Search
  • Follow NativePlanet
Share
» »ఇక్కడికి వెళ్లి భోలో భారాత్ మాతాకి జై

ఇక్కడికి వెళ్లి భోలో భారాత్ మాతాకి జై

ఎందరో వీరుల త్యాగఫలం నేటి స్వేచ్ఛకు మూలఫలం. స్వతంత్ర దినోత్సవాన్ని మనం మరో కొన్ని గంటల్లో జరుపుకొనబోతున్నాం. అయితే ఈ స్వేచ్ఛవాయువుల వెనుక ఎంతో మంది మంది త్యాగం ఉంది. ఆ త్యాగాలకు ఎన్నో ప్రాంతాలు ప్రత్యక్ష సాక్షాలు. ఆ ప్రాంతాలు ప్రస్తుతం ప్రముఖ పర్యాటక కేంద్రాలుగా మారాయి. ఈ స్వతంత్ర దినోత్సవం తర్వాత రెండు రోజులు సెలవు పెడితే మొత్తం నాలుగు రోజుల పాటు మనకు వీకెండ్ దొరుకుతుంది. ఈ నేపథ్యంలో అక్కడికి వెళ్లి జై బోలో స్వతంత్ర భారత్ కు జై అని బిగ్గరగా ఆ భరత మాతకు జై కొట్టుదాం. ఇందుకు అనువైన ప్రాంతాల సమహారం ఈ కథనం. మరెందుకు ఆలస్యం చదివేయండి. ఆయా ప్రాంతాలకు వెళ్లి మీ వీకెండ్ ను సరదాగానే కాకుండా దేశభక్తితో నింపేయండి.

 అలహాబాద్

అలహాబాద్

P.C: You Tube

అలహాబాద్ లో అత్యంత విస్తారమైన ఉద్యానవనం చంద్రశేఖర్ అజాద్ పార్క్. అంతేకాకుండా భారత స్వతంత్ర సంగ్రామంతో ఈ పార్క్ కు విడదీయలేని బంధం ఉంది. బ్రిటీష్ పాలనతో ఈ పార్క్ ను ఆల్ఫ్రెడ్ పార్క గా పిలిచేవారు.

చివరి బులెట్

చివరి బులెట్

P.C: You Tube

అప్పట్లో ఇక్కడ బ్రిటీష్ వారు ఇక్కడ మ్యూజికల్ నైట్స్ తదితర కార్యక్రమాలను నిర్వహించేవారు. ఇదే పార్కులో చంద్రశేఖర్ అజాద్ బ్రిటీష్ సైనికులకు దొరకకుండా ఉండటం కోసం తన వద్ద ఉన్న చివరిబులెట్ తో తనను తాను కాల్చుకొని అమరుడయ్యాడు. అలహాబాద్ నగరం నడిబొడ్డున ఈ పార్క్ ఉంది. ఏడాది మొత్తం సందర్శనకు అనుమతి.

 ఝాన్సీ

ఝాన్సీ

P.C: You Tube

ఝాన్సీ రాణి కోట గా దీనికి పేరు. దాదాపు 400 ఏళ్లుగా ఈ కోట చెక్కుచెదరకుండా ఉంది. ఇక్కడే స్వతంత్ర సంగ్రామానికి ఇక్కడే బీజం పడిందని చెప్పవచ్చు. ఝాన్సీ రాణి లక్ష్మీభాయ్ బ్రిటీష్ సైనికులను

ధైర్యంగా ఎదుర్కొన్నది ఇక్కడే.

20 ఎకరాల్లో

20 ఎకరాల్లో

P.C: You Tube

అయితే సైనిక బలం చాలక ఝాన్సీ లక్ష్మీభాయ్ చివరికి వారి చేతుల్లో మరణిస్తుంది. కాగా దాదాపు 20 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఝాన్సీ కోట ఉంది. మొత్తం 10 గేట్లు ఉంటాయి. ఏడాది మొత్తం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ ఎప్పుడైనా ఈ కోటను సందర్శించుకోవచ్చు.

బరాక్ పోర్

బరాక్ పోర్

P.C: You Tube

మంగళ్ పాండే తన కత్తితో బ్రిటీష్ అధికారిని గాయపరిచిన ప్రదేశం బరాక్ పోర్. ప్రస్తుతం ఇది కలకొత్త అర్బన్ లో భాగం. దీంతో మంగళ్ పాండేను ఉరితీసారు. ఈ ఘటనే 1857 స్వతంత్ర్య సంగ్రామానికి బీజం అని చెప్పవచ్చు.

మంగళ్ పాండే సంస్మరణార్థం

మంగళ్ పాండే సంస్మరణార్థం

P.C: You Tube

ఇక్కడ ఉన్న పార్క్ ఆ వీరును సంస్మరణార్థం ఏర్పాటు చేశారు. ఈ పార్క్ ను మనం ఎప్పుడైనా సందర్శించవచ్చు. మరింత అభివ`ద్ధి చేయడం వల్ల ఇక్కడ పర్యాటకులను ఎక్కువ సంఖ్యలో ఆకర్షించవచ్చు. మంగళ్ పాండే ఇతి వ`త్తంగా అమీర్ ఖాన్ అదే పేరుతో సినిమా కూడా తీసాడు.

సెల్యులార్ జైల్

సెల్యులార్ జైల్

P.C: You Tube

పోర్ట్ బ్లెయిర్ లో ఉన్న ఈ సెల్యులార్ జైల్ ను కాలాపానీ అని పిలిచేవారు. సముద్రం మధ్యలో ఒక ద్వీపంలో ఈ జైలును ఏర్పాటు చేశారు. ఇక్కడే చాలా మంది స్వతంత్ర సమరయోధులను ఊరి తీసేవారు.

మ్యూజియం

మ్యూజియం

P.C: You Tube

ఇది అప్పటి రాజకీయాలకు కూడా కేంద్రంగా ఉంది. ప్రస్తుతం దీనిని మ్యూజియంగా మార్చారు. ఇక్కడ స్వతంత్ర సమరయోధులను హింసించడానికి వినియోగించే అనేక రకాల వస్తువులను ప్రదర్శనగా కూడా ఉంచారు.

వాఘా సరిహద్దు

వాఘా సరిహద్దు

P.C: You Tube

అమ`త్ సర్ కు దగ్గరగా ఉన్న వాఘసరిహద్దు భారత దేశాన్ని పాకిస్తాన్ తో వేరుచేస్తుంది. ఇక్కడ ప్రతి రోజూ పాకిస్తాన్ కు చెందిన బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, పాకిస్తాన్ రెజిమెంట్ సూర్యాస్తమయానికి ముందు చేసే ఫ్లాగ్ ఆఫ్ చేస్తూ తమ తమ దేశానికి గౌరవ వందనం సమర్పిస్తారు. దీనిని చూడటానికి అటు భారత్ నుంచి ఇటు పాకిస్తాన్ నుంచి ఎంతో మంది పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు.

నాతులా పాస్

నాతులా పాస్

P.C: You Tube

గ్యాంగ్ టక్ నుంచి 52 కిలోమీటర్ల దూరంలో సముద్ర మట్టానికి 14,140 అడుగుల ఎత్తులో నాతులా పాస్ ఉంటుంది. పూర్వం ఈ మార్గాన్ని ఇండో చైనా మధ్య వర్తక వాణిజ్యాలు జరుపుకోవడానికి వినియోగించేవారు.

ప్రస్తుతం పర్యాటక ప్రాంతం

ప్రస్తుతం పర్యాటక ప్రాంతం

P.C: You Tube

అయితే 1962 తర్వాత ఈ మార్గం పూర్తిగా మూసివేయబడింది. ఇక్కడ అటు ఇండియా, ఇటు చైనా దేశీయానికి చెందిన సైనికులు కాపాలా కాస్తుంటారు. ఇది ప్రముఖ పర్యాటక ప్రాంతంగా కూడా మారింది. ఇక్కడ ఉన్న నెహ్రూ స్టోన్ కూడా చూడదగినది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X