• Follow NativePlanet
Share
» »1,300 ఏళ్లుగా భా...రీ విగ్రహం నీటి పై అలాగే

1,300 ఏళ్లుగా భా...రీ విగ్రహం నీటి పై అలాగే

Written By: Beldaru Sajjendrakishore

హిందూ మతంలో దేవాలయాల దర్శనం, దేవుడి ఆరాధన చాలా పురాతన ధార్మిక విధానం. అందుకోసమే అఖండ భారత దేశంలోని అనేక లక్షల దేవాలయాలు నెలకొల్పబడ్డాయి. వీటిలో కొన్నింటికి వేల సంవత్సరాల చరిత్ర కూడా ఉంది. ఇందులో కొన్ని దేవాలయాల నిర్మాణంతో పాటు దేవాలయల్లోని విగ్రహాలు ఉన్న తీరు ఆశ్చర్యాన్ని కలిగిస్తుండగా వాటి వెనుక ఉన్న మర్మాన్ని ఇప్పటికీ తెలుసుకోలేకపోతున్నారు. వందల ఏళ్లుగా వాటి రహస్యాన్ని తెలుసుకోవాలనుకొని పరిశోధనలు చేస్తున్నా ప్రయోజనం లేకుండా పోతోంది. అటువంటి కోవకు చెందినదే నేపాల్ లోని బుద్ నీల్ నాథ్ దేవాలయం. ఈ దేవాలయంతో పాటు అక్కడి విగ్రహం విశేషాలు కూడా ఎంతో ఆశ్చర్యాన్ని కలిస్తాయి. ఇందుకు సంబంధించిన కథనం నేటివ్ ప్లానెట్ పాఠకుల కోసం

1. ఎతైన హిమశిఖరాల నడుమ

1. ఎతైన హిమశిఖరాల నడుమ

Image source

ఎతైన హిమశిఖరాల నడుమన ఉన్న నేపాల్ దేశంలో ఉన్న దేవాలయమే బుధనీలకంఠ దేవాలయం. ఈ ఆలయం పేరుమీదుగానే ఈ గ్రామానికి కూడా బుధనీలకంఠ గ్రామంగా పేరు వచ్చింది. ఈ పేరు విన్న తక్షణం మనకు ఇది బౌద్ధ ఆలయం అన్న స్పరణ కలుగుతుంది. అయితే బుధ నీల కంఠ అనగా నీలరంగు కలిగిన విగ్రహం అని అర్థం. అందుకే ఈ ప్రాంతానికి, దేవాలయానికి బుధనీలకంఠ అని పేరు వచ్చింది. నారాయనంథన్ అనే పేరుతో కూడా ఈ దేవాలయాన్ని పిలుస్తారు.

2. వెళ్లికిలా విష్ణుమూర్తి...

2. వెళ్లికిలా విష్ణుమూర్తి...

Image source

ప్రపంచంలోని ఏ దేవాలయంలోనైనా విష్ణువు ఒక పక్కకుతిరిగి పడుకొని ఉన్న స్థితిలో కనిపిస్తాడు. అయితే ఈ దేవాలయంలో విష్ణువు పూర్తిగా వెళ్లికిలా పడుకుని ఉండటం విశేషం. శేషతల్పం దాని పై విష్ణుమూర్తి పవలించిన రీతిలో శిల్పం ఎంతో చూడముచ్చటగా ఉంటుంది.

3. 1,300 సంవత్సరాల క్రితానికి చెందినది

3. 1,300 సంవత్సరాల క్రితానికి చెందినది

Image source

బ్లాక్ బ్లాస్ట్ రకానికి చెందిన ఏక శిలలో ఈ విగ్రహాన్ని చెక్కారు. విగ్రహం పొడవు 5 మీటర్లు అంటే 16.4 అడుగులు. ఈ విగ్రహం దాదాపు 13 మీటర్లు అంటే 42.65 అడుగులు ఉన్న సరస్సు మధ్యగా ఎటువంటి ఆధారం లేకుండా నేటి పై తేలుతూ ఉంటుంది. ఈ విగ్రం చెక్కి దాదాపు 1,300 ఏళ్లు అయ్యి ఉంటుందని చరిత్ర, పురాతనశాస్త్రవేత్తలు అంచనా వేశారు.

4. 100 ఏళ్లుగా

4. 100 ఏళ్లుగా

Image source

ఈ విగ్రహం నీటి పై ఎలా తేలుతోందనే విషయం పై నేపాల్, భారత దేశానికి చెందిన శాస్ర్తవేత్తలే కాకుండా ప్రపంచం నలుమూలకు చెందిన ప్రసిద్ధి చెందిన ఎంతో మంది శాస్త్రవేత్తలు ఈ విగ్రహం పై దాదాపు వందేళ్లుగా పరిశోధన చేస్తున్నారు. అయితే ప్రయోజనం లేకుండా పోయింది.

5. నాగలి తగిలి...

5. నాగలి తగిలి...

Image source

ఈ విగ్రహం ఇక్కడకు ఎలా చేరిందన్న విషయం పై అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. అయితే వాటిలో కేవలం రెండు కథనాలను ఇక్కడి వారు ప్రముఖంగా ప్రస్తావిస్తారు. పూర్వం ఈ ప్రాంతానికి దగ్గర్లో ఒక రైతు పొలం దున్నుతున్న సమయంలో నాగలిమొన ఒక రాయికి తగిలింది. వెంటనే అక్కడ రక్తం కారడం మొదలయ్యింది. విషయాన్ని గ్రమాస్తులకు చెప్పి అక్కడ తవ్వించారు. అప్పుడు ఈ విష్ణుమూర్తి విగ్రహం లభించింది. దీంతో గ్రామస్తులంతా ఈ విగ్రహాన్ని ప్రస్తుతం ఉన్న ప్రాంతంలో ప్రతిష్టింప జేశారు.

6. విష్ణుగుప్త చక్రవర్తి...

6. విష్ణుగుప్త చక్రవర్తి...

Image source

మరో కథనం ప్రకారం. ఏడో శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పరిపాలించిన విష్ణుగుప్త చక్రవర్తి ఈ విగ్రహాన్ని తయారు చేయించాడు. అటు పై ప్రస్తుతం ఉన్న చోట విగ్రహాన్ని ప్రతిష్టింపజేసి దేవాలయన్ని కట్టించినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. తేజోమయమైన ఈ విగ్రహం నీటి పై తేలుతూ ఉండటం అటు హిందూమత భక్తులనే కాకుండా ఇతర మతాలకు చెందిన వారిని ఎంతగానో అకర్షిస్తోంది. దీంతో ఇది ప్రముఖ పర్యాటక కేంద్రంగా కూడా విరాజిల్లుతోంది.

7. హరిబోధిని పేరుతో

7. హరిబోధిని పేరుతో

Image source

ఈ విగ్రహానికి ప్రతి రోజు హిందూధర్మిక శాస్త్రాన్ని అనుసరించి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ముఖ్యంగా ప్రతి ఏడాది కార్తీక మాసంలో 11 రోజున అంటే ఏకాదసి రోజున హరిబోధిని పేరుతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. తద్వారా నిద్రపోతున్న శ్రీమహావిష్ణువును మేల్కొపగలిగామని భక్తులు నమ్ముతుంటారు.

8. రాజులు సందర్శించడం లేదు

8. రాజులు సందర్శించడం లేదు

Image source

1641 నుంచి 1674 మధ్య నేపాల్ ను పరిపాలించిన ప్రతాపమల్లుడు ఈ దేవాలయన్ని సందర్శించిన వారికి మరణం తప్పదని నమ్మేవాడు. అందువల్లే ఆయన వంశీయులతో పాటు ప్రస్తుతం నేపాల్ ను పరిపాలించే రాజులు ఎవరూ ఈ దేవాలయాన్ని సందర్శించడం లేదు.

9. ఎక్కడ ఉంది

9. ఎక్కడ ఉంది

Image source

నేపాల్ రాజధానికి ఖడ్మాండుకు దగ్గర్లో ఈ దేవాలయం ఉంది. దూరం కేవలం 8 కిలోమీటర్లు మాత్రమే. ఇక ఢిల్లీ నుంచి ఖాట్మాండుకు విమానయాన సేవలు అందుబాటులో ఉన్నాయి.

10. ఇంకా ఏమి చూడవచ్చు.

10. ఇంకా ఏమి చూడవచ్చు.

Image source

బౌద్ధనాత్ సుప్తా, స్వయంభునాథ్ దేవాలయం, పశుపతినాథ దేవాలయం, కుమారిచౌక్, హనుమాన్ దేవాలయం తదితర పర్యాటక ప్రాంతాలను ఇక్కడ చూడవచ్చు. వేసవి కాలంలో ఇక్కడకు వెళ్లడం ఉత్తమం.

Read more about: travel

పర్యాటకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి
పర్యాటక చిట్కాలు, పర్యాటకానికి సంబంధించిన కథాలు తక్షణం పొందండి