలుతాడు. అందువల్లే ఇక్కడ రామచంద్రుడితో పాటు ఆ ఆంజనేయుడి విగ్రహం ఉండదు.

ఏరి కథ రామార్ దేవాలయం, మధురాంతకం

ఏరి కథ రామార్ దేవాలయం, మధురాంతకం

P.C: You Tube

ఇక్కడ మూడు వరుసల్లో ఉత్సవ విగ్రహాలు ఉంటాయి. మొదటిది శ్రీమన్నారాయణుడి చేత ప్రతిష్టించబడిన కరుణాకర మూర్తి విగ్రహం. రెండో వరుసలో శ్రీ రామానుజుడు పూజించిన విగ్రహాలు. అటు పై మిగిలిన విగ్రహాలు ఉంటాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X