Search
  • Follow NativePlanet
Share
» »కోణార్క్ నృత్యోత్సవం చూసొద్దాం

కోణార్క్ నృత్యోత్సవం చూసొద్దాం

కోణార్క్ డ్యాన్స్ ఫెస్టివల్ కు సంబంధించిన కథనం.

సంప్రదాయ నృత్య కళాకారులు తమ నాట్య ప్రతిభను ప్రదర్శించాలని తహతహలాడే సమయం ఆసన్నమవుతోంది. ఇందు కోసం ఒక వైపు ఒడిషా ప్రభుత్వం కార్యకలాపాలలను ఇప్పటికే మొదలు పెట్టగా మన రైల్వే శాఖ కూడా అక్కడికి పర్యాటకులను తీసుకువెళ్లడానికి వీలుగా ప్రత్యేక ప్యాకేజీని అందుబాటులోకి తీసుకువస్తోంది. ఇందుకు సంబంధించిన వివరాలు...

కోణార్క్ నృత్యోత్సవం చూసొద్దాం

కోణార్క్ నృత్యోత్సవం చూసొద్దాం

P.C: You Tube

ఒడిషా ప్రభుత్వం నృత్యకారుల ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేసే ఉద్దేశంతో 1986 నుంచి కోణార్క్ అంతర్జాతీయ డాన్స్ ఫెస్టివల్ ను నిర్వహిస్తోంది. ప్రతి ఏడాది డిసెంబర్ 1 నుంచి ఐదు రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగుతాయి.

కోణార్క్ నృత్యోత్సవం చూసొద్దాం

కోణార్క్ నృత్యోత్సవం చూసొద్దాం

P.C: You Tube

ఈ ఉత్సవాల్లో పాల్గొనడానికి దేశంలోని ప్రఖ్యాత నృత్య కళాకారులు తహతహలాడుతూ ఉంటారు. ఈ ఉత్సవాల్లో ఎంపిక చేసిన వారికి మాత్రమే వేదిక పై తమ నాట్య ప్రతిభను ప్రదర్శించే అవకాశం ఉంటుంది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన పర్యాటక ప్రాంతం కోణార్క్ సూర్య దేవాలయం వద్ద ఈ ఉత్సవాలు జరుగుతాయి.

కోణార్క్ నృత్యోత్సవం చూసొద్దాం

కోణార్క్ నృత్యోత్సవం చూసొద్దాం

P.C: You Tube

అదే సమయంలో అంతర్జాతీయ శాండ్ ఫెస్టివల్ కూడా జరుగుతుంది. ఇందులో ఇసుకతో కళాఖండాలను తయారు చేసే కళాకారులు పాల్గొంటారు. ఈ ఉత్సవంలో పాల్గొనడానికి విదేశీ కళాకారులు కూడా వస్తుంటారు. ఇంతటి విశిష్టమైన ఉత్సవంలో పాల్గొనడానికి దేశంలోని పర్యాటకులే కాకుండా విదేశీయులు సైతం ఎక్కువ సంఖ్యలో వస్తుంటారు. వీరిని ఈ ఉత్సవానికి తీసుకువెళ్లడానికి వీలుగా భారత రైల్వే శాఖ ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది.

కోణార్క్ నృత్యోత్సవం చూసొద్దాం

కోణార్క్ నృత్యోత్సవం చూసొద్దాం

P.C: You Tube

హైదరాబాద్ నుంచి ఈ రైలు నవంబర్ 30న బయలు దేరుతుంది. ఇక మూడు రాత్రులు నాలుగు పగళ్లు ఉండే ఈ పర్యాటకంలో కోణార్క్ డ్యాన్స్ ఫెస్టివల్ తో పాటు భువనేశ్వర్, పూరి, చిల్కా సరస్సు, కోణార్క్ పర్యాటక ప్రాంతాలను చూపిస్తారు. పెద్దలకు ఒక్కొక్కరికి రూ.23,190 ధర నిర్ణయించారు. ఇద్దరు కలిసి బయలు దేరితే రూ. ఒక్కొక్కరికి రూ.16,515, ముగ్గురు బయలు దేరితే రూ.15,405 చెల్లించాల్సి ఉంటుంది.

కోణార్క్ నృత్యోత్సవం చూసొద్దాం

కోణార్క్ నృత్యోత్సవం చూసొద్దాం

P.C: You Tube

పిల్లలకు ఒక్కొక్కరికి (5 నుంచి 11 ఏళ్లు) రూ.13,180 చెల్లించాలి. మరిన్ని వివరాల కోసం ఐఆర్సీటీసీ వెబ్ సైట్ www.irctctourism.com ను సంప్రదించవచ్చు. ఫోన్ నంబర్లు 040 27702407, 23400606 (హైదరాబాద్), 0866 2572280 (విజయవాడ) 9701376620 (తిరుపతి).

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X