» »కవ్వించే అందాలతో .. మరిపించే వర్కల !!

కవ్వించే అందాలతో .. మరిపించే వర్కల !!

Written By:

వర్కల కేరళ కోస్తా తీరంలోని పట్టణం. ఇది కేరళ దక్షిణ భాగంలో కలదు. త్రివేండ్రం నుండి వర్కల మధ్య దూరం 42 కిలోమీటర్లు. ఇక్కడి ప్రధాన ఆకర్షణ బీచ్లు. సముద్రానికి సమీపంలో కొండలు ఉండటంవల్ల అవి సముద్రంతో కలుస్తున్నాయా ? అని అనిపిస్తుంటాయి. వర్కల ఇండియాలో ఉన్న పది సీజనల్ బీచు లలో ఒకటి.

చారిత్రక కథనం

ఒక పాండ్యరాజు ను అయన చేసిన తప్పులకు గానూ బ్రహ్మ దేవుడు ఒక ఆలయాన్ని కట్టించమని అడిగాడు. అలాగే ఇక్కడ మరో కధనం కూడా ఉంది అదేమిటంటే నారదమహర్షి తనను చూడటానికి వచ్చిన పాపులను చూసి తన వల్కలం విసిరి పారేశాడని దీంతో ఆ ప్రదేశానికి వర్కాల అన్న పేరొచ్చిందని సారాంశం.

పాలక్కాడ్ - పర్యాటకులకు స్వర్గం !!

వర్కల అంతా యాత్రలతోనే నిండి ఉంటుంది. బీచులు, దేవాలయాలు, టన్నెల్ లు, జలాశయాలు, వివిధ మత కేంద్రాలు ఇలా ఎన్నో వర్కల లో సందర్శించేందుకు ఉన్నాయి. బీచ్ లలో కెల్లా పాపస్నానం బీచ్ ప్రధానమైనది మరియు ప్రత్యేకమైనది. వర్కల లో తప్పక చూడవలసిన ప్రధాన పర్యాటక ప్రదేశాలు ఒకసారి గమనిస్తే ... !!

పాపస్నానం బీచ్

పాపస్నానం బీచ్

తాజా వేడినీటి బుగ్గలు పాపస్నానం బీచ్ ప్రధాన ఆకర్షణ. బీచ్ లో భక్తులు పుణ్యస్నానాలు చేసి తమ రుగ్మతలను పోగొట్టుకుంటారు. పురాణాల ప్రకారం నారదుడు ఇక్కడే తన వల్కలం విసిరేశాడని చెబుతారు. బీచ్ వద్ద కొబ్బరి తోటలు, అస్తమిస్తున్న సూరీడు ప్రధాన ఆకర్షణలుగా నిలుస్తాయి.

చిత్రకృప : Koshy Koshy

జనార్థన స్వామి టెంపుల్

జనార్థన స్వామి టెంపుల్

బీచ్ కు దగ్గరలో జనార్థన స్వామి టెంపుల్ కలదు. ఇది విష్ణుమూర్తికి చెందిన దేవాలయం. డచ్ కెప్టెన్ ఒకరు గుడికి ఒక పెద్ద గంటను బహూకరించాడు. అదే ఇక్కడికో ప్రధాన ఆకర్షణ. ప్రతి ఏడాది ఆరాట్టు పండగ గుడిలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు.

చిత్రకృప : Binoyjsdk

సర్కార దేవి టెంపుల్

సర్కార దేవి టెంపుల్

సర్కార దేవి ఆలయం భద్రకాళీ అమ్మవారికి అంకితం చేయబడింది. గుడి పైభాగం రాగి కప్పు కలిగి ఉంటుంది. రెండవ అంతస్తులో శ్రీకృష, రామ, గణపతి, మహా విష్ణు, మాతా దుర్గా, నరసింహస్వామి విగ్రహాలు ఉన్నాయి. కలియుత్, మీనా భరణి గుడి యొక్క ప్రధాన పండుగలు.

చిత్రకృప : Raji.srinivas

పొన్నుమ్ తుర్త్ ద్వీపం

పొన్నుమ్ తుర్త్ ద్వీపం

ఈ ద్వీపం 12 కిలోమీటర్ల దూరంలో కలదు. ద్వీపం కనుక బోట్ లో మాత్రమే చేరుకుంటాం. ప్రధాన ఆకర్షణ శివ పార్వతుల దేవాలయం. ట్రావెన్కోర్ రాణులు, రాజులు దేవాలయాన్ని దర్శించేటప్పుడు ఈ ద్వీపంలో బంగారాన్ని దాచిపెట్టేవారట. అందుకే ఈ ద్వీపానికి గోల్డెన్ ఐలాండ్ అన్న పేరొచ్చింది.

చిత్రకృప : Ikroos

శివగిరి మఠం

శివగిరి మఠం

ఈ మఠం కేరళలో ప్రసిద్ధి చెందినది. శ్రీ నారాయణ గురు జ్ఞాపకార్థం దీనిని నిర్మించారు. ప్రతి ఏటా చివరి మాసం, చివరి వారంలో మఠాన్ని వేలాది మంది భక్తులు దర్శిస్తారు.
మఠం వేళలు : ఉదయం 5:30 - మధ్యాహ్నం 12:00 వరకు మరియు తిరిగి 4:30 - 6:30 వరకు తెరుస్తారు.

చిత్రకృప : Kalesh

లైట్ హౌస్

లైట్ హౌస్

వర్కల లో లైట్ హౌస్ ప్రసిద్ధి చెందినది. దీనిని బ్రిటీష్ వారు 16 వ శతాబ్దంలో, యూరప్ శిలాశైలిలో నిర్మించారు. దీని పై నుండి వర్కాల మరియు దాని చుట్టుప్రక్కల అందాలను చూడవచ్చు. లైట్ హౌస్ పొడవు 130 అడుగులు.

చిత్రకృప : celblau

కప్పిల్ లేక్

కప్పిల్ లేక్

కప్పిల్ లేక్ వర్కల కు 4 కిలోమీటర్ల దూరంలో కలదు. బ్యాక్ వాటర్స్ అరేబియా సముద్రంలో కలిసే ప్రదేశం ఇది. దట్టమైన కొబ్బరి తోటలు, బోట్ విహారం, ఫోటోగ్రఫీ అదనపు ఆకర్షణలు.

చిత్రకృప : Vipin.bl

వర్కల బీచ్

వర్కల బీచ్

బీచ్ వద్ద జనార్థస్వామి దేవాలయం, వేడి నీటి బుగ్గలు ఉన్నాయని తెలుసుకున్నాం కదా !! అవి ఈ వర్కల బీచ్ వద్దనే ఉన్నాయి. బీచ్ వద్ద పర్యాటకులు నీటి క్రీడలు ఆచరించవచ్చు. నేచర్ సెంటర్ కేర్ లు బీచ్ పరిసరాలలో వెలిశాయి. బీచ్ వద్ద సూర్యోదయం, సూర్యాస్తమయం చూసి ఆనందించవచ్చు.

చిత్రకృప : Shishirdasika

అంజెంగో కోట

అంజెంగో కోట

అంజెంగో కోటను పోర్చుగీసు వారు కట్టించారు. ఇది సముద్రానికి, బీచ్ కు మధ్యలో కలదు. కోట పై నుండి చుట్టుప్రక్కల అందాలను, ముతలిపూజ్హ సరస్సు చూసి ఆనందించవచ్చు.

చిత్రకృప : Prasanthvembayam

వర్కాల టన్నెల్

వర్కాల టన్నెల్

లైట్ హౌస్ కు దగ్గరలో ఉన్న మరో ఆకర్షణ వర్కాల టన్నెల్. టన్నెల్ ను దివాన్ ఆఫ్ ట్రావెన్కోర్ కట్టించాడు. ట్రావెన్కోర్ నీటి అవసరాలకొరకు కట్టించిన ఈ టన్నెల్ పొడవు 934 అడుగులు. దీని నిర్మాణానికి 14 ఏళ్ళు పట్టిందట.

చిత్రకృప : Binoyjsdk

జుమా మసీద్

జుమా మసీద్

ఈ మసీదునే కడువయిల్ జుమా మసీద్ అని కూడా పిలుస్తారు. ఈ మసీదు పక్కనే దర్గా కూడా ఉన్నది. అది ఎంతో మహిమ కలది. ఒక్కసారి దర్శిస్తే చాలు పుణ్యం కలుగుతుందని భక్తుల విశ్వాసం. దర్గాలో ఉరుసు, కిస్తీ, గంధం వంటివి ఏటా నిర్వహిస్తారు.

చిత్రకృప : jynxzero

వర్కల ఎలా చేరుకోవాలి ?

వర్కల ఎలా చేరుకోవాలి ?

వాయు మార్గం : వర్కాల కు 55 కిలోమీటర్ల దూరంలో ఉన్న త్రివేండ్రం సమీప విమానాశ్రయం.

రైలు మార్గం : వర్కాల లో రైల్వే స్టేషన్ కలదు. ఇక్కడికి దేశంలోని వివిధ నగరాల నుండి రైళ్ళు వస్తుంటాయి.

రోడ్డు మార్గం : కేరళ, తమిళనాడు రాష్ట్రాల నుండి పలు ప్రభుత్వ/ ప్రవేట్ బస్సులు వర్కల కు నడుస్తాయి.

చిత్రకృప : binoyjsdk

Please Wait while comments are loading...