Search
  • Follow NativePlanet
Share
» »చెన్నైలో ఈ పర్యాటక స్థలాలన్నింటినీ మీరు చూశారా?

చెన్నైలో ఈ పర్యాటక స్థలాలన్నింటినీ మీరు చూశారా?

సముద్రతీర నగరమైన చెన్నైకు శతాబ్దాల కాలంనాటి చరిత్ర ఉంది. ప్రస్తుత తమిళనాడుకు రాజధానిగా ఉన్న ఈ చెన్నై ఎంతోమంది రాజులు తమ ముఖ్యపట్టణంగా చేసుకొని తమిళనాడును పరిపాలించారు. అంతేకాకుండా ఈ పట్టణం నుంచి విదేశాలకు భారతదేశ నుంచి సరుకులు ఎగుమతి చేసేవారు. అప్పట్లో సముద్రవాణిజ్యానికి కేంద్రబిందువు ప్రస్తుతం చెన్నైగా పిలువబడే ఈ మద్రాసు అని చెప్పడలంలో అతిశయోక్తి లేదు. ఇక భారత దేశాన్ని వందల ఏళ్లు పాలించిన విదేశీ రాజులు కూడా తమ కార్యకలాపాలకు ఈ చెన్నైనే కేంద్రంగా చేసుకొన్నారు. ఇలా శతాబ్దకాలంనాటి ఈ నగరంలో చూడదగ్గ ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. అందులో మైలాపూర్, సయింట్ జార్జ్ ఫోర్ట్, మెరీనాబీచ్, జార్జ్ టౌన్ మార్కెట్ తదితర ప్రాంతాల గురించి క్లుప్తంగా మీ కోసం...

మైలాపూర్

మైలాపూర్

P.C: You Tube

మైలాపూర్ ను చెన్నై ఆత్మగా పిలుస్తారు. నగరం పాత నివాస ప్రాంతాల్లో ఇది మొదటిస్థానంలో నిలుస్తుంది. ఇక్కడ ప్రధానంగా బ్రాహ్మణులు నివశిస్తారు. ప్రాచీన తమిళ సంప్రదాయాలను మనం ఇక్కడ చూడవచ్చు. ఇదే ప్రాంతంలో అత్యంత ప్రాచీనమైన కపలీశ్వరాలయం కూడా ఉంది. నియో గోతిక్ శైలిలో నిర్మించిన చర్చి కూడా ఇక్కడ ప్రధాన ఆకర్షణ. రామకృష్ణ మఠ ఆలయం కూడా మనం ఇక్కడ చూడవచ్చు.

సెయింట్ జార్జ్ కోట

సెయింట్ జార్జ్ కోట

P.C: You Tube

దీనిని ఈస్ట్ ఇండియా కంపెనీ నిర్మించింది. ఇక్కడే మనం ప్రపంచంలో అతి విశాలమైన చర్చిలో ఒకటిగా భావించే సెయింట్ మేరీ చర్చిని చూడవచ్చు. ఇక్కడ మ్యూజియం కూడా ఉంది. ఈ మ్యూజియంలో ముఖ్యంగా అప్పటి సైన్యం వాడిన ఆయుధాలు, ఈస్ట్ ఇండియా కంపెనీ ఉన్నతాధికారులు ధరించిన దుస్తులు తదితరాలను చూడవచ్చు. ప్రతి రోజూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ ప్రవేశానికి అవకాశం కల్పిస్తారు.

జార్జ్ టౌన్ మార్కెట్

జార్జ్ టౌన్ మార్కెట్

P.C: You Tube

చెన్నైలోని జార్జ్ టౌన్ మార్కెట్ ఒక్క తమిళనాడులోనే కాకుండా భారత దేశంలోనే పేరుగాంచింది. ఇక్కడ వివిధ రాష్ట్రాల్లో పండించే కూరగాయలు, పళ్లు, పూలు అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా మసాలా దినుసులకు ఈ మార్కెట్ ఫేమస్. ఫొటో గ్రఫీ అంటే ఇష్టమున్నవారికి ఈ ప్రాంతం బాగా నచ్చుతుంది.

మెరీనా బీచ్

మెరీనా బీచ్

P.C: You Tube

సముద్ర తీర అలల్లో మనస్సు తేలిపోవాలంటే మెరీనా బీచ్ కు వెళ్లాల్సిందే. ఇక్కడ పలురకాల జలక్రీడలు అందుబాటులో ఉంటాయి. అంతేకాకుండా మెరీనా బీచ్ స్ట్రీట్ ఫుడ్ కూ కూడా చాలా ప్రాచూర్యం పొందింది. పట్టణ ప్రాంతంలో ఉన్నఅతి పొడవైన బీచ్ లలో మెరీనా బీచ్ అగ్రస్థానంలో ఉంటుంది.

టీ నగర్

టీ నగర్

P.C: You Tube

చెన్నైలో షాపింగ్ అంటే మొదట గుర్తుకు వచ్చేది టీ. నగర్ . ఇక్కడ చీరల నుంచి బంగారం వరకూ ప్రతి ఒక్కటి రాయితీ ధరలకు లభిస్తుంది. వారాంతాల్లో ఇక్కడ రద్దీ ఎక్కువగా ఉంటుంది. అదే విధంగా పండుగల సమయాల్లో టీ. నగర్ ను ప్రతి రోజు దాదాపు లక్షల సంఖ్యలో సందర్శిస్తారు. ఈ టీ. నగర్ కు దగ్గరగానే క`ష్ణగాన సభ, వాణి మహల్ ఉన్నాయి. ప్రతి రోజూ ఇక్కడ ఏదే ఒక సాంస్క`తిక కార్యక్రమం నిర్వహిస్తుంటారు. కొన్నింటికి ప్రవేశం ఉచితం కూడా.

చోళమండల్ ఆర్ట్ విలేజ్

చోళమండల్ ఆర్ట్ విలేజ్

P.C: You Tube

భారతదేశంలో అతి పెద్దదైన ఆర్ట్ మార్కెట్ ఇదే. చెన్నైకు శివారులోని ఇన్ జంబాకమ్ గ్రామానికి దగ్గరగా ఈ చోళమండల్ ఆర్టిస్ట్ విలేజ్ ఉంది. హస్తకళాకారులు సొంతంగా ఈ ఈ మార్కెట్ ను ఏర్పాటు చేసుకొన్నారు. ఇక్కడ దొరికినన్ని పెయింటింగ్స్, కొయ్య, లోహంతో తయారు చేసిన బొమ్మలు, గ`హోపకరణాలు మరెక్కడా దొరకవు. ఈ ఆర్ట్ విలేజ్ కు దగ్గర్లోనే కళాకారుల ఇళ్లు కూడా ఉంటాయి. ఉదయం 9.30 నుంచి సాయంత్రం 6.30 వరకూ ఈ ఆర్ట్ విలేజ్ అందుబాటులో ఉంటుది. ప్రవేశ రుసుం రూ.20

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X