• Follow NativePlanet
Share
» »ఒక్కొ వీకెండ్...ఒక్కో అడవిలో

ఒక్కొ వీకెండ్...ఒక్కో అడవిలో

Written By: Beldaru Sajjendrakishore

వారం మొత్తం నాలుగు గోడల మధ్య పనిచేయడం..., ఉదయం, సాయంత్రం ఆఫీసుకు వచ్చే, వెళ్లే సమయాల్లో ట్రఫిక్ రణగొణుల మధ్య విసిగి పోయారా? ఈ కాంక్రీట్ జంగిల్ నుంచి దూరంగా రెండు రోజుల పాటు సేదదీరాలని మనసు కోరుకుటోందా? మీకోసమే ఈ కథనం. ప్రకతి రమణీయతకు, వేలాది జాతుల జంతు, వక్ష సంపదకు కర్ణాటక నిలయం. ఈ రాష్ర్టంలో దాదాపు 20 అభయారణ్యాలు, జాతీయ పార్కులు ఉన్నాయి. అందులో అంత్యంత సుందరమైనవి, సురక్షితమైనవే కాకుండా దేశంలోని వివిధ చోట్ల నుంచి సదరు ప్రాంతాలను చేరుకోవడానికి మంచి రవాణా సదుపాయాలన్న ఐదింటిని మొదటగా నేటివ్ ప్లానెట్ మీ ముందుకు తెలుస్తోంది. రానున్న వీక్ ఎండ్ ఎక్కడికి వెళ్లాలి అటు పై వీకెండ్ ఎక్కడికి వెళ్లాలి అన్న విషయం పై ప్రణాళిక తయారు చేసుకుని ట్రవెల్ బ్యాగ్ ను సర్థు కోవడం మాత్రం మీ వంతు..

1. మూకాంబిక వన్యప్రాణుల అభయారణ్యం:

1. మూకాంబిక వన్యప్రాణుల అభయారణ్యం:

Image source

ఉడుపి జిల్లాలోని కొల్లూర్ సమీపంలో మూకాంబిక వన్యప్రాణుల అభయారణ్యం ఉంది. ఈ అభయారణ్యం 247 చదరపు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ అభయారణ్యం షరావతి వన్యప్రాణుల అభయారణ్యంతో ఉత్తర-పశ్చిమ సరిహద్దును పంచుకుంటుంది. ముంకాంబిక వన్యప్రాణుల అభయారణ్యం మంగుళూరు నుండి 125 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ అభయారణ్యంలో సంచరించే సమయంలో ఉక్కపోత కొంత ఎక్కవగా ఉంటుంది.

2. సింహపు తోకలను పోలిన తోకలు కలిగిన కోతులు ఇక్కడే

2. సింహపు తోకలను పోలిన తోకలు కలిగిన కోతులు ఇక్కడే

Image source

కర్ణాటకలోని అనేక జాతీయ ఉద్యానవనాలు మరియు వ్యన్యప్రాణుల అభయారణ్యాల్లో మూకాంబిక వన్యప్రాణుల అభయారణం దాని సంపన్న వృక్ష మరియు జంతుజాలం కారణంగా ప్రత్యేకతను సంతరించుకుంది. సింహపు తోకను పోలిన తోకలను కలిగిన కొండముచ్చు జాతికి చెందిన ప్రాణులు కర్ణాటకలో ఇక్కడ మాత్రమే కనిపిస్తాయి. సఫారీ సమయం ఉదయం 6.30 గంటల నుంచి 9.30 గంటల వరకూ, మరలా సాయంత్రం 3.30 నుంచి 6 గంటల వరకూ

3.భద్ర వణ్య ప్రాణి సంరక్షణ కేంద్రం:

3.భద్ర వణ్య ప్రాణి సంరక్షణ కేంద్రం:

Image source

భద్రా వన్యప్రాణులకు ముఖ్యంగా పులుల సంరక్షణ ప్రాంతం కర్ణాటక రాష్ట్రంలోని చిక్కమగళూరు పట్టణంలోని 38 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ అభయారణ్యం విస్తృత వ`క్ష మరియు జంతుజాలం కలిగి ఉంది. సముద్ర మట్టానికి 1,875 అడుగుల ఎత్తులో ఈ అభయారణ్యం ఉంది. హెబ్బే గిరి ఈ అభయారణ్యంలో అత్యంత ఎతైన పర్వత శిఖరం. దేశంలోని మొదటి పులుల సంరక్షణ కేంద్రం ఇదే.

4. రోజుకు రెండు సార్లు సఫారి

4. రోజుకు రెండు సార్లు సఫారి

Image source

టెర్న్ లాడ్జ్ నుండి నుండి సఫారి మొదలవుతుంది. రోజుకు రెండుసార్లు అంటే ఉదయం 6.30 లకు మరియు సాయంత్రం 4 గంటలకు ఈ సఫారీ మొదలవుతుంది. జీప్, బోట్ లు అందుబాటులో ఉంటాయి. సఫారీ సమయం సుమారు 2 నుంచి 2.30 గంటలు. వెళ్లే సమయంలో పులులతో పాటు వివిధ రకాల పాములు, రంగురంగుల చిలుకలు, బరోనీట్, సదరన్ బర్డ్ వింగ్ జాతికి చెందిన అత్యంత అరుదైన సీతా కోక చిలుకలను కూడా పలకరించుకుంటూ వెళ్లవచ్చు.

5.బన్నేరుగట్ట నేషనల్ పార్క్...

5.బన్నేరుగట్ట నేషనల్ పార్క్...

Image source

ప్రసిద్ధ చంపాకదామ కొండల లోయలోని అడవుల మధ్యలో బన్నెర్గట్ట నేషనల్ పార్క్ ఉంది. బెంగుళూరుకు కేవలం 22 కిలోమీటర్ల దూరంలోనే ఉంటం వల్ల కర్ణాటకలోని మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే ఈ నేషనల్ పార్క్ ను సందర్శించే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. మొత్తం విస్తీర్ణం 65,127 ఎకరాలు.

6. ప్రతి గంటన్నరకు ఒక మారు సఫారీ...

6. ప్రతి గంటన్నరకు ఒక మారు సఫారీ...

Image source

ఇక్కడ సఫారీతో పాటు జూ, దేశంలోనే ఏకైక సీతాకోక చిలుక ఉద్యానవనవాన్ని కూడా చూడవచ్చ. వివిధ జాతులకు చెందిన ఎలుగుబంటలను చూడవచ్చు. ప్రతి గంటన్నరు ఒక సారి సఫారీ ప్రారంభవవుతుంది. దేశంలో మొదటి ఏనుగుల సంరక్షణ కేంద్రం కూడా. వ్యాన్ లతో పాటు జీపులు కూడా అందుబాటులో ఉంటాయి. దాదాపు 101 జాతుల పక్షులకు ఈ నేషనల్ పార్క్ ఆలవాలం.

7. దండేలి అభయారణ్యం

7. దండేలి అభయారణ్యం

Image source

కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలో 834.16 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. కర్ణాటకలోని అతి విస్తీర్ణమైన అభయారణ్యాల్లో ఇది మొదటి వరుసలో ఉంటుంది. ఈ అభయారణ్యం ఎన్నో రంగుల రంగుల పక్షులతోపాటు, మచ్చల మరియు ఎలుక జింక, స్లాత్ ఎలుగుబంటి, చిరుతపులి, పులి, గౌర్, ఏనుగు, అడవి కుక్క, అడవి పిల్లి, బైసన్, జాకాల్, లంగూర్ మరియు ఎగిరే ఉడుతలకు సురక్షితమైన ఆశ్రయం. ఇక్కడ కేవలం సఫారీనే కాకుండా ర్యాఫ్టింగ్ వంటి సాహస జల క్రీడలకు కూడా అవకాశం ఉంది.

8. గుహలను కూడా...

8. గుహలను కూడా...

Image source

ఈ అభయారణ్యానికి దగ్గరగా అతి ప్రాచీనమైన కవాల గుహలు కూడా ఉన్నాయి. ఇందులోని శివుడిని దర్శించుకోవాలంటే దాదాపు మూడు కిలోమీటర్ల దూరం నడక తప్పదు. ప్రక`తి సోయగాన్ని చూస్తూ అడుగులు వేయడం ప్రక`తి ప్రేమికులకు పెద్దగా అలసట అనిపించదు.

9 కావేరి వన్యప్రాణుల అభయారణ్యం

9 కావేరి వన్యప్రాణుల అభయారణ్యం

Image source

కావేరి వన్యప్రాణుల అభయారణ్యం బెంగుళూరు నుంచి దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మండ్యా, చామరజ నగర, రామ్ నగర్ జిల్లాల్లో మొత్తం 1, 02,753 హెక్టార్ల విస్తీర్ణం మేర ఉంది. కావేరి వన్యప్రాణుల అభయారణ్యం ప్రకృతి ప్రేమికులను, వన్యప్రాణి ఔత్సాహికులతో పాటు బర్డ్ వాచర్స ను విశేషంగా ఆకర్షిస్తుంది.

10. మరింత సమాచారం కోసం

10. మరింత సమాచారం కోసం

Image source

అభయారణ్యాల్లో వాతావరణం తరుచుగా మారుతూ ఉంటుంది. అంతే కాకుండా సఫారీకి కొన్ని సందర్భాల్లో ముందస్తు అనుమతి తప్పనిసరి. అందు కోసం కర్ణాటక ప్రభుత్వం ఈ జంగిల్ టూరిజానికి సంబంధించి పర్యాటక శాఖలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి ఎప్పటి కప్పుడు పర్యాటకులకు అవసరమైన సమాచారం, సదుపాయాలను కల్పిస్తోంది. వాటి వినియోగం కోసం ఈ చిరునామాల్లో సంప్రదించవచ్చు.

కార్పోరేట్ ఆఫీస్
జంగిల్ లాడ్జ్ అండ్ రిసార్ట్ లిమిటెడ్
గ్రౌండ్ ఫ్లోర్, వెస్ట్ ఎంట్రెన్స్
ఖనిజభవన్, రేస్ కోర్స్ రోడ్
బెంగళూరు 560001
080 40554055
Email: info@junglelodges.com

లేదా
సమాచార కేంద్రం
పర్యాటక శాఖ
2, జేఎల్బీ రోడ్, మెట్రో పోల్ సర్కిల్, మైసూర్ 570005
91- 821- 2422096 / 9449599759 / 9449597870
Email: hyd@junglelodges.com

Read more about: adventure travel

పర్యాటకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి
పర్యాటక చిట్కాలు, పర్యాటకానికి సంబంధించిన కథాలు తక్షణం పొందండి