Search
  • Follow NativePlanet
Share
» »రూ.25వేలు కంటే తక్కువగా భూతల స్వర్గం కాశ్మీర్ అందాలన్నీ మీ సొంతం...విమాన ప్రయాణ ఖర్చులూ ఇందులోనే

రూ.25వేలు కంటే తక్కువగా భూతల స్వర్గం కాశ్మీర్ అందాలన్నీ మీ సొంతం...విమాన ప్రయాణ ఖర్చులూ ఇందులోనే

By Kishore

వేసవిలో పర్యకాలు సర్వసాధారణం. ముఖ్యంగా చల్లని వాతావరణ పరిస్థితులు ఉన్న హిల్ స్టేషన్లు, లేదా బీచ్ లకు ఎక్కువ మంది వెళ్లడానికి ఇష్టపడుతారు. హిల్ స్టేషన్లు అన్న తక్షణం మనకు గుర్తుకు వచ్చేది జమ్ము కాశ్మీర్. ఇక్కడి చల్లని వాతావరణం, మంచుతో కప్పబడిన పర్వత శిఖరాలు పర్యాటకులను రారమ్మని ఆహ్వానిస్తూ ఉంటాయి. అయితే జమ్ము కాశ్మీర్ కు వెళ్లి అక్కడ కనీసం మూడు రోజులు గడపాలంటే లక్షరుపాయలు ఖర్చవుతుందని చాలా మంది భావిస్తూ ఉంటారు. అయితే సరిగా ప్రణాళిక వేసుకుంటే కేవలం రూ.25 వేలు కంటే తక్కువ ఖర్చుతో ఆ కాశ్మీర్ అందాలను చూసి రావచ్చు. ముఖ్యంగా దాల్ సరస్సులో బోట్ హౌస్ ప్రయాణం, ఫ్లోటింగ్ మార్కెట్ సందర్శన, నిషాంత్ బాగ్ ఫౌటైన్లు, శంకరాచార్య దేవాలయం, పహల్గామ్, పొన్నీ ప్రయాణం, గుల్మార్గ్ లో దాదాపు 3000 మీటర్ల ఎత్తులో కేబుల్ కార్లో ప్రయాణంతో పాటు కాశ్మీరీ రుచులను కూడా రూ.25 వేలు కంటే తక్కువ ఖర్చుతో మన పర్యాటకాన్ని ముగించవచ్చు. ఇందుకు సంబంధించిన వివరాలన్నీ మీ కోసం...

సంతానం, సుమంగళి యోగాన్ని ప్రసాదించే పార్వతి దేవి ప్రతిష్టించిన శివ రూపం

1. ఎలా చేరుకోవాలి

1. ఎలా చేరుకోవాలి

Image Source:

భారత దేశంలోని చాలా నగరాల నుంచి శ్రీనగర్ కు నేరుగా విమానయాన సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. తక్కువ ధరకు టికెట్టు దొరకాలంటే సాధ్యమైనంత త్వరగా టికెట్లను రిజర్వ్ చేసుకోవడం ఉత్తమం.

2. మొదటి రోజు శ్రీనగర్

2. మొదటి రోజు శ్రీనగర్

Image Source:

జమ్ము కాశ్మీర్ రాజధాని అయిన శ్రీనగర్ అనేక ప్రక`తి అందాలకు నిలయం. సరస్సులు, మొఘల్ గార్డెన్లు, మంచుతో కప్పబడిన పర్వత శిఖరాలు ఒక్కటేమిటి ప్రక`తిలోని ప్రతి అందం ఈ కాశ్మీర్ లోనే ఉందన్న అనుభూతి అక్కడకు వెళ్లిన పర్యాటకులు పొందుతారు. అందువల్లే కాశ్మీర్ ను భూతల స్వర్గం అని అంటారు.

3. ఆకర్షణీయమైన ఫౌంటైన్లు

3. ఆకర్షణీయమైన ఫౌంటైన్లు

Image Source:

ముఖ్యంగా నిషాత్ బాగ్, షాలిమర్ బాగ్ లను శ్రీనగర్ వెళ్లిన వారు తప్పక సందర్శిస్తుంటారు. అక్కడి ఫౌంటైన్ల నుంచి వివిధ ఆకారాల్లో చిమ్ముతున్న నీటిని చూస్తూ, అక్కడే ఉన్న పచ్చటి తివాచీ పై పడుకోవడం మరపురాని అనుభూతి.

4. బోట్ హౌస్

4. బోట్ హౌస్

Image Source:

శ్రీనగర్ కు వెళ్లిన వారు తప్పక బోట్ హౌస్ లో ప్రయాణం చేస్తారు. ముఖ్యంగా దాల్ లేదా నీగిన్ సరస్సుల్లో బోట్ హౌస్ లలో ప్రయాణం చేస్తూ చుట్టు పక్కల ఉన్న అందాలను ఆస్వాధించనిదే ఏ పర్యాటకుడు తిరిగిరాడు.

5. ఫ్లోటింగ్ మార్కెట్

5. ఫ్లోటింగ్ మార్కెట్

Image Source:

ఇక ఇక్కడ ఉన్నటు సరస్సుల్లో ఫోటింగ్ మార్కెట్ నీటి పై తేలియాడే సంత అని అర్థంలో దీనిని మనం చూడవచ్చు. ఉదయం 5 గంటలకే సరస్సులో పూలు, పళ్లు, కాయగూరులు అమ్మే వర్తకులతో సరస్సు కొత్త శోభను సంతరించుకుంటుంది. రంగురంగు బోట్లలో వర్తకులు ప్రయాణం చేస్తూ వస్తువులను అమ్మే విధానం చూడటం కొత్త అనుభూతిని మిగులుస్తుంది.

6. శంకరాచార్య దేవాలయం

6. శంకరాచార్య దేవాలయం

Image Source:

శ్రీనగర్ కు దగ్గర్లో సముద్ర మట్టానికి 1000 అడుగుల ఎత్తులో ఉన్న శ్రీ శంకరాచార్య కొండ పై ఉన్న శ్రీ శంకరాచార్య దేవాలయంను సందర్శించడంతో మొదటి రోజు పర్యటనను పూర్తి చేసుకోవచ్చు.

7. రెండవ రోజు....పహల్గామ్

7. రెండవ రోజు....పహల్గామ్

Image Source:

పహల్గామ్ శ్రీనగర్ కు దాదాపు 90 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ ఎక్కడ చూసిన పచ్చదనం కనువిందు చేస్తుంది. ముఖ్యంగా నదీ, పర్వత లోయల ప్రాంతాలు, పంచుతో కప్పబడిన పర్వత శిఖరాలు పర్యాటకులను తమ వద్దకు రారమ్మని ఆహ్వనిస్తూ ఉంటాయి. పహల్గామ్ ట్రెక్కర్స్ కు స్వర్గధామంగా చెప్పవచ్చు.

8. రివర్ ర్యాఫ్టింగ్

8. రివర్ ర్యాఫ్టింగ్

Image Source:

సాహస క్రీడలంటే ఇష్టపడేవారు పహల్గామ్ లోని లిడ్డర్ రివర్ లో రివర్ ర్యాఫ్టింగ్ చాలా బాగా నచ్చుతుంది. తెల్లటి నదీ జలాల నురుగుల పై జుమ్ అంటూ వెళ్లడంలో యువత ఆసక్తి కనబరుస్తుంది. ఇక్కడ ఫిషింగ్ కు కూడా అవకాశం ఉంది.

9. పొన్నీ పై ప్రయాణం

9. పొన్నీ పై ప్రయాణం

Image Source:

ఇక్కడ మూడు గంటల పాటు పొన్నీ పై ప్రయాణం (ఎత్తు తక్కువగా ఉన్న గుర్రం పై ప్రయాణం) అందుబాటులో ఉంటుంది. వీటి పై ప్రయాణంతో మనం చిన్నపిల్లలుగా మారిపోతామనడంలో సందేహం లేదు. చుట్టూ ఉన్న పచ్చటి కొండలు, ముంచుతో కప్పబడిన పర్వత శిఖరాలను చూస్తూ మూడు గంటలను ఇట్టే ఖర్చుపెట్టేస్తాం.

10. మినీ స్విర్జర్లాండ్

10. మినీ స్విర్జర్లాండ్

Image Source:

ఇక్కడ ఉన్న దాబియాన్ లను మినీ స్విర్జర్లాండ్ అని అంటారు. శాండిల్ వుడ్, బాలివుడ్, టాలివుడ్, కోలివుడ్ తో పాటు ఇతర దేశాలకు చెందిన చిత్రరంగం ఇక్కడ ఎన్నో షూటింగ్ లను కూడా జరుపుకొంది. ముఖ్యంగా ప్రేమ గీతాలకు ఈ ప్రాంతం చాలా ఫేమస్.

11. మూడో రోజు గుల్మార్గ్

11. మూడో రోజు గుల్మార్గ్

Image Source:

పహల్గామ్ నుంచి మూడు గంటల ప్రయాణంతో గుల్మార్గ్ ను చేరుకోవచ్చు. పెహల్గామ్, శ్రీ నగర్ తో పోలిస్తే ఇక్కడి ప్రక`తి రెట్టింపు అందాలను కలిగి ఉంటుంది. ముఖ్యంగా వేసవి కాలంలోనే పూజే ప్రత్యేక పూలు ఈ గుల్మార్గ్ సొంతం. ఈ పూల తోటలను చూడటానికే పర్యాటకులు ఎక్కువ సంఖ్యలో ఇక్కడికి వస్తుంటారు. ఇక చలికాంలో ఇక్కడ స్కీయింగ్ ప్రత్యేకం.

12. 3వేల మీటర్ల ఎత్తులో కేబుల్ కార్ ప్రయాణం

12. 3వేల మీటర్ల ఎత్తులో కేబుల్ కార్ ప్రయాణం

Image Source:

సముద్ర మట్టానికి దాదాపు 3వేల మీటర్ల ఎత్తులో కేబుల్ కార్లో ప్రయాణం చేస్తూ చుట్టూ ఉన్న పర్వత శిఖరాలను చూడటం అమరిచిపోలేని అనుభూతి. ఈ కేబుల్ కార్ లో మొదట కాంగ్ దూర్ చేరుకొని అక్కడి నుంచి మరో 1200 మీటర్లు అంటే నాలుగువేల రెండువందల మీటర్ల ఎత్తులోని అఫర్వత్ ను చేరుకొంటాం. ఈ పర్వత శిఖాల పై స్కీయింగ్, స్లెడ్జింగ్ క్రీడాకారులు ఎక్కువ సంఖ్యలో కనిపిస్తుంటారు.

13. ప్రపంచంలోని ఎతైన గోల్ఫ్ కోర్స్

13. ప్రపంచంలోని ఎతైన గోల్ఫ్ కోర్స్

Image Source:

ప్రపంచంలోని అత్యంత ఎతైన గ్రీన్ గోల్ఫ్ కోర్స్ గుల్మార్గ్ లోనే ఉంది. సముద్రమట్టానికి 2650 మీటర్ల ఎత్తులో ఈ గోల్ప్ కోర్స్ ఉంటుంది. ఇక్కడ కాశ్మీర్ రుచులను అందించే స్ట్రీట్ ఫుడ్ రెస్టోరెంట్లు ఎన్నో ఉన్నాయి.

14. ఎక్కడ ఉండాలి

14. ఎక్కడ ఉండాలి

Image Source:

శ్రీనగర్ లో రాత్రి పూట బోట్ హౌస్ లో ప్రయాణం ఒక మరిచిపోలేని అనుభూతిని ముగులుస్తుంది. ముఖ్యంగా టైఫ్ హౌస్ బోట్లో ఒక రాత్రి బసకు కేవలం రూ.600 మాత్రమే. అదే విధంగా మొగల్ రిసార్ట్ లో రూ.650లను చెల్లించాల్సి ఉంటుంది. హోటల్ మహాజన్ లో మాత్రం ఒక రోజు రాత్రి ఉండాలంటే రూ.1,200 ఖర్చు చేయాలి.

15. ఎక్కడ మంచి ఫుడ్ దొరుకుతుంది

15. ఎక్కడ మంచి ఫుడ్ దొరుకుతుంది

Image Source:

కాశ్మీర్ లో మాంసం కూరలతో కూడిన భోజనం చాలా ఫేమస్. శ్రీనర్ లోని మొఘల్ దర్బార్ లో ఇద్దరి భోజనానికి రూ.300 ఖర్చవుతుంది. ఫెహల్గాన్ లోని కెఫే లాగ్ ఇన్ లో అయితే ఈ ఖర్చు రూ.1,100 కాగా, గుల్మార్గ్ లో కేవలం రూ.250 మాత్రమే.

16. మొత్తం ఖర్చు ఇలా...

16. మొత్తం ఖర్చు ఇలా...

Image Source:

ఒకరికి మూడు రోజులకు

విమాన ప్రయాణం ఖర్చు..........................రూ.11,000

హోటల్స్............................రూ.2,500

ఫుడ్..........................రూ.1,600

సైట్ సీయింగ్........రూ.2,000

రవాణా...................రూ.5,500

ఇతర ఖర్చులు......రూ.2,000

మొత్తం......................రూ.23,600

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X