• Follow NativePlanet
Share
» » త్రిభుజాకారంలో ఉన్న ఏకైక శివ లింగం ఎక్కడ ఉందో తెలుసా...

త్రిభుజాకారంలో ఉన్న ఏకైక శివ లింగం ఎక్కడ ఉందో తెలుసా...

Posted By: Beldaru Sajjendrakishore

హిందువులకు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాల్లో కేథర్నాథ్ మొదటి స్థానంలో ఉంటుంది. జీవితంలో ఒకసారైనా ఇక్కడికి వెళితే ముక్తి లభిస్తుందని ప్రతి హిందువూ భావిస్తుంటారు. ఇక్కడికి వెళ్లిన తర్వాత ఎటువంటి పాపకార్యములూ చేయకూడదని ఒక వేళ అలా చేస్తే దేవుడు పరలోకంలో కఠినంగా శిక్షిస్తాడని ప్రతీతి. అందువల్లే జీవిత చరమాంకంలో అంటే 60 ఏళ్లు పై బడిన వారే ఎక్కువగా ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శిస్తుంటారు. ఇక్కడి ప్రతి అణువణువు శివమయమై ఉంటుందని అందువల్ల ఈ పుణ్యక్షేత్ర ప్రవేశించినప్పటి నుంచి తిరిగి వచ్చేంత వరకూ పరమ పవిత్రంగా ఉండాలని స్థానిక అర్చకులు చెబుతుంటారు. ఆధ్యాత్మికంగా ఇంతటి విశిష్టతలకు కలిగిన ఈ కేధర్ నాథ్ అనేక ప్రత్యేకతలకు నిలయం. ఆ వివరాలన్నీ నేటివ్ ప్లానెట్ పాఠకుల కోసం...

1. పాండవుల నుంచి దూరంగా వెళ్లిన శివుడు

1. పాండవుల నుంచి దూరంగా వెళ్లిన శివుడు

Image source

పురాణాల ప్రకారం పాండవులు కురుక్షేత్రంలో విజయం సాధిస్తారు. అయితే తోటి సోదరులను బంధువులను చంపడంతో విపరీతమైన పాపం మూటగట్టు కొంటారు. ఈ పాప పరిహారం కోసం శివుడిని పూజించాలని భావిస్తారు. అయితే శివుడు వారికి దొరకకుండా చాలా చోట్లకు వెలుతుంటాడు. చివరికి ప్రస్తుత కేదరినాథ్ ప్రాంతానికి వచ్చి అక్కడ నంది రూపంలో ఉండిపోతాడు. ఈ విషయం ఆకాశవాణి ద్వారా తెలుసుకుని పాండవులు అక్కడికి వెళ్లి పూజిస్తారు. వీరి పట్టుదలకు మెచ్చిన శివుడు స్వర్గారోహణ సమయంలో సహాయం చేస్తానని వరం ఇచ్చినట్లు పురాణాలు చెబుతున్నాయి.

2. త్రిభుజాకారంలో లింగం

2. త్రిభుజాకారంలో లింగం

Image source

సాధారణంగా లింగం ఒవెల్ లేదా గుడ్డు ఆకారంలో ఉంటుంది. అయితే కేదారినాథ్ దేవాలయంలో మాత్రం త్రిభుజాకారంలో ఉంటుంది. పాండవుల్లో ఒకరైన భీముడు శివుడిన్ని ఆరాధించే సమయంలో ఈ లింగాన్ని ప్రతిష్టించారని ఒక కథనం. మరో కథనం ప్రకారం ఆదిశంకరాచార్యులు దేశ పర్యటనలో భాగంగా జ్యోతిర్లింగాల స్థాపన జరిపే సమయంలో ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్టించారని చెబుతారు. ఏది ఏమైనా ప్రపంచంలో త్రిభుజాకారంలో ఉన్న శివలింగం ఇక్కడ మాత్రమే కనిపిస్తుంది.

3. పాళీ భాషలో శాసనాలు...

3. పాళీ భాషలో శాసనాలు...

Image source

దేశీయ ఆధ్యాత్మికత వైపు విదేశీయులు సైతం ఇటీవల ఎక్కువ మక్కువ చూపిస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే కేథరినాథ్ దర్శించుకునే విదేశీయుల సంఖ్య కూడా ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఇక ప్రధాన ఆలయం మెట్ల పై పాళీ భాషలో మనకు శాసనాలు కనిపిస్తాయి.

4. ఈ రోజుల్లో మాత్రమే దర్శనం...

4. ఈ రోజుల్లో మాత్రమే దర్శనం...

Image source

కేదరినాథ్ మిగిలిన పుణ్యక్షేత్రంలో దైవ దర్శనం మిగిలిన పుణ్యక్షేత్రాలమాదిరి కాదు. ఆలయ పూజారులు కొన్ని విషయాలను పరిగణనలోకి తీసుకుని క్షేత్రం ఎప్పుడు భక్తులకు అందుబాటులో ఉండేది అధికారికంగా ప్రకటిస్తారు. సాధారణంగా ఛార్ ధామ్ యాత్రలో భాగంగా హిందువులు ఈ కేదరినాథ్ క్షేత్రాన్ని సందర్శిస్తుంటారు. అంటే ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్యలో ఈ ఛార్ దామ్ యాత్ర సాగుతుంది.

5. ఆరునెలలు గుప్తకాశీలోనే...

5. ఆరునెలలు గుప్తకాశీలోనే...

Image source

చలి కాలం అంటే నవంబర్ నుంచి ఏప్రిల్ మధ్య కాలంలో ఈ ప్రాంతంలో తీవ్రమైన చలి ఉంటుంది. వివపరీతమైన మంచు వల్ల ప్రజలు జీవించడానికి వీలుకాదు. అందువల్లే ఆ సమయంలో కేదరినాథ్ లోని ప్రధాన ఆలయాన్ని మూసివేస్తారు. పల్లకితో పాటు కేథరీనథ్ ను దగ్గర్లోని గుప్త కాశీకి మార్చి అక్కడే పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తారు.

6. ఇంకా ఏమేమి చూడవచ్చు...

6. ఇంకా ఏమేమి చూడవచ్చు...

Image source

కేథరినాథ్ ప్రధాన ఆలయానికి దగ్గరగా భైరవ దేవాలయం ఉంటుంది. ఇందులోని భైరవమూర్తికి ప్రధానంగా అర్చన జరుగుతుంది. శీతాకాలంలో కేధరినాథ్ ను భైరవుడే సంరక్షిస్తారని ఇక్కడి పూజారులతో పాటు ప్రజలు నమ్ముతారు. ఈ ఆలయానికి సుమారు 6 కిలోమీటర్ల దూరంలోని చోలాభాయ్ తాల్ అనే సరోవరం కూడా చూడదగినది.

7. కేధరినాథ్ చలువే...

7. కేధరినాథ్ చలువే...

Image source

2013 జూన్ 16 రాత్రి 7.30 గంటలకు అకస్మాత్తుగా వర్షం పడటం ప్రారంభించింది. ఈ వర్షం రెండు రోజుల పాటు కొనసాగి వరదలు పారాయి. ఈ బోరు వానులో వేలాది మంది భక్తులు తమ ప్రాణాలు కోల్పోగా అందుకు రెట్టింపు సంఖ్యలో ఆచూకి తెలియలేదు. కేథరినాథ్ పట్టణం దాదాపు తుడిచిపెట్టుకుని పోయింది. ఎక్కడ చూసిన బురద మయం. ఇంతటి విపత్తు సంభవించినా కేథరినాథ్ గర్భగుడి మాత్రం చెక్కచెదర లేదు. అంతే కాక గుడిలో ఉన్న భక్తులు కూడా ఈ వరదల నుంచి ప్రాణాలు కాపాడుకోగలిగారు. దీంతో గర్భగుడిలో శివుడు ఉండటం వల్లే అంతటి విపత్తు నుంచి కూడా దేవాలయం భయటపడిందని ప్రజలు నమ్ముతున్నారు.

8. 11,755 అడుగుల ఎత్తులో

8. 11,755 అడుగుల ఎత్తులో

Image source

కేదరినాథ్ ఉత్తరఖండ్ రాష్టంలో మందాకిని నదికి దగ్గరగా, సముద్రమట్టానికి 11,755 అడుగుల ఎత్తులో ఉంది.ఆలయానికి చేరుకోవడానికి నేరుగా రోడ్డు మార్గం లేదు. దగ్గరలోని గౌరికుండ్ వరకూ వాహనాల్లో వెళ్లి అక్కడి నుంచి దాదాపు 18 కిలోమీటర్లు నడిస్తే ప్రధాన ఆలయం వస్తుంది. నడవలేని వారికి డోలి సౌకర్యం ఉంది.

9. ఎలా వెళ్లాలి...

9. ఎలా వెళ్లాలి...

Image source

కేదరినాథ్ కు దగ్గర్లో జోలీ గ్రాంట్ విమానాశ్రయం ఉంది. ఢిల్లీ ఎయిర్ పోర్టు నుంచి ఇక్కడికి విమానసర్వీసులు ఉన్నాయి. జోలి గ్రాంట్ విమానశ్రయం నుంచి గౌరికుండ్ కు ట్యాక్సీ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. రైలు ద్వారా రిశికేష్ చేరుకుంటే అక్కడి నుంచి గౌరికుండ్ కు ట్యాక్సీ సర్వీసులు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటాయి. ఇక రోడ్డు మార్గంలో రిషికేష్, శ్రీనరగ్ నుంచి గౌరి కుండ్ చేరుకోవచ్చు.

10 మరింత సమాచారం కోసం...

10 మరింత సమాచారం కోసం...

Image source

శ్రీ కేథరినాథ్ యుథాన్ చారిటబుల్ ట్రస్ట్
ఉత్తరఖండ్ టూరిజం డెవలప్ మెంట్ బోర్డ్
నియర్ ఓ ఎన్ జీసీ హెలీపాడ్, డెహరడూన్248001

ఫోన్ నం 91- 135- 2559898, 2559987

E-mail : info.utdb@gmail.com

Read more about: travel

పర్యాటకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి
పర్యాటక చిట్కాలు, పర్యాటకానికి సంబంధించిన కథాలు తక్షణం పొందండి