Search
  • Follow NativePlanet
Share
» » తిరుపతికి అతి సమీపంలో ఉన్న ఈ అద్భుతమైన గుండాలకోన చూశారా?

తిరుపతికి అతి సమీపంలో ఉన్న ఈ అద్భుతమైన గుండాలకోన చూశారా?

అడవులు ... నీటి అందాలు చెప్పలేనివి. ఎందుకంటే చుట్టూరా విస్తరించిన పచ్చిక బయళ్లు, ప్రకృతి సోయగాలు వీటి సొంతం.వీటిని చూస్తేనే తెలీని ఆనందం ప్రతీ అణువులోనూ ప్రసరిస్తుంది. మన దగ్గర ఉన్న అడవుల విషయానికొస్తే శేషాచలం అడవులు, నల్లమల్ల అడవులు. శ్రీశైల మల్లికార్జునుడు నల్లమల్ల అడవులలో, శ్రీ వెంకటేశ్వరుడు శేషాచలం అడవులలో కొలువై ఉన్నారు. ఇప్పుడు మనం చెప్పబోయే ప్రదేశం శేషాచలం అడవులు. చల్లదనం కోసం ప్రశాంతత కోసం టూర్‌ కు వెళ్లాలని అనుకునేవారు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఈ ఊటీ కే ఇవ్వొచ్చు.

ఎందుకంటే ప్రకృతిలో మనకందించిన అరుదైన అద్భుతాల్లో అడవులతో పాటు జలపాతాలు కూడా అత్యంత కీలకమైనవి. ఆ జలపాతాల సోయగాలను ఒక్కసారి వీక్షించి వస్తే చాలు ఎంత ఒత్తిడిలో ఉన్నా మాయమైపోతుంది. ముఖ్యంగా మరి సిటీ లైఫ్ లో పడి నవ్వడం కూడా మర్చిపోయిన మనం ఒక్కసారి జలపాతాల్లో , అడవుల్లో విహరిద్దాం రండి.

అందమైన జలపాతాలకు నెలవైన కడప జిల్లాలో ప్రకృతి అందాలకు కొదవే లేదు. ఎత్తైన కొండలు, లోతైన జలపాతాలు..ఇక అడవుల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కారణం, అడవుల జిల్లాగా పిలుకోవడమే దీనికి నిదర్శనం. వీటితో పాటు దర్శనీయ రమణీయ స్థలాలు చాలా ఉన్నాయి. దక్షిణ భారతదేశంలోనే పేరెన్నికగన్న దేవుని కడప ఆలయం కొలువైంది కడపలోనే. అంతే కాదు, జిల్లాలోనే ఎత్తైన జలపాతం కూడా ఇక్కడే ఉంది. అదే పాలకొండ జలపాతం. అలాగే లంకమల జలపాతం. తౌలాంతపూరం జలపాతం, గుండాలకోన జలపాతం. కడప పర్యటనకు వెళ్లే వారు తప్పకుండా సందర్శించ వల్సిన ప్రదేశాలు ఇవి. ముఖ్యంగా గుండాల కోన జలపాతం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం..

కడప జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలో పెద్దూరు అనే ప్లెకు దగ్గరలో

కడప జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలో పెద్దూరు అనే ప్లెకు దగ్గరలో

కడప జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలో పెద్దూరు అనే ప్లెకు దగ్గరలో ఉంది. ఇక్కడ నీలకంఠేశ్వరస్వామి ఆలయం..విశ్వామిత్రుడు ప్రతిష్టించిన గుండాలేశ్వరస్వామి ఆలయ ప్రాంతమే గుండాలకోనగా ప్రసిద్ది చెందింది.

ప్రత్యేకతలు:

ప్రత్యేకతలు:

ఈ గుండాలకోనలో ఈశ్వరుడు ఇక్కడ కర్కాటకం రూపంలో దర్శనమిస్తాడు. ఈ కర్కాటకం ఒకొక్క సందర్భంలో ఒక్కొక్క సైజులో కూడా కనిపిస్తూ కోరిన వారి కోర్కెలు తీరుస్తాడు. ఇక్కడి గుండంలో మునిగి దేవున్ని దర్శించుకుంటే పాపాలు పోతాయని పూర్వీకులు నమ్మకం. ఒక్కసారి గుండాలలో స్నానమాచరిస్తే అప్పటి వరకు ఉన్న బడలిక మటుమాయమవుతుందని వైద్యులు సైతం అంటున్నారు.

విశేషం:

విశేషం:

పార్వతీపరమేశ్వరుల నిలయమైన గుండాలకోన’ అత్యంత పవిత్రమైన స్థలంగా చెప్పుకోవచ్చు. ఈ ప్రదేశంలో ఒక పేటులో కర్కాటకం రూపంలో సజీవంగా దర్శనమిచ్చే స్వామిని దర్శించుకోవడానికి కార్తీక మాసంలోని సోమవారాల్లో అధిక సంఖ్యలో వెళుతుంటారు. ప్రత్యేకించి మూడవ సోమవారం ఎక్కువ మంది వెళుతుంటారు.

విశేషం:

విశేషం:

ఇక్కడికి వచ్చే భక్తులు నీటి గుండంలో మునిగి స్వామి వారిని దర్శించుకుంటారు. స్వామి వారికి దగ్గరలో పుష్పం రేకును పెట్టినట్లైతే మన మనస్సులో అనుకున్నది తీరుతుంది అంటే ఆ రేకును స్వామి వారు తీసుకుని నీట ముంచుతాడు.

మహత్యం :

మహత్యం :

గుండాల కోనలో ఆ పరమేశ్వరుడు కర్కాటక రూపంలో ఎన్నో సంవత్సరాల నుండి ఉండటం ఒక పెద్ద విశేషం. తుంగా రాఘవయ్య మరియు మరికొందరు భక్తులు కలసి ఈ ప్రదేశంలో రాత్రుళ్ళు నిద్రచేయగా తెల్లవారు జామున స్వామివారి పుటు దగ్గర నుంచి మంగళ వాయిద్యాలు వినిపించాయని అంటారు. ఆలయంతో పాటు ఇక్కడ చూడవల్సిన ప్రదేశాలు గుండాల కోన మనస్సుకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది.

ఇక్కడ ఎత్తైన ప్రదేశం నుండి జారి గుండంలో పడే నీరు ఒక ప్రత్యేకత.

ఇక్కడ ఎత్తైన ప్రదేశం నుండి జారి గుండంలో పడే నీరు ఒక ప్రత్యేకత.

ఇక్కడ ఎత్తైన ప్రదేశం నుండి జారి గుండంలో పడే నీరు ఒక ప్రత్యేకత. గుండాలు.. గుండాలకోన సెలయేరు పైభాగాన ఆకారాన్ని బట్టి ఏడు గుండాలు ఉన్నాయి, చదును గుండం, బూడిద గుండం, సమారాధన గుండం, పసుపుగుండం, గిన్నిగుండం, అక్కదేవతల గుండం, స్నాన గుండం... ఇలా ఏడు గుండాలు కనిపిస్తాయి. సాధారణ గుండాల కంటే ఎక్కువ లోతుగా ఉండటం వీటి ప్రత్యేకత.

చదునుగుండంగా చెప్పే చోట నుండి నీరు గిన్నె ఆకారంలో

చదునుగుండంగా చెప్పే చోట నుండి నీరు గిన్నె ఆకారంలో

చదునుగుండంగా చెప్పే చోట నుండి నీరు గిన్నె ఆకారంలో ఉన్న బండలపై పడుతుంది. దీనినే గిన్నె గుండంగా పిలుస్తున్నారు. ఇక్కడే స్నాన గుండం కూడా ఉంది. గిన్నె గుండంలోని నీరు ఇక్కడికి చేరుతుంది. ఈ నీరు మీరో గుండంలోకి పడగానే పసుపు రంగులోకి మారుతుంది. అందువల్లనే దీనికి పసుపు గుండం అని పిలుస్తారు. ఆ తర్వాత ఈ నీరు మరో గుండంలో పడగానే బూడిదరంగుగా మారడంతో దాన్ని బూడిదగుండం అంటున్నారు. ఈ నీరు సమారాధన గుండంలోకి వెళుతుంది. ఇక్కడే భక్తులు స్నానమాచరిస్తారు. కారణాలు ఏవైనప్పటికీ ఇక్కడికి వచ్చే భక్తులు గుండాల్లో స్నానమాచరించి తమ బాధలు మరచి మానసిక ప్రశాంతత పొందుతారు.

పర్యాటకులు విహరిస్తూ..

పర్యాటకులు విహరిస్తూ..

కొండెలెక్కుతున్నా, జారిపడుతూ సెలయేళ్లు దాటుతున్నా, ఇరుకుదారుల్లో నుంచి నడవాల్సి వచ్చినా ఆ కష్టమేదీ అనిపించదు. ఆ అడవి అందాలు చేసే మాయ అది. ఒక్కసారి సందర్శిస్తే చాలు... 'మళ్లీ ఓ సారి వచ్చిపో' అన్నట్టు ఆ ఆహ్లాదపు జ్ఞాపకాలు మనసులో తిష్ట వేసుకుంటాయి. పూర్తిగా ఒక కొత్త లోకంలో ప్రయాణిస్తున్నట్టు ఉంటుంది. తిరుగు ప్రయాణంలో మంచి నేస్తాన్ని వదిలివస్తున్న గాఢమైన అనుభూతికి లోనవ్వాల్సిందే ఎవరైనా.!

ఉత్సవాలు

ఉత్సవాలు

శతాబ్దాలుగా మహాశివరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయక్కడ. భక్తుల రద్దీ పెరిగాక ఆర్టీసీ అధికారులు ఆ ఒక్క రోజు మాత్రం రైల్వేకోడూరు నుంచి వై.కోట మీదుగా గుండాలకోనకు బస్సులు నడుపుతున్నారు. ఇక్కడి నీలకంఠేశ్వరస్వామి ఆలయంలో కూడా యేటా మహాశివరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి.

వై.కోట నుంచి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ ఆలయ ఉత్సవాలకు కొందరు వాహనాల్లో వెళ్తే, కొందరు కాలి నడకన వెళ్తుంటారు. కాని దట్టమైన అడవుల్లో దారి తప్పి క్రూరజంతువులకు బలైన సంఘనటలు కొన్ని జరిగాయి. అందుకే అటవీ అధికారుల అనుమతి, సహాయంతో ప్రయాణం సాగించటం మంచిదంటారు అధికారులు.

Photo Courtesy: Bharath Kumar

గుండాల కోన నుంచి మూడు కిలో మీటర్ల దూరంలో ఉన్న సలీంద్ర కోన

గుండాల కోన నుంచి మూడు కిలో మీటర్ల దూరంలో ఉన్న సలీంద్ర కోన

గుండాల కోన నుంచి మూడు కిలో మీటర్ల దూరంలో ఉన్న సలీంద్ర కోన కూడా పర్యాటకులను ఆకట్టుకునే మరొక ప్రదేశం. తుంబురకోన క్షేత్రం.. గలగల శబ్దాలతో ఒక అందమైన జలపాతం. దాని పక్కనే ఒక గుహ. అడవి మధ్యలోనున్న ఆ గుహలో కొలువుదీరిన తుంబుర స్వామి.చూడముచ్చటగా కనిపించే ఆ ప్రదేశమే తుంబురకోన క్షేత్రం. తిరుమలకు ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రానికి పొరుగు రాష్ట్రాల నుంచి కూడా సందర్శకులు ఎక్కువగా వస్తుంటారు. గుంజన జలపాతం.. బాలపల్లె అడవుల్లో ఉన్న గుంజన నది జలపాతం నయగరా జలపాతాన్ని గుర్తుకు తెస్తుందంటే అతియోశక్తి కాదేమో!

శేషాచలం అడవులకు ఎలా వెళ్ళాలి?

శేషాచలం అడవులకు ఎలా వెళ్ళాలి?

విమానాశ్రయం రుపతి వద్ద ఉన్న రేణిగుంట విమానాశ్రయం ఈ శేషాచల అడవులకు దగ్గరలో ఉన్నది. ఇక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా ఈ అడవులకు చేరుకోవచ్చు.

రైలు మార్గం

తిరుపతి వద్ద ఉన్న రైల్వే స్టేషన్ ప్రధాన రైల్వే స్టేషన్. ఇక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా ఈ ప్రాంతానికి చేరుకోవచ్చు.

రోడ్డుమార్గం

రోడ్డు మార్గం విషయానికొస్తే రైల్వేకోడూరు నుంచి అటవీ ప్రాంతంలోకి వెళ్తే... కొట్రాల గుండాలు, చెంచమ్మకోన, వాననీళ్ళగుట్టలు, కమ్మపెంట, కుందేలుపెంట, ఏనుగలబావి, స్వామి వారి పాదాలు, సలీంద్రకోన.. మొదలైన ప్రాంతాలు ప్రకృతి అందాలకు చిరునామాగా వెలుగొందుతుంటాయి. ఎర్రచందనానికి ప్రసిద్ధిగాంచిన శేషాచలం కొండల్లోకి ట్రెక్కింగ్ వెళ్ళాలంటే ముందుగా... రేణిగుంట-కడప జాతీయ రహదారి మీదుగా కుక్కల దొడ్డి గ్రామంవద్ద ఉన్న "బాలపల్లె బంగ్లా క్యాంప్" నుంచి బయలుదేరాలి.

Photo Courtesy: Sreenivasan Ramakrishnan

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Nativeplanet sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Nativeplanet website. However, you can change your cookie settings at any time. Learn more