• Follow NativePlanet
Share
» »ఇక్కడి రాళ్లకు రాసలీలు తెలుసు అంతేనా అనేక కథలు కూడా

ఇక్కడి రాళ్లకు రాసలీలు తెలుసు అంతేనా అనేక కథలు కూడా

Written By: Kishore

కర్నాటకలోని బాదామి, ఐహోలు, పట్టడకల్ ప్రాంతాలు ప్రస్తుతం రాజకీయంగా చాలా వేడిగా ఉన్నాయి. బాదిమిలో  కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అక్కడ నామినేషన్ దాఖలు చేయడమే కారణం. ఇప్పుడే కాదు గతంలో కూడా ఈ బాదామి రాజకీయంగా ఎంతో ప్రాముఖ్యం కలిగినది. చాళుక్యుల రెండో రాజధాని కూడా ఈ బాదామి. అందువల్లే వారిని బాదామి చాళుక్యులని పిలిచేవారు. బాదామిని రాజధానిగా చేసుకొని చాళుక్యులు దక్షిణ భారత దేశంలో చాలా ప్రాంతాలను పరిపాలించారు. వీరికి శిల్పికళ పై మక్కువ ఎక్కువ. అందువల్లే బాదామితో పాటు దగ్గరగా ఉన్న ఐహోలు, పట్టడకల్ ప్రాంతాల్లో అనేక సముదాయ దేవాలయాలు, గుహాలయాలను నిర్మింపజేశారు. ఆ దేవాలయాలు, గుహాలయాలో దేవాతా మూర్తుల విగ్రహాలు ఎంత బాగా చెక్కారో శృంగార భరిత శిల్పాలను కూడా అంతే మనోహరంగా చెక్కారు. ఈ మూడు ప్రాంతాల విశిష్టత మీ కోసం...

చలా 'మని'లోని ఈ 'కళావిపంచి'గురించి తెలుసా

1.బాదామి...

1.బాదామి...

Image Source:

ఇక్కడ చూడదగిన దేవాలయాల్లో ముఖ్యమైనది బనశంకరీ దేవి ఆలయం. ప్రస్తుతం కర్ణాటక, మహారాష్ట్రలోని ఎంతో మందికి కులదేవత అయిన బనశంకరి అమ్మవారు పూర్వం బాదామి చాళుక్యుల కుల దేవత.

2. ఎనిమిది చేతులు

2. ఎనిమిది చేతులు

Image Source:

ఇక్కడ అమ్మవారు ఎనిమిది చేతులు కలిగి సింహ వాహిని రూపంలో కనిపిస్తుంది. బాదామి చాళుక్యులకు పూర్వమే ఇక్కడ బనశంకరి ఆలయం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ దేవాలయాన్ని మొదట అభివ`ద్ధి చేసింది మాత్రం చాళుక్య రాజైన జగదేకమల్లుడు.

3. రాష్ట్రకూట రాజులు

3. రాష్ట్రకూట రాజులు

Image Source:

అటు పై రాష్ట్ర కూట రాజులు ఈ దేవాలయం అభివ`ద్దికి ఎంతగానో పాటు పడ్డారు. ప్రస్తుతం ఉన్న దేవాలయం విజయనగర రాజుల కాలంలో కట్టించబడినదని ఇక్కడి శాసనాల వల్ల తెలుస్తోంది.

4. పులకేశి నిర్మించాడు

4. పులకేశి నిర్మించాడు

Image Source:

ఈ దేవాలయం తర్వాత బాదామిలో చూడదగిన దేవాలయం మహాబలేశ్వర దేవాలయం. ఇది బాదిమిలోనే అత్యంత విశాలమైన దేవాలయం దీనిని చాళుక్యరాజైన మొదటి పులకేశి నిర్మించాడు.

5.రెండు సమాధులు

5.రెండు సమాధులు

Image Source:

దీనిని మహాకూటమిగా పేర్కొంటారు. ఇక్కడ పదుల సంఖ్యలో దేవాలయాలు ఉన్నాయి. ఈ మహాకూటమికి దగ్గర్లోనే శివయోగ మందిరం ఉంది. ఇక్కడ శివుడు ప్రధాన దైవం. ఈ దేవాలయానికి సమీపంలో రెండు సమాధులు ఉన్నాయి.

6. అతీత శక్తులు

6. అతీత శక్తులు

Image Source:

ఒకటి కుమారస్వామిజీ హనగల్, మరొకటి సదాశివ స్వామిజీది. వీరికి అత్యంత అతీత శక్తులు ఉన్నాయని చెబుతారు. చెబుతారు. ఈ సమాధుల సందర్శన వల్ల మన కష్టాలన్నీ తీరుతాయని స్థానికులు చెబుతుంటారు.

7. భూత నాథ ఆలయం

7. భూత నాథ ఆలయం

Image Source:

ఈ బాదామిలో చూడదగిన మరో ఆలయం భూతనాథ ఆలయం. పెద్ద సభా మంటపంతో కూడా ఈ ఆలయం భారతీయ శిల్ప కళకు నెలవు. కొండలమధ్య ఉన్న అగస్త తీర్థంలో నీరు ఎప్పుడూ చల్లగా ఉంటుంది.

8. వాతాపిని సంహరించింది ఇక్కడే

8. వాతాపిని సంహరించింది ఇక్కడే

Image Source:

ఇక్కడే అగస్త మహాముని వాతాపి అనే రాక్షసుడి సంహరించినట్లు పురాణ కథనం. బాదామిలోని రాతి గుహలను చూడాల్సిందే. ఇక్కడ ముఖ్యంగా నాలుగు గుహాలయాలు ఉంటాయి.

9. 18 చేతులతో నటరాజు

9. 18 చేతులతో నటరాజు

Image Source:

మొదటి గుహాలయాన్ని శైవ గుహ అంటారు. ఇక్కడ నటరాజమూర్తి 18 చేతులతో పద్మం పై నాట్యం చేస్తన్నట్లు కనిపిస్తాడు. ఇక్కడ ప్రథమగణాలకు చెందిన అనేక విగ్రహాలను మనం చూడవచ్చు.

10. వామనావతారం

10. వామనావతారం

Image Source:

దశావతరాంలో ఐదవ అవతారం అయిన వామనావతారాన్ని చెక్కారు. దీనిలో బలిచక్రవర్తి విగ్రహం కూడా చూడముచ్చటగా ఉంటుంది. మూడోది కూడా విష్ణు గుహ కాగా, నాలుగో గుహలో జైన తీర్థాకరుల విగ్రహాలు కనిపిస్తాయి.

11.ఐహోలె

11.ఐహోలె

Image Source:

గుహలన్నీంటిని చూసిన తర్వాత బాదామి కోటను కూడా చాలా మంది పర్యాటకులు ఆసక్తిగా చూస్తుంటారు. మహాకూటమికి 25 కిలోమీటర్ల దూరంలో ఐహోలె ఉంటుంది. ఇది కూడా అనేక ఆలయాల సముదాయం.

12. మ్యూజియం కూడా

12. మ్యూజియం కూడా

Image Source:

వీటిలో దర్గాదేవి దేవాలయం, లాడ్ ఖాన్ దేవాలయం ముఖ్యమైనవి. అంతే కాకుండా ఇక్కడ ఒక మ్యూజియం కూడా ఉంది. అందులో ఈ ప్రాంతాన్ని పాలించిన రాజులు, రాజ్యాలకు చెందిన శాసనాలు ఇక్కడ భద్రపరిచబడ్డాయి.

13. మలప్రభ నదీ తీరంలో

13. మలప్రభ నదీ తీరంలో

Image Source:

ఇక్కడి మలప్రభ నదీ తీరంలో గండ్రగొడ్డలి ఆకారంలో ఒక రాయి ఉంది. దీనిని పరుశరామ ఆయుధంగా చెబుతారు. క్షత్రియులను వధించిన తర్వాత తన ఆయుధమైన గండ్ర గొడ్డలిని ఇక్కడ కడగడం వల్ల ఈ ప్రాంతమంతా ఎర్రగా మారిందని చెబుతారు.

14. పాదం గుర్తులు

14. పాదం గుర్తులు

Image Source:

ఇదే నది ఒడ్డున ఉన్న రాతి పై పాదం గుర్తులు పరుశరాముడివని స్థానికులు చెబుతుంటారు. ఈ ఐహోలు ప్రాంతంలో సుమారు 120కి పైగా హిందూ, జైన, బౌద్ధ దేవాలయాలు ఉంటాయి.

15. పట్టడకల్

15. పట్టడకల్

Image Source:

ఐహోలెకు 13 కిలోమీటర్ల దూరంలో పట్టడకల్ ఉంటుంది. ఇక్కడ మొత్తం పది ఆలయాలు ఉంటాయి. వీటలో ఎనిమిది ఒక కూటమిగా ఒకే చోట ఉండగా పాపనాథ ఆలయం, జైన నారాయణ ఆలయం చెరో దిక్కుగా రెండు కిలోమీటర్ల పరిధిలో ఉంటాయి.

16. రెండో విక్రమాదిత్యుడి

16. రెండో విక్రమాదిత్యుడి

Image Source:

ఈ ఆలయాలన్నీ రెండో విక్రమాదిత్యుడి కాలానికి చెందినవని చరిత్రకారులు గుర్తించారు. ఈ పది ఆలయాల్లో విరూపాక్ష ఆలయం, మల్లికార్జున ఆలయాలు చూడదగినవి. విరూపాక్ష ఆలయానికి దగ్గరగా ఉన్న నంది విగ్రహం చూడముచ్చటగా ఉంటుంది.

17. 18 రాతి స్తంభాలు

17. 18 రాతి స్తంభాలు

Image Source:

విరూపాక్ష ఆలయం, మల్లికార్జున ఆలయం 18 రాతి స్తంభాలతో అద్భుతంగా నిర్మించారు. వీటి పై ఉన్న శిల్పాలు భారతీయ శిల్పకళకు అద్ధం పడుతాయి.

18. సంగమేశ్వర ఆలయం

18. సంగమేశ్వర ఆలయం

Image Source:

ఐహోలెకు 35 కిలోమీటర్ల దూరంలో క`ష్ణా, ఘటప్రభ, మలప్రభ నదులు కలిసే సంగమం ఉంది. ఇక్కడ ప్రముఖ శైవ దేవాలయమైన కూడల సంగమేశ్వర ఆలయం ఉంది.

19. బసవేశ్వరుడు జన్మించింది

19. బసవేశ్వరుడు జన్మించింది

Image Source:

దీనిని 12 శతాబ్దంలో నిర్మించినట్లు తెలుస్తుంది. పరమ శివభక్తుడు బసవేశ్వరుడు జన్మించింది ఇక్కడే. ఆయన సమాధిని కూడా మనం ఇక్కడ చూడవచ్చు.

20. ఎక్కడ ఉంది. ఎలా వెళ్లాలి

20. ఎక్కడ ఉంది. ఎలా వెళ్లాలి


Image Source:

కర్నాటకలోని బాగల్ కోటే జిల్లాలో బాదామి, పట్టడకల్ ఉన్నాయి. బాదామికి దగ్గరగా హుబ్లీ విమానాశ్రయం ఉంది. బాదామి నుంచి హుబ్లీకు 84 కిలోమీటర్లు. అక్కడి నుంచి ప్రైవేటు ట్యాక్సీల ద్వారా వెళ్లవచ్చు. అదే విధంగా బాదామికి భారతదేశంలోని పలు ప్రాంతాల నుంచి నేరుగా రైలు సౌకర్యం ఉంది. అదే విధంగా పలు పట్టణాల నుంచి బాదామికి నేరుగా బస్సు సౌకర్యం ఉంది. అక్కడి నుంచి పట్టడకల్, ఐహోల్ దగ్గరగా ఉంటాయి.

పర్యాటకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి
పర్యాటక చిట్కాలు, పర్యాటకానికి సంబంధించిన కథాలు తక్షణం పొందండి