Search
  • Follow NativePlanet
Share
» »తిరుపతి కాదు అయినా వేంకటేశ్వరుడు వెలిసిన గుహాలయం ఇది, 350 ఏళ్ల నుంచి...

తిరుపతి కాదు అయినా వేంకటేశ్వరుడు వెలిసిన గుహాలయం ఇది, 350 ఏళ్ల నుంచి...

జూపూడి లోని వేంకటేశ్వర దేవాలయం గురించి కథనం.

కృష్ణా నదీ తీరంలో ఉన్న ఓ చిన్న కొండ పై ఉన్న గుహలో ఓ దేవాలయం ఉంది. ఇక్కడ కలియుగ దైవమైన శ్రీ వేంకటేశ్వరుడు స్వయంభువుగా కొలువై ఉన్నాడు. ఆ గుహ చాలా చిన్నదిగా ఉంటుంది. దాదాపు 350 ఏళ్ల క్రితం నుంచి క్రమం తప్పకుండా అక్కడ దీపారాధన జరుగుతూ ఉంది.

ఇంత విశిష్టమైన గుహాలయం గురించి బయటి ప్రపంచానికి తెలియజెప్పినది ఎవరో కాదు సాక్షాత్తు ఆ వేంకటేశ్వరుడే. అయితే సరైన ప్రచారం లేకపోవడం వల్ల ఆ దేవాలయం అంతగా ప్రాధాన్యత చెందలేదు.

అయితే స్థానికులకు మాత్రం ఈ దేవాలయంలోని స్వామి కొంగు బంగారమై విరాజిల్లుతున్నాడు. ఇక్కడ స్వామివారిని కోరిన కోర్కె తప్పక తీరుతుందని ప్రజల నమ్మకం. ఇంతటి విశిష్టమైన దేవాలయానికి సంబంధించిన పూర్తి కథనం మీ కోసం

కృష్ణా నదీ తీరంలో

కృష్ణా నదీ తీరంలో

P.C: You Tube

పూర్వం జూపూడి గ్రామంలో కృష్ణా నదీ తీరంలో ఇసుక తిన్నల పై కొంతమంది పిల్లలు ఆడుకొంటూ ఉండేవారు. అదే సమయంలో ఎక్కడి నుంచో ఓ పిల్లవాడు వచ్చి తనను కూడా ఆటలో చేర్చుకోవాల్సిందిగా స్థానిక పిల్లలను అడిగారు.

ఒక పిల్లవాడు కనిపించి

ఒక పిల్లవాడు కనిపించి

P.C: You Tube

అందుకు అంగీకరించిన పిల్లలు తాము ఆడే అన్ని ఆటల్లో ఆ పిల్లవాడికి కూడా స్థానం కల్పించేవారు. అయితే ఆ పిల్లవాడు ఏ వైపున ఉంటే అదే బ`ందం ఆటల్లో గెలిచేది. ఇది సహించలేని ఓ పిల్లవాడు మరికొంతమందితో కలిసి ఆ పిల్లవాడిని కొట్టడానికి పోయాడు.

శ్రీగిరి పర్వతం వద్దకు

శ్రీగిరి పర్వతం వద్దకు

P.C: You Tube

దీంతో ఆ పిల్లవాడు వారికి దొరక కుండా దగ్గర్లోనే ఉన్న శ్రీ గిరి పర్వతం దగ్గరకు వెళ్లాడు. అయినా పట్టువిడవని ఆ ఆకతాయి పిల్లలు ఆ పిల్లవాడి పై రాళ్లు రువ్వడానికి ప్రయత్నించారు. ఇంతలో ఆ బాలుడు నామాలు ధరించిన వామనుడి రూపంలో కనిపించాడు.

గ్రామ పెద్దలు

గ్రామ పెద్దలు

P.C: You Tube

తాను వేంకటేశ్వరుడినని ఈ గిరి పైనే ఉంటానని చెప్పి అక్కడి నుంచి అంతర్థానమై పోయారు. దీంతో పిల్లలు ఆశ్చర్యపోయి జరిగిన విషయాన్ని తమ గ్రామ పెద్దలతో చెప్పారు. దీంతో గ్రామ పెద్దలు పిల్లలు చెప్పిన విషయానికి ప్రాధాన్యత లేదని భావించి మిన్నకుండిపోయారు.

జమీందారు రాజా వాసిరెడ్డి

జమీందారు రాజా వాసిరెడ్డి

P.C: You Tube

ఇదిలా ఉండగా ఈ ఘటన జరిగిన రోజు రాత్రే ఆ ప్రాంత జమీందారు రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడి కలలో వేంకటేశ్వరుడు కనిపించాడు. తాను జూపూడి గ్రామంలోని శ్రీ గిరి పై వెలిసి ఉన్నానని చెప్పి అంతర్థానమయ్యాడు.

అక్కడ వారికి కనిపించలేదు

అక్కడ వారికి కనిపించలేదు

P.C: You Tube

దీంతో ఉదయం రాజావాసిరెడ్డి తన కల గురించి తన సహాయకులకు చెప్పి శ్రీ గిరి పర్వతం పై వేంకటేశ్వరుడు ఎక్కడ ఉన్నడో తెలుసుకొని రావాల్సిందిగా పంపాడు. అయితే వారికి అక్కడ ఎటువంటి విగ్రహం కనపడలేదు.

మరలా కలలో కనపడి

మరలా కలలో కనపడి

P.C: You Tube

దీంతో సహాయకులు వెనక్కు వచ్చి జరిగిన విషయం మొత్తం తెలిపాడు. దీంతో రాజావారు కూడా మిన్నకుండి పోయారు. అయితే మరో వారం గడిచిన తర్వాత స్వామివారు మరలా రాజావాసిరెడ్డి వెంకటాద్రి నాయుడి కలలో కనిపించి తాను నిన్ను రమ్మంటే నీ పరివారాన్ని ఎందుకు పంపించావని ప్రశ్నించాడు.

తనకు తోవ చూపించాల్సిందిగా

తనకు తోవ చూపించాల్సిందిగా

P.C: You Tube

కేవలం నీవు వస్తేనే తాను దర్శనమిస్తానని చెప్పాడు. దీంతో రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు స్వయంగా ఆ శ్రీ గిరి వద్దకు వెళ్లి తనకు తోవ చూపించాల్సిందిగా ఆ వేంకటేశ్వరుడిని వేడుకొన్నాడు.

కొండ పైన ఉన్న గుహ వద్ద

కొండ పైన ఉన్న గుహ వద్ద

P.C: You Tube

దీంతో కరుణించిన వేంకటేశ్వరుడు ఒక చిన్న బాలుడి రూపంలో అక్కడికి వచ్చి కొండ పైన ఉన్న గుహను చేరుకొని అద`శ్యమయ్యాడు. ఆ బాలుడి వెంటవెళ్లిన రాజా వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడుకి అక్కడ స్వయంభువుగా వెలిసిన శ్రీ వేంకటేశ్వరుడి విగ్రహం కనిపించింది.

16 ఎకరాల భూమి

16 ఎకరాల భూమి

P.C: You Tube

దీంతో ఆయన అక్కడ ఆలయ నిర్మాణంతో పాటు ధూప, దీప నైవేద్యాల కోసం 16 ఎకరాల 64 సెంట్ల భూమిని కానుకగా ఇచ్చాడని చెబుతారు. ఈ ఘటన జరిగి దాదాపు 350 ఏళ్లు అవుతోంది. అప్పటి నుంచి ఇక్కడ నిత్యం ధూప, దీప నైవేద్యం తదితర పూజాది కార్యక్రమాలు క్రమం తప్పకుండా జరుగుతూనే ఉన్నాయి.

100 మెట్లు

100 మెట్లు

P.C: You Tube

ఇక శ్రీగిరి మీద ఉన్న ఆ ఆలయాన్ని చేరకోవడానికి దాదాపు 100 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. అక్కడ ఒక ధ్వజ స్తంభం కనిపిస్తుంది. దానికి ఎదురుగా చిన్న గది కనిపిస్తుంది. అదే ఆలయ ముఖద్వారం. దాని గుండా వెలితే ఒక చిన్న గుహ కనిపిస్తుంది.

చాలా చిన్నగా

చాలా చిన్నగా

P.C: You Tube

అక్కడ ఆదిశేషు, శంఖం, చక్రం గోడలో ఉబ్బెత్తుగా దర్శనమిస్తాయి. అంతకు మించి స్వామి రూపం ఏమీ కనిపించదు. గుహ చాలా సన్నాగా ఉంటుంది. ఒకరు వెళ్లడానికి మాత్రమే అవకాశం ఉంటుంది. అందువల్ల పూజారి పూజ చేసి బయటికి వచ్చిన తర్వాత మాత్రమే స్వామివారి దర్శనం చేసుకోవచ్చు.

కళ్యాణం వైభవంగా

కళ్యాణం వైభవంగా

P.C: You Tube

వైశాఖ శుద్ధ చతుర్దశినాడు స్వామివారి కళ్యాణం అతి వైభవంగా జరుగుతుంది. శనివారం నాడు ఎక్కువ మంది భక్తులు వస్తారు. ప్రస్తుతం ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ ఆధ్వరయంలో ఉంది. ఈ ఆలయ పరిసర ప్రాంతలను అభివ`ద్ధి చేయాలని స్థానిక ప్రజలు కోరుకొంటున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X