• Follow NativePlanet
Share
» »ఇక్కడ ఎలుకలే దేవుళ్లు

ఇక్కడ ఎలుకలే దేవుళ్లు

Posted By: Kishore

ఈ దేవాలయంలో సుమారు 25,000 నల్ల ఎలుకలు సజీవంగా ఉన్నాయని ప్రసిద్ధి. ఈ ఎలుకలు దేవాలయం అంతా తిరుగుతుంటాయి. ఈ ప్రసిద్ధ ఎలుకలను కబ్బాలు అని పిలుస్తారు. ఈ ఎలుకలు దైవత్వ ఎలుకలుగా పూజిస్తారట. ఈ దేవాలయాన్నిసందర్శించడానికి దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచే కాకుండా ప్రపంచం నలుమూలల నుంచి కూడా వస్తుంటారు. ఆ ఆలయమే కర్ణిమాత ఆలయం. రాజస్థాన్ లోని బికనేర్ కు 30 కి.మీ దూరంలో ఈ దేవాలయం. ఇది ఎలుకల దేవాలయంగా ప్రసిద్ధి చెందింది. ఈ దేవాలయానికి సంబంధించిన వివరాలు నేటివ్ ప్లానెట్ పాఠకుల కోసం

1. దుర్గా దేవి ఉపాసకురాలు

1. దుర్గా దేవి ఉపాసకురాలు

P.C শক্তিশেল

కర్ణిమాత బాల్యం నుంచి దుర్గాదేవి ఉపాసకురాలు. ఈమె 150 సంవత్సరాలు జీవించిందని తెలుస్తోంది. పుట్టుకతోనే ఈమెకు అతీంద్రియ శక్తులు ఉండేవని ప్రచారం.

2. అదృశ్యమైంది.

2. అదృశ్యమైంది.

P.C Ms Sarah Welch


తనకున్న శక్తులతో పేదలు, భక్తుల సమస్యలు పరిష్కరించేదని ప్రతీతి. దీంతో స్థానిక ప్రజలు ఆమెకు ఎక్కువ గౌరవం ఇచ్చేవారు. ఒకరోజు ఆమె ఆకస్మాత్తుగా తన ఇంట్లోనే అదృశ్యమైంది. అటు పై ఎవరికీ కనిపించలేదు.

3. అక్కడే ఆలయం నిర్మించారు.

3. అక్కడే ఆలయం నిర్మించారు.


P.C Jean-Pierre Dalbéra


దీంతో ఆమెను దైవాంశ సంభూతురాలుగా భావించి కర్ణిమాతకు అక్కడే ఆలయం నిర్మించి పూజలు జరిపారు. కొంతకాలానికి భక్తులతో ఆమె మాట్లాడుతూ తమ వంశస్థులంతా త్వరలోనే చనిపోతారని తెలిపింది.

 కొన్ని రోజులకు

కొన్ని రోజులకు

P.C dalbera

చనిపోయిన వారంతా ఎలుకలుగా జన్మించి ఇక్కడే ఉంటారని, వారికి అన్నపానీయాలు సమర్పించి ధన్యులు కమ్మని చెప్పిందట. మాత చెప్పిన విధంగానే కొన్ని రోజులకు ఆ కుటుంబాల వారంతా మరణించడం వెంటనే ఆలయంలో ఎలుకలు గుంపులు గుంపులు వచ్చాయి.

5. కర్ణి మాత వంశీయులే అని భావిస్తారు

5. కర్ణి మాత వంశీయులే అని భావిస్తారు

P.CAvinashmaurya


దీన్ని చూసిన వారంతా కర్ణిమాత వంశీయులే ఎలుకలుగా మారారని భావించారు. నాటినుంచే ఈ ఎలుకలను కర్ణిమాతతో సమానంగా పూజించడం మొదలుపెట్టారట.

6. మరో కథనం ప్రాకారం

6. మరో కథనం ప్రాకారం

Image source:

మరో జానపద కథ ప్రకారం 20 వేల మంది బలమైన సైన్యం ఒకానొక యుద్ధంలో ఓడిపోయి, పారిపోయి దేష్నోక్ గ్రామానికి చేరుకుంది. ఇక్కడికి వచ్చాక యుద్ధం నుంచి పారిపోవటం మహాపాపమని, దానికన్నా మరణమే మేలని భావించారు.

7. మరణ శిక్ష విధించుకుంటారు

7. మరణ శిక్ష విధించుకుంటారు

P.C Jean-Pierre Dalbéra


అటు పై తమకు తామే మరణశిక్ష విధించుకున్నారు. కర్ణిమాత వారి ఆత్మహత్య దోషం పోవడానికి ఈ ఆలయంలో ఎలుకలుగా ఉండిపొమ్మని చెప్పిందట. సైనికులంతా కర్ణిమాతకు తమ కృతజ్ఞతలు తెలియజేస్తూ అక్కడే ఉండిపోయారట. అలా మానవులే ఎలుకలుగా పునర్జన్మ ఎత్తినట్టుగా భావిస్తారు.

8.దేవాలయంలో తెల్ల ఎలుకలు

8.దేవాలయంలో తెల్ల ఎలుకలు

P.C Vberger

వేలాది నల్లని ఎలుకల మధ్య కొన్ని తెల్లని ఎలుకలు కనిపిస్తాయి. దీనికి కథ కూడా ప్రచారంలో ఉంది. కర్ణిమాతకు ముగ్గురు పిల్లలు పుట్టి పురిట్లోనే కన్నుమూశారు. దీంతో ఆమె తన భర్తకు సొంత చెల్లెలినే ఇచ్చి వివాహం చేసింది.

9.సరోవర్ లో పడిపోతాడు

9.సరోవర్ లో పడిపోతాడు

P.C Jean-Pierre Dalbéra

వారి కుమారుడు ఒకసారి ఆడుకుంటూ కపిల్ సరోవర్‌లో పడి చనిపోయాడు. కర్ణిమాత ఆ బిడ్డ ప్రాణాలను ఇవ్వమని యముడిని వేడుకుంది. యముడు ఆమె ప్రార్థనలకు కరగలేదు. కర్ణిమాత దుర్గాదేవి అనుగ్రహంతో ఆ కుమారుడిని బతికించుకుంది. అంతేకాదు ఆ కుమారుడితో పాటు ఆమె మిగతా ముగ్గురు బిడ్డలూ తిరిగి బతికారట.

10. ఆమె బిడ్డలే

10. ఆమె బిడ్డలే

P.C Arian Zwegers

ఈ ఆలయంలో కనిపించే నాలుగు తెల్లని ఎలుకలు కర్ణిమాత బిడ్డలేనని స్థానిక ప్రజలు చెబుతుంటారు. ఆ నాలుగు ఎలుకలు కనిపించిన వారికి కర్ణిమాత పూర్తి ఆశీస్సులు లభించినట్టే అని భక్తుల నమ్మకం.

11.ఓపికగా ఎదురు చూస్తారు

11.ఓపికగా ఎదురు చూస్తారు

Image source:

అందుకే ఆ నాలుగు తెల్లని ఎలుకలు కనిపించేదాక భక్తులు అక్కడే కూర్చొని ఓపికగా ఎదురుచూస్తుంటారు. అయితే, ఈ తెల్ల ఎలుకలు ముఖ్యమైన వేడుకలలో మాత్రమే కనిపించడం విశేషం.

12. తెల్లవారుజాము 4 గంటలకు

12. తెల్లవారుజాము 4 గంటలకు


P.C Doris Antony

కర్ణిమాత ఆలయంలో తెల్లవారుజాము 4 గంటలకు తొలి పూజ మొదలవుతుంది. పూజారులు అమ్మవారికి నైవేద్యాలు, మంగళహారతి సమర్పించి, మృదంగ ధ్వనులను వినిపిస్తారు.

13. నైవేద్యాన్ని తింటాయి.

13. నైవేద్యాన్ని తింటాయి.


dalbera

ఈ శబ్దాలు విన్న వెంటనే ఎలుకలన్నీ గర్భాలయం నుంచి బిరబిరా బయటకు వస్తాయి. పెద్ద పెద్ద పళ్లాలలో పెట్టిన నైవేద్యాన్ని ఆబగా ఆరగిస్తాయి. ఆ తర్వాత భక్తులు సమర్పించే నైవేద్యాలను తింటూ, ఆలయంలో తిరుగుతూ రోజంతా గడిపేస్తాయి. తిరిగి రాత్రి సమయంలో గర్భాలయంలోకి వెళ్లిపోతాయి.

14. దేవాలయం వద్ద పాలరాతి శిల్పాలు.

14. దేవాలయం వద్ద పాలరాతి శిల్పాలు.


P.C dalbera


నిర్మించినట్టుగా చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఈ ఆలయం 20వ శతాబ్దపు మొదట్లో పునర్నిర్మించారు. మొఘలుల శిల్పకళానైపుణ్యం ఇక్కడి గోడల మీద ప్రతిఫలిస్తూ ఉంటుంది.

15. హైదరాబాద్ వారు అందజేశారు

15. హైదరాబాద్ వారు అందజేశారు


Image source:


ఆలయం ముందు భాగమంతా పాలరాతి వైభవంతో విరాజిల్లుతుంది. వెండి తాపడం చేసిన ద్వారాలు అబ్బురపరుస్తాయి. నగిషీలు చెక్కిన పాలరాతిని హైదరాబాద్‌కు చెందిన కొంతమంది సపన్నులు అందజేశారు.

16. కర్ణిమాతా ఉత్సవాలు

16. కర్ణిమాతా ఉత్సవాలు

Image source:


కర్ణిమాతా ఉత్సవాలు ముఖ్యంగా దెష్ నోక్ వద్ద సంవత్సరానికి రెండుసార్లు జరుగుతాయి. మార్చి - ఏప్రిల్ నెలలలో నవరాత్రులు (చైత్ర శుక్ల ఏకాదశి నుండి చైత్ర శుక్ల దశమి). సెప్టెంబరు - అక్టోబరు నెలలలో (ఆశ్వయుజ శుక్ల ఏకాదశి నుండి ఆశ్వయుజ శుక్ల దశమి వరకు).

17. ఎక్కడ ఉంది, ఎలా వెళ్లాలి

17. ఎక్కడ ఉంది, ఎలా వెళ్లాలి


Image Source:


కర్ణి మాతా దేవాలయం రాజస్థాన్ లోని బికనేర్ కు 30 కి.మీ దూరంలోని దెష్నోకి అనే చిన్న పట్టణంలో ఉంది. బికనీర్ కు దగ్గరగా ఉన్న విమానాశ్రయం జోద్ పూర్. రెండు నగరాలమధ్య దూరం 251 కిలోమీటర్లు.

18. దగ్గర్లో చూడదగ్గ పర్యాటక ప్రాంతాలు

18. దగ్గర్లో చూడదగ్గ పర్యాటక ప్రాంతాలు

Image Source:

కర్ణిమాత దేవాలయంలో పాటు బికనీర్ కు దగ్గరగా జూనాఘడ్ కోట, జైన్ దేవాలయం, జజ్నీర్ సరస్సు తదితర పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి.

పర్యాటకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి
పర్యాటక చిట్కాలు, పర్యాటకానికి సంబంధించిన కథాలు తక్షణం పొందండి