Search
  • Follow NativePlanet
Share
» »వావ్!! ముంబై తాజ్ & గేట్ వే ఆఫ్ ఇండియా చూడటానికి రెండు కళ్ళు సరిపోవు..

వావ్!! ముంబై తాజ్ & గేట్ వే ఆఫ్ ఇండియా చూడటానికి రెండు కళ్ళు సరిపోవు..

ముంబై నగరం పేరు చెప్పగానే అతి రద్దీగా ఉండే ప్రదేశం, గజిబిజీగా ఉండే ప్రదేశం, ఫ్యాషన్లు బిజీగా గడిపే జీవన విధానాలు గుర్తుకొస్తాయి. ఈ వెంటనే బాలీవుడ్ సినిమాలు, ప్రసిద్ది నటీనటులు కూడా గుర్తుకు వస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రపంచానికి అమెరికా దేశం ఎలా ఉంటుందో..భారత దేశానికి ముంబై నగరం అలాగుంటుంది. ముంబై నగర ప్రాధాన్యతలు వివరించాలంటే అక్కడ ఉన్న విభిన్న మతాల ప్రజలు, వివిధ ప్రదేశాలు మరియు ప్రజల ఆధ్యాత్మికపరమైన పూజలు మరియు స్థానికంగా లభించే అనేక రకాల ఆహారాలు మొదలైన వాటిపై ఆధారపడి ఉంటాయి.

పక్కగా చెప్పాలంటే ముంబై నగరంలో అన్ని వయస్సుల వారికి, అన్ని అభిరుచులవారికి తగినంత ఆనందం లభిస్తూనే ఉటుంది. ఖర్చు పెట్టే విధానాన్ని బట్టే వస్తు సేవలు, వస్తువుల నాణ్యత ఉంటుంది. ఎంత తక్కువ సమయం అయినా సరే మీరు నగరాన్ని చూచి ఆనందించవచ్చు. నగరంలో పర్యటించటం చవక మరియు సౌకర్యం ప్రతి ప్రదేశంలోనూ మీకు మంచి ఆనందం దొరుకుతుంది. ముంబై నగరంలో చూడాల్సిన ప్రదేశాలు చాల ఉన్నాయి , వాటిలో ముఖ్యంగా చెప్పుకోవల్సింది గేట్ వే ఆఫ్ ఇండియా గురించి...

ప్రసిద్ది గాంచిన శిల్పకళా అద్భుతం

ప్రసిద్ది గాంచిన శిల్పకళా అద్భుతం

ప్రసిద్ది గాంచిన శిల్పకళా అద్భుతం . గేట్ వే ఆఫ్ ఇండియా దాని 8 అంతస్తుల ఎత్తుతో ముంబైలోని కొలబాలో పర్యాటకులకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. గేట్ వే ఆఫ్ ఇండియా ముంబై నగరంలోని అపోలో బందర్ ప్రాంతంలో సముద్రం ఒడ్డున ఉంది. దీని ఎత్తు 85మీటర్లు. ఇదో స్మారక కట్టడం. సముద్రం ద్వారా వచ్చే అతిథులకు ఇదో స్వాగత ద్వారం. బోట్ల ద్వారా ముంబై వచ్చే సందర్శకులకు ముందుగా కనిపించేది కూడా ఇదే.

Photo Courtesy : wikimedia.org

భారతీయ, యూరోపియన్ నిర్మాణ శైలిలో

భారతీయ, యూరోపియన్ నిర్మాణ శైలిలో

భారతీయ, యూరోపియన్ నిర్మాణ శైలిలో గేట్ వే ఆఫ్ ఇండియాను నిర్మించారు. దీనిని హిందు మరియు ముస్లీంలు కలిసి నిర్మాణం చేశారు.అప్పట్లో దీని నిర్మాణానికి 21 లక్షల రూపాలను ఖర్చుచేశారు. 1911వ సంవత్సరం డిసెంబర్ లో బ్రిటన్ రాజు కింగ్ జార్జ్ -5క్వీన్ మేరీలు భారత పర్యటనకు గుర్తుగా అదే సంవత్సరం మార్చి 31వ తేదీన దీని నిర్మాణాన్ని ప్రారంభించారు. 1924 డిసెంబర్ లో కట్టడాన్ని పూర్తి చేశారు.

Photo Courtesy : wikimedia.org

బ్రిటీష్ సైన్యం భారత్ నుండి వెనుదిరిగినప్పుడు

బ్రిటీష్ సైన్యం భారత్ నుండి వెనుదిరిగినప్పుడు

బ్రిటీష్ సైన్యం భారత్ నుండి వెనుదిరిగినప్పుడు అందులోని సోమర్ సైట్ లైట్ ఇన్ ప్రాంటీ మొదటి దళం గేట్ వే ఆప్ ఇండియా నుండే బయలుదేరి వెళ్లింది. ఇక్కడకు దక్షిణ ముంబైలో ప్రసిద్దిగాంచిన రెస్టారెంట్లు, బడే మియాస్, కేఫే మండేగర్ మరియు కేఫే లియో పోల్డ్ కూడా సీమపంలోనే ఉన్నాయి.

Photo Courtesy : wikimedia.org

గేట్ వే ఆఫ్ ఇండియా నైట్ వ్యూ..

గేట్ వే ఆఫ్ ఇండియా నైట్ వ్యూ..

గేట్ వే ఆఫ్ ఇండియా వద్ద నిలుచుని మీరు ఒక ఫొటో తీయించుకోకపోతే మీ ముంబై ట్రిప్ వృధాగా భావించాల్సిందే. గోట్ వే ఆఫ్ ఇండియా కొలబా కాజ్ వే కు సమీపంలోనే ఉంటుంది.

Photo Courtesy : wikimedia.org

భారత దేశంలో మొట్టమొదటి ఫ్యాషన్లు ముంబైలో

భారత దేశంలో మొట్టమొదటి ఫ్యాషన్లు ముంబైలో

భారత దేశంలో మొట్టమొదటి ఫ్యాషన్లు ముంబైలో పుడతాయనుకుంటే, వీధి కొనుగోలు ముంబైలో మొట్టమొదట ఎక్కడ మొదలవుతాయంటే కాజ్ వే లో అని చెప్పాలి. వీటితో పాటు మరికొన్ని ఆకర్షనీయ ప్రదేశాలు కూడా చూడండి..

Photo Courtesy : wikimedia.org

మెరైన్ డ్రైవ్ :

మెరైన్ డ్రైవ్ :

మెరైన్ డ్రైవ్ లో వాక్ చేస్తుంటే అది మిమ్మల్ని ప్రపంచ ప్రసిద్ద చౌపట్టీ బీచ్ కు చేరుస్తుంది. ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ కు ప్రసిద్ది. వివిధ రకాల స్ట్రీట్ ఫుడ్ ను రుచి చూడవచ్చు. మెరైన్ డ్రైవ్ లో ప్రసిద్ధ బ్రాండ్లు మరియు విశేషమైన హేండ్ లూమ్ స్టోర్సు కలవు. చీకటి పడితే, లైట్లు సముద్రపు ఒడ్డు అందాలను మటుమాయం చేస్తాయి. రాత్రులలో మెరైన్ డ్రైవ్ నుండి ముంబై స్కై లైన్ చూడటం ఎంతో ఆనందం కలిగిస్తుంది.

PC: A.Savin

జుహు బీచ్ :

జుహు బీచ్ :

బీచ్ ప్రేమికులందరకూ జుహు బీచ్ ఎంతో ఉత్సాహం కలిగిస్తుంది. ఇక్కడకి బాద్రా నుండి సుమారు నాలుగు గంటల్లో చేరుకోవచ్చు. ఇక్కడ ఎంత సేపైనా ఉండిపోయిన ఆనంద సాగరంలో మునిగితేలుతారు. బీచ్ లో దొరికే ఆహారాలు ముంబై లోనే ప్రత్యేకత.

Photo Courtesy : wikimedia.org

విక్టోరియా టర్మినస్ :

విక్టోరియా టర్మినస్ :

ఛత్రపతి శివాజీ స్టేషన్ అనే పేరు కంటే కూడా వి.టి స్టేషన్ లేదా విక్టోరియా టర్మినస్ అనే పేరుతో ముంబైలోని ప్రధాన వాణిజ్య కేంద్రంగా ఇప్పటికీ ఎన్నో ఏళ్ళుగా కొనసాగుతోంది. పట్టణ యువత అవసరాల కారణంగా ఇక్కడ కన్ స్యూమర్ ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సంబంధిత మరియు దుస్తులు వంటివి ఈ ప్రాంతంలోని వీధులలోకి వచ్చేసాయి.

PC: Anoop Ravi

ముంబై సీలింక్:

ముంబై సీలింక్:

బంద్రా-ముంబై సీ లింకు ముంబైలోని ప్రధాన మురియు తాజా నిర్మాణం.. ముంబై స్కై లైన్ కు ఇది ఒక అద్భుత నిర్మాణం. వేలాడే ఈ 8లైనుల బ్రిడ్జి మోటారిస్టులను వర్లి మరియు బంద్రాల మధ్య పది నిమిషాలలో ప్రయాణింపజేస్తుంది.

PC:

హేంగింగ్ గార్డెన్:

హేంగింగ్ గార్డెన్:

హేంగింగ్ గార్డెన్ పార్క్ నగరంలోనే అతిపురాతనమైనది. చక్కగా నిర్వహించబడే పార్క్. ఈ పార్క్ లో ప్రతేకత ఏంటంటే అతి పెద్ద జైంట్ లేడీ షూ. ఫోటో గ్రఫర్ల మం ఫోటో కొరకు నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు.

Photo Courtesy : wikimedia.org

బంద్ర స్ట్రీట్ షాపింగ్ :

బంద్ర స్ట్రీట్ షాపింగ్ :

బ్రాండెడ్ వస్తువుల షాపింగ్ పూర్తి అయిన తర్వాత ఇక మీరు బంద్రాలో వీధి షాపింగ్ మొదలుపెట్టండి.

Photo Courtesy : wikimedia.org

ఐస్ బార్

ఐస్ బార్

సాధారణంగా ముంబై వాసులకు చలి వాతావరణం అలవాటులేదు. అయితే, ఇటీవలే ఈ నగరం అధిక చలి వాతావరణాన్ని ఎదుర్కుంటోంది. అలాగని ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కు కూడా పడటం లేదు. ముంబై లోని అంధేరిలో 21 డిగ్రీ ఫారెన్ హీట్ ఎపుడూ ఉష్ణంగా ఉండే ముంబై వాసులకు స్వాగతించదగినదే. మంచి ఉన్ని కోట్లు వేసుకొని నగరంలోని ఈ ఐస్ బార్ లో ఒక సాయంత్రం గడిపేయండి.

Photo Courtesy : wikimedia.org

ఎఇఆర్ రూఫ్ టాప్ లాంజ్ ముంబై:

ఎఇఆర్ రూఫ్ టాప్ లాంజ్ ముంబై:

ఎఇఆర్ రూఫ్ టాప్ లాంజ్ ముంబైలోని ప్రభాదేవి వద్దకల ఫోర్ సీజన్స్ లో కలదుజ పార్టీప్రియులు ఈ లాంజ్ లో తప్పక విందు చేసుకుని ఆనందించాల్సిందే. ముంబై మహానగర రాత్రి దృశ్యాలను ఈ ప్రదేశం కళ్ళకు కట్టినట్లు అందంగా చూపుతుంది. 34వ అంతస్తు నుండి చూస్తే మిమ్మల్ని మీరు మరిచిపోవాల్సిందే.

Photo Courtesy : Raman Patel

బ్యాండ్ స్టాండ్ :

బ్యాండ్ స్టాండ్ :

బ్యాండ్ స్టాండ్ ముంబైకి మరో సముద్ర ముందు భాగం. ఈ ప్రదేశంలో విలాసవంతమైన కాఫీ హౌస్ లు రెస్టారెంట్లు, చక్కటి వీధి దీపాలు సంప్రదాయ ముంబై చాయ్ వంటివి ఎన్నో ఉంటాయి. బ్యాండ్ స్టాండ్ నుండి కిందకు నడుచుకుంటూ వెళితే, బాలీవుడ్ ప్రఖ్యాత సెలబ్రిటీల, నటుల నివాసాలు కనపడతాయి. షా రుఖ్ ఖాన్ నివాసం మన్నత్, సల్మాన్ ఖాన్ నివాసం గెలాక్సీ టవర్ వద్ద చూడవచ్చు. బ్యాండ్ స్టాండ్ ను ముంబై లో లవర్స్ పాయింట్ అని కూడా అంటారు. దీనికి కారణం ఇక్కడ అనేకమంది స్కూలు మరియు కాలేజీ విద్యార్ధులు తమ తరగతులను ఎగవేసి ముంబై అందాలను ఇక్కడ కూర్చొని తెగ ఆనందించేస్తారు.

Photo Courtesy : wikimedia.org

ఎలిఫెంటా కేవ్స్

ఎలిఫెంటా కేవ్స్

ఎలిఫెంటా గుహలు ముంబై లోని ఒక ద్వీపంలో ఉన్నాయి. ఇక్కడికి చేరాలంటే బోట్ లో వెళ్ళాలి. ఇవి యునెస్కో చేత ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించబడ్డాయి. పోర్చుగీసు వారు ఇక్కడికి వచ్చినప్పుడు ఎలిఫెంట్ శిల్పశైలి అధికంగా కనిపించడంతో, దీనికి ఎలిఫెంటా అని పేరుపెట్టారు. చిత్రకృప : AKS.9955 PC:

ముంబాయ్ చంత్రపతి శివాజీ ఎయిర్ పోర్ట్:

ముంబాయ్ చంత్రపతి శివాజీ ఎయిర్ పోర్ట్:

ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం. గతంలో సహార్ అంతర్జాతీయ విమానాశ్రయం, ఇది ముంబాయి లోని ప్రధాన విమానాశ్రయం మరియు ప్రయాణికుల రవాణాను దృష్టిలో పెట్టుకుంటే దక్షిణ ఆసియా యొక్క అత్యంత బిజీగా ఉండే విమానాశ్రయం.గతంలో దీనిని సహార్ (అంతర్జాతీయ) విమానాశ్రయం మరియు శాంతాక్రూజ్ (స్వదేశీయ) విమానాశ్రయం అని పిలిచేవారు, ఈ రెండు విమానాశ్రయాలు విలీనమయ్యి 17వ శతాబ్దపు మరాఠా రాజు ఛత్రపతి శివాజీ భోస్లే పేరు మీదగా ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం అని పెట్టబడింది.

PC:

 ముంబై ఎలా చేరుకోవాలి ?

ముంబై ఎలా చేరుకోవాలి ?

వాయు మార్గం : ముంబై లో అంతర్జాతీయ విమానాశ్రయం కలదు. ఇక్కడికి దేశ, విదేశాల నుండి విమానాలు రాకపోకలు సాగిస్తుంటాయి. క్యాబ్ లేదా టాక్సీ అద్దెకు తీసుకొని మీ ప్రయాణాన్ని మొదలుపెట్టవచ్చు.

రైలు మార్గం : ముంబై లో రైల్వే స్టేషన్ కలదు. దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుండి ఇక్కడికి రైళ్ళు రాకపోకలు సాగిస్తుంటాయి.

బస్సు మార్గం : హైదరాబాద్, బెంగళూరు, గాంధీనగర్ తదితర ప్రాంతాల నుండి ముంబై కు పలు ప్రభుత్వ/ ప్రవేట్ బస్సులు తిరుగుతుంటాయి.

PC : Superfast1111

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X