• Follow NativePlanet
Share
» »కాకి కూడా హంసగా మారిన చోటు..సర్వపాపాలు తొలిగే ప్రాంతం..ఎన్నెన్ని వింతలో

కాకి కూడా హంసగా మారిన చోటు..సర్వపాపాలు తొలిగే ప్రాంతం..ఎన్నెన్ని వింతలో

Written By: Kishore

కృష్ణానది సాగరుడిలో కలిసే ప్రాంతమే హంసల దీవి. పురాణ ప్రాధాన్యత కలిగిన ఈ ప్రాంతాన్ని హిందువులు అత్యంత పవిత్రమైన స్థలంగా భావిస్తారు. ఇక ఇక్కడ ఉన్న సత్యభామా సమేత శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయాన్ని ఒక్క రాత్రిలో దేవతలు నిర్మించారని చెబుతారు. అంతేకాదు మహర్షులు, దేవతలకు సంబంధించిన అనేక ఘటనలకు ఈ హంసల దీవి కేంద్ర బిందువు. ఈ హంసల దీవి పురాణ ప్రాధాన్యత కలిగిన ప్రాతంగానే కాకుండా ఒక పిక్నిక్ స్పాట్ గా కూడా ప్రాచుర్యం పొందింది. దీంతో వారాంతాల్లో ఇక్కడకు ఎక్కువ మంది వస్తుంటారు. విజయవాడకు 110 కిలోమీటర్లు, అవనిగడ్డకు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ హంసల దీవికి సులభంగా రోడ్డు మార్గం ద్వారా కూడా చేరుకోవచ్చు. ఇక్కడ సౌకర్యాలు కొంత తక్కువ అందువల్ల మంచినీరుతో పాటు ఆహారం అన్నీ మనమే తీసుకొని వెళితే మంచిది. ఇక ఈ హంసల దీవి వెనుక ఉన్న కథలన్నీ మీ కోసం

సముద్ర నురుగుతో తయారైన వినాయకుడు..సందర్శిస్తే వెంటనే వివాహం

1. అపవిత్రమైన గంగానది

1. అపవిత్రమైన గంగానది

P.C: You Tube

పాపాత్ములు అందరూ గంగానదిలో స్నానం చేసి వారి పాపాలను పోగొట్టుకొనేవారు. అయితే వారి పాపాలను గంగాదేవి తీసుకోవడంతో ఆమె అవిత్రమైంది. అంతే కాకుండా ఆమె రంగు కూడా నల్లమారిపోయింది.

2. విష్ణువు వద్దకు వెళ్లి తన బాధలను చెప్పుకొంది

2. విష్ణువు వద్దకు వెళ్లి తన బాధలను చెప్పుకొంది

P.C: You Tube

దీంతో గంగాదేవి విష్ణువు వద్దకు వెళ్లి తన బాధలను చెప్పుకొంది. విష్ణువు సూచన మేరకు గంగానది కాకి రూపంలో దేశంలోని అన్ని పవిత్ర స్థలాల్లోని తీర్థాల్లో స్నానం చేస్తూ ఉండేది.

3. నల్లని రూపం పోయి

3. నల్లని రూపం పోయి

P.C: You Tube

ఒకసారి కృష్ణానది సాగరుడిలో కలిసే ప్రాంతం అంటే ప్రస్తుత హంసలదీవిలో స్నానం చేయగానే నల్లని రూపం పోయి హంసగా మారిపోయింది. అందువల్లే ఈ ప్రాంతాలనికి హంసల దీవి అని పేరు వచ్చింది.

4. బ్రహ్మాండ పురాణంలోని కథనం ప్రకారం

4. బ్రహ్మాండ పురాణంలోని కథనం ప్రకారం

P.C: You Tube

బ్రహ్మాండ పురాణంలోని కథనం ప్రకారం పూర్వం ఇక్కడ చాలా మంది మహాపురుషులు తపస్సు చేస్తూ ఉండేవారు. ఒకసారి వారు ఒక గొప్ప యాగం చెయ్యాలని భావించారు.

5. శౌనకాది మహర్షులను పిలిపించారు

5. శౌనకాది మహర్షులను పిలిపించారు

P.C: You Tube

ఇందుకోసం శౌనకాది మహర్షులను పిలిపించారు. అంతేకాకుండా విషయం తెలిసి దేశంలోని చాలా ప్రదేశాల నుంచి కూడా ఈ యాగం జరిగే ప్రాంతానికి ప్రజలతో పాటు అనేక మంది బుురుషులు కూడా వచ్చారు.

6. కవశుడనే మహర్షి

6. కవశుడనే మహర్షి

P.C: You Tube

ఈ క్రమంలోనే గోదావరి నదీ తీరాన కవశుడనే మహర్షి ఉండేవాడు. ఆయన బ్రాహ్మణుడికి, శూద్ర జాతి స్త్రీకి జన్మించిన వాడు. అయినా గొప్ప తపస్సంపన్నుడు. కొంతమందికి మోక్షమార్గాన్ని కూడా బోధించాడు.

 7. కవశ మహర్షిని చూడగానే

7. కవశ మహర్షిని చూడగానే

P.C: You Tube

ఈ కవశుడనే మహర్షికి కూడా హంసల దీవి వద్ద జరిగే యాగాన్ని చూడటానికి బయలు దేరి వెళ్లాడు. అక్కడ ఉన్న కొంతమంది బుుషులు కవశ మహర్షిని చూడగానే కోపంతో ఊగిపోయారు. వేద మంత్రోఛ్ఛరణ ఆపేశారు.

8. వేణుగోపాలస్వామి ఆలయం వద్దకు వెళ్లాడు.

8. వేణుగోపాలస్వామి ఆలయం వద్దకు వెళ్లాడు.

P.C: You Tube

కుల బ్రష్టుడైన కవశుడి రాకతో యాగవాటిక అపవిత్రమైందని అనేక విధాలుగా దూషించి అగౌరవ పరిచారు. కవశుడి శిష్యులు ఆ బుుషులపై దాడికి వెళ్లబోయారు. అయితే శాంతస్వరూపుడైన కవశుడి వారిని వారించి దగ్గర్లో ఉన్న వేణుగోపాలస్వామి ఆలయం వద్దకు వెళ్లాడు.

9. కృష్ణానది ఒక్కసారిగా ఉప్పొంగింది

9. కృష్ణానది ఒక్కసారిగా ఉప్పొంగింది

P.C: You Tube

తనకు జరిగిన అవమానం భరించలేనిదిగా ఉందని కవశుడు విచారిస్తూ ఉంటారు. అదే సమయంలో నిర్మలంగా ప్రవహిస్తున్న కృష్ణానది ఒక్కసారిగా ఉప్పొంగింది. ఇప్పటి పులిగడ్డ గ్రామానికి కొంచెం అవతల రెండు చీలికలుగా మారిపోయింది.

10. యాగవాటికను ముంచెత్తింది

10. యాగవాటికను ముంచెత్తింది

P.C: You Tube

అందులో ఒక చీలిక కళ్లేపల్లి మీదుగా హంసలదీవి వచ్చి వేణుగోపాలస్వామి పాదాలను తాకి, కవశ మహర్షి చుట్టూ తిరిగి యాగవాటికను ముంచెత్తింది. యాగకుండాలు నీటితో నిండిపోగా కవశుడిని నిందించినవారందరూ ఆ నీటి ప్రవాహంలో కొట్టుకోపోసాగారు.

11. క్షమించమని అడిగారు

11. క్షమించమని అడిగారు

P.C: You Tube

దీంతో శౌనకాది మహర్షులు తమ దివ్య శక్తితో జరిగిన దానికి కారణం తెలుసుకొని కవశమహర్షి వద్దకు వెళ్లి క్షమించమని అడిగారు. అయితే తాను మిమ్ములను క్షమించేత పెద్దవాడిని కాకని అందరినీ ఆ క్షమించేవాడు ఆ దేవుడేనని వేణుగోపాలస్వామిని వేడుకోమని సూచించారు.

12. కృష్ణానది శాంతించింది

12. కృష్ణానది శాంతించింది

P.C: You Tube

ఇక యాగం మధ్యలో ఆగిపోకుండా సహకరించాల్సిందిగా బుుషులు వేణుగోపాలస్వామిని వేడుకోగానే కృష్ణానది శాంతించింది. అటు పై యాగం ఎటువంటి ఆటంకాలు లేకుండా కొనసాగిందని స్థల పురాణం.

13. ఈ ప్రాంతం చాలా పవిత్రమైనదనదని

13. ఈ ప్రాంతం చాలా పవిత్రమైనదనదని

P.C: You Tube

ఇక కవశమహర్షి ఈ ఘటన జరిగిన తర్వాత ఈ ప్రాంతం చాలా పవిత్రమైనదనదని చెబుతారు. ఇక్కడ స్నానం చేసి వేణుగోపాల స్వామికి అర్చన చేసిన వారి సకల పాపాలు పోతాయని చెబుతాడు.

14. అలా కూడా పేరు వచ్చింది

14. అలా కూడా పేరు వచ్చింది

P.C: You Tube

కవశమహర్షి అలా చెబుతుండంగానే ఒక కాకి కృష్ణానది సాగరుడిలో కలిసే ప్రాంతంలో మునిగి హంసగా మరడం అందరూ చూశారు. దీంతో ఈ ప్రాంతానికి హంసల దీవి అనే పేరు వచ్చిందని చెబుతారు.

15. ఒక్క రాత్రిలో

15. ఒక్క రాత్రిలో

P.C: You Tube

ఇక ఇక్కడ వెలిసిన వేణుగోపాల స్వామి దేవాలయాన్ని దేవతలు ఒక్క రాత్రిలో నిర్మించారని చెబుతారు. సూర్యోదయం అవుతున్న సమయంలో స్నానిక ప్రజలు చూస్తారన్న భయంతో దేవతలు అంతర్థానమైపోతారని అందువల్లే ఈ వేణుగోపాలస్వామి రాజగోపురం అసంపూర్తిగా మిగిలిపోయిందని చెబుతారు.

16. నీలమేఘ ఛాయతో

16. నీలమేఘ ఛాయతో

P.C: You Tube

సాధారణంగా ఏ విగ్రహమైన నల్లని రంగులో ఉంటుంది. ప్రపంచంలో ఎక్కడా లేనట్లు ఇక్కడ వేణుగోపాల స్వామి విగ్రహం నీలమేఘ ఛాయతో విలసిల్లుతోంది. ఇందుకు సంబంధించి కూడా ఒక కథనం ప్రచారంలో ఉంది.

17. ఆ పుట్టపై వేసి తగులబెట్టారు.

17. ఆ పుట్టపై వేసి తగులబెట్టారు.

P.C: You Tube

పూర్వం ఇక్కడ గోవులను మేపేవారు. ఈ క్రమంలో కొన్ని గోవులు ఒకసారి ఒక పుట్ట వద్దకు వచ్చి తమంతకు తామే పలు ఇవ్వడం మొదలు పెట్టాయి. దీంతో గోవులను కాసేవారు కొంత చెత్తను ఆ పుట్టపై వేసి తగులబెట్టారు.

18. విగ్రహం పూర్తిగా కాలిపోయింది

18. విగ్రహం పూర్తిగా కాలిపోయింది

P.C: You Tube

దీంతో పుట్టలోని స్వామి వారి విగ్రహం పూర్తిగా కాలిపోయింది. ఒక్క మొహం తప్ప మిగిలిన శరీరం అంతా తునాతునకలు అయిపోయింది. విషయం తెలుసుకొన్న గోపాలురుతో పాటు గ్రామస్తులు తీవ్రంగా బాధపడ్డారు.

19. అశరీరవాణి వారికి వినిపించింది

19. అశరీరవాణి వారికి వినిపించింది

P.C: You Tube

ఈ సమయంలో ఒక అశరీరవాణి వారికి వినిపించింది. దాని ప్రకారం పశ్చిమగోదావరి జిల్లాల్లోని కాకరపర్తి అనే గ్రామంలోని ఓ భూస్వామి ఇంటి ఈశాన్యపూలలో ఉన్న కాకర మెక్క పాదులో నేను వెలిశానని చెప్పాడు.

 20. నీలి వర్ణంలో మెరిసిపోతూ

20. నీలి వర్ణంలో మెరిసిపోతూ

P.C: You Tube

ఆ విగ్రహాన్ని ఇక్కడకు తీసుకువచ్చి ప్రతిష్టించి పూజించాలని చెప్పాడు. ఆ శరీర వాణి చెప్పినట్లే గ్రామస్తులు అక్కడికి వెళ్లి చూడగా స్వామివారి విగ్రమం నీలి వర్ణంలో మెరిసిపోతూ ఉంది. దానినే ఇక్కడకు తెచ్చి ప్రతిష్టించారు. అటు పై దేవతలు అందరూ కలిసి ఈ వేణుగోపాల స్వామికి దేవాలయం నిర్మించారు.

పర్యాటకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి
పర్యాటక చిట్కాలు, పర్యాటకానికి సంబంధించిన కథాలు తక్షణం పొందండి