Search
  • Follow NativePlanet
Share
» »సంతానం లేని వారికి సంతానప్రాప్తి..సుఖ ప్రసవం ప్రసాధించే గర్భరక్షాంబిక ఆలయం

సంతానం లేని వారికి సంతానప్రాప్తి..సుఖ ప్రసవం ప్రసాధించే గర్భరక్షాంబిక ఆలయం

దేవుడు అన్ని చోట్లో సర్వవ్యాప్తియై ఉన్నా, కొన్ని ప్రదేశాల్లో కొన్ని రూపాలలో విశేషించి ఆయన అనుగ్రహం కలుగుతూనే ఉంది. వీటినే పుణ్యక్షేత్రాలని అంటుంటారు. ఇలాంటివి ఎన్నో దివ్యమైన పుణ్యక్షేత్రాలు గల భూవి మన భారతదేశం. పుణ్య క్షేత్రాలలో ఒక్క క్షేత్రం ఒక్కో కారణానికి ప్రసిద్ది చెందాయి. అలాంటి పుణ్య క్షేత్రాలలో ఒకటి గర్భరక్షాంబికా ఆలయం. ఇక్కడ అమ్మవారు స్త్రీలలో గర్భ సంబంధిత లోపాలను తొలగించి సంతాన ప్రాప్తిని కటాక్షించు తల్లిగా వెలిసింది.

శ్రీ గర్భరక్షాంబికా సమేత శ్రీ ముల్లైవనాథర్ ఆలయం తమిళనాడులో ఉన్న ఒక అద్భుతమైన క్షేత్రం. ఈ ఆలయంలో ప్రధాన దేవత శ్రీ గర్భరక్షాంబికా అమ్మవారు మరియు శ్రీ మల్లైవనాథర్. ఈ క్షేత్రం యొక్క పేరులో క్షేత్ర మహిమ అవగతమువుతున్నది. గర్భరక్షాంబికా అంటే గర్భములో ఉన్న శిశువును, ఆ గర్భం దాల్చిన తల్లిని కాపాడే అమ్మలనుగమన్న యమ్మ చాలా పెద్దమ్మ పార్వతీదేవీయే ఇక్కడ గర్భరక్షాంబికా అమ్మగా పిలవబడుతున్నది. ఇక్కడ అమ్మవారు కేవలం గర్భవతులుకు మాత్రమే కాకుండా, సంతానం లేని దంపతులకు కూడా సంతానం కటాక్షిస్తుంది.

ఇదే క్షేత్రంలో అమ్మవారితో పాటు ఆ పరమేశ్వరుడు శ్రీ ముల్లైవనాథర్ గా కొలువై ఉన్నాడు. ముల్లైవనాథర్ అంటే మల్లికార్జున స్వామి అని. ఇక్కడ స్వామి వారిని పూజిస్తే ఎటువంటి చర్మ వ్యాధులైనా నయం అవుతాయని భక్తుల నమ్మకం. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది. ఆ ఆలయ చరిత్ర , విశిష్టతలేంటో తెలుసుకుందాం..

తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరు జిల్లాలోని

తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరు జిల్లాలోని

తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరు జిల్లాలోని పాపనాశనం తాలూకాలో ఈ గర్భరక్షాంబికా దేవాలయం ఉంది. తంజావూరు-కుంబకోణం వెళ్ళే మార్గంలో కుంభకోణం అనే ప్రసిద్ద పట్టణానికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ క్షేత్రం గల ఊరిని అక్కడ తిరుక్కరుగావుర్ గా పిలుస్తారు.

PC: templeofficialwebsite

ఈ ఆలయంలో అమ్మవారు సుమారు 7అడుగుల ఎత్తులో

ఈ ఆలయంలో అమ్మవారు సుమారు 7అడుగుల ఎత్తులో

ఈ ఆలయంలో అమ్మవారు సుమారు 7అడుగుల ఎత్తులో ఉండి కంచిపట్టు చీర ధరించి సర్వాలంకార భూషితయై మెరిసిపోతుంటుంది. అమ్మ చిరునవ్వులు చిందిస్తూ కోరిన వారికి కొంగుభంగారమైన..సంతాన ప్రాప్తిని అనుగ్రహించడానికి అభయ ఇస్తున్నట్లుగా కనబడుతుంటుంది అమ్మ వారి స్వరూపం. ఈ క్షేత్రాన్ని దర్శించే భక్తులకు అమ్మ వారు విగ్రహ రూపంలో కాదు, అంతటా నిండి నిబిడీకృతమై ఉన్న అమ్మ సంతానం కటాక్షించడానికి సాకార రూపం దాల్చి ఉన్న శ్రీమాత ఈ అమ్మ. ఇక్కడకి వచ్చే భక్తులు ఎంతో భక్తితో సంతానా ప్రాప్తికి అమ్మని నమ్మి వస్తారు. ఎవరైనా తెలిసి కానీ, తెలియక కానీ ఈ క్షేత్రంలో అమ్మని దర్శించినచో వారికి కూడా తప్పక అమ్మ అనుగ్రహం కలుగుతుంది.

అలాగే ఇక్కడ కొలువై ముల్లైవనాథర్ గా ఉన్నమల్లికార్జునడు

అలాగే ఇక్కడ కొలువై ముల్లైవనాథర్ గా ఉన్నమల్లికార్జునడు

అలాగే ఇక్కడ కొలువై ముల్లైవనాథర్ గా ఉన్నమల్లికార్జునడు స్వయంభువుగా వెలిసిన స్వామి. శంకరుడు స్వయంభూగా వెలిసిన అరవైనాలుగు క్షేత్రాలలో ఇది ఒకటి. ఇక్కడ శివలింగం పుట్ట మన్నుతో చేసినది. అందువల్ల ఇక్కడ స్వామికి జలంతో అభిషేకం చేయరు. కేవలం మల్లె నూనెతో అభిషేకం చేస్తారు. అలాగే ఈ క్షేత్రానికి మాధవీ క్షేత్రం అని కూడా పేరు. మాధవీ అంటే సంస్కృతములో మల్లెలు అని అర్థం. ఈ స్థల వృక్షం కూడా మల్లె తీగయే.

ఈ ఆలయంలో మరొక ప్రత్యేకత ఉంది.

ఈ ఆలయంలో మరొక ప్రత్యేకత ఉంది.

ఈ ఆలయంలో మరొక ప్రత్యేకత ఉంది. ప్రతీ ఏటా తమిళ ఫాల్గుణ మాసంలో పౌర్ణమినాడు శివలింగము మీద చంద్ర కిరణాలు నేరుగా పడతాయి. అది ఒక అద్భుతమైన దృశ్యము.

PC: templeofficialwebsite

 ఈ ఆలయంలోనే శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి సన్నిథి

ఈ ఆలయంలోనే శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి సన్నిథి

ఇక్కడ కర్పగ వినాయాకర్ మరియు నందీశ్వరుడు కూడా స్వయంభూగా వెలిశారు. ఈ ఆలయంలోనే శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి సన్నిథి కూడా కలదు.

స్థల పురాణం:

స్థల పురాణం:

ఈ ఆలయంలో కనీసం వేయి సంవత్సరాల నాటిదని చెబుతారు. అది ఆలయ గోపురం, ప్రహరీలు చూస్తే తెలుస్తుంది. ఈ ఆలయంలో తొమ్మిదవ శతాబ్ధంలో చోళ రాజుల హయాంలో చెక్కిన శిలా ఫలకాలున్నాయి. ఈ క్షేత్రం యొక్క మహిమను అప్పార్, సుందరార్ మరియు జ్ఝాన సంబంధార్ అనే ముగ్గురూ ప్రఖ్యాత నాయనార్లు వారి పద్యములలో కీర్తించారు. వీటిని తమిళంలో పత్తిగం అంటారు. ఈ ముగ్గురు నాయనార్లు ఈ క్షేత్రంలోని ఆయల దర్శనానికి వస్తున్న సమయంలో దారి కనపడకపోతే, సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే వీరికి ఆలయ దర్శనం చేయించినట్టు స్థల పురాణం తెలుపుతున్నది.

PC: templeofficialwebsite

ఈ క్షేత్ర విశిష్టత:

ఈ క్షేత్ర విశిష్టత:

పూర్వం ఇక్కడ నిధ్రువ అనే ఒక మహర్షి ఆయన ధర్మపత్ని వేదికతో కలిసి ఒక ఆశ్రమంలో ఉండేవారు. వాళ్ళు ఎప్పూడు శివుడిని పూజిస్తూ విహిత కర్మాచారణ చేస్తూ ఆ దంపతులు ఇద్దరు ఆనందంగా కాలం గడిపేవారు. అయితే వారికి ఉన్న ఒకే ఒక సమస్య సంతానం కలుగకపోవడం. సంతానం కోసం వీరిద్దర పార్వతీపరమేశ్వరులను విశేషంగా ఆరాధించారు. ఒక మంచి రోజు వేదిక గర్భం దాల్చింది. ఒక రోజు నిధ్రువ మహర్షి వరుణుడిని కలుసుకోవడానికి బయటకి వెళతారు. అప్పుడు వేదిక మూడవ త్రైమాసికంలో ఉంది.

PC: templeofficialwebsite

ఈ క్షేత్ర విశిష్టత:

ఈ క్షేత్ర విశిష్టత:

కొద్ది రోజులలో ప్రసవం జరగాల్సి ఉండగా..ఒక రోజు నిధ్రువ మహర్షి బయటకి వెళ్ళిన సమయంలో ఊర్థ్వపాదుడు అనే మహర్షి ఆశ్రమానికి వచ్చారు. అప్పటికి ఇంటిపనితో ఆలసిపోయి విశ్రాంతి తీసుకుంటున్న వేదిక ఆయన వచ్చిన సంగతి గమనించక మహర్షికి అతిథి మర్యాదలు చేయలేదు. దాంతో ఆగ్రహించిన ఊర్థ్వ పాదుడు ఆమె గర్భిణి అని తెలియక శపిస్తాడు. ఆ శాపంతో ఆమె ఒక వింత వ్యాధితో బాధపడటం మొదలవుతుంది. తత్పలితంగా ఆమె శరీరంలోని భాగాలే కాకుండా గర్భంలో ఉన్న శిశువు కూడా తినివేయబడడం మొదలవుతుంది. వెంటనే ఆమె ఎంతో ఆర్తితో బాధపడుతూ సర్వమంగళ స్వరూపమైన ఆ పార్వతీ మాతను ప్రార్థిస్తుంది.

PC: templeofficialwebsite

ఈ క్షేత్ర విశిష్టత:

ఈ క్షేత్ర విశిష్టత:

అవ్యాజకరుణామూర్తి అయిన అమ్మవారు వెంటనే ప్రత్యక్షమై ఆ గర్భస్థ పిండమును ఒక పవిత్రమైన కుండలో ఉంచి రక్షిస్తుంది. ఈ విధంగా రక్షింపబడిన శిశువు ఆ కుండలో పెరిగి అందమైన పిల్లవాడు జన్మిస్తాడు. అతనికి నైధ్రువన్ అని పేరు పెడుతారు. అప్పుడు జన్మించిన ఆ శిశువుకు కామధేనువు పాలిచ్చి ఆకలి తీర్చుతుంది. ఈలోగా ఆశ్రమం చేరుకున్న నిధ్రువ మహర్షి విషయం తెలుసుకుని ఎంతో సంతోషించి శివ పార్వతులను ఇక్కడే ఉండి రాబోయే తరాలలో కూడా మిమ్మల్ని ఆశ్రయించే వారికి గర్భరక్ష కలుగజేయమని ప్రార్థిస్తారు. మహర్షి చేసిన ప్రార్థనకి సంతసించిన అమ్మవారు మరియు అయ్యవారు ఈ క్షేత్రంలోనే గర్భరక్షాంబిక, ముల్లైవనాథర్ గా కొలువైఉన్నారు. ఇప్పటికీ అమ్మ అనుగ్రహంతో ఈ క్షేత్రమును దర్శించిన గర్భిణీ స్త్రీలకు ఎంతో చక్కగ ప్రసవం అయ్యి, మంచి పిల్లలు పుడతారు.

PC: templeofficialwebsite

ఈ క్షేత్ర విశిష్టత:

ఈ క్షేత్ర విశిష్టత:

ఈ క్షేత్రంలో అమ్మవారిని సేవిస్తే ఎన్నో ఎళ్ళగా పిల్లలు లేని వారు కూడా గర్భం దాల్చడం జరుగుతుంది. గర్భం దాల్చిన వాళ్ళకి చక్కని ప్రసవం అవుతుంది. పెళ్లికాని ఆడపిల్లలు ఇక్కడ అమ్మని ప్రార్థిస్తే వెంటనే మంచి వ్యక్తితో వివాహం జరిగి సంతానవంతులు అవుతారు.

PC: templeofficialwebsite

ఈ క్షేత్ర విశిష్టత:

ఈ క్షేత్ర విశిష్టత:

ఈ క్షేత్రంలో మరియు పరిసర ప్రాంతాల్లో నివాసించే వారెవ్వరికీ సంతానం లేకపోవడం లేదా గర్భస్రావాలు వంటి సమస్యలు లేవు. ఈ క్షేత్ర దర్శనానికి స్థానికులే కాదు, ఇతర రాష్ట్రాల నుండి, దేశ విదేశాల నుండి కూడా భక్తులు వస్తుంటారు.

PC: templeofficialwebsite

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X