» »ఇటార్సి - పర్యాటకులకు ఆసక్తిని కలిగించే ప్రదేశం !

ఇటార్సి - పర్యాటకులకు ఆసక్తిని కలిగించే ప్రదేశం !

Written By:

ఇటార్సి మధ్య ప్రదేశ్ రాష్ట్రంలోని ఒక ప్రధాన వాణిజ్య కూడలి. ఈ సిటీ వ్యవసాయ పరంగానూ, పరిశ్రమల పరంగానూ గణనీయమైన అభివృద్ధి సాధించింది. దీనికి కారణం ఇక్కడ ఉన్న పురాతన రైల్వే జంక్షన్ అయివుండొచ్చు. ఇటార్సి చేనేత ఉత్పత్తులకు ప్రసిద్ధి. భోపాల్ కు 110 కిలోమీటర్ల దూరంలో కలదు.

ఇది కూడా చదవండి : సింధియా రాజుల వేసవి కేంద్రం ... శివపురి !

ఇటార్సికి ఆ పేరు ఎలా వచ్చిందో చెప్తే భలే గమ్మత్తుగా ఉంటుంది. ఇటుకలు, తాడు వలన దీనికి ఆ పేరు వచ్చిందంటారు స్థానికులు. ఇటార్సిలో భారత రక్షణ శాఖ కు సంబంధించిన ఆయుధ కర్మాగారం (ఆర్డనెన్సు ఫ్యాక్టరీ) కలదు. ఇక్కడ పుష్కలమైన ఖనిజ సంపద, అద్భుతమైన సోయా ఆయిల్ మిల్లులు కలవు. ఇటార్సి లోని ప్రముఖ ఆకర్షణల విషయానికి వస్తే ... !

బూది మాత ఆలయం

బూది మాత ఆలయం

ఇటార్సి లో గల అనేక మతపర ప్రదేశాలలో బూది మాత ఆలయం ప్రధానమైనది. టెంపుల్ యొక్క తెల్లటి గోడలు సూర్య కాంతిలో ధగధగ మంటూ మెరుస్తూ శాంతిని సూచిస్తాయి. ఈ మందిరానికి భక్తులు సంవత్సరం పొడవునా వస్తూనే ఉంటారు.

చిత్రకృప : Neeraj Soni

బోరి వన్యప్రాణుల అభయారణ్యం

బోరి వన్యప్రాణుల అభయారణ్యం

బోరి వైల్డ్ లైఫ్ సంక్చురి దేశం లోనే అతి పురాతన మైన ఫారెస్ట్ రిజర్వు. దీనిని 1865 లో ఒక వైల్డ్ లైఫ్ సంక్చురి గా 518 చ.కి.మీ. ల విస్తీర్ణం లో ఏర్పాటుచేశారు. ఈ బోరి వైల్డ్ లైఫ్ సంక్చురి ని మరింత వృక్ష, జంతు సంపదలకు నిలయంగా చేసాయి. ఈ సంక్చురిలో పులులు ప్రధాన ఆకర్షణ. టూరిస్టులకు అనేక సఫారీలు నిర్వహించబడతాయి. ఇక్కడ అనేక ఫారెస్ట్ బంగళాలు, గెస్ట్ హౌస్ లు వసతిగా కలవు.

చిత్ర కృప : Apna Madhyapradesh India

ద్వారకాదీష్ మందిర్

ద్వారకాదీష్ మందిర్

ద్వారకాదీష్ మందిర్ లో శ్రీకృష్ణుడు పూజించబడతాడు. ఈ టెంపుల్ సిటీ కి మధ్యలో ఉండటం చేత అనేక మంది పర్యాటకులు వచ్చి పోతుంటారు. ఆకర్షణీయమైన టెంపుల్ సముదాయంలో ఇంకా అనేక దేవాతామూర్తుల విగ్రహాలు కూడా కలవు.

చిత్ర కృప : Emmanuel DYAN

హుస్సేని మసీద్

హుస్సేని మసీద్

ఇటార్సి లో ముస్లిం లు అధికం. భిన్నత్వంలో ఏకత్వం అనే సిద్ధాంతాన్ని బాగా నమ్ముతారు. హుస్సేని మసీద్ ఇక్కడ ప్రసిద్ధి చెందినది. ప్రతి శుక్రవారం, రంజాన్, బక్రీద్ పర్వదినాలలో మసీదులో అధికంగా ప్రార్థనలు చేయటానికి వస్తుంటారు.

చిత్ర కృప : Ansari Javed

ఎవాన్జలికల్ లూథరన్ చర్చి

ఎవాన్జలికల్ లూథరన్ చర్చి

ఈ చర్చి ఇక్కడ గల ప్రజల మాత సహనానికి ప్రతీకగా నిలుస్తుంది. చర్చి యొక్క శిల్ప శైలి పర్యాటకులను తప్పక ఆకట్టుకుంటుంది. ఇక్కడ క్రిస్మస్, గుడ్ ఫ్రైడే వేడుకలు అంబరాన్ని అంటుతాయి.

పెంతే కోస్టల్ చర్చి

పెంతే కోస్టల్ చర్చి

నేడు ఇటార్సి కి ప్రపంచ వ్యాప్తంగా పేరువచ్చిందంటే కారణం పెంతే కోస్టల్ చర్చి. ఈ చర్చి దేశంలోనే కాక విదేశాలలో సైతం చర్చీలను స్థాపిస్తుంటుంది. ఈ చర్చి నిర్మాణ సౌందర్యానికి ఎవరైనా దాసోహం అవ్వకతప్పదు. సంవత్సరం పొడవునా క్రిస్టియన్ సోదరులు, సోదరీమణులు ప్రార్థనలకై వస్తుంటారు.

చిత్ర కృప : Grande Illusion

తావా డాం

తావా డాం

తావా మరియు దేన్వా నదులు కలిసే చోట తావా డాం కలదు. ఇది చాలా పెద్దది. దీని చుట్టూ ఉన్న ప్రకృతి అందాలు, పచ్చదనం, డాం నీరు దీనిని ఒక పర్యాటక ప్రదేశంగా మార్చాయి. డాం వద్ద ట్రెక్కింగ్ సహస క్రీడలు ఆచరించవచ్చు.

చిత్రకృప : Rakshpatil

ఎలా చేరుకోవాలి ?

ఎలా చేరుకోవాలి ?

వాయు మార్గం : ఇటార్సి కి సమీపాన భోపాల్ అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ కలదు. ఇక్కడికి దేశ విదేశాల నుండి విమానాలు వస్తుంటాయి. 110 కి. మీ ల దూరంలో ఉన్న ఉన్న విమానాశ్రయం నుండి క్యాబ్ లలో ప్రయాణించి ఇటార్సి చేరుకోవచ్చు.

రైలు మార్గం : ఇటార్సి పెద్ద రైల్వే జంక్షన్. దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుండి ఇక్కడికి రైళ్లు వస్తుంటాయి.

రోడ్డు మార్గం : భోపాల్, ఇండోర్ మరియు చుట్టుపక్కల ప్రాంతాల నుండి ఇటార్సి కి బస్సు సౌకర్యం కలదు.

చిత్రకృప : RAKHEESARV

Please Wait while comments are loading...