Search
  • Follow NativePlanet
Share
» »దక్షిణ భారత దేశపు అగ్రభాగం !

దక్షిణ భారత దేశపు అగ్రభాగం !

భారత దేశ దక్షిణ ప్రాంత చిట్ట చివరి భాగంలో ప్రసిద్ధి చెందిన పట్టణం కన్యాకుమారి. ఒక వైపు యాత్రికులకు మరో వైపు నిరంతరం అన్వేషణ సాగించే పర్యాటకులకు అక్కడ కల అద్భుత దృశ్యాలతో ఎంతో ఆనందం కలిగిస్తుంది. తమిళనాడు లోని ఈ పట్టణం అద్భుత దేవాలయాలు, పెద్ద పెద్ద విగ్రహాలు, స్మారకాలు అన్నిటిని మించి అందమైన బీచ్ లతో పర్యాటకుల మదిలో ఒక ప్రత్యేకతను సంతరించుకొన్నది.

కన్యాకుమారి లో సూర్యోదయ, సూర్యాస్తమయాలు అద్భుతంగా వుంటాయి. ఈ అద్భుత దృశ్యాల నేపధ్యంగా ప్రకృతి అక్కడ అనేక కొండలు, రంగుల తీరాలుఅందమైన కొబ్బరి చెట్ల వరుసలు, వరి పొలాలు ప్రసాదించినది. కన్యాకుమారి పట్టణం అసలు సిసలైన దక్షిణ భారత ఆహారాలకు ప్రసిద్ధి. మరి ఇంతఅందమైన పట్టణానికి మీరు స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో కలసి వెళ్లి చక్కని విశ్రాంతి సెలవులు గడపవచ్చు. కన్యాకుమారి లో చూడదగిన పర్యాటక ఆకర్షణలు కొన్ని అందిస్తున్నాము, పరిశీలించండి.

వివేకానంద రాక్ మెమోరియల్

వివేకానంద రాక్ మెమోరియల్

కన్యాకుమారిలోని పర్యాటక ఆకర్షనలలో వివేకానంద రాక్ మెమోరియల్ ఒకటి. వవతురై మెయిన్ ల్యాండ్ కు 500 మీటర్ల దూరంలో ఇది కలదు. ఈ స్మారకం హిందువుల వేదాంతి, ఆధ్యాత్మిక మార్గ దర్శకుడు స్వామీ వివేకానంద జ్ఞాపకార్ధం నిర్మించబడినది. అందమైన ఈ నిర్మాణం చక్కని శిల్ప శైలితో హిందూ మహా సముద్రం, అరేబియా సముద్రం మరియు బంగాళా ఖాత స్వముద్ర ప్రాంతాలు కలిసే దృశ్యాలను చూపుతుంది. ఈ స్మారకం తప్పక చూడదగినది
Photo Courtesy: Arul Jegadish

తిరువల్లువార్ విగ్రహం

తిరువల్లువార్ విగ్రహం

కన్యాకుమారి లో కల తిరువల్లువార్ విగ్రహం తప్పక చూడదగినది. ఈ విగ్రహం తమిళ కవి తిరువల్లువార్ స్మారక చిహ్నం. ఈయన ఒక కవి మాత్రమే కాక గొప్ప వేదాంతి కూడాను. విగ్రహం మొదటి భాగంలో కల బేస్ పై తిరుక్కురాల్ లో వివరించిన 38 అధ్యాయాల గొప్ప తనాలు వివరించారు. రాయిమరియు కాక్క్రీట్ లతో నిర్మించబడిన ఈ విగ్రహం సుమారు 7000 టన్నులకు పైగా బరువు కలిగి వుంటుంది.
Photo Courtesy: ritesh3

దేవి కన్యాకుమారి టెంపుల్

దేవి కన్యాకుమారి టెంపుల్

కన్యాకుమారిలో విశిష్టత కల ఈ టెంపుల్ లో మాత భగవతి తన యవ్వన రూపంలో వుంటుంది. ఈ దేవాలయాన్ని ' శక్తి పీఠాల లో ఒకటిగా భావిస్తారు. కన్యాకుమారి కి వెళ్ళేవారు ఈ దేవాలయ దర్శనం చేసి, మాత ఆశీస్సులు తప్పక పొందుతారు. ఈ దేవాలయం ఉ. 4:30 నుండి మ. 12:15 మరియు సా.4:00 గం నుండి రా. 8:15 వరకూ తెరచి వుంటుంది.
Photo Courtesy: Parvathisri

 తనుమాలయన్ టెంపుల్

తనుమాలయన్ టెంపుల్

17 వ శతాబ్దంలో నిర్మించబడిన తనుమాలయన్ దేవాలయం కన్యాకుమారిలో మరొక పర్యాటక ఆకర్షణ. ఈ దేవాలయం లో హిందువుల దేవతలైన త్రిమూర్తులు అంటే, శివ, బ్రహ్మ మరియు విష్ణుమూర్తి ఒకే రూపంలో అంటే స్తానుమల్యం అనే పేరుతో పూజించ బడతారు. ఈ దేవాలయ అందమైన శిల్ప శైలి ఆశ్చర్య పరుస్తుంది. ఇక్కడ కల తెల్లటి గోపురం అనేక శిలా లేఖనాలు చూపుతుంది. ఏక శీలా హనుమాన్ విగ్రహం సుమారు 22 అడుగుల ఎత్తుతో దర్శనమిస్తుంది. ఇండియా లోని హనుమాన్ విగ్రహాలలో ఇది ఎత్తైనదిగా భావిస్తారు. ఇక్కడ జరిగే ప్రసిద్ధి చెందిన రధోత్సవం మరియు తెప్పోత్సం వంటి వాటికి దేశ నలుమూలలనుండి పర్యాటకులు వస్తారు.

Photo Courtesy: Vinayaraj

పద్మనాభపురం పాలస్

పద్మనాభపురం పాలస్

కన్యాకుమారి లోని పద్మనాభపురం పాలస్ వెలి పర్వత శ్రేణుల దిగువ భాగంలో కలదు. ఈ నిర్మాణం కేరళ శిల్ప శైలికి ఒక ఉదాహరణగా నిలుస్తుంది. ఈ రాజ భవనంలో అనేక భాగాలు అంటే రాజుల ఆస్థాన మండపం, రాణి వాసం, సభా భవనం, మధ్య భవనం మరియు దక్షిణ భవన విడిది వంటివి కలవు. దక్షిణ భవన విడిది వంటి భాగాలు సుమారు 400 సంవత్సరాల నాటివి. ఇపుడు ఈ భవనం ఒక మ్యూజియం గా మార్చారు. ఈ భవనంలో మరొక పురాతన వస్తువు 300 సంవత్సరాల పురాతన గడియారం. నేటికి ఇది చక్కగా గంటలు కొడుతుంది. ఈ పాలస్ తమిళనాడు లో ఉన్నప్పటికీ, దీనిపై నిర్వహణా హక్కులు కేరళ ప్రభుత్వం కింద కలవు.
Photo Courtesy: Aviatorjk

సొత విలాయి బీచ్

సొత విలాయి బీచ్

కన్యాకుమారి లోని సొత విలాయి బీచ్ మరొక పర్యాటక ఆకర్షణ. సుమారు 4 కి. మీ. ల పొడవు కల ఈ బీచ్ తమిళనాడు లో పొడవైన బీచ్ లలో ఒకటిగా లెక్కించబడుతుంది. బీచ్ పరిశుభ్రంగా వుండి అధిక జనాలు లేకుండా వుంటుంది. కుటుంబ విహారాలకు ఇది ఒక అనువైన ప్రదేశం.

Photo Courtesy: Infocaster

కన్యాకుమారి బీచ్

కన్యాకుమారి బీచ్

తమిళనాడు లో ప్రసిద్ధి చెందిన కన్యాకుమారి బీచ్ లో నిరంతరం అలలు ఎగిసి పడుతూ పర్యాటకులకు ఆనందం కలిగిస్తుంది. బీచ్ ను ఒక గోడ వేరు పరుస్తుంది. ఆ ప్రదేశం దాటి ఎవరూ ముందుకు వెళ్లారు. అనేక అందమైన ఇసుక తిన్నెలు కల ఈ బీచ్ ప్రదేశం సూర్యాస్తమయాలు చూసి ఆనందించే ప్రదేశంగా వుంటుంది. పౌర్ణమి రాత్రులలో బీచ్ లో కూర్చొని వెన్నెలలో ఎగిసిపడే అలలు చూడటం ఇక్కడి ప్రత్యేకత.

Photo Courtesy: Raj

తిర్పరప్పు జలపాతాలు

తిర్పరప్పు జలపాతాలు

వర్ష రుతువులో లేదా వర్షాల తర్వాత చూడదగిన ఈ జలపాతాలు కన్యాకుమారిలో ఒక గొప్ప ఆకర్షణ. సుమారు 300 అడుగుల పొడవు కల ఈ జలపాతాలు సుమారు 50 అడుగుల ఎత్తు నుండి కింద పడతాయి. పిల్లల ఆనందం కొరకు ప్రభుత్వం ఇక్కడ ఒక స్విమ్మింగ్ పూర్ కూడా నిర్మించినది. కుటుంబ సభ్యులతో లేదా స్నేహితులతో విహరించేందుకు ఇది ఒక గొప్ప పిక్నిక్ ప్రదేశం.
Photo Courtesy: Pranav

ఫుడ్ మరియు షాపింగ్

ఫుడ్ మరియు షాపింగ్

ఆహార ప్రియులకు కన్యాకుమారి రుచికరమైన దక్షిణ భారత దేశ వంటకాలను అందిస్తుంది. బీచ్ లలో కూడా చిరుతిండ్లు దొరుకుతాయి. ఇక్కడ కల హోటల్ సి వ్యూ ఆహారాలకు ప్రసిద్ధి.

బీచ్ ప్రాంతం కావటం వలన ఇక్కడ మీకు రంగు రంగుల సముద్రపు గవ్వలు, గాలి గంటలు, అద్దములు, చిత్ర పటాలు, కీ చైన్ లు,మొదలైనవి కొనుగోలు చేయవచ్చు. చెక్క మరియు తాటి ఆకులతో చేసిన కొన్ని సహజ ఉత్పత్తులు సైతం లభిస్తాయి.
Photo Courtesy: Ryan

కన్యాకుమారి ఎలా చేరాలి ?

కన్యాకుమారి ఎలా చేరాలి ?

రోడ్డు మార్గం
కన్యాకుమారి రాష్ట్ర మరియు జాతీయ రహదారులలో కలుపబడి వుంది. తిరువనంతపురం నుండి 85 కి. మీ. లు మదురై నుండి 244 కి. మీ. ల దూరం కలదు. కేరళ మరియు తమిలనాడులు అనేక బస్సు సర్వీస్ లను నిర్వహిస్తాయి. కర్నాటక, ఆంధ్ర ప్రదేశ ల లోని ప్రధాన నగరాలనుండి కూడా బస్సు సర్వీస్ లు కలవు.
రైలు మార్గం లో చేరాలనుకునే వారికి ఇండియా లోని అనేక ప్రధాన నగరాలనుండి కన్యాకుమారికి ట్రైన్ సర్వీస్ కలదు. ఈ మార్గాలలో అనేక ఎక్స్ప్రెస్స్ రైళ్ళు నడుస్తాయి.
విమాన ప్రాణం చేయ గోరె వారికి సమీప విమానాశ్రయం 82 కి.మీ. ల దూరంలో తిరువనంతపురం లో కలదు. మదురై ఎయిర్ పోర్ట్ 244 కి. మీ. లు. ఎయిర్ పోర్ట్ లలో టాక్సీ లు, బస్సు లు లభ్యంగా వుంటాయి.

Photo Courtesy: Mehul Antani

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X