Search
  • Follow NativePlanet
Share
» »రామాయణ కాలానికి రైలులో చలో చలో

రామాయణ కాలానికి రైలులో చలో చలో

రామాయణ కాలంలో పేర్కొన్న ప్రాంతాలకు సంబంధించిన కథనం.

భారత దేశంలో రామాయణానికి ప్రత్యేక స్థానం ఉంది. రామాయణ కాలానికి చెందిన ఎన్నో ప్రాంతాలు ఇప్పటికీ మన భారత దేశంలో నలుదిశలా వ్యాపించి ఉన్నాయి. రామాయణానికి విడదీయరాని సంబంధం ఉంది. రామయణం భారత దేశంలోని అయోద్యలో మొదలై శ్రీలంకలోని లంకలోని రామరావణ యుద్ధంతో దాదాపు ముగిసినట్లు చెప్పవచ్చు.

రామాయణంలో ప్రముఖ పాత్రలైన శ్రీరాముడు, లక్ష్మణుడు, సీత, రావణుడు, విభీషణుడు సంబంధించిన ప్రాంతాలు అటు భారత దేశంతో పాటు ఇటు శ్రీలంకలో కూడా ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రాలుగా, పర్యాటక స్థలాలుగా మారిపోయాయి. అక్కడికి సులభంగా రైలులో ఎలా చేరుకోవచ్చో ఈ కథనంలో చూదాం.

రామాయణంలో పేర్కొన్న ప్రాంతాలు

రామాయణంలో పేర్కొన్న ప్రాంతాలు

P.C: You Tube

రామాయణంలో పేర్కొన్నే ముఖ్యమైన ప్రదేశాలన్నింటినీ ఒకే యాత్రలో చూసివచ్చే అవకాశాన్ని భారత రైల్వే శాఖ కల్పిస్తోంది. అందుకోసం శ్రీరామాయణ ఎక్స్ ప్రెస్ రైలును నడపనున్నట్లు రైల్వే శాఖ అధికారికంగా ప్రకటించింది.

నవంబర్ 14న

నవంబర్ 14న

P.C: You Tube

నవంబర్ 14న ఈ రైలు ఢిల్లీలో ప్రారంభమవుతుంది. అటు పై అయోధ్యలోని గర్హి రామ్ కోట్, కనక్ భవన్, ఆయాల సందర్శన తర్వాత నందిగ్రామ్, సతామర్హి, జనక్ పూర్, వారణాసి, ప్రయాగ, శ్రింగ్ వర్పూర్, చిత్రకూట్, హంపి, నాసిక్ ల మీదుగా రామేశ్వరం చేరుకొంటుంది.

16 రోజుల పాటు

16 రోజుల పాటు

P.C: You Tube

ఈ యాత్రం మొత్తం 16 రోజుల పాటు సాగుతుంది. ఒక్కొక్క వ్యక్తికి రూ.15,120 చెల్లించాల్సి ఉంటుంది. ఈ సొమ్ముతోనే భోజన సదుపాయాలు, వసతి సౌకర్యం కల్పించనున్నారు. ఈ స్పెషల్ ట్రైన్ లో యాత్రికులకు అవసరమైన సదుపాయాలు కల్పించడానికి వీలుగా టూర్ మేనేజర్ తో పాటు మరికొంత మంది సిబ్బంది కూడా ఉంటారు.

మొత్తం 800 మంది

మొత్తం 800 మంది

P.C: You Tube

మొత్తం 800 మంది ప్రయాణించడానికి వీలుంటుంది. ఇదిలా ఉండగా భారత దేశంలో పాటు శ్రీలంకలో కూడా రామాయణంతో ముడిపడిన ప్రదేశాలను చూడాలనుకొనేవారు రూ.15,120 కు అదనంగా మరో రూ.47,500 చెల్లించాల్సి ఉంటుంది.

విమానంలో శ్రీలంకకు

విమానంలో శ్రీలంకకు

P.C: You Tube

శ్రీలంకకు విమానంలో పర్యాటకులను తీసుకువెలుతారు. శ్రీలంకలో మొత్తం పర్యాటన 5 రోజులు. ఈ ఐదు రోజుల్లో కండీ, నువారా, ఎలియా, కొలంబో, నీగోమ్బెలను సందర్శించడానికి వీలుకల్పిస్తారు. ఈ రెండు ప్యాకేజీలకు సంబంధించిన టికెట్లు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పోరేషన్ (ఐఆర్సీటీసీ) వెబ్ సైట్ ద్వారా అందుబాటులో ఉంచనున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X