Search
  • Follow NativePlanet
Share
» »రాజస్థాన్ వెలితే రాత్రి సమయంలో మాత్రం అక్కడ ఉండకండి? రుజువులు ఇవిగో

రాజస్థాన్ వెలితే రాత్రి సమయంలో మాత్రం అక్కడ ఉండకండి? రుజువులు ఇవిగో

దెయ్యం అంతుచిక్కని ఒక బ్రహ్మపదార్థం. ఈ దెయ్యం ఈ భూమి పై ఉందా లేదా అన్న విషయానికి సంబంధించి ఎవరూ నేరుగా సమాధానం చెప్పలేరు. ఇందుకు సంబంధించి కథలు మాత్రమే చెబుతారు. మరికొంతమంది మాత్రం కొన్ని రుజువులు చూపిస్తారు. అయినా ఈ భూమి పై దెయ్యాలు ఉన్నాయని ఖచ్చితంగా నిరూపించడానికి మాత్రం సాహసించడం లేదు. ఈ నేపథ్యంలోనే రాజస్థాన్ లో అత్యంత భయంకరమైన ప్రాంతాల గురించి మీ కోసం

 రాణా కుంభా ప్యాలెస్

రాణా కుంభా ప్యాలెస్

P.C: You Tube

రాజస్థాన్ లోని చిత్తోర్ ఘర్ కు చెందిన ఈ ప్యాలెస్ చాలా భయంకరమైనది. ఇటీవల జరిగిన కొన్ని సంఘటలను అనుసరించి ఇక్కడికి వెళ్లినవారు ఖచ్చితంగా దెయ్యాన్ని చూస్తారని చెబుతారు. స్థానికులు చెప్పే కథనాన్ని అనుసరించి అల్లాఉద్దీన్ ఖిల్జీ ఈ రాణా కుంభా ప్యాలెస్ ను వశపరుచుకొంటాడు.

శ్రావణ శుక్రవారం 40 కిలోల బంగారు, వజ్రాల కిరీటం ఉన్న లక్ష్మీ దేవిని సందర్శిస్తే...

రాణి పద్మినీ దేవి

రాణి పద్మినీ దేవి

P.C: You Tube

ఆ సమయంలో రాణి పద్మినీ దేవి తన అనునాయులైన 700 మంది చెలికెత్తలతో కలిసి ఇక్కడ ప్రాణత్యాగం చేస్తుంది. వారి ఆత్మలే ఇక్కడ దెయ్యాలుగా తిరుగుతున్నాయని చెబుతారు. ఇటీవల కొంతమంది విద్యార్థులు రాత్రి సమయంలో నిజ నిర్థారణకు అక్కడికి వెళ్లినా వారికి కూడా ఆ ఆత్మలు కనిపించాయని చెబుతారు.

ఎన్ హెచ్ -79

ఎన్ హెచ్ -79

P.C: You Tube

రాజస్థాన్ లోని అజ్మీర్-ఉదయ్ పూర్ హైవే అత్యంత భయంకరమైన మార్గంగా చెబుతారు. ఈ మార్గానికి దగ్గరగా ఉన్న డూడూ గ్రామం లో జరిగిన ఓ సంఘటన కారణంగా ఈ మార్గంలో రాత్రి సమయంలో ప్రయాణించడానికి చాలా మంది భయపడుతూ ఉంటారు. చాలా ఏళ్లక్రితం బాల్య వివాహాలు భారత దేశంలో సర్వసాధారణం.

బాల్య వివాహాన్ని తప్పించబోయి

బాల్య వివాహాన్ని తప్పించబోయి

P.C: You Tube

ఈ క్రమంలోనే డుడూ గ్రామానికి చెందిన 5 రోజుల శివును మూడు ఏళ్ల పిల్లాడికి ఇచ్చి వివాహం చేయాలని ఊరి పెద్దలు నిశ్చయిస్తారు. అయితే ఈ వివాహాన్ని పిల్ల తల్లి వ్యతిరేకిస్తుంది. అంతేకాకుండా ఎవరికీ దొరకకూడదని చెప్పి ఆ పాపను ఎత్తుకొని ఈ మార్గం గుండా పరుగెత్తుతూ ఉంటే అటుగా వేగంగా వచ్చిన గుర్రాలు కట్టిన రథం ఒకటి ఆమెను ఢీ కొడుతుంది. అప్పటి నుంచి ఈ మార్గంలో ప్రయాణించడానికి చాలా మంది భయపడుతున్నారు.

నహర్ ఘర్ కోట

నహర్ ఘర్ కోట

P.C: You Tube

పింక్ సిటీగా పేరుగాంచిన జైపూర్ శివారులో అరావళి పర్వత శిఖరాల అంచున ఈ నహర్ ఘర్ కోట ఉంటుంది. ఆకాశాన్ని అంటేలా ఉన్న ఈ కోట గోడలు మనలను మంత్రముగ్దులను చేస్తాయి. ఈ కోట ఎంత అందంగా ఉంటుందో అంతే భయంకరమైన కోటగా దీనికి పేరుంది.

 రాజా మాన్ సింగ్

రాజా మాన్ సింగ్

P.C: You Tube

ఈ కోటను రాజా మాన్ సింగ్ తన 12 మంది భార్యల కోసం నిర్మించాడు. ఈ నహర్ ఘర్ కోటతో పాటు అమీర్ కోట, జై ఘర్ కోటను కూడా ఆయన నిర్మించాడు. అయితే నహర్ ఘర్ కోట అంటే రాజా మాన్ సింగ్ కు చాలా ఇష్టం. ఇప్పటికీ ఆయన ఆత్మ ఈ కోటలోనే ఉన్నట్లు చెబుతారు.

మరమత్తులు

మరమత్తులు

P.C: You Tube

ఈ కోటను ఎవరైనా పున: నిర్మాణం చేయాలని లేదా మరమత్తులు చేయాలని భావిస్తే వెంటనే వారు చనిపోతున్నారని చెబుతారు. ఇందుకు ఎన్నో ప్రత్యక్ష ఉదాహరణలు ఇప్పటికీ చూపిస్తారు. ఈ కారణంతో ఇప్పటి వరకూ దాదాపు 10 మంది ప్రాణాలు కోల్పోయారు.

కుల్తారా గ్రామం

కుల్తారా గ్రామం

P.C: You Tube

రాజస్థాన్ లో కాకుండా భారత దేశంలోనే అత్యంత భయంకరమైన ప్రాంతం కుల్దారా. దాదాపు క్రీస్తు శకం 1800 వరకూ ఈ గ్రామం మిగిలిన రాజస్థాన్ గ్రామాల వలే కళకళాడుతూ ఉండేది. అయితే అప్పట్లో ఆ ప్రాంతాన్ని పాలించే రాజు దగ్గర మంత్రిగా పనిచేసే వ్యక్తి ఈ గ్రామంలోని ఓ అందమైన అమ్మాయిని బలవంతంగా పెళ్లి చేసుకోవాలని భావించాడు.

దుర్మార్గుడైన మంత్రి

దుర్మార్గుడైన మంత్రి

P.C: You Tube

అయితే గ్రామం మొత్తం ఆయన్ను ఎదురించి ఆ దుర్మార్గుడి నుంచి ఆ అమ్మాయిని కాపాడారు. దీంతో కోపంతో ఆ మంత్రి ఈ గ్రామంలోని మొత్తం ప్రజలను చంపించేశాడని చెబుతారు. ఇటీవల ఢిల్లీకి చెందిన కొతమంది మంది ప్యారానార్మల్ సొసైటికి చెందిన వ్యక్తులు ఇక్కడ పర్యటించినప్పుడు వారు ఇది నిజమేనని నిర్ధారించారు.

చిన్నపిల్లల పాదముద్రలు

చిన్నపిల్లల పాదముద్రలు

P.C: You Tube

అంతేకాకుండా వారి పరిశోధనలో అప్పుడు చనిపోయిన వ్యక్తులు తమ పేర్లను చెప్పడమే కాకుండా ఈ ప్రాంతం ఎప్పటికీ ప్రజల నివాస యోగ్యం కాదని కూడా చెప్పారు. ఇవన్నీ ఇప్పటికీ రికార్డుగా ఉన్నాయి. ఇక ఆ పారానార్మల్ సొసైటీకి చెందిన వ్యక్తులకు అప్పట్లో చనిపోయిన చిన్న పిల్లల పాదముద్రలు కూడా కనిపించాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X