Search
  • Follow NativePlanet
Share
» »హనుమాన్ ఆవహించి ఊగిన విగ్రహం !

హనుమాన్ ఆవహించి ఊగిన విగ్రహం !

By Mohammad

గుజరాత్ రాష్ట్రంలో అహ్మదాబాద్ నుండి భావనగర్ వెళ్లే దారిలో, సాలంగ్ పూర్ (సారంగ్ పూర్) అనే ప్రాంతంలో ప్రసిద్ధిచెందిన శ్రీ హనుమాన్ మందిర్ కలదు. ఈ హిందూ దేవాలయం స్వామినారాయణ ఆలయంగా ప్రసిద్ధి చెందినప్పటికీ ... హనుమాన్ కు అంకితం చేశారు. ఈయనను ఇక్కడ కస్త్ భంజన్ దేవ్ గా పూజిస్తారు. దేవాలయంలో స్వామినారాయణ లేదా శ్రీకృష్ణుని విగ్రహాలు లేదా మూర్తులు ఉండవు.

హనుమాన్ మందిర్

హనుమాన్ మందిర్

చిత్ర కృప : Around The Globe

దేవాలయ చరిత్ర మరియు వివరణ

దేశంలో ప్రసిద్ధిచెందిన స్వామినారాయణ ఆలయాలలో ఇది కూడా ఒకటి. ఇక్కడ అప్పుడప్పుడు ఎన్నో వింతలు, విశేషాలు చోటుచేసుకుంటాయి. దేవాలయంలో విగ్రహాన్ని సద్గురు గోపాలనంద్ స్వామి ప్రతిష్టించినారు. ప్రముఖ కవి రేమాండ్స్ విలియమ్స్ ప్రకారం, గోపాలనంద్ స్వామి విగ్రహాన్ని ప్రతిష్టించే సమయంలో హనుమంతుడు విగ్రహంలోకి ఆవహించి చాలాసేపు ఊగిపోయాడని, ఇదొక అద్భుత దృశ్యం అని చెబుతారు.

హనుమాన్ విగ్రహం వర్ణన

సాలంగ్ పూర్ లో హనుమాన్ 'కస్త్ భంజన్ దేవ్' గా భక్తులకు దర్శనం ఇస్తుంటాడు. హనుమాన్ విగ్రహం మీసాలను కలిగి ఉంటుంది. ఆడ రాక్షసిని కాళ్ళ కింద తొక్కుతున్న దృశ్యం, విగ్రహం వెనకాల కోతులు పండ్లను పట్టుకున్న దృశ్యాలు, గద మొదలైనవి చూడవచ్చు.

ఆలయాన్ని ఎక్కువగా దయ్యంపట్టినోళ్లు దర్శిస్తారు. ఆలయంలో రెండు, మూడు రాత్రులు నిద్రించి హనుమంతుణ్ణి సేవిస్తే ఆ బారినుండి విముక్తి లభిస్తుందని భక్తుల నమ్మకం.

హనుమాన్ కస్త్ భంజన్ దేవ్

హనుమాన్ కస్త్ భంజన్ దేవ్

చిత్ర కృప : Wheredevelsdare

శనివారం, ఆదివారాలలో ఒక్కోసారి భక్తులు ఆలయం గేట్ బయటే వేచి ఉన్న సందర్భాలు .ఉంటాయి ముఖ్యంగా శనివారాలలో. ఆలయ ప్రాంగణం చాలా పెద్దది, విశాలంగా ఉంటుంది. ప్రాంగణంలోని బావిలో దొరికే నీరు పవిత్రమైనదిగా భావిస్తారు. సమీపంలోనే కౌంటర్ లు ఉంటాయి. డబ్బులు చెల్లించి నీటిని ఇంటికి తీసుకెళ్లవచ్చు. ప్రసాదంగా 'సుఖ్ దిస్' అనే గుజరాతి స్వీట్ ను ఇస్తారు.

ఇది కూడా చదవండి : అంబాజీ - పురాతన తీర్థ యాత్ర !

నిత్యాన్నదానాన్ని ఆలయ డైనింగ్ హాల్ లో వడ్డిస్తారు. ఆలయానికి ఎంతమందైతే దర్శిస్తారో అంతమందీ వెళ్లి తినవచ్చు. మీకు ఇష్టమైతే విరాళాలు ఇవ్వండి బలవంతం ఏమీ లేదు. ఎవ్వరూ అడగరు. ఈ అన్నదాన భాద్యత ఆలయ కాంప్లెక్స్ లోని స్వామినారాయణ ఆలయం మరియు ఆలయాల ట్రస్ట్ చూసుకుంటుంది.

సుమారు ఐదు వేల మందికి ప్రతిరోజూ అన్నదానం కార్యక్రమంలో భాగంగా ప్రసాదాన్ని ఇస్తారు. ఇది శనివారాలలో రెట్టింపు సంఖ్యలో ఉంటుంది (దాదాపు పది వేలు). హనుమాన్ చాలిసా పుస్తకాలు తక్కువ ధరకే లభ్యమవుతాయి.

రాత్రిపూట విద్యుత్ దీపాలలో ఆలయం

రాత్రిపూట విద్యుత్ దీపాలలో ఆలయం

చిత్ర కృప : Bhargavinf

వసతి

వసతి కోరుకొనేవారికి ఆలయ గేట్ పక్కనే ధర్మశాల కలదు. దూర ప్రాంతాల నుండి వచ్చేవారు రాత్రిపూట నిద్రపోవచ్చు.

ఆలయ సందర్శన సమయం

ఆలయాన్ని ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు త్రిరిగి మధ్యాహ్నం 3 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ప్రతిరోజూ తెరిచే ఉంటుంది.

ఆలయ ఉత్సవం

హనుమాన్ జయంతి మహోత్సవ్, సుందరకాండ మరియు రామ కథ అనే ఉత్సవాలను ఆలయంలో నిర్వహిస్తారు.

ఆలయం సమీపంలో ఇతర ఆకర్షణలు

భావనగర్ సిటీ కి సమీపాన ఉన్న ఖోదియర్ మాత రాజ్పారా, తలాజా తాలూకాలో గోప్నాథ్ మహాదేవ్ ఆలయం, మహువా సిటీ సమీపాన ఉన్న ఉంచా కొత్థ చాముండ మాత ఆలయం లు సందర్శించదగినవిగా ఉన్నాయి.

స్వామి నారాయణ ఆలయం, సాలంగ్ పూర్

స్వామి నారాయణ ఆలయం, సాలంగ్ పూర్

చిత్ర కృప : Vijay8808

సారంగ్ పూర్ ఎలా చేరుకోవాలి ?

వాయు మార్గం : 156 కి. మీ ల దూరంలో ఉన్న అహ్మదాబాద్ సిటీ సమీప విమానాశ్రయం.

రైలు మార్గం : భావ నగర్ రైల్వే స్టేషన్ సమీపాన కలదు (75 కి. మీ).

రోడ్డు మార్గం : సారంగ్ పూర్ కు రోడ్డు మార్గం ద్వారా చేరుకోవడం చాలా సులభం. బస్సులలో లేదా కార్లలో ఇక్కడికి చేరుకోవచ్చు. భావనగర్ నుండి కేవలం 82 కిలోమీటర్ల దూరంలో సారంగ్ పూర్ ఉంది. గుజరాత్ లోని అన్ని ప్రధాన ప్రాంతాల నుండి బస్సు సేవలు కలవు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X