Search
  • Follow NativePlanet
Share
» »పౌర్ణమి అర్థరాత్రి పూజలు జరిపించుకొనే కాలభైరవుడిని దర్శిస్తే అనారోగ్య రుణ, భాధల నుంచి విముక్తి

పౌర్ణమి అర్థరాత్రి పూజలు జరిపించుకొనే కాలభైరవుడిని దర్శిస్తే అనారోగ్య రుణ, భాధల నుంచి విముక్తి

హిందూమతంలో దైవారాధన తరతరాలుగా వస్తోంది. ఇందులో కొంతమంది దేవతలు అత్యంత శక్తిశాలి, ప్రభావశాలి దేవతలు, శాంతి స్వరూపులు. వారి ఆకారం అందుకు తగ్గట్టుగానే ఉంటుంది. అయితే మరికొంతమంది దేవతలు రౌద్రంగా, భయంకరంగా ఉంటారు. ముఖ్యంగా భద్రకాళి, ప్రత్యాంగిరా దేవి, రుద్ర, కాళభైరవ మొదలైన వారు.

ఈ దేవతల ఆకారం చూడటానికే కాదు వారి పూజలు కూడా ఒళ్లు గగుర్పాటుకు గురిచేసేలా, విస్మయం గొలిపేలా ఉంటాయి. ఆ విధంగా పూజలు చేస్తేనే వారికి సంతృప్తి కలిగి మనం కోరిన కోర్కెలు తీరుస్తారని భక్తులు నమ్ముతారు.

ఈ పూజలు యాగాలు చాలా వరకూ క్షుద్ర, తాంత్రి, వామాచార తదితర విధానాలుగా ఉంటాయి. ఈ నేపథ్యంలో కేవలం అర్థరాత్రిలోనే పూజలు జరిపించుకునే ఓ భైరవ దేవాలయం, అందుకు సంబంధించిన కారణాలు, అలా పూజలు చేయడం వల్ల కలిగే లాభాలు తదితర వివరాలన్నీ మీ కోసం...

శివుడి అత్యంత ఉగ్రరూపం

శివుడి అత్యంత ఉగ్రరూపం

P.C: You Tube

1. భైరవుడు శివుడి అత్యంత ఉగ్రరూప అవతారంగా మన పురాణాలు చెబుతాయి. ఇక మన పురాణాల ప్రకారం ఈ భైరవుడికి ఎనిమిది రూపాలు ఉంటాయి.

శివుడి అత్యంత ఉగ్రరూపం

శివుడి అత్యంత ఉగ్రరూపం

P.C: You Tube

ఈ ఎనిమిది మంది ఎనిమిది దిక్కులకు అధిపతులు. ఇక ప్రధానమైన ఎనిమిది మంది భైరవులకు మొదటే ఒక్కొక్క దిక్కును కేటాయిస్తారు.

శివుడి అత్యంత ఉగ్రరూపం

శివుడి అత్యంత ఉగ్రరూపం

P.C: You Tube

అదే విధంగా ఒక్కొక్క భైరవుడి కింద మరో ఎనిమిది మంది ఉప భైరవులు ఉంటారు. ఈ ఎనిమిదిమంది ఉప భైరవులు తమ నాయకుడి ఆధీనంలో ఉంటారు.

శివుడి అత్యంత ఉగ్రరూపం

శివుడి అత్యంత ఉగ్రరూపం

P.C: You Tube

5. తమ పరిధిలో జరిగే ప్రతి చర్యను వారు తమ నాయకుడికి తెలియజేసి ఆయన ఆదేశాలమేరకు ఆ క్రియకు సంబంధించిన ప్రతి క్రియలో పాలుపంచుకొంటారు.

శివుడి అత్యంత ఉగ్రరూపం

శివుడి అత్యంత ఉగ్రరూపం

P.C: You Tube

ఇక ఎనిమిది మంది భైరువులకు వేర్వేరుగా దేవాలయాలు ఉంటాయి. అయితే ఎనిమిదిమందికి కలిపి ఒకే చోట దేవాలయం ఉండటం చాలా అత్యంత అరుదైన విషయం.

శివుడి అత్యంత ఉగ్రరూపం

శివుడి అత్యంత ఉగ్రరూపం

P.C: You Tube

భారత దేశంలో ఇటువంటి దేవాలయాలు కేవలం రెండు చోట్ల మాత్రమే ఉన్నాయి. ఒక దేవాలయం ఉత్తరప్రదేశ్ లోని కాశీలో ఉంది. అదేవిధంగా మరో దేవాలయం దక్షిణ భారత దేశ రాష్ర్టమైన తమిళనాడులోని సేలం వద్ద ఉంది.

శివుడి అత్యంత ఉగ్రరూపం

శివుడి అత్యంత ఉగ్రరూపం

P.C: You Tube

అందువల్లే ఒక్క తమిళనాడు నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, కేరళ, మహారాష్ట్ర, తెలంగాణ తదితర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడకు భైరవ పూజలు చేసే భక్తులు ఎక్కువ సంఖ్యలో వస్తారు.

శివుడి అత్యంత ఉగ్రరూపం

శివుడి అత్యంత ఉగ్రరూపం

P.C: You Tube

ఇక ఈ దేవాలయంలో అసితంగ, కాల, కపాల, క్రోధ, రుద్ర, రురు, సంహార, ఉన్మత్త పేర్లతో ఎనిమిది మంది ప్రధాన భైరవులు కొలువై ఉన్నారు.

శివుడి అత్యంత ఉగ్రరూపం

శివుడి అత్యంత ఉగ్రరూపం

P.C: You Tube

ప్రతి నెల అష్టమి తర్వాత వచ్చే పౌర్ణమి అర్థరాత్రి మాత్రమే ఇక్కడ ప్రత్యేక జూలు నిర్వస్తారు. ఆ రోజున ఇక్కడ పూజలు నిర్వహించడానికి దక్షిణ భారత దేశం నలుమూలల నుంచి వేల సంఖ్యలో భక్తులు ఇక్కడకు వస్తారు.

శివుడి అత్యంత ఉగ్రరూపం

శివుడి అత్యంత ఉగ్రరూపం

P.C: You Tube

ఆ అర్థరాత్రి సమయంలో భైరవుడికి జరిగే పూజలు కొంత భయం కలిగించేవిగా ఉన్నా ఇందులో పాల్గొంటే అలౌకిక ఆధ్యాత్మికతకు లోనవుతామని భక్తులు నమ్ముతారు.

శివుడి అత్యంత ఉగ్రరూపం

శివుడి అత్యంత ఉగ్రరూపం

P.C: You Tube

ఇక్కడి పూజారులతో పాటు ఈ దేవాలయానికి తరుచుగా వచ్చే భక్తులు చెప్పే దాన్ని బట్టి పౌర్ణమి రోజు జరిగే ప్రత్యేక పూజలో పాల్గొనడం వల్ల కోరిన కోర్కెలననీ నెరవేరుతాయి.

శివుడి అత్యంత ఉగ్రరూపం

శివుడి అత్యంత ఉగ్రరూపం

P.C: You Tube

ముఖ్యంగా అనారోగ్య సమస్యలతో రుణ, ఆర్థిక పరమైన ఇబ్బందులు తొలిగిపోతాయని భక్తుల గట్టినమ్మకం. దక్షిణ భారత దేశంలోనే కాకుండా భారత దేశం మొత్తం మీద ఇలా అర్థరాత్రి తర్వాత పూజలు నిర్వహించే దేవాలయం ఇదొక్కటే.

శివుడి అత్యంత ఉగ్రరూపం

శివుడి అత్యంత ఉగ్రరూపం

P.C: You Tube

ఇక స్థల పురాణం ప్రకారం ఇక్కడే మన్మథుడు తన బాణం ద్వార శివుడి తపస్సుకు భంగం కలిగించాడని చెబుతారు. అందువల్ల ఇక్కడ శివుడు కూడా ప్రధాన దైవమే. ఆ పరమశివుడిని ఇక్కడ కామనదీశ్వరుడి అనే పేరుతో పూజిస్తారు.

శివుడి అత్యంత ఉగ్రరూపం

శివుడి అత్యంత ఉగ్రరూపం

P.C: You Tube

ఇక ఇటువంటి అష్ట భైరవ దేవాలయాన్ని మనం కాశీ తర్వాత ఇక్కడ మాత్రమే చూడగలం. వశిష్ట నదీ తీరంలో ఉన్న ఈ దేవాలయం అత్యంత మహిమాన్వితమైనదని నమ్ముతారు.

శివుడి అత్యంత ఉగ్రరూపం

శివుడి అత్యంత ఉగ్రరూపం

P.C: You Tube

ఇక మార్చ్-ఏప్రిల్ మధ్యన సూర్యోదయం అయిన తక్షణం ఆ సూర్య కిరణాలు మొదట ఈ దేవాలయంలోని శివలింగాన్ని తాకుతాయి. ఆ రోజును స్థానికంగా పంగుణి ఉత్తిరమ్ అని పిలుస్తారు.

శివుడి అత్యంత ఉగ్రరూపం

శివుడి అత్యంత ఉగ్రరూపం

P.C: You Tube

ఏడాదికి ఒకసారి మాత్రమే కనిపించే అరుదైన సన్నివేషం చూడటానికి దక్షిణ భారత దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తారు.

శివుడి అత్యంత ఉగ్రరూపం

శివుడి అత్యంత ఉగ్రరూపం

P.C: You Tube

ఈ దేవాలయాన్ని పదమూడవ శతాబ్దంలో నిర్మించినట్లు స్థానిక శాసనాల ద్వారా తెలుస్తోంది. మూడు వరుసల్లో ఆలయ గోపురాలు ఉండటం విశేషం. ఈ గోపురాల పై కాల భైరవుడిని చూడవచ్చు.

శివుడి అత్యంత ఉగ్రరూపం

శివుడి అత్యంత ఉగ్రరూపం

P.C: You Tube

అత్యంత అరుదైన ఈ దేవాలయం సేలం జిల్లాలోని అరళగూరు అనే గ్రామంలో ఉంది. ఇది తలైవసల్ అనే పట్టణం నుంచి కేవలం ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

శివుడి అత్యంత ఉగ్రరూపం

శివుడి అత్యంత ఉగ్రరూపం

P.C: You Tube

సేలం నుంచి అష్టభైరవ దేవాలయం 75 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. తలైవసల్ అనే పట్టణం నుంచి ఈ అష్ట భైరవ దేవాలయానికి మినీ బస్సులు, ఆటోలు ఎక్కువ సంఖ్యలో ఉంటాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X