• Follow NativePlanet
Share
» »వినాయకుడు మొట్టికాయలు తిన్నది ఇక్కడే...

వినాయకుడు మొట్టికాయలు తిన్నది ఇక్కడే...

Written By: Beldaru Sajjendrakishore

మన పురాణాలను అనుసరించి లోక కళ్యాణం కోసం దేవతలు అనేక రూపాలను సంతరించుకున్నారు. ఈ క్రమంలో కొన్ని సార్లు రాక్షసుల నుంచి దెబ్బలు కూడా తిన్నారు. ఈ నేపథ్యంలోనే అందరి కంటే ముందుంగా పూజలు అందుకునే వినయకుడు ఈ ప్రపంచాన్ని కాపడటం కోసం పశువుల కాపరి వేశం వేసుకున్నాడు. అంతే కాకుండా రావణబ్రహ్మ అయిన రావణాసురుడితో మొట్టి కాయులు కూడా తిన్నాడు. అలా మొట్టికాయలు తిన్న ప్రాంతం నేడు గోకర్ణ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. అసలు ఎందుకు పశువుల కాపరి వేశం వేసుకోవాల్సి వచ్చంది? ఎందుకు ఆ విఘ్నవినాయకుడు మొట్టి కాయలు తిన్నాడు తదితర వివరాలతో పాటు ప్రముఖ శైవక్షేత్ర మైన గోకర్ణం విశేషాలు నేటివ్ ప్లానెట్ పాఠకుల కోసం...

1. ఆత్మలింగం కోసం...

1. ఆత్మలింగం కోసం...

Image source

గోకర్ణ క్షేత్ర వివరాలు స్కందపురాణంలో కనిపిస్తాయి. ఇందులో ఉన్న వివరాల ప్రకారం లంకాధిపతి అయిన రావణుడు తన తల్లి కోసం శివుడి ఆత్మలింగాన్ని సంపాదించడం కోసం ఘోర తపస్సు చేస్తాడు. రావణుడి తపస్సుకు మెచ్చి రావణుడు ప్రత్యక్ష మయ్యి ఆత్మ లింగాన్ని అందజేస్తాడు. అయితే అదే సమయంలో ఒక షరత్తు విధిస్తాడు. ఒక్కసారి ఆత్మ లింగం భూమిని తాకితే అక్కడే ప్రతిష్టితమై పోతుంది. అందువల్ల లంకకు తీసుకెళ్లే వరకూ సదరు ఆత్మ లింగాన్ని భూమి పై పెట్టకూడదని చెబుతారు. ఇందుకు సమ్మతించిన రావణుడు ఆత్మలింగాన్ని తనతో పాటు తీసుకువెళుతాడు.

2. భయపడిన దైవ గణం...

2. భయపడిన దైవ గణం...

Image source

ఆత్మలింగం రావణుడి వద్ద ఉంటే అతని బలం రెట్టింపు అవుతుందని అంతేకకాకుండా లోకాలన్నీ అల్లకల్లోలమైపోతాయని భయపడిన దైవగణాలు బ్రహ్మ, విష్ణవుల వద్దకు వెళ్లి ఈ గండం నుంచి తప్పించాల్సిందిగా వేడు కొంటారు. కొద్ది సేపు ఆలోచించిన వారిరువురూ వినాయకుడి సహకారం కోరుతారు. లోక కళ్యాణాన్ని ద`ష్టిలో ఉంచుకున్న వినియకుడు బ్రహ్మ, విష్ణు ప్రతిపాదనకు అంగీకరిస్తారు.

3. సూర్యుడి గమనాన్ని అడ్డుకున్న విష్ణువు

3. సూర్యుడి గమనాన్ని అడ్డుకున్న విష్ణువు

Image source

ప్రణాళిక ప్రకారం విష్ణువు తన చక్రాయుధంతో సూర్యుడి గమనాన్ని అడ్డు కొంటారు. దీంతో వెలుగు తగ్గిపోయి తత్కాలికంగా సాయంత్రం అవుతుంది. దీంతో రావణబ్రహ్మ అయిన రావణుడు సంధ్యా వందనానికి సమయం అయ్యిందని భావిస్తాడు. చేతిలో అత్మలింగం ఉండటంతో సంధ్యా వందనం ఎలా చేయాలని ఆలోచిస్తూ ఉంటాడు.

4. గో కాపరిగా వినాయకుడు

4. గో కాపరిగా వినాయకుడు

Image source

ఇంతలో అటుగా బాలుడి వేశంలో వినాయకుడు గోవులను కాస్తూ అక్కడికి వస్తాడు. విషయం మొత్తం రావణుడు బాలుడికి చెప్పి సంధ్యా వందనం చేసే వరకూ ఆత్మలింగాన్ని పట్టు కోవాల్సిందిగా అభ్యర్థిస్తారు. ఆత్మలింగాన్ని పట్టు కోవడానికి బాలుడు రూపంలో ఉన్న వినాయకుడు అంగీకరిస్తాడు. అయితే తాను మూడుసార్లు పిలుస్తానని అప్పటికి రాకపోతే ఆత్మ లింగాన్ని భూమి పై పెడుతానని బాలుడు చెబుతాడు. ఇందుకు అంగీకరించిన రావణుడు రావణుడు ఆత్మలింగాన్ని బాలుడి రూపంలో ఉన్న వినాయకుడి చేతిలో పెట్టి సంధ్యా వందనానికి బయలు దేరుతారు.

5. కోపంతో మొట్టికాయ వేసిన రావణుడు

5. కోపంతో మొట్టికాయ వేసిన రావణుడు

Image source

రావణుడు కొంత దూరం వెళ్లిన తర్వాత బాలుడు త్వర త్వరగా మూడు సార్లు రావణ...రావణ...రావణ అని పిలుస్తారు. దీంతో రావణుడు పరుగు పరుగునా వస్తాడు. అప్పటికే బాలుడి రూపంలోని వినాయకుడు ఆత్మలింగాన్ని భూమి పై పెట్టేస్తాడు. దీంతో కోపగించుకున్న రావణుడు బాలుడి రూపంలో వినాయకుడి తల పై గట్టిగా మొట్టికాయ వేస్తాడు. ఫలితంగా గణపతి నెత్తి పై నొక్కు ఏర్పడుతుంది. ఆ నొక్కు ఇప్పటికీ ఇక్కడున్న మహాగణపతి ఆలయంలోని గణపతి వగ్రహానికి చూడవచ్చు.

6. బ`హదాకాన్ని సంతరించుకున్న ఆత్మలింగం

6. బ`హదాకాన్ని సంతరించుకున్న ఆత్మలింగం

Image source

రావణుడితో మొట్టికాయ తిన్న వెంటనే వినాయకుడు అద`ష్యమై పోవడం, అటు పై సూర్యుడి వెలుగు రావాడం చకచకా జరిగిపోతాయి. దీంతో రావణుడు తన దివ్యద`ష్టితో విషయం గ్రహించి ఆగ్రహంలో ఆత్మలింగాన్ని పెకిలించడానికి ప్రయత్నిస్తారు. అయితే ఆ ఆత్మలింగం అంతకంతకూ పెరిగిపోతూ బ`హదాకారాన్ని సంతరించుకుంటుంది.

7. శైవ పంచక్షేత్రాలు ఇవే...

7. శైవ పంచక్షేత్రాలు ఇవే...

Image source

దీంతో మరింత ఆగ్రహంతో ఆత్మలింగాన్ని తెచ్చిన పెట్టే మూతను విసిరేస్తే ప్రస్తుత గోకర్ణకు 23 కిలోమీటర్ల దూరంలోపడుతుంది. ఆ ప్రాంతంలో సజ్జేశ్వర లింగం వెలుస్తుంది. ఇక ఈ పెట్టే మూతను విసిరేస్తే గోకర్ణకు 27 కిలోమీటర్ల దూరంలోపడి గుణేశ్వర లింగం వెలుస్తుంది. అదే విధంగ లింగం పై నున్న వస్త్రాన్ని విసిరేస్తే అది ప్రస్తుత మురుడేశ్వర ప్రాంతంలో పడుతుంది. ఇక పెట్టెకు ఉన్న తాళ్లు కూడా దూరంగా పడి అక్కడ ధారేశ్వర లింగం ఏర్పడుతుంది. ఈ నాలుగు లింగాల మధ్య ఆత్మలింగం ఉంచబడిన చోట మహాబలేశ్వర లింగం వెలుస్తుంది. అటు పై ఆగ్రహాన్ని తగ్గించుకుని విషన్న వదనంతో రావణుడు ఒట్టి చేతులతో లంకకు ప్రయాణమవుతాడు. ఇక ఆత్మలింగంతో ముడిపడిన ఈ ఐదు క్షేత్రాలను శైవ పంచ క్షేత్రాలని భక్తులు పిలుచుకుంటారు.

8. కోటి తీర్థంలో స్నానం...

8. కోటి తీర్థంలో స్నానం...

Image source


గోకర్ణలో ప్రధానంగా శ్రీ మహాబలేశ్వర లింగానికి పూజాది కార్యక్రమాలు జరుగుతాయి. ఆలయంలో స్వామి వారిని దర్శించుకునే ముందు భక్తులు అక్కడే ఉన్న కోటి తీర్థంలో స్నానం చేస్తారు. ఇందులో స్నానం చేస్తే సమస్త రోగాలు నయమవుతాయని భావిస్తారు. . కోటి తీర్థానికి దక్షిణం వైపున అగస్తుల ముని చేత స్థాపితమైన వరటేశ్వరలింగాన్ని కూడా భక్తులు సందర్శిస్తుంటారు.

9. లింగం లోపల లింగం...

9. లింగం లోపల లింగం...

Image source

గర్భగుడిలోని లింగం కింది వైపున పెద్దగా ఉంటూ పైకి వెళ్లే కొద్ది సన్నబడి ఉంటుంది. రావణుడు పెకిలించడానికి ప్రయత్నించడం వల్ల లింగం ఈ రూపును సందర్శించుకుందని పూజారులు చెబుతుంటారు. ఇక లింగం పై భాగంలో ఉన్న రంద్రంలో వేలును పెడితే లింగం లోపల ఉన్న మరో లింగం కనిపిస్తుంది. అదే నిజమైన ఆత్మలింగంమని కథనం. పన్నేండేళ్లకు ఒకసారి ఇక్కడ ఈ లింగానికి విశేష పూజలు జరుగుతాయి. ఈ పూజల్లో పాల్గొనడానికి దేశ విదేశాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు.

10. గణపతి విగ్రహం తల పై నొక్కు

10. గణపతి విగ్రహం తల పై నొక్కు

Image source

మహాబలేశ్వర ఆలయం తూర్పున మహాగణపతి ఆలయం ఉంటుంది. రావణుడికి ఆత్మలింగం దక్కకుండా తన వంతు సహకారం అందించి నుందుకు గాను గణపతిని శివుడు మెచ్చు కుంటాడు. అంతే కాకుండా ఈ క్షేత్రంలో మొదట గణపతిని దర్శించుకున్న తర్వాతనే తనకు భక్తు పూజలు చేస్తారని చెబుతారు. ఈ విధానం ఇప్పటికీ ఆచరిస్తున్నారు. ఇక్కడి గణపతి విగ్రహం తల పైన నొక్కు రావణుడి మొట్టి కాయకు గుర్తుగా చెబుతారు.

11. శివుడు గోవు చెవి నుంచి వచ్చింది ఇక్కడే

11. శివుడు గోవు చెవి నుంచి వచ్చింది ఇక్కడే

Image source

దక్షిణ కాశి, భూ కైలాసం అని పిలుచుకునే ఈ దివ్య క్షేత్రానికి సంబంధించి మరో కథనం కూడా ప్రచారంలో ఉంది. పాతళ లోకంలో తపస్సు చేసి శివుడు భూమి పైకి వచ్చే సమయంలో ఓ గోవు చెవి నుంచి వస్తూ ఇవే ప్రాంతంలో మొదట కాలు మోపాడని చెబుతుంటారు. అందువల్లే ఈ క్షేత్రానికి గో (ఆవు), కర్ణి (చెవి) అని పేరు వచ్చింనట్లు చెబుతుంటారు. సదరు గోవును భూ మాతగా కూడా చెబుతుంటారు.

12. ఛత్రపతి శివాజీ కూడా సందర్శించిన క్షేత్రం

12. ఛత్రపతి శివాజీ కూడా సందర్శించిన క్షేత్రం

Image source

ఈ క్షేత్ర అభివ`ద్ధికి అనేక మంది రాజులు సహకారం అందించారు. ముఖ్యంగా కుందపుర వంశానికి చెందిన విశ్వేశ్వర రాయుడు ఈ క్షేత్రంలోని చంద్రశాల, నంది మంటపాలను నిర్మించారు. అనంతరం విజయనగర రాజులు ఈ క్షేత్రం అభివ`ద్ధి కోసం వేల ఎకరాల భూములతో పాటు కొంత సొమ్మును కూడా అందజేశారు. ఛత్రపతి శివాజీ కూడా ఈ క్షేత్రాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారని ఇక్కడి శాసనాల ద్వార తెలుస్తుంది.

13. ఇంకా ఏమేమి చూడవచ్చు...

13. ఇంకా ఏమేమి చూడవచ్చు...

Image source

ఇంకా ఇక్కడ భద్రకాళి, కాళభైరవ, శ్రీక`ష్ణ , నరసింహస్వామి, తామ్రగౌరి దేవాలయాలను చూడవచ్చు. అంతే కాకుండా దగ్గర్లో మ`డేశ్వర, గుణేశ్వర, సజ్జేశ్వర క్షేత్రాలను దర్శించుకోవచ్చు.

14. ఎలా వెళ్లాలి...

14. ఎలా వెళ్లాలి...

Image source

8కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలోని గోకర్ణకు బెంగళూరు నుంచి దాదాపు 450 కిలోమీటర్లు. అంతేకాకుండా హుబ్లీ, ఉడిపి, మంగళూరు, బెల్గాం తదితర చోట్ల నుంచి బస్సు సౌకర్యం ఉంది.

పర్యాటకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి
పర్యాటక చిట్కాలు, పర్యాటకానికి సంబంధించిన కథాలు తక్షణం పొందండి