Search
  • Follow NativePlanet
Share
» »దాల్ సరస్సుపై తేలియాడే సబ్జీ బజార్ విశేషాలు మీకోసం

దాల్ సరస్సుపై తేలియాడే సబ్జీ బజార్ విశేషాలు మీకోసం

దాల్ సరస్సుపై తేలియాడే సబ్జీ బజార్ విశేషాలు మీకోసం

భారతదేశంలోని అతిపెద్ద పర్యాటక ఆకర్షణలలో ఒకటి కాశ్మీర్‌లో ఉన్న దాల్ సరస్సు. 18-22 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ స‌రస్సు హౌస్‌బోట్‌లు, చెక్క బాల్కనీలు మరియు పిర్ పంజాల్ పర్వతాల పొగమంచు శిఖరాలను ప్రతిబింబిస్తుంది. మొఘల్ కాలంలో లేక్ షోర్ మొఘల్ చక్రవర్తుల వేసవి విడిదిగా గుర్తింపు పొందింది. లేక్ ఆఫ్ ఫ్లవర్స్‌గా కూడా పిలువబడే ఈ సుంద‌రమైన‌ సరస్సు తేలియాడే కూరగాయల మార్కెట్‌కు ప్రసిద్ధి చెందింది. ఈ దాల్ స‌ర‌స్సుపై తేలియాడే మార్కెట్‌ ప్ర‌త్యేక‌లు తెలుసుకుందాం.

ఈ దాల్ స‌ర‌స్సుపై తేలియాడే సబ్జీ బజార్ (కూరగాయల మార్కెట్ అని అర్థం) కాశ్మీర్ లోయలలో పర్యాటకులకు ప్రధాన ఆకర్షణ. ఇక్కడ మార్కెట్‌లో స్థానిక వ్యాపారులు పగటిపూట సరస్సు మధ్యలో గుమిగూడి, సూర్యరశ్మి నీటిని తాకుతున్న స‌మ‌యానికి మాయ‌మైన‌ట్లు తమ వ్యాపారాన్ని ముగించేస్తారు. ఇది ప్రపంచంలో రెండవ అతిపెద్ద హోల్‌సేల్ మార్కెట్. వియత్నాంలోని మెకాంగ్ డెల్టాలో మొదటి తేలియాడే మార్కెట్ ఉంది. ఈ ఫ్లోటింగ్ మార్కెట్ ఫోటోను 1960లో జపాన్‌లో ప్రచురించబడిన ఒక టూరిస్ట్ గైడ్‌లో ఒక జపనీస్ ఫోటోగ్రాఫర్ ప్రదర్శించడంతో అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది.

ఫ్లోటింగ్ గార్డెన్స్‌లోని ఉత్ప‌త్తులు..

ఫ్లోటింగ్ గార్డెన్స్‌లోని ఉత్ప‌త్తులు..

ఇక్కడ విక్రయించే ఉత్ప‌త్తుల‌న్నీ ఇదే సరస్సులో ఉన్న ఫ్లోటింగ్ గార్డెన్స్‌లో ఉత్పత్తి చేయబడతాయి. ఈ మార్కెట్ యొక్క సరఫరాదారులు తమ దిన‌చ‌ర్య‌ను తెల్లవారుజామున నాలుగు గంటలకు ప్రారంభిస్తారు. వారి పంటను కోయడానికి వారి ఫ్లోటింగ్ గార్డెన్‌లకు వెళతారు. దాల్ సరస్సు మధ్యలో ఉన్న సబ్జీ బజార్‌కు తాజాగా సేక‌రించిన‌ కూరగాయలను తీసుకువెళతారు. సరస్సుపై శాశ్వత దుకాణాలు ఉండ‌వు. స్థానిక వ్యాపారులు తమ బోట్ల సహాయంతో ఈ ఫ్లోటింగ్ మార్కెట్‌లో తమ రోజువారీ వ్యాపారాన్ని నిర్వహిస్తారు. వారు పొడవాటి స్వెటర్లను ఉపయోగించి బయట చలి నుండి తమను తాము రక్షించుకుంటూ తమ పడవల ముందు భాగంలో కూర్చొని నీటి గుండా ప్ర‌యాణం చేస్తారు.

వస్తుమార్పిడి విధానం..

వస్తుమార్పిడి విధానం..

ఈ బజార్ (మార్కెట్) భారతదేశంలో ఇప్పటికీ వస్తుమార్పిడి విధానం అమలులో ఉన్న కొన్ని ప్రదేశాలలో ఒకటిగా ప్ర‌సిద్ధి పొందింది. అంతేకాదు, స్థానిక వ్యాపారులతో సంప్రదాయ మార్పిడి వ్యవస్థను పాక్షికంగా అవలంబిస్తూ, పర్యాటకులు మరియు విక్రేతల కోసం ఆధునిక కరెన్సీని కూడా అంగీకరిస్తారు.

ఈ మార్కెట్‌లో వ్యాపారులు టోకు అమ్మకంపై దృష్టి పెడ‌తారు. అమ్మకానికి ఉన్న ఉత్ప‌త్తులలో టమోటాలు, క్యారెట్లు, టర్నిప్‌లు, ఆకుకూరలు మరియు ప్రసిద్ధ నడ్రు (తామరపువ్వులు, కాశ్మీర్ లోయలో రుచికరమైనవి) ఉంటాయి. ఈ ఉత్ప‌త్తుల‌న్నీ ఇక్క‌డి చిత్తడి నేలలోని గొప్ప పర్యావరణ వ్యవస్థలో పండించ‌బ‌డిన‌వే. ప్రసిద్ధ కాశ్మీర్ పువ్వులు కూడా ఈ మార్కెట్‌లో ఉత్పత్తి చేయబడతాయి మరియు అమ్మబడతాయి.

అదృశ్య‌మ‌య్యే ర‌ద్దీ..

అదృశ్య‌మ‌య్యే ర‌ద్దీ..

ప్ర‌తిరోజూ వేకువజామున అమ్మకందారులు, కొనుగోలుదారుల‌తో ర‌ద్దీగా క‌న‌పించే ఈ ఫ్లోటింగ్ మార్కెట్‌లో ఉదయం ఏడు గంటలయ్యే స‌రికే రద్దీ అదృశ్యమవుతుంది. మార్కెట్ అస్స‌లు ఎప్పుడూ లేనట్లుగా ఆ ప్రాంతమంతా నిశ్శబ్దంగా మారిపోతుంది. బేరసారాలు, మార్పిడి ప్రక్రియ తర్వాత మిగిలిపోయిన ఏవైనా కూరగాయలను వీధి మార్కెట్‌లకు తీసుకువెళతారు. సంద‌ర్శ‌కులు స్థానిక కాశ్మీరీల ప్రామాణికమైన జీవనశైలిని అనుభవించడానికి షికారా (పడవ) కంటే మెరుగైన మార్గం మరొకటి లేదు. తేలియాడే మార్కెట్‌కి ఉదయాన్నే రైడ్‌ని బుక్ చేసుకోవ‌చ్చు. షికారా రైడ్ సమయంలో స్థానిక కాశ్మీర్ టీని రుచి చూడటం మర్చిపోకండి.

Read more about: dal lake sabzi bazar kashmir
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X