» »అందరికీ తెలిసిన విశ్వనగరం - హైదరాబాద్

అందరికీ తెలిసిన విశ్వనగరం - హైదరాబాద్

హైదరాబాద్ అందరికీ తెలిసిన ప్రదేశం. విశ్వనగరం. ఉదయం నుంచి రాత్రి వరకు ఎప్పుడూ సందడిగా గజిబిజిగా ఉంటుంది. ఛాయ్ దుకాణాలు, సమోసా, కచోరి,బిరియాని.ఇలా ఎన్నో ఇక్కడ దొరుకుతాయి.సాయంత్రం అయ్యిందంటే షాపింగ్ మాళ్ళు,చార్మినార్ సందులు, పార్కులు నగరప్రజలతో కిటకిటలాడుతుంటాయి.ఇంత సందడిగా వుండే హైదరాబాద్ లో 9భయానక ప్రదేశాలున్నాయంటే ఆశ్చర్యం కలగకమానదు.అక్కడి ప్రదేశాల్లో స్థానికంగా నివసించే కొంతమందిని ఆరాతీస్తే నమ్మశక్యం కాని నిజాలు బయటపడినాయి.

అవి పుకార్లు అనుకోవాలో, లేదా వారి మూడనమ్మకాలు అనుకోవాలో ఏమనుకోవాలే అది మీరే అర్థం చేసుకోవాలి. రాత్రి అయితే వింత శబ్దాలు, ధ్వనులు వినిపిస్తుంటాయని, వింతైన ఆకారాలు సైతం కనిపిస్తుంటాయని వారు చెబుతున్నారు.శాస్త్ర సాంకేతిక ఇంతగా అభివృద్ది చెందుతున్న ప్రస్తుత తరుణంలో ఇలాంటివి కూడా వున్నాయంటే చాలా మంది నమ్మకపోవచ్చు.మరి అక్కడ స్థానికులు చెబుతున్న విషయాలేంటి?ఆ మాటల్లో నిజం ఎంత?అసలు ఆ 9ప్రదేశాలు హైదరాబాద్ లో ఎక్కడెక్కడ వున్నాయో ఒకసారి తెలుసుకుందాం రండి.

రోడ్ నెం12 బంజారాహిల్స్

రోడ్ నెం12 బంజారాహిల్స్

హైదరాబాద్ లో విలాసవంతమైన,ఖరీదైన ప్రాంతం బంజారాహిల్స్.రోడ్ నెం12 లో విద్యుద్దీపాలు వాటంతటవే స్విచ్ ఆఫ్ అయిపోతాయి.

రోడ్ నెం12 బంజారాహిల్స్

రోడ్ నెం12 బంజారాహిల్స్

రాత్రి పూట వాహనాలు ఈ మార్గం గుండా వెళితే వందకి 80శాతం వాహనాలు పంచరయిపోతాయటకూడా.హైదరాబాద్ లో ఇప్పటికీ చాలామంది ఈ విషయాన్ని బలంగా నమ్ముతున్నారు.

రవీంద్రనగర్ కాలనీ

రవీంద్రనగర్ కాలనీ

అది 2012వ సం హైదరాబాద్ లోని రవీంద్రనగర్ కాలనీలో అతీతశక్తులున్నాయనే పుకారు చుట్టు పక్కలప్రాంతాలన్నిటినీ కదిలించాయి.

రవీంద్రనగర్ కాలనీ

రవీంద్రనగర్ కాలనీ

అందరూ ఇంటి గోడలపై,తలుపులపై వారి వారి మతాలకు సంబంధించిన మంత్రాలను రాసారు.అలా రాయని వారు దెయ్యం సమక్షంలో ఆత్మహత్యచేసుకున్నారని చెబుతారు.

రవీంద్రనగర్ కాలనీ

రవీంద్రనగర్ కాలనీ

ఇక్కడ అతీతశక్తులు ఏర్పడటానికి కారణం. దైవ కోపం యొక్క ఒక రూపం అని స్థానికుల కధనం. ఇందులో నిజాలు ఏమిటో ఇప్పటికి ఎవ్వరికీ తెలీదు.

ఖైరతాబాద్

ఖైరతాబాద్

ఖైరతాబాద్ లోని సైన్స్ కాలేజ్ ప్రస్తుతం ఒక హంటెడ్ ప్రదేశంగా గుర్తించబడింది.సైన్స్ ల్యాబ్ లో చనిపోయిన శవాలమీద పరిశోధనలు చేస్తున్నప్పుడు ఏమైనా శవం లేచొచ్చిందో లేక ఏదైనాజరిగిందో తెలీడుకాని ఇక్కడకైతే ఎవ్వరూరారు.

ఖైరతాబాద్

ఖైరతాబాద్

ఈ కాలేజ్ వాచ్ మెన్ చావుకూడా ఇప్పటికి మిస్టరీగానే మిగిలి పోయింది. ఉప్పల్ స్టేడియం కూడా ఆనోటా,ఈనోటా పడి చివరికి భయానకప్రదేశాల జాబితాలో చోటుసంపాదించుకుంది.

ఖైరతాబాద్

ఖైరతాబాద్

అక్కడ సిబ్బంది మరియు ప్రేక్షకులు స్టేడియంలోని లైట్ లేని కారిడార్ లో నల్లటి దుస్తులు ధరించిన ఒక వింతైన ఆకారాన్ని చూసారని ఆ తర్వాత అక్కడ నుంచి మాయమైపోయిందని అప్పట్లో వార్తలు వెలువడ్డాయి.

షంషాబాద్ ఎయిర్ పోర్ట్

షంషాబాద్ ఎయిర్ పోర్ట్

షంషాబాద్ ఎయిర్ పోర్ట్ హైదరాబాద్ కే గర్వకారణం. సుమారు 5000ఎకరాల్లో నిర్మించిన ఈ ఎయిర్ పోర్ట్ ఇప్పుడు అతీతశక్తులకు నిలయంగా మారింది అన్న వాదన ఒకటివుంది.ఎయిర్ పోర్ట్ నిర్మాణం ముందు వివాదాల సమయంలో కొంతమంది మరణించారని,వారి ఆత్మలు అక్కడే తిరుగుతున్నాయని చెబుతున్నారు.

షంషాబాద్ ఎయిర్ పోర్ట్

షంషాబాద్ ఎయిర్ పోర్ట్

ఒక మనిషి 300 డిగ్రీలలో తన తలను తిప్పుకుని కూర్చున్నట్లు మరియు రన్ వే మీద తెల్లనిచీర కట్టుకుని ఒక మహిళ డ్యాన్స్ చేసుకుంటూ తిరిగినట్లు అప్పట్లో అక్కడ వీడియోలో దృశ్యాలు కనిపించాయి.

తలలేని ఆత్మ

తలలేని ఆత్మ

హైదరాబాద్ లో తలలేని ఒక ఆత్మ ఒక ఇంట్లో వుందని పుకారు వుంది.ఆ ఇంటిమీద తనకున్న మమకారం చంపుకోలేక ఆ మనిషి ఆ ఇంట్లో చనిపోయినప్పటినుంచి ఇప్పటివరకు తల లేకుండా ఆత్మలా తిరుగుతున్నాడని స్థానికుల కధనం.

అపార్ట్ మెంట్

అపార్ట్ మెంట్

సుమారు 40సంల క్రితం ఒకటిన్నర సంవత్సరాలు ఒక అపార్ట్ మెంట్ నిర్మించారు.ఆ అపార్ట్ మెంట్ అన్ని ఫ్యామిలీలు కొన్నిసంవత్సరాలు బాగానే జీవించారు.కానీ ఏమైందో అన్ని ఫ్యామిలీలు ఒకే సారి గొలుసువలె లైన్ గా చనిపోయారు.

అపార్ట్ మెంట్

అపార్ట్ మెంట్

కానీ చుట్టుపక్కలవారు ఈ అపార్ట్ మెంట్ నుండి వింతైనశబ్దాలు వినిపిస్తున్నాయని,ముఖ్యంగా అమ్మాయి దీనంగా ఏడుస్తున్నట్లు శబ్దం వినిపిస్తుందని చెబుతున్నారు.

గోల్కొండ కోట

గోల్కొండ కోట

గోల్కొండ కోట హైదరాబాద్ చరిత్రకు నిలువెత్తు సాక్ష్యం.ఇక్కడ కూడా అతీతశక్తులు వున్నాయన్నవాదన కూడా లేకపోలేదు.దొంగలు ఈ కోటలోని సంపదను దోచుకోవటానికి వచ్చి అక్కడి వింతరూపాన్ని ఆత్మలుగా మారారని తెలుస్తుంది.కోటలోని తారామతి దర్వాజా వద్ద వేశ్యరాణిసంచరిస్తున్నట్లు పుకారుకూడా వుంది.

కుందన్ బాగ్

కుందన్ బాగ్

కుందన్ బాగ్ లో అంతుతెలియని మిస్టరీ అలాగే వుంది.ఒక దొంగ ఆ ఇంటిలో ప్రవేశించినప్పుడు అక్కడ 3శవాలను గుర్తించాడు.అప్పటికే ఆ శవాలు చనిపోయి 3నెలలు కావస్తున్నాయి.కానీ స్థానికులు ఆ తల్లి,ఇద్దరు పిల్లల్ని మొన్నమొన్ననే వీధిలో తిరుగుతుంటే చూసామని చెప్తున్నారు.రాత్రి పూట ఆ ఇంటి చుట్టూ ఎవరో క్యాండిల్ పట్టుకుని తిరుగు తుంటారని ఆ ఇంటివరండాలో రక్తపుబాటిళ్ళు దొరికాయని పుకారు కూడా వుంది.