Search
  • Follow NativePlanet
Share
» »ఇక్కడి దేవత సర్పదోషం నివారించి సంతాన ప్రాప్తిని కలిగిస్తుంది....

ఇక్కడి దేవత సర్పదోషం నివారించి సంతాన ప్రాప్తిని కలిగిస్తుంది....

హరిద్వార్ లోని మానసదేవి దేవాలయం గురించి.

By Kishore

మానసదేవీ ఆలయం ఉత్తరాఖండ్ లోని హరిద్వారాల్ లో ఉంది. మనసదేవి దేవాలయాన్ని హరిద్వార్ లో ఉన్న మూడు శక్తి పీఠాల్లో ఒకటిగా పేర్కొంటారు. మాయా దేవి ఆలయం, చండీదేవి ఆలయం మిగిలిన రెండు దేవాలయాలుగా స్థానికులు చెబుతారు. ఇక్కడ కొలువై ఉన్న మానస దేవిని పూజిస్తే సర్పదోశ నివారణ జరిగి వెంటనే సంతానం కలుగుతుందని చెబుతారు. ఈ భూమండలం పై ఉన్న అన్ని సర్పాలకు అధినేత్రిగా మానసదేవిని భావిస్తారు. ముఖ్యంగా వర్షాకాలంలో ఈ దేవతకు పూజలు ఎక్కువగా జరుగుతాయి. పాముకాటుకు గురైనప్పుడు మానసదేవిని పూజిస్తే ప్రయోజనం ఉంటుందని చాలా మంది భక్తుల నమ్మకం. కష్యప మహాముని మనస్సు నుంచి పుట్టిన దేవి కనుక ఈమెకు మానస అనే పేరు వచ్చిందనేది కొన్ని పురాణాల కథనం. హరిద్వార్ వెళ్లే యాత్రికులు ఈ దేవాలయానికి తప్పక వెలుతుంటారు. ఇన్ని విశిష్టతలు ఉన్న ఈ దేవాలయం, ఆ దేవత పూర్తి చరిత్ర మీ కోసం...

ఇక్కడ బెల్లం నీళ్లలో స్నానం చేస్తారు...చర్మవాధులు పోగొట్టుకొంటారుఇక్కడ బెల్లం నీళ్లలో స్నానం చేస్తారు...చర్మవాధులు పోగొట్టుకొంటారు

1. సర్పాలకు అధినేత్రి

1. సర్పాలకు అధినేత్రి

Image Source:

ఈ భూమండలం పై ఉన్న అన్ని సర్పాలకు అధినేత్రిగా మానస దేవిని భావిస్తారు. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ తో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో మానస దేవిని తమ కుల దేవతగా ఎంతో మంది పూజిస్తుంటారు.

2. వర్షాకాలంలో

2. వర్షాకాలంలో

Image Source:

ముఖ్యంగా వర్షాకాలంలో ఈ దేవతకు ఆ ప్రాంతాల్లో పూజలు ఎక్కువగా జరుగుతాయి. ఈ కాలంలో సర్పాలు చాలా చురుకుగా ఉంటాయి కాబట్టి వాటి నుంచి కాపాడుకోవడం కోసం మానసదేవిని భక్తులు ఈ విధంగా పూజలు జరుపుతారు.

3. పంట పొలాల్లో

3. పంట పొలాల్లో

Image Source:

అంతే కాకుండా పాముకాటుకు గురైనప్పుడు మానసదేవిని పూజిస్తే ప్రయోజనం ఉంటుందని చాలా మంది ఇప్పటికీ నమ్ముతుంటారు. ముఖ్యంగా పంట పొలాల వద్ద మానస దేవికి ప్రత్యేక పూజలు చేసే సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతూ వస్తోంది.

4. శివుడి కుమార్తే?

4. శివుడి కుమార్తే?

Image Source:

మానస దేవి పుట్టుక పై ఖచ్చితమైన సమాచారం ఏదీ లేదు. కొన్ని పురాణాలు మానస దేవి శివుడి కుమార్తెగా పేర్కొంటే, మరికొన్ని మాత్రం కష్యప మహాముని సంతానమని చెబుతాయి.

5. వాసుకికి సోదరి

5. వాసుకికి సోదరి

Image Source:

కష్యప మహాముని మనస్సు నుంచి పుట్టిన దేవి కనుక ఈమెకు మానస అనే పేరు వచ్చిందనేది కొన్ని పురాణాల కథనం. క్షీరసాగర మదనం సమయంలో దేవతలకు సాయం చేసిన వాసుకి అనే పాముకు మానస దేవి సోదరి అని చెబుతారు.

6. పరమశివుడినే కాపాడిందని చెబుతారు

6. పరమశివుడినే కాపాడిందని చెబుతారు

Image Source:

బెంగాల్ జానపద కథలను అనుసరించి మానస దేవి పరమశివుడు క్షీర సాగర మధనం లో వచ్చిన హాలాహలంను తాగిన తర్వాత చనిపోకుండా కాపాడింది వాసుకీ దేవి అని చెబుతారు.

7. అక్కున చేర్చుకోవడానికి

7. అక్కున చేర్చుకోవడానికి

Image Source:

మానస దేవి పుట్టుకకు సంబంధించి సరైన ఆధారాలు లేక పోవడం వల్ల దేవతలు ఆమెను తమ అక్కున చేర్చుకోవడానికి ఇష్టపడటం లేదని కొన్ని వాదనలు వినిపిస్తున్నాయి.

8. మూడు నాళ్ల ముచ్చటగానే

8. మూడు నాళ్ల ముచ్చటగానే

Image Source:

మరోవైపు ఆమె వివాహ బంధం కూడా మూడునాళ్ల ముచ్చటగానే మిగిలి పోయింది. కష్యప మహాముని అభ్యర్థన మేరకు జరత్కరు అనే ముని మానసదేవిని వివాహం చేసుకుంటాడు. కొన్ని రోజుల పాటు వీరి సంసారం బాగానే సాగుతుంది.

9. అష్టిక అనే కుమారుడు

9. అష్టిక అనే కుమారుడు

Image Source:

అయితే ఒక రోజు మానసదేవి తన భర్త పట్ల నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తుంది. దీనిని సహించలేని జరత్కరు ఆమెను వదిలి వెళ్లి పోతాడు. అప్పటికే గర్భవతి అయితన మానస దేవి అష్టిక అనే కుమారుడు పుడుతాడు.

10. తాచుపాములతో కూడిన కిరీటం

10. తాచుపాములతో కూడిన కిరీటం

Image Source:

తల్లి, తండ్రి అన్నీ తానై అష్టికను మానసదేవి పెంచుతుంది. అందువల్లే కొన్ని శిల్పాలు, చిత్రాల్లో మానస దేవి తొడ పైన ఈ అష్టిక కనిపిస్తూ ఉంటాడు. ఇదిలా ఉండగా ఆమె తన తల పై ఏడు తాచుపాములతో కూడిన కిరిటాన్ని కలిగి ఉండటమే కాకుండా పద్మం పై ఆసీను రాలై ఉంటుంది.

11. హరిద్వార్ కు దగ్గరగా

11. హరిద్వార్ కు దగ్గరగా

Image Source:

ఇక మానసదేవి ఆలయం భారత దేశంలోని ఉత్తరాఖండ్ లో హరిద్వార్ నగరానికి దగ్గర్లో ఉంటుంది. మానసదేవి దేవాలయం హిమాలయాల్లో భాగమైన శివాలిక్ పర్వత శ్రేణిలోని బిల్వ పర్వత శిఖరం పై ఉంటుంది.

12. సంతానం కలుగుతుంది

12. సంతానం కలుగుతుంది

Image Source:

దేశంలోని ప్రాచీన దేవాలయాల్లో ఇది కూడా ఒకటి. ఇక్కడ మానసను కోరిన కోర్కెలు తీర్చే దేవతగా పూజిస్తారు. ముఖ్యంగా సర్పదోష నివారణ విషయంగా ఇక్కడ ఎక్కువ పూజలు జరుగుతాయి. అంతే కాకుండా ఈ దేవతను పూజిస్తే దంపతులకు వెంటనే సంతానం కలుగుతుందని నమ్ముతారు.

13. చెట్టు కొమ్మకు దారాలు

13. చెట్టు కొమ్మకు దారాలు

Image Source:

ఇందుకు ఈ మానసదేవి దేవాలయం పరిసర ప్రాంతంలో గల చెట్టు కొమ్మలకు దారాలను కట్టి తమ కోర్కెలను నెరవేర్చాల్సిందిగా వేడుకొంటారు. మరలా తమ కోర్కెలు నెరవేరిన తర్వాత అదే చెట్టు కొమ్మకు భక్తులు వచ్చి మరలా దారాలు కడుతారు.

14. మూడు శక్తి పీఠాల్లో ఒకటి

14. మూడు శక్తి పీఠాల్లో ఒకటి

Image Source:

హరిద్వార్ లో ఉన్నమూడు ముఖ్యమైన శక్తి పీఠాల్లో మానస దేవి ఆలయం ఒకటి. మాయాదేవి ఆలయం, చండీదేవి ఆలయం మిగిలిన రెండు దేవాలయాలుగా స్థానికులు చెబుతారు.

15.రోప్ వే మార్గం కూడా

15.రోప్ వే మార్గం కూడా

Image Source:

హరిద్వార్ వెళ్లే యాత్రికులు ఈ దేవాలయానికి తప్పక వెలుతుంటారు. దాదాపు 178 మీటర్ల ఎత్తులో ఉండే మానస దేవి దేవాలయం చేరుటకు రోప్ వే మార్గం కూడా ఉంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X