Search
  • Follow NativePlanet
Share
» »సింధియా రాజుల వేసవి కేంద్రం ... శివపురి !

సింధియా రాజుల వేసవి కేంద్రం ... శివపురి !

By Mohammad

శివగిరి, శివపురి .. ఇవి రెండూ ఎప్పుడూ యాత్రికులను కన్ఫ్యూజ్ చేస్తుంటాయి. శివగిరి .. కర్ణాటకలోని చిక్కమగళూరు జిల్లాలో కలదు. ఇది సాహస కృత్యాలను ఇష్టపడేవారికి నచ్చుతుంది. శివపురి మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో కలదు. పూర్వం సింధియా రాజులకు 'శివపురి' వేసవి విడిది.

శివపురి చుట్టూ దట్టమైన అడవులు అలుముకొని ఉన్నాయి. మధ్య ప్రదేశ్ ను పాలించిన సింధియా రాజులు వేసవి సెలవుల్లో ఇక్కడికి సేదతీరటానికి వచ్చేవారు. సరదాలకు, కాలక్షేపాలకు జంతువులను వేటాడేవారు. మీకోవిషయం తెలుసా ? మొఘల్ చక్రవర్తి అక్బర్ కాలంలో వందల సంఖ్యలో ఏనుగులను లొంగదీసుకున్న ప్రాంతం కూడా ఇదే.

శివపురి లో సందర్శించటానికి చారిత్రక సైట్ లు, మతపర ప్రదేశాలు ఉన్నాయి. ఇవి పర్యాటకులను తప్పక ఆనందాన్ని కలిగిస్తాయి. అవేంటో ఒకసారి పరిశీలిద్దాం పదండి ..!

ఇది కూడా చదవండి : అమర్ కంటక్ - నర్మదా నది జన్మస్థలం !

మాధవ్ విలాస్ ప్యాలెస్

మాధవ్ విలాస్ ప్యాలెస్

సింధియా వాస్తు కళను ప్రతిబింబించే చారిత్ర కట్టడాలతో మాధవ్ విలాస్ ప్యాలెస్ ఒకటి. ప్యాలెస్ లోపల మార్బుల్స్ పరిచిన తీరు చూపరులను ఆకట్టుకుంటుంది. దీనిని సింధియా రాజులు వేసవి విడిది గా ఉపయోగించేవారు. భవంతి కి సమీపంలో గణపతి మండపం కలదు.

చిత్ర కృప : PRONagarjun Kandukuru Follow

మాధవ్ నేషనల్ పార్క్

మాధవ్ నేషనల్ పార్క్

మాధవ్ నేషనల్ పార్క్ 150 చ. కి. మీ ల విస్తీర్ణంలో ఏర్పాటుచేశారు. సింధియా రాజులు వేసవి లో ఈ అటవీ ప్రాంతంలోనే వేట సాగించేవారు. ప్రస్తుతం ఈ అడవి జంతువులకు, పక్షులకు మరియు వృక్షాలకు నిలయంగా ఉన్నది. చింకారా జింకలు, నల్ల దుప్పి, పులులు మరియు అనేక జంతువులు ఇక్కడ ఉన్నాయి.

చిత్ర కృప : Amit Mitra

మాధవ్ రావ్ సింధియా స్మారక స్థూపం

మాధవ్ రావ్ సింధియా స్మారక స్థూపం

మాధవ్ రాజ్ సింధియా స్మారకస్థూపాన్ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేసింది. తెల్లని చలువరాతి రాళ్లు ఉపయోగించి దీనిని నిర్మించారు. లోపల సింధియా వంశస్థుల చిత్ర పటాలను గమనించవచ్చు.

చిత్ర కృప : kikivoyage

జార్జ్ కాస్టిల్

జార్జ్ కాస్టిల్

దట్టమైన శివపురి అడవి లో ఉన్న జార్జ్ కాస్టిల్ ఒక జంగల్ రిసార్ట్. దీనిని జియాజి సింధియా నిర్మించారు. ఈ భవనం పై కి ఎక్కి చూస్తే అడవి తల్లి అందాలను చూడవచ్చు. సూర్యాస్తమ సమయంలో అక్కడి సరస్సులలో పడే రంగురంగుల ప్రతిబింబాలను తిలకించవచ్చు.

చిత్ర కృప : mpforest

సాఖ్య సాగర్ బోట్ క్లబ్

సాఖ్య సాగర్ బోట్ క్లబ్

సాఖ్య సాగర్ బోట్ క్లబ్, మాధవ్ నేషనల్ పార్క్ లో ఒక భాగం. ఈ సరస్సులో వివిధ రకాల సరీసృపాలు తిరుగుతుంటాయి. మొసళ్ళు, కొండ చిలువలు వంటివి ఇక్కడ ఉన్నాయి. దీనికి సమీపంలోనే సాఖ్య బోట్ క్లబ్ ఉన్నది.

చిత్ర కృప : LRBurdak

శివపురి ఇతర ఆకర్షణలు

శివపురి ఇతర ఆకర్షణలు

భాదయ్యా కుండ్, శివ ఆలయం (చాత్రి రోడ్), బాన్ గంగా ధామ్, సాఖ్య సాగర్, మాధవ్ సాగర్ మొదలైనవి చూడదగ్గవి. శివపురి లో వసతి కై హోటల్ సదుపాయాలు కలవు.

చిత్ర కృప : Gajendra Kumar Baheti

శివపురి ఎలా చేరుకోవాలి ?

శివపురి ఎలా చేరుకోవాలి ?

శివపురి కి సమీపాన 120 km దూరంలో గ్వాలియర్ నగరం కలదు.

బస్సు ద్వారా : గ్వాలియర్ నుండి శివపురి కి రెగ్యూలర్ గా ప్రభుత్వ బస్సులు తిరుగుతుంటాయి.

రైలు ద్వారా : శివపురి లో రైల్వే స్టేషన్ కలదు. రాష్ట్రం నలుమూలల నుండి ఇక్కడికి రైళ్లు వస్తుంటాయి.

విమానం ద్వారా : శివపురి కి సమీపాన గ్వాలియర్ ఎయిర్ పోర్ట్ కలదు.

చిత్ర కృప : Amit Mitra

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X