Search
  • Follow NativePlanet
Share
» »మనాలిలో దాగిన అబ్బుర‌ప‌ర‌చే పర్యాటక ప్రదేశాలు

మనాలిలో దాగిన అబ్బుర‌ప‌ర‌చే పర్యాటక ప్రదేశాలు

మనాలిలో దాగిన అబ్బుర‌ప‌ర‌చే పర్యాటక ప్రదేశాలు

మనాలిలోని పర్యాటక ప్రదేశాలకు కొద‌వేలేదు. సొలంగనాల సందర్శన మొద‌లుకుని,
అటల్ టన్నెల్, రోహ్తాంగ్ మరియు హమ్తా వంటి అనేక పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి.

ఈ ప్రాంతాల‌ను సందర్శించడం జీవితంలో మ‌ర్చిపోలేని అనుభూతిని మిగుల్చుతుంది. జ‌న‌సంచారం త‌క్కువ‌గా ప్ర‌కృతి ఒడిలో సేద‌దీరేందుకు ఈ పర్యాటక ప్ర‌దేశంలో చాలా ప్రాంతాలే ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం.

బియాస్ కుండ్

బియాస్ కుండ్

బియాస్ కుండ్ ఇది పవిత్ర సరస్సుగా పరిగణించబడుతుంది. సోలాంగ్ వ్యాలీ గుండా బియాస్ కుండ్‌కు వెళ్లే మార్గం ఎంతో ఆహ్లాదంగా క‌నిపిస్తుంది. హిమాలయ ప్రాంతంలో సులభమయిన ట్రెక్‌లలో ఒకటిగా పరిగణించబడే బియాస్ కుండ్ ట్రాక్, 2,050 మీటర్ల ఎత్తులో ఉన్న ప్రముఖ హిల్ స్టేషన్ మనాలికి చేరువ‌గా ఉంటుంది. బియాస్ కుండ్ ట్రాక్ మనాలి నుండి మొదలై సోలాంగ్ నాలా మీదుగా 3,150 మీటర్ల దూరం వరకు దుండి వైపు వెళుతుంది. దుండి నుండి 3,300 మీటర్ల ఎత్తులో ఉన్న బకార్తాచ్‌కు వెళ్లే మార్గం మరియు క్రమంగా మొరైన్ పైకి ఎక్కిన తర్వాత, బియాస్ కుండ్‌కు దారి తీస్తుంది.

దషోర్ సరస్సు

దషోర్ సరస్సు

15500 అడుగుల ఎత్తులో ఉన్న ఈ సరస్సు చాలా అందంగా ఉంటుంది. సరస్సు సమీపంలోని పర్యాటక ప్రదేశం రోహ్‌తంగ్ పాస్ వరకు చాలా తక్కువ మంది పర్యాటకులు ఇక్కడికి చేరుకుంటారు. మనాలి నుండి రోహ్‌తంగ్‌కి కారులో చేరుకోవచ్చు కాబట్టి ఇక్కడికి చేరుకోవడం చాలా సులభం. మర్హి నుండి కాలిన‌డ‌క‌న కూడా చేరుకోవ‌చ్చు. రోహ్‌తంగ్‌ చేరుకోవడం ద్వారా, మీరు ఈ చారిత్రక సరస్సును నడక ద్వారా సులభంగా చేరుకోవచ్చు. ఈ సరస్సును సందర్శించడానికి ఉత్తమ సమయం మే నుంచి అక్టోబర్.

భృగు సరస్సు

భృగు సరస్సు

భృగు సరస్సు ప్ర‌కృతి అందాల‌కు చిరునామాగా నిలుస్తుంది. పర్యాటకులు 15400 అడుగుల ఎత్తున భృగు సరస్సును సందర్శించి, దాని చుట్టూ ట్రెక్కింగ్ చేస్తూ ఆనందించవచ్చు. భృగు సరస్సు మనాలిలోని ఒక ప్రధాన పర్యాటక ప్రదేశం. భృగు సరస్సు రోహ్‌తంగ్ పాస్‌కు తూర్పున ఉంది. ఇక్కడికి చేరుకోవడానికి, గులాబ నుండి కాలినడకన సరస్సుకు చేరుకోవ‌చ్చు. రెండవ మార్గంలో అయితే కులాంగ్ గ్రామం నుండి ఉంది. అయితే ఈ మార్గం నిటారుగా ఉన్న భూభాగం ఎక్కి దాటాల్సి ఉంటుంది. ఈ సరస్సు సంద‌ర్శ‌న‌కు మే నుంచి అక్టోబర్ మధ్య అనువుగా ఉంటుంది.

పాండు రోపా

పాండు రోపా

చారిత్రక పాండు రోపా కూడా సందర్శించడానికి ఉత్తమ పర్యాటక ప్రదేశం. 11500 అడుగుల ఎత్తైన పాండు రోపా ప్రయాణం పచ్చని యాపిల్ తోటల గుండా దట్టమైన మరియు సువాసనగల దేవదారు అడవిలోకి ప్ర‌వేశించ‌డంతో ప్రారంభమవుతుంది. వేసవి నెలల్లో ఈ మార్గంలో అనేక గొర్రెల మందలు కనిపిస్తాయి. పాండవులు తమ అజ్ఞాత వనవాస సమయంలో ఇక్కడ గడిపారని మరియు పాండు రోపాలో పంట‌ల‌ను పండించేవాడని చెబుతారు. మీరు శిఖరం వరకు సరిగ్గా ఎక్కగలిగితే, మొత్తం కులు మరియు మనాలి లోయను చూడవచ్చు. ఈ ట్రెక్కింగ్‌కు సుమారు ఏడు గంటల సమయం ప‌డుతుంది. మే నుండి నవంబర్ మధ్య ఇక్క‌డ‌కు వెళ్లేందుకు అనువైన స‌మ‌యం.

జానా వాటర్ ఫాల్

జానా వాటర్ ఫాల్

జానా వాటర్ ఫాల్స్ కూడా సందర్శించడానికి మంచి ప్రదేశం. వాహనంలో నగ్గర్ నుండి రెండు గంటల ప్రయాణం తర్వాత జానా చేరుకోవచ్చు. అందమైన జానా గ్రామాన్ని సందర్శించిన తరువాత, నీటి జలపాతం తార‌స‌ప‌డుతుంది. ఈ జలపాతం దగ్గర దాబా కూడా ఉంది. ఈ దాబాలో రాజ్మా మరియు రెడ్ రైస్ అందుబాటులో ఉన్నాయి. దీని రుచి అందరినీ దాని వైపు ఆకర్షిస్తుంది. జానా వాటర్ ఫాల్స్ నుండి తేలికపాటి ట్రెక్కింగ్ తర్వాత, మీరు జలపాతాలు, మంచు పర్వతాలు మరియు పచ్చని దేవదార్ అడవులను చూడవచ్చు. రోజంతా ఈ లోయలను ఆస్వాదించిన తర్వాత, మీరు సాయంత్రం మనాలికి తిరిగి రావచ్చు.

Read more about: manali beaskund
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X