Search
  • Follow NativePlanet
Share
» »ఇక్కడికి వెళితే మీ చేతితో పాటు దానికి పనిచెప్పకుండా ఉండలేరు

ఇక్కడికి వెళితే మీ చేతితో పాటు దానికి పనిచెప్పకుండా ఉండలేరు

By Kishore

హె....అబ్బబ్బ... ఏముదిరా? ఇంకా, ఇంకా, ఇంకా.. ఇంకా కావాలని పిస్తోంది. తనివి తీరడం లేదు. అయితే అప్పడే పర్సులో డబ్బులన్నీ అయిపోయాయి. లేకుంటేనా నాతో పాటు మా ఊరికి కూడా తీసుకుపోతా. అయితే చెడిపోతుందేమో. ఏమిటీ ఇలాంటి వాఖ్యానాలు అని ఆశ్చర్యపోకండి. ఇవన్నీ కర్నాటకలో వివిధ ప్రాంతాల్లో దొరికే విభిన్న ఆహార పదార్థాలు. వీటిలో కొన్ని హాట్ హాట్ గా ఉంటే మరికొన్ని తీయని రుచిని ఇస్తాయి. వాటి వివరాలను, అవి దొరికే ప్రాంతాలను మీ కోసం నేటివ్ ప్లానెట్ అనే విస్తరిలో వడ్డించి తీసుకొచ్చాం. మీదే ఆలస్యం ఒక సారి రుచి 'చూసేయండి'. అటు పై వివాహ భోనంబు అంటూ తీరిగ్గా పాటలు పాడుకోవచ్చు.

ఇక్కడ పడుకొంటే మీ ఇంట్లో ఆ చప్పుడు ఖచ్చితం

1. మైసూర్ పాక్

1. మైసూర్ పాక్

P.C: YouTube

తీపి పదార్థాలను ఇష్టపడే వారికి మైసూర్ పాక్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదనుకుంటా. చాలా ఏళ్లుగా ఈ తీపి పదార్థం కర్ణాటకతో పాటు భారత దేశీయులందరికీ ఇష్టమైన వంటకం. దీనిని మొదట మైసూరులోని రాజవంశీయులకు ప్రత్యేకంగా వండి వడ్డించేవారు. అందువల్లే దీనికి మైసూర్ పాక్ అని పేరు వచ్చింది. అటు పై సామాన్యులకు కూడా అది అందుబాటులోకి వచ్చింది. దేశంలోని మిగిలిన ప్రాంతల్లో మైసూర్ పాక్ దొరికినా కర్నాటకలోని రాచనగరి మైసూరులో దొరికే మైసూరుపాక్ రుచేవేరు.

2. దావణగెరె బెణ్ణె దోసె

2. దావణగెరె బెణ్ణె దోసె

P.C: YouTube

కర్నాటకలోని ఓ మోస్తారు హోటల్స్ లో బెణ్ణెదోసేను ప్రత్యేకంగా అతిథిలకు వడ్డిస్తారు. ఈ దోసెను దావణగెరెలో మొదటిసారి తయారు చేశారు. మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే ఇక్కడ బెణ్ణె దోసె రుచి చాలా బాగుంటుంది.

3.మద్దూరు వడ

3.మద్దూరు వడ

P.C: YouTube

సాయంకాలం స్నాక్స్ గా తినడానికి మద్దూరు వడ చాలా బాగుంటుంది. బియ్యం రవ్వకు మరికొన్ని దినుసులు కలిపి ఈ వడను తయారు చేస్తారు. మండ్యాలోని మద్దూరు అనే ప్రాంతంలో ఓ కుంటుంబం వారు మొదటిసారిగా ఈ వడను ప్రపంచానికి పరిచయం చేశారు.

4.జోళద రొట్టి

4.జోళద రొట్టి

P.C: YouTube

జొన్నతో రొట్టెలు తయారు చేసే విధానం ఈ దేశానికి పరిచయం చేసింది ఉత్తర కర్నాటకలోని ప్రజలు. ఇక్కడ జొన్నెరొట్టెలను చట్నీ లేదా కారంతో కలిపి తింటారు. మీరు కూడా ఎప్పుడైనా ఆ ప్రాంతానికి వెళ్లినప్పుడు తప్పక ఈ నాన్ ఫాటీ రొట్టెలను తినడం మరిచిపోవద్దు.

5.ధార్వాడ పేడ

5.ధార్వాడ పేడ

P.C: YouTube

ఇది కూడా ఒక తీపి పదార్థం. లైట్ బ్రౌన్ కలర్ లో ఉండే ఈ తీపి పదార్థం రుచి దేశ సరిహద్దులను దాటి విదేశాలకు కూడా పాకింది. కర్నాటకలోని దార్వాడకు వెళ్లి నప్పుడు ఈ తీపి పదర్థాం రుచి చూడటం మరిచిపోవద్దు.

6. మంగళూరు గోళిబజ్జి

6. మంగళూరు గోళిబజ్జి

P.C: YouTube

సాయంకాలం పూట స్నాక్స్ గా తినడానికి ఈ మంగళూరు గోళిబజ్జి చాలా బాగుంటుంది. మంగళూరులో మాత్రమే ఈ స్నాక్స్ బాగా ఫేమస్. అందువల్ల మంగళూరుకు వెళ్లినప్పుడు వివిధ రకాల చెట్నీలతో కలిపి మంగళూరు గోళి బజేను తినడం మరిచిపోవద్దు.

7. బిడిది తట్టె ఇడ్లీ

7. బిడిది తట్టె ఇడ్లీ

P.C: YouTube

నోట్లో వేసుకొంటూనే కరిగే పోయే తట్టి ఇడ్లీ ప్రస్తుతం కర్నాటకలో ప్రతి ప్రాంతంలోనూ దొరుకుతోంది. అయితే బెంగళూరు మైసూరు హైవే దారిలో వచ్చే బిడిదిలో దొరికే తట్టె ఇడ్లీ రుచి మరే ప్రాంతంలో దొరకదు. ముఖ్యంగా ఆలుతో చేసే సాగు, టమోటతో చేసిన చెట్నీతో తట్టె ఇడ్లీ తింటుంటే నా సామి రంగం...స్వర్గం కనిపిస్తుంది.

8. గోకాక్ కార్దంటు

8. గోకాక్ కార్దంటు

P.C: YouTube

ఇది ఒక తీపి పదార్థం. డ్రై ఫ్రూట్స్ కు స్వచ్ఛమైన నెయ్యిని చేర్చి దీనిని తయారు చేస్తారు. దీని ధర కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది. అయితే రుచి మాత్రం అమోఘం. కర్నాటకలోని గోకాక్ ప్రాంతంలో ఇది చాలా ఫేమస్. అందువల్లే దీనిని గోకాక్ కార్దంటు అంటారు.

9.నీర్ దోసే

9.నీర్ దోసే

P.C: YouTube

కర్నాటకలోని తీర ప్రాంత జిల్లాల్లో ఇది చాలా ఫేమస్. ముఖ్యంగా కోడి కూరతో నీర్ దోసె తినడం మరిచిపోలేని అనుభూతి. అందువల్ల మంగళూరు వంటి ప్రాంతాలకు వెళ్లినప్పుడు నీర్ దోసెను తినడం మరిచిపోకండి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X