Search
  • Follow NativePlanet
Share
» »ఇక్కడ శివయ్య మీ మానసిక సమస్యలకు పరిష్కారమార్గం చూపిస్తాడు?

ఇక్కడ శివయ్య మీ మానసిక సమస్యలకు పరిష్కారమార్గం చూపిస్తాడు?

గుణశీలం విష్ణు దేవాలయానికి సంబంధించిన కథనం.

గుణశీలం విష్ణు దేవాలయం గురించి మీరు విన్నారా? మానసిక వ్యాధులతో బాధపడేవారు ఈ దేవాలయానికి వస్తే వారి సమస్యకు పరిష్కారమార్గం దొరుకుతుందని స్థానికుల నమ్మకం. ఈ నేపథ్యంలో ఈ దేవాలయానికి సంబంధించిన కథనం.

గుణశీలం విష్ణు దేవాలయం

గుణశీలం విష్ణు దేవాలయం

P.C: You Tube

గుణశీలం విష్ణు దేవాలయం దక్షిణభారత దేశంలోని తమిళనాడులోని తిరుచ్చి నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ ప్రధానదైవం విష్ణువు. ఈ దేవాలయం కొల్లిడామ్ నదీతీరంలో ఉంది. ఈ దేవాలయంలో రోజుకు ఒకసారి దేవాలయం పూజారులు భక్తుల ముఖం పై నీటిని చిలకరిస్తారు.

గుణశీలం విష్ణు దేవాలయం

గుణశీలం విష్ణు దేవాలయం

P.C: You Tube

అలా చిలకరించే నీరు తమ పై పడాలని భావిస్తూ వేల సంఖ్యలో భక్తులు ఎదురుచూస్తుంటారు. ఇందు కోసం కొన్ని గంటల ముందు నుంచి దేవాలయం వద్ద పడిగాపులు కాస్తూ ఉంటారు. ఈ దేవాలయ నిర్మాణం కొంత భిన్నంగా ఉంటుంది.

గుణశీలం విష్ణు దేవాలయం

గుణశీలం విష్ణు దేవాలయం

P.C: You Tube

ఈ దేవాలయం విమానం పై శంకువు ఆకారంలో మూడు ప్రత్యేక నిర్మాణాలు ఉండటం వల్ల ఈ దేవాలయాన్ని త్రినేత్ర విమానం అని పిలుస్తారు. ఈ విమానం పై పెద్ద పెద్ద శిల్పాలు చూపరులను ఇట్టే ఆకర్షిస్తాయి. ముఖ్యంగా గరుడ వాహనం పై ఉన్న విష్ణువు విగ్రహం ఎంతగానో ఆకట్టుకొంటుంది.

గుణశీలం విష్ణు దేవాలయం

గుణశీలం విష్ణు దేవాలయం

P.C: You Tube

ఈ దేవాలయంలో ప్రసన్న వదనంతో కూడిన వేంకటేశ్వరుడి విగ్రహం కూడా ఉంది. అందువల్ల ఈ దేవాలయాన్ని కొందరు ప్రసన్న వెంకటాచలపతి దేవాలయం అని కూడా పిలుస్తారు. ఇక్కడ భగవంతుడు నిలుచొన్న స్థితిలో కనిపిస్తాడు.

గుణశీలం విష్ణు దేవాలయం

గుణశీలం విష్ణు దేవాలయం

P.C: You Tube

ఇక్కడ కుడి చేయ్యి అభయముద్రను సూచిస్తుంది. అదే విధంగా మరో చేతిలో గదకూడా ఉంటుంది. మరో రెండు చేతుల్లో శంఖు, చక్రాలు ఉంటాయి. గర్భగుడి చుట్టూ నరసింహ, చేతిలో వెన్న ముద్దలతో కూడిన క`ష్ణుడు, వరాహ, శ్రీదేవి, భూదేవి తదితర విగ్రహాలతో కూడిన పలు ఉపాలయాలు కూడా మనం ఇక్కడ చూడొచ్చు.

గుణశీలం విష్ణు దేవాలయం

గుణశీలం విష్ణు దేవాలయం

P.C: You Tube

ముఖ్యంగా ఈ దేవాలయం మానసిక వ్యాధితో బాధపడేవారికి పరిష్కారమార్గం చూపిస్తుందని భక్తులు నమ్ముతారు. సాధారణంగా మానసిక వ్యాధితో బాధపడేవారిని వారి కుటుంబ సభ్యులు 48 రోజుల పాటు దేవస్థానంలో వదిలేస్తారు.

గుణశీలం విష్ణు దేవాలయం

గుణశీలం విష్ణు దేవాలయం

P.C: You Tube

వారిని ఆధ్యాత్మిక కార్యక్రమాల వైపు దేవాలయ నిర్వహకులు ప్రోత్సహిస్తారు. దీంతో వారు ఇక్కడి దైవం అనుగ్రహం వల్ల 48 రోజుల తర్వాత పూర్తిగా కోలుకొంటారని నమ్ముతారు. ఈ దేవాలయాన్ని ప్రతి రోజూ ఉదయం 6.30 గంటల నుంచి రాత్రి 8.30 గంటలవరకూ సందర్శించవచ్చు.

గుణశీలం విష్ణు దేవాలయం

గుణశీలం విష్ణు దేవాలయం

P.C: You Tube

ఇక్కడ ప్రతిఏడాది స్వామివారి బ్రహోత్సవాలను ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. పదిహేను రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వస్తుంటారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X