» »ఇక్కడ దెయ్యానికి మినరల్ వాటర్, సిగరెట్ ఇవ్వాల్సిందే లేదంటే ప్రయాణం...

ఇక్కడ దెయ్యానికి మినరల్ వాటర్, సిగరెట్ ఇవ్వాల్సిందే లేదంటే ప్రయాణం...

Written By: Beldaru Sajjendrakishore

హిమాలయ పర్వత ప్రాంతల్లోని హిమాచల్ ప్రదేశ్ ఎన్ని ప్రకతి అందాలను తనలో దాచుకుందో అంత కంటే ఎక్కువ రహస్యాలు ఈ రాష్ర్టంలో దాగి ఉన్నాయి. అందులో పురాణ , హితిహాసాలకు సంబంధించిన దేవాలయాలతో పాటు భౌగోళిక, ఖగోళ ప్రాంతాలు కూడా ఉన్నాయి. అందులో ఒక ప్రాంతమే మనాలి మార్గ్. ఇక్కడ దెయ్యం ఉందని భావించి దానికి నైవేద్యంగా మినరల్ వాటర్ సిగరెట్ ను అందజేస్తున్నారు. ఇందుకు సంబంధించిన కథనం నేటివ్ ప్లానెట్ పాఠకుల కోసం

1. 1700 అడుగుల ఎత్తులో

1. 1700 అడుగుల ఎత్తులో

Image source:

హిమాచల్ లోని మనాలి ప్రాంతంలో దాదాపు 1700 అడుగుల ఎత్తులో అతి అపాయకరమైన రోడ్డు మార్గం ఉంది. దీన్ని ఘాటా లూప్ అంటారు. ఈ మార్గంలో దాదాపు 21 లూప్ లు ఉంటాయి. అనేక ఒంపులు తిరిగిన ఈ ప్రాంతంలో ఎంతో అనుభవమున్న డ్రైవర్లు మాత్రమే వాహనాలను నడపగలరు.

2. మినరల్ వాటర్, సిగరెట్టు

2. మినరల్ వాటర్, సిగరెట్టు

Image source:

ఇక ఈ ప్రాంతం నుంచి వెళ్లే వారు ఖచ్చితంగా మినరల్ వాటర్, సిగరెట్ ను అక్కడ ఓ ప్రత్యేక మైన స్థలంలో ఉంచి తమకు ఎటువంటి హాని కలిగించవద్దని వేడుకుంటారు. పర్యాటకులతో పాటు నిత్యం ఈ మార్గం గుండా సంచరించేవారు ఈ పదార్థాలను నైవేద్యంగా ఉంచుతారు.

3. ట్రక్కు డ్రైవర్లు

3. ట్రక్కు డ్రైవర్లు

Image source:

ముఖ్యంగా వివిధ రకాల సరుకులను రవాణా చేసే డ్రైవర్లు ఈ మార్గం ద్వారా వెలుతుంటారు. చాలా వరకూ ఈ ప్రాంతం గుండా వెళ్లడానికి డ్రైవర్లు సాహసించరు. విధిలేని పరిస్థితుల్లో మాత్రమే ఈ మార్గాన్ని ఎంచుకుంటారు.

4. 20 ఏళ్ల క్రితం

4. 20 ఏళ్ల క్రితం

Image source:

దీనికి సంబంధించి ఒక కథ ప్రచారంలో ఉంది. దాదాపు 20 ఏళ్ల క్రితం ఈ మనాలీ ఘాట్ రోడ్ గుండా ఒక ట్రక్ వెలుతూ మార్గమధ్యలో చెడిపోయింది. దీంతో డ్రైవర్ తన అసిస్టెంట్ ను వాహనంలోనే వదిలి మెకానిక్ ను పిలుచుకురావడానికి దగ్గరలో ఉన్న గ్రామంలోకి వెళ్లాడు.

5. వారం తర్వాత కాని

5. వారం తర్వాత కాని

Image source:

అయితే మంచు తుఫాను వల్ల దాదాపు ఏడు రోజుల తర్వాత కాని డ్రైవర్ తిరిగి తన వాహనం ఉన్న ప్రాంతానికి చేరుకోలేక పోయాడు. అయితే చలి, ఆకలికి తట్టుకోలేక వాహనంలో ఉన్న వ్యక్తి మరణించాడు.

6. అక్కడే పూడ్చిపెట్టారు

6. అక్కడే పూడ్చిపెట్టారు

Image source:

దీంతో సదరు డ్రైవర్ ఎంతో దు:ఖంతో తన అసిస్టెంట్ చనిపోయిన ప్రాంతంలోనే శవాన్ని ఖననం చేసి అతనికి ఇష్టమైన సిగరెట్లతో పాటు కొంత నీరు, తిండిపదార్థాలను పెట్టి అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

7. రెండు కిలోమీటర్ల మేర

7. రెండు కిలోమీటర్ల మేర

Image source:

అప్పటి నుంచి ఆ రోడ్డు మార్గంలో వెళ్లే వారికి వింత వింత శబ్దాలు వినిపించేవి. నాకు తినడానికి తాగడానికి ఏమైనా ఇవ్వాలని ఆ దారిన పోయే వారి వెంట ఓ యువకుడు వెంటపడేవాడు. ఇలా సుమారు రెండు కిలోమీటర్ల మేర వెంటపడేవాడు.

 8.సరుకు రవాణా చేయలేక పోయేవారు

8.సరుకు రవాణా చేయలేక పోయేవారు

Image source:

ఏమైనా అతని చేతిలో పెట్టిన వారి ప్రయాణం సుఖంగా సాగేది. లేదంటే ఖచ్చితంగా ప్రమాదాలు జరిగేవి. ఆ మార్గం గుండా సరుకు రవాణా చేయలేకపోయేవారు.

9. మంత్రగాళ్లు అక్కడకు చేరుకుని

9. మంత్రగాళ్లు అక్కడకు చేరుకుని

Image source:

ఈ విధానం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. కాగా, వివిధ రకాల పదార్థాలను అక్కడ ఉంచినా చాలామంది మినరల్ వాటర్, సిగరెట్ ను నైవేద్యంగా పెట్టి అక్కడ పూజ చేసి వెలుతారు. ఇందుకు విరుద్ధంగా ప్రవర్తించినవారికి ఇప్పటికీ ఏదో ఒక ప్రమాదం జరుగుతూనే ఉందని స్థానికుల కథనం

10. అదే కొనసాగుతోంది

10. అదే కొనసాగుతోంది

Image source:

ఈ విధానం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. కాగా, వివిధ రకాల పదార్థాలను అక్కడ ఉంచినా చాలామంది మినరల్ వాటర్, సిగరెట్ ను నైవేద్యంగా పెట్టి అక్కడ పూజ చేసి వెలుతారు. ఇందుకు విరుద్ధంగా ప్రవర్తించినవారికి ఇప్పటికీ ఏదో ఒక ప్రమాదం జరుగుతూనే ఉందని స్థానికుల కథనం