» »శివుడి శిరస్సు పై చంద్రుడితో పాటు సూర్యుడూ కనిపించే క్షేత్రం...మన ఆంధ్రప్రదేశ్ లోనే

శివుడి శిరస్సు పై చంద్రుడితో పాటు సూర్యుడూ కనిపించే క్షేత్రం...మన ఆంధ్రప్రదేశ్ లోనే

Written By: Beldaru Sajjendrakishore

భారత దేశంలో శివుడు సాధారణంగా లింగరూపంలో మనకు దర్శనమిస్తాడు. అయితే అతి అరుదుగా మాత్రమే విగ్రహ రూపంలో కనిపిస్తాడు. అందులోనూ సిద్ధాసనంలో (కుర్చొని) శివుడు కొలవై ఉన్న క్షేత్రం ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలో అమరాపురం మండలం హేమావతిలోని సిద్ధేశ్వరాలయంలో కనిపిస్తాడు. ఇక స్వామివారి శిరస్సు పై చంద్రుడితో పాటు సూర్యుడు కూడా ఉండటం ఇక్కడ విశేషం. అంతేకాకుండా ఇక్కడ ప్రతి శివరాత్రి రోజూ సూర్యాస్తమయం సమయంలో సూర్యకిరణాలు స్వామివారి నుదుటను తాకుతాయి. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఈ క్షేత్రం గురించిన వివరాలు నేటివ్ ప్లానెట్ పాఠకుల కోసం

1.కుర్చొని ఉన్న రూపంలో

1.కుర్చొని ఉన్న రూపంలో

Image Source:

సాధారణంగా శివుడు లింగ రూపంలో మనకు కనిపిస్తాడు.అయితే దేశంలో ఎక్కడా లేనట్లు ఇక్కడ పరమశివుడు కుర్చొని ఉన్న భంగిమలో మనకు దర్శనమిస్తాడు.

2. అందుకే ఆ పేరు

2. అందుకే ఆ పేరు

Image source

సిద్ధాసనంలో (కుర్చొని) శివుడు కొలువై ఉండటం వల్ల ఈ ఆలయానికి సిద్దేశ్వరాలయం అని పేరు వచ్చింది. ఇక స్వామివారు జఠాజూటంలో చంద్రుడితో పాటు సూర్యుడు కూడా కనిపిస్తాడు.

3. దేశంలో ఇటువంటి రూపం ఇదొక్కటే

3. దేశంలో ఇటువంటి రూపం ఇదొక్కటే

Image source

కుడిచేతిలో బ్రహ్మకపాలాన్ని, మెడలో కపాలాలను కూడా స్వామి వారు ధరించి సంగం మూసిన కనులతో స్వామివారు కనిపిస్తారు. ఇటువంటి రూపం భారత దేశంలో ఇదొక్కటే అని స్థానికులు చెబుతున్నారు. ఇదే ఆలయంలో పంచ లింగాలు కూడా మనం చూడవచ్చు.

4. శివరాత్రి రోజున

4. శివరాత్రి రోజున

Image source:

శివరాత్రి రోజు సూర్యాస్తమయం సమయంలో సూర్యకిరణాలు ఈ దేవాలయంలోని మూల విగ్రహం నుదిటిమీద ఖచ్చితంగా పడుతాయి. ఇలా ఎలా పడుతున్నయన్న దానికి ఇప్పటి వరకూ ఖచ్చితమైన సమాధానం లేదు.

5. ఇవి కూడా ప్రత్యేకమే

5. ఇవి కూడా ప్రత్యేకమే

Image source:

ఇక ఆలయంలో శివుడికి ఎదుగా ఉన్న నంది స్వామివారిని చూస్తున్నట్టుగా కాక కొంత పక్కకు తిరిగి ఉంటుంది. పడమర ముఖంగా ప్రవేశ ద్వారం ఉన్న దేవాలయాల్లో హేమావతి సిద్దేశ్వరస్వామి దేవాలయం కూడా ఒకటి.

6. గతంలో హెంజేరుగా

6. గతంలో హెంజేరుగా

Image source

హేమావతిని పూర్వ కాలంలో హెంజేరుగా పిలిచేవారు. కాలక్రమంలో అది హేమావతిగా మారింది. పూర్వం ఈ ప్రాంతాన్ని నోలంబరాజులు పరిపాలించేవారు. అందువల్ల హేమావతిలోని సిద్దేశ్వరుడిని నోలంబేశ్వరుడు, ఎంజేరప్ప అని కూడా అంటారు.

7. నోలంబ రాజులు

7. నోలంబ రాజులు

Image source:

హేమావతిని రాజధానిగా చేసుకొని నోలంబరాజులు ప్రస్తుత ఆంధ్ర, కర్ణాటక ప్రాంతంలోని 32 వేల గ్రామాలను దాదాపు 300 ఏళ్లు పరిపాలించారు. అటు పై పదో శతాబ్డంలో ఈ ప్రాంతం పల్లవుల ఏలుబడిలోకి వచ్చింది. పల్లవుల హయాంలో ఈ దేవాలయం మరింతగా అభివ`ద్ధి చెందింది.

8. వివిధ రతి భంగిమలు

8. వివిధ రతి భంగిమలు

Image source:

దేవాలయంలో పల్లవ శిల్ప శైలి కనిపిస్తుంది. ఆలయం ఎదురుగా ధ్వజస్థంభం, పక్కన ఆస్థాన మంటపం ఉంటాయి. ఇక ఆలయ ప్రహరీ గోడ పై స్త్రీ, పురుషలకు సంబంధించిన వివిధ రతి భంగిమలు ఇక్కడ ఎంతో అంతంగా చెక్కబడ్డాయి.

9. శిల్పకళ విశ్వ విద్యాలయం

9. శిల్పకళ విశ్వ విద్యాలయం

Image source

సృష్టి కార్యం పరమ పవిత్రమైనదిగా భావించడం వల్లే ఈ దేవాలయంలో అటువంటి విగ్రహాలను ఏర్పాటు చేశారని చెబుతారు. పూర్వం ఇక్కడ శిల్పకళకు చెందిన విశ్వ విద్యాలయం ఉండేదని స్థానికులు చెబుతారు.

10. పెద్ద ఎత్తున జాతర

10. పెద్ద ఎత్తున జాతర

Image source

శివరాత్రి సమయంలో జరిగే జాతరకు ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి కూడా చాలా మంది భక్తులు ఇక్కడికి వస్తుంటారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక బస్సులను కూడా అందుబాటులోకి తీసుకువస్తుంది.

11. ఎక్కడ ఉంది

11. ఎక్కడ ఉంది

Image source

అనంతపురం జిల్లా అమరాపురం మండలంలో హేమావతి క్షేత్రం ఉంది. అనంతపురం నుంచి ఇక్కడకు 150 కిలోమీటర్ల దూరం. అదేవిధంగా హిందూపురం నుంచి హేమావతికి 69 కిలోమీటర్ల దూరం.

12. ఎలా చేరుకోవాలి

12. ఎలా చేరుకోవాలి

Image source:

అనంతపురం, హిందూపురాలకు రైల్వే సౌకర్యం ఉంది. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా హేమావతిని చేరుకోవచ్చు. పలు ప్రభుత్వ, ప్రైవేటు బస్సు సర్వీసులు ఉన్నాయి.

13. మరొకొన్ని పుణ్యక్షేత్రాలు

13. మరొకొన్ని పుణ్యక్షేత్రాలు

Image source:

అనంతపురం జిల్లాలో హేమావతితో పాటు లేపాక్షి, ఇస్కాన్ దేవాలయం, తిమ్మమ్మమర్రిమాను, కదిరి, పెనుకొండ, గుత్తి కోట తదితర పర్యాటక కేంద్రాలను చూడవచ్చు.