Search
  • Follow NativePlanet
Share
» »కమండల గణపతి తీర్ధం: బ్రహ్మనదిలో స్నానం చేస్తే శనిదోషం తొలగిపోతుంది

కమండల గణపతి తీర్ధం: బ్రహ్మనదిలో స్నానం చేస్తే శనిదోషం తొలగిపోతుంది

హిందూ సంప్రదాయంలో వినాయకుడు సకల దేవతలకు అధిపతి. అన్ని కార్యములకూ, పూజలకూ ప్రధమముగా పూజలు అందుకునే వాడు. విజయానికీ, చదువులకూ, జ్ఝానాన్ని అందించే ఆది దేవుడు వినాయకుడు. ఈయనకు 32 రూపాలున్నాయి. ఈయనను గణనాయ

హిందూ సంప్రదాయంలో వినాయకుడు సకల దేవతలకు అధిపతి. అన్ని కార్యములకూ, పూజలకూ ప్రధమముగా పూజలు అందుకునే వాడు. విజయానికీ, చదువులకూ, జ్ఝానాన్ని అందించే ఆది దేవుడు వినాయకుడు. ఈయనకు 32 రూపాలున్నాయి. ఈయనను గణనాయకుడు, గణపతి, గణేశుడు మరియు అన్ని అడ్డంకులు తొలగించు వాడు విఘ్నేశ్వరుడు అంటూ అనేక రకాలుగా కొలుస్తారు.

కర్ణాటక రాష్ట్రం పర్యాటక ప్రదేశాలకు, ఆధ్యాత్మిక ప్రదేశాలకు పెట్టింది పేరు. కర్ణాటక రాష్ట్రంలో చూడాల్సిన అనేక ప్రదేశాల్లో చిక్క మంగళూరు ఒకటి. చిక్కమగళూరు ప్రకృతి అందాలు..కాఫీ తోటల ఘుమఘుమలు..సెలయేళ్ల గలగలలే కాకుండా ప్రకృతి ఒడిలో ఆలయాలెన్నో భక్తుల్లిన విశేషంగా ఆకర్షిస్తున్నాయి.

ఇక్కడ నీటిని సేవిస్తే చాలు..అనేక రుగ్మతలు యాయమవుతాయని భక్తులు విశ్వసిస్తారు. ఏడాది పొడవునా అక్కడ నీటి ధార పెల్లుబుకుతోంటుంది. అదే తుంగ ఉపనది బ్రహ్మ. అక్కడి తీర్థాన్ని స్వీకరించి అనారోగ్య సమస్యల్ని అనారోగ్య సమస్యలెంటిని దూరం చేసుకోవడం కొరకు ఇక్కడకు అనేక మంది యాత్రికులు ఈ ఆలయాన్ని సందర్శిస్తుంటారు. ఇంతకు ఈ ఆలయం ఎక్కడుందో తెలుసుకుందాం..

ఈ ఆలయం ఎక్కడ ఉంది

ఈ ఆలయం ఎక్కడ ఉంది

చిక్క మంగళూరు జిల్లాలోని కొప్ప పట్టణానికి సుమారు 10కిలోమీటర్ల దూరంలో ఉన్న దట్టమైన అటవీ ప్రదేశంలో కమండల గణపతి ఆలయం ఉంది. ఈ ఆలయం వెయ్యి సంవత్సరాల క్రితం నాటిదని చెబుతున్నారు.

PC : Youtube

స్థలపురాణం

స్థలపురాణం

ఆలయ స్థల పురాణం ప్రకారం శని వక్రదృష్టి కారణంగా అనేక సమస్యలను ఎదుర్కొన్న పార్వతీదేవి ఈ ప్రాంతానికి వచ్చి తపస్సు చేయాలనీ భావించి శివుడి కంటే ముందుగా గణపతిని ప్రార్ధించినదట, అప్పుడు బ్రహ్మచారి రూపంలో వినాయకుడు సృష్టించాడని స్థల పురాణం తెలుపుతున్నది.

PC : Youtube

స్థలపురాణం

స్థలపురాణం

ఇలా వినాయకుడు బ్రహ్మచారి రూపంలో కమండలం ధరించి కనిపించిన సృష్టించిన తీర్థాన్ని బ్రహ్మ తీర్థమనీ, కమండలం ధరించి దర్శనమిచ్చిన గణపతిని కమండల గణపతి అనే పేరు వచ్చినదని స్థల పురాణం. ఇక్కడే పార్వతీదేవి తపస్సు చేసిన ప్రదేశం కూడా మనం దర్శనం చేసుకోవచ్చు.
PC : Youtube

ఇక్కడ గణపతి విగ్రహం విశిష్టంగా ఉంటుంది

ఇక్కడ గణపతి విగ్రహం విశిష్టంగా ఉంటుంది

ఇక్కడ గణపతి విగ్రహం విశిష్టంగా ఉంటుంది. యోగముద్రలో కుర్చొన్న రీతిలో ఇక్కడ గణపతి విగ్రహం ఉండటం విశేషం. వర్షాకాలంలో ఇక్కడి పుష్కరిణిలోని నీరు గణపతి పాదం వరకూ చేరుతాయని చెబుతారు.

PC : Youtube

పుష్కరిణిలోని నీరు గణపతిని తాకడం వల్ల

పుష్కరిణిలోని నీరు గణపతిని తాకడం వల్ల

ఆ సమయంలో గణపతిని దర్శించుకొంటే చేసిన సకల పాపాలు పోతాయని చెబుతారు. ఈ పుష్కరిణి కమలం ఆకారంలో ఉంటుంది. ఇక పుష్కరిణిలోని నీరు గణపతిని తాకడం వల్ల ఈ గణపతిని కమండల గణపతి అని అంటారు.

PC : Youtube

గణపతికి ప్రత్యేక పూజలు

గణపతికి ప్రత్యేక పూజలు

ఉదయం 7.30 గంటల నుంచి 8.30 వరకూ ఇక్కడి గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఎటువంటి పూజలు జరుపరు. అందువల్ల ఈ దేవాలయానికి వెళ్లాలనుకొంటే తెల్లవారుజామున ఇక్కడికి వెళ్లడం ఉత్తమం.

PC : Youtube

కుండికలో ప్రత్యక్షమయ్యే నీటిలో అనేక ఔషద గుణాలు

కుండికలో ప్రత్యక్షమయ్యే నీటిలో అనేక ఔషద గుణాలు

భక్తులకు మేలుచేసేందుకు తీర్థాన్ని సృష్టించిందని స్థల పురాణం. కొండల్లో నుంచి భూగర్భంలో చేరుకుని కుండికలో ప్రత్యక్షమయ్యే నీటిలో అనేక ఔషద గుణాలున్నాయంటారు. ఇక్కడి నుండే బ్రహ్మ నది జన్మించి సుదూరంగా ప్రయాణించి తుంగానదిలో కలుస్తుంది. పుణ్యక్షేత్రాలైన కళస హోరనాడు ప్రాంతాల్ని సందర్శించేందుకు వచ్చే భక్తులు కమండల గణపతి ఆలయాన్ని కూడా దర్శించుకుని వెళ్తుంటారు.

PC : Youtube

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X