Search
  • Follow NativePlanet
Share
» »వైద్యులకు ముచ్చెమటలు పట్టించే వ్యాధి ఇక్కడ నయమవుతోంది?

వైద్యులకు ముచ్చెమటలు పట్టించే వ్యాధి ఇక్కడ నయమవుతోంది?

ఏదైనా వ్యాధి వచ్చినప్పుడు వైద్యుల వద్దకు వెళ్లడం సాధారణం. అయితే ఆ వ్యాధి నయం కాదని తెలిసినప్పుడు దైవం పై భారం వేసి అనేక దేవాలయాల చుట్టూ తిరుగుతాం. మన భారత దేశంలో దేవతలను అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ముఖ్యంగా కష్టాలు వచ్చినప్పుడు అయితే మరింత భక్తి శ్రద్ధలతో ఆ దేవతలను పూజిస్తారు. ముఖ్యంగా ఏదైనా వ్యాధి వచ్చినప్పుడు అయితే మరింత శ్రద్ధతో మనం దేవుళ్లను పూజిస్తూ వస్తాం. వైద్య రంగంలో ఎన్నో అద్భుతాలు జరుగుతున్నా కొన్ని వ్యాధులకు చికిత్స ఇప్పటికీ కనుగొనలేకపోతున్నారు. అంటువంటి వ్యాధే పక్షవతం. ఈ వ్యాధి వచ్చినవారిలో చాలా మంది దేవుడి పై భారం వేస్తారు. అలా వైద్యుల చికిత్సకు లొంగని పక్షవాతాన్ని కూడా పూర్తిగా నయం చేసే ఓ దేవాలయం గురించిన పూర్తి వివరాలు మీ కోసం...

ఉచితం...

ఉచితం...

P.C: You Tube

పక్షవాతం వంటి దీర్ఘకాల వ్యాధులతో బాధపడే వారు ఎక్కువగా ఈ దేవాలయాన్ని సందర్శిస్తూ ఉంటారు. అటువంటి వ్యాధులతో బాధపడేవారు ఏడు రోజుల పాటు ఈ దేవాలయంలో ఉండాలి. ఉండటానికి వసతి, భోజనం కూడా లభిస్తుంది. అంతా ఉచితమే.

భారత దేశంలో ఏక శిలా నంది విగ్రహాలు చూశారా

ప్రధాన మంటపంలో కూడా

ప్రధాన మంటపంలో కూడా

P.C: You Tube

ప్రస్తుతం ఈ దేవాలయానికి వచ్చే భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. అందువల్లే ప్రత్యేక గదులు దొరకడం చాలా కష్టం. అయితే ఒక పెద్ద మంటపం ఉంటుంది. ఆ మంటపంలోనే మనం వసతిని ఏర్పాటుచేసుకోవచ్చు.

నమ్మకం..

నమ్మకం..

P.C: You Tube

చాలా మందికి ఇది మూడ నమ్మకంగా తోచవచ్చు. అయితే చాతా మంది భక్తులు తమకు పూర్తిగా వ్యాధి తగ్గిన తర్వాత ఈ దేవాలయానికి వచ్చి అనేక కానుకలు ఇచ్చి వెలుతూ ఉంటారు. అందువల్ల నమ్మకం ఇక్కడ ప్రధానంగా చెబుతారు.

500 ఏళ్ల క్రితం

500 ఏళ్ల క్రితం

P.C: You Tube

ఇందుకు సంబందించిన కథనం ప్రకారం దాదాపు 500 ఏళ్ల క్రితం ఒక ముని ఇక్కడికి వచ్చాడు. అతడు తన దగ్గరకు వచ్చే భక్తుల రోగాలను నయం చేస్తుండేవాడు. ఆ సన్యాసి సమాధిని కూడా ఈ దేవాలయంలో చూడవచ్చు. ఈ సమాధి చుట్టూ ప్రతి రోజూ ఏడు ప్రదిక్షిణాలు చొప్పున ఏడు రోజుల పాటు చేస్తే వ్యాధి నయమవుతుందని చెబుతారు.

ముక్కంటి ముక్కోపిగా మారిన ప్రాంతం చూశారా? ఇక్కడ నుంచి ఆకాశం చూస్తే స్వర్గ ప్రాప్తి

మంగళహారతి

మంగళహారతి

P.C: You Tube

ప్రదిక్షిణాల తర్వాత అక్కడ మంగళహారతి ఇస్తారు. ఆ మంగళహారతిని తీసుకున్నవారు. కాలు చెయ్యి పనిచేయని వారికి కొద్ది కొద్దిగా కాళ్లు, చేతులు స్వాధీనంలోకి రావడం కనిపిస్తుంది. అంతే కాకుండా మాటలు కోల్పోయిన వారు కూడా కొద్ది కొద్దిగా మాట్లాడటం చూడవచ్చు.

డబ్బును ఆశించరు

డబ్బును ఆశించరు

P.C: You Tube

ఇక్కడ భక్తుల నుంచి ఎటువంటి డబ్బును నిర్వాహకులు తీసుకోరు. అయితే వ్యాధి నయమైన తర్వాత వారు తమకు తోచిన రీతిలో ఆలయ అభివ`ద్ధికి పాటు పడవచ్చు. ఇలా వచ్చిన కానుకలతోనే ఇక్కడికి వచ్చే భక్తులకు వసతి, భోజన సదుపాయం కల్పిస్తున్నారు.

ఇక్కడ రొట్టెను తీసుకొంటే మీకు ఉద్యోగం, సంతానం ఖచ్చితం.

రాజస్థాన్ లో

రాజస్థాన్ లో

P.C: You Tube

ఈ దేవాలయం రాజస్థాన్ రాష్ట్రంలోని నాగోర్ జిల్లాలో దేగాన్ అనే మండలంలో బుడాటి అనే చిన్న గ్రామంలో ఉంది. ఈ దేవాలయాన్ని చతుర్ దాస్ జీ మందిరం అని పిలుస్తారు. అత్యంత ప్రాచీనమైన ఈ దేవాలయాన్ని ప్రతి రోజూ వెయ్యి మందికి పైగా భక్తులు సందర్శిస్తూ ఉంటారు. వీరిలో 200 నుంచి 250 మంది పక్షవాతంతో బాధపడేవారే. ఉంటారు.

ప్రవేశ రుసుం లేదు

ప్రవేశ రుసుం లేదు

P.C: You Tube

చతుర్ దాస్ జీ మహారాజ మందిరానికి ఎటువంటి ప్రవేశ రుసుం లేదు. ఈ దేవాలయం ప్రతి రోజూ ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 వరకూ భక్తులకు ప్రవేశం కల్పిస్తారు. అనేక ఆసుపత్రులకు వెళ్లి పక్షవాతం నయం కానివారు ఇక్కడకు ఎక్కువగా వస్తుంటారు.

జైపూర్

జైపూర్

P.C: You Tube

ఈ దేవాలయానికి దగ్గరగా జైపూర్ విమానాశ్రయం ఉంది. జైపూర్ నుంచి ఈ దేవాలయానికి నేరుగా బస్సు సౌకర్యం ఉంది. సుమారు 5 నుంచి 6 గంటల ప్రయాణం తర్వాత ఈ దేవాలయానికి చేరుకోవచ్చు.

కొత్త దంపతులు ఆ కొమ్ముల మధ్య నుంచి లింగాన్ని దర్శిస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయంటా

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X