Search
  • Follow NativePlanet
Share
» »వేదాలే అక్కడ కొండ రూపంలొ కొలువయ్యాయి

వేదాలే అక్కడ కొండ రూపంలొ కొలువయ్యాయి

పక్షి తీర్థం పుణ్యక్షేత్రానికి సంబంధించిన కథనం.

By Karthik Pavan

శాస్త్ర సాంకేతిక రంగాలలో ముందుకు దూసుకుపోతూ.. సృష్టికి ప్రతిసృష్టిని చేయగలిగే స్ధాయికి మనిషి చేరుకున్నా.. కొన్ని నమ్మకాలు , ఘటనలు అందరిని ఆశ్చర్యాలకు గురిచేస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా మన దేశంలో ప్రాచీన నిర్మాణాలు, దేవాలయాలు, వాటి వెనుక కథలు ఎన్నో ఇప్పటికీ అంతుబట్టకుండా మిగిలిపోయాయి. అలాంటి వాటిలో ఒకటే తమిళనాడులోని వేదగిరీశ్వరుడి దేవాలయం. వేదగిరీశ్వరుడి రూపంలో ఆ పరమశివుడు కొలువైన ఈ దేవాలయం విశేషాలు తెలుసుకుందాం..

వేదగిరీశ్వరుడి దేవాలయం గురించి ఆసక్తికర కథ

వేదగిరీశ్వరుడి దేవాలయం గురించి ఆసక్తికర కథ

P.C: You Tube

వేదగిరీశ్వరుడి దేవాలయం గురించి ఒక ఆసక్తికర కథ స్ధానికంగా ప్రచారంలో ఉంది. భరద్వాజ మహాముని కోరిక మేరకు వేదాలు ఇక్కడ కొండరూపంలో కొలువయ్యేలా పరమేశ్వరుడు చేశాడని చెప్తారు. వేదాలు నేర్చుకోవాలనే మహర్షి కోరికను ఆయన ఈ విధంగా తీర్చాడని నమ్ముతారు. కలియుగంలో భక్తిభావంతో ఇక్కడకు వచ్చే భక్తులు మోక్షాన్ని పొందుతారని కూడా శివుడు మహర్షికి చెప్పినట్టు కథనం. ఈ కారణంగానే వీటిని వేదాల కొండలుగా వ్యవహరిస్తారు.

త్రిపుర సుందరీ అమ్మవారు

త్రిపుర సుందరీ అమ్మవారు

P.C: You Tube

పైన గుడిలో శివుడు, కొండ కింద మరో గుడిలో అమ్మవారు త్రిపురసుందరీదేవి రూపంలో దర్శనమివ్వడం ఈ దేవాలయం ప్రత్యేకత. కొండ దిగువ భాగాన ఒక తీర్ధం కూడా చూడచ్చు. పూర్తి ద్రవిడ నిర్మాణశైలితో కట్టిన ఈ దేవాలయం..చరిత్రకారులను సైతం ఎంతగానో ఆకట్టుకుంటుంది. కంచీపురంలో ప్రఖ్యాతదేవాలయాల్లో ఒకటైన వేదగిరీశ్వర దేవాలయాన్ని దర్శించుకోవాలంటే చెన్నయ్‌ నుంచి 72 కిలోమీటర్లు ప్రయాణించాలి. మహాబలిపురం నుంచి 16కిలోమీటర్ల ప్రయాణిస్తే ఇక్కడకు చేరుకోవచ్చు.

ఆ పక్షులు

ఆ పక్షులు

P.C: You Tube

పూర్వం ఈ దేవాలయం ఉన్న ఊరిని తిరకలుకుండ్రం అని పిలిచేవారు. అటు పై వేదగిరిగా మారిపోయింది. గతంలో గద్ద జాతికి చెందిన రెండు పక్షులు క్రమం తప్పకుండా మధ్యాహ్నం 12గంటలకు వచ్చి పూజారి పెట్టే స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించేవట. దీంతో ఈ తీర్ధానికి పక్షితీర్ధం అని నామకరణం చేశారు. ఈ రెండు పక్షులు పరమశివుని శాపానికి గురైన అలా మారిన బుుషులని, అందుకే ఇవి ఇక్కడకు ప్రతీరోజూ వచ్చేవి అన్నది ఒక కథనం. భక్తుల్లో పాపాత్ములు ఎవరైనా ఉంటే అవి అక్కడకు రావని కూడా చెప్పేవారు. అయితే, చాలా ఏళ్లుగా ఈ పక్షులు తీర్ధం దగ్గర కనిపించడంలేదు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X