Search
  • Follow NativePlanet
Share
» »ఎవరికీ తెలియని ఉత్తరాఖండ్ హిల్ స్టేషన్ లు !!

ఎవరికీ తెలియని ఉత్తరాఖండ్ హిల్ స్టేషన్ లు !!

ఉత్తరా ఖండ్ లోని ప్రసిద్ధ మస్సూరీ, అల్మోర , డెహ్రాడూన్ వంటి హిల్ స్టేషన్ లు అందరకూ తెలిసినవే. కాని చాలా మందికి తెలియని కొన్ని అందమైన హిల్ స్టేషన్ లు ఉత్తరాఖండ్ లో కలవు.

అవి పురి, నౌకుచియాతల్, రానిఖేట్ వంటివి. ఈ హిల్ స్టేషన్ లు అధిక జనాలు లేక వెళ్ళిన వారికి ఒక ప్రత్యేకంగా వుంది ఆనందించేవి గా వుంటాయి. ఈ హిల్ స్టేషన్ లలో కూడా పర్యాటకులు, ప్రకృతి ప్రియులు, సాహసికులు కోరే, అందమైన దృశ్యాలు, సాహస క్రీడలు కలవు.

మరి చాలామందికి సమాచారం లేనటువంటి ఈ హిల్ స్టేషన్ లు గురించిన వివరాలు నేటివ్ ప్లానెట్ అందిస్తోంది. పరిశీలించండి.

ఔలి

ఔలి

ఔలి హిల్ స్టేషన్ స్కయింగ్ కు ప్రసిద్ధి. ఈ ప్రదేశం పవిత్ర బదరీనాథ్ మరియు కేదార్ నాథ్ టెంపుల్స్ వెళ్ళే మార్గంలో ప్రవేశ ద్వారం వాలే వుంటుంది. ఇక్కడ ఆసియా లోనే అతి ఎత్తైన కేబుల్ కార్ కలదు.

Photo Courtesy: Mandeep Thander

ధనౌల్తి

ధనౌల్తి

మస్సూరీ హిల్ స్టేషన్ ప్రతి ఒక్కరకూ తెలుసు. కాని ధనౌల్తి తెలియనిది. సుందరమైన ఈ హిల్ స్టేషన్ సాహస క్రీడలకు, సైట్ సీయింగ్ లకు ప్రసిద్ధి.

Photo Courtesy: Kiran Jonnalagadda

కల్సి

కల్సి

కల్సి హిల్ స్టేషన్ అంతరించి పోయే అందమైన పక్షుల నిలయం. యమునా, టోన్స్ నదుల సంగమం. జౌన్సార్ - బవార్ ప్రాంతాలకు ఇది ఒక ప్రవేశ ద్వారం. ఇక్కడ అశోకుడి కాలం నాటి శిలా శాసనాలు కలవు.
Photo Courtesy: nipun sohanlal

లాన్స్ డౌన్

లాన్స్ డౌన్

చాలా ప్రశాంతమైన, అందమైన హిల్ స్టేషన్. టవున్ అభివృద్ధిని స్థానిక సైనిక బోర్డు ఒకటి నిర్వహిస్తుంది. ఇక్కడ అనేక బ్రిటిష్ కాలపు భవనాలు కలవు. ఇక్కడ నుండి హిమాలయా పర్వత శ్రేణులను చూడవచ్చు.
Photo Courtesy: Sanyam Bahga

పౌరి

పౌరి

మంచుతో నిండిన పర్వత శ్రేణులకు మంత్ర ముగ్దులవుతారు. కైన్కలేస్వర్ మహాదేవ టెంపుల్ లో ప్రార్ధించండి. అమాయకులైన స్థానిక ప్రజల మధ్య ఈ సుందరమైన ప్రదేశంలో విహరించండి. పౌరి లో చేపలు పట్టుట, సైకిల్ తొక్కుట వంటివి ఆనందించవచ్చు. నాయర్ నది లో ఈత కూడా కొట్టవచ్చు. Photo Courtesy: Fowler&fowler

నౌకుచితయాల్

నౌకుచితయాల్

నౌకుచితయాల్ ను లేక్ విలేజ్ అని కూడా అంటారు. నౌ కుచియతాల్ అంటే, తొమ్మిది మూలాలు కల సరస్సు అని అర్ధం చెపుతారు. ఈ సరస్సు యొక్క తొమ్మిది మూలాలు కనపడిన వారికి నిర్వాణం లభిస్తుందని చెపుతారు. ఈ ప్రదేశంలో బోటు విహారం, పారాగ్లైడింగ్ వంటివి చేయవచ్చు. సరస్సులకు ప్రసిద్ధి గాంచిన భీమ తాల్ ఇక్కడ నుండి నాలుగు కి. మీ. ల దూరం మాత్రమె.

Photo Courtesy: dlisbona

రానిఖేట్

రానిఖేట్

రాణి ఖేట్ ను రాణి పచ్చిక బయలు ప్రదేశం అని అంటారు. ఇక్కడ మౌంటెన్ బైకింగ్, ట్రెక్కింగ్ వంటివి చేయవచ్చు. ఇక్కడ కల గోల్ఫ్ కోర్సు మరియు రాణి ఝీల్ అనే ఒక కృత్రిమ సరస్సు తప్పక చూడదగినవి. రాణి ఝీల్ లో బోటు విహారం చేయవచ్చు. ద్వారహాట్, భాలు డాం, తారి ఖేట్, కుమోన్ రెజిమెంట్ గోల్ఫ్ కోర్సు, కంటోన్మెంట్ పార్క్, సన్ సెట్ పాయింట్లు చూడదగిన ఇతర ఆకర్షణలు.

Photo Courtesy: Thetomcruise

చోప్తా

చోప్తా

ట్రెక్కింగ్ పాయింట్ ఇక్కడే మొదలవుతుంది. ఇక్కడ నుండి తుంగనాత్ మరియు చంద్రశిలలకు చేరవచ్చు. చోప్తా ప్రదేశాన్ని మినీ స్విట్జర్లాండ్ అని కూడా అంటారు. ఎన్నో సుందర దృశ్యాలు కలిగి వుంటుంది. ఇక్కడ నుండి చౌఖంబా, త్రిశూల్ మరియు నందా దేవి శిఖర దృశ్యాలు చూడవచ్చు. శివుడు పూజించబడే తుంగా నాథ్ టెంపుల్ ఇక్కడ ప్రసిద్ధి చెందిన పర్యాటక ఆకర్షణ.

Photo Courtesy: Wikid

ఉత్తరా ఖండ్ హోటల్ వసతులకు క్లిక్ చేయండి

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X