Search
  • Follow NativePlanet
Share
» »ఖ‌జ్జియార్.. ఇది మినీ స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియా

ఖ‌జ్జియార్.. ఇది మినీ స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియా

ఖ‌జ్జియార్.. ఇది మినీ స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియా

మినీ-స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియాగా ప్ర‌సిద్ధి చెందిన‌ ఖజ్జియార్ హిమాచ‌ల్‌ప్ర‌దేశ్‌లోని డల్హౌసీకి ఇర‌వై కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న ఓ చిన్న ప‌ట్ట‌ణం. ఇక్క‌డి ప‌గ‌టిపూట‌తోపాటు రాత్రిని కూడా ఎంజాయ్ చేసేందుకు ప‌ర్యాట‌కులు ఆస‌క్తి చూపిస్తారు. ఖజ్జియార్ ప‌చ్చ‌ని తివాచీ ప‌రిచిన‌ట్లు క‌నిపించే పచ్చికభూములకు ప్రసిద్ధి చెందింది. ఇక్క‌డి గడ్డి మైదానం మధ్యలో క‌నిపించే ఓ చిన్న సరస్సు సంద‌ర్శ‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ర్షిస్తుంది. అచ్చం ప్ర‌కృతిమాత ప‌ల్ల‌కీపై ఊరిగిన‌ట్లు ఖ‌జ్జియార్ సంద‌ర్శ‌కుల‌కు ఆహ్వానం ప‌లుకుతుంది.

సాహ‌స‌ క్రీడకు అనువైన స్థలం..

సాహ‌స‌ క్రీడకు అనువైన స్థలం..

పారాగ్లైడింగ్, జోర్బింగ్, గుర్రపు స్వారీతో సహా కొన్ని సాహస క్రీడలకు ఖ‌జ్జియార్ చిరునామాగా చెప్పొచ్చు. గుర్రపు స్వారీ అనేది పట్టణంలో మరియు చుట్టుపక్కల చాలా ప్రాంతాల్లో క‌నువిందుచేసే ఓ సాధారణ కార్యకలాపంగానే ఉంటుంది. జోర్బింగ్ అనేది ఈ ప్రాంతంలో ఎక్కువ‌గా క‌నిపించే సాహ‌స‌ క్రీడ. ఇక్కడ ఉన్న భారీ పచ్చికభూములు, లోయలు సాహ‌స‌ క్రీడకు అనువైన స్థలంగా గుర్తింపుపొందాయి. అయితే, వేసవి నెలల్లో మాత్రమే ఇక్కడ జోర్బింగ్ ఆనందించే అవ‌కాశం ఉంటుంది. 6,500 అడుగుల ఎత్తులో ఉన్న ఖజ్జియార్ గోల్ఫ్ కోర్స్‌కు కూడా ప్రసిద్ధి చెందింది. ఇక్క‌డి పచ్చదనంతో నిండిన ప్ర‌కృతి దృశ్యాన్ని మ‌న‌సారా ఆస్వాదించేందుకు ప‌ర్యాట‌కులు పోటీప‌డ‌తారు. అంతేకాదు, ఖజ్జియార్‌కు వెళ్లే మార్గం చలికాలంలో కొన్నిసార్లు భారీ హిమపాతం కారణంగా మూసివేయబడుతుంది. వాటిని సైతం దాటుకుంటూ కొంద‌రు సాహ‌శీకులు త‌మ గ‌మ్య‌స్థానాన్ని చేరుకునేందుకు ఆస‌క్తి చూపుతారు. ప‌ర్య‌ట‌న‌లో ఇది కూడా ఓ భాగంగా భావించేవారూ లేక‌పోలేదు.

కలాతోప్ వన్యప్రాణుల అభయారణ్యం..

కలాతోప్ వన్యప్రాణుల అభయారణ్యం..

డల్హౌసీ నుండి ఖజ్జియార్‌కు వెళ్లే మార్గంలో కలాతోప్ వన్యప్రాణుల అభయారణ్యం సందర్శించడం అస్స‌లు మ‌ర్చిపోకూడ‌దు. సంద‌ర్శ‌కుల‌న మంత్రముగ్ధులను చేసే ఈ ప్ర‌దేశ‌పు ప్ర‌కృతి అందం మాట‌ల్లో చెప్ప‌డం క‌ష్ట‌మే. శీతాకాలంలో ఈ అభ‌యార‌ణ్యం జీవం పోసుకున్న‌ట్లు క‌నిపిస్తుంది. అరుదైన జంతుజాలం ఈ అభ‌యార‌ణ్యం సొంత‌మ‌నే చెప్పాలి. అలాగే, రాజ్‌పుత్‌లు, మొఘల్‌లతో సహా అనేక రాజ‌వంశీయుల పాల‌నా ప్ర‌భావం ఇక్క‌డి చుట్టుప‌క్క‌ల ప్రాంతాల‌ను ఎంతగానో ప్ర‌భావితం చేశాయి. పురాత‌న‌ ఖజ్జీ నాగ్ ఆలయం ఎంతో ప్ర‌సిద్ధ పొందింది. దీనిని 12వ శతాబ్దంలో నిర్మించార‌ని చ‌రిత్ర‌కారులు చెబుతున్నారు. దీని నిర్మాణ శైలి ఎంతో ఆక‌ర్ష‌ణీయంగా ఉంటుంది. ఆ ఆల‌యం నిత్యం ఆధ్యాత్మిక ప‌రిమళాల‌తో అల‌రారుతూ.. ఆల‌య ప‌రిస‌రాలు ఆధ్యాత్మిక వ‌నాన్ని త‌ల‌పించేలా ద‌ర్శ‌న‌మిస్తుంది.

ఖజ్జియార్ సరస్సు..

ఖజ్జియార్ సరస్సు..

చంబా జిల్లాలో ఉన్న సుందరమైన ఖజ్జియార్ సరస్సు 1920 మీటర్ల ఎత్తులో ఉంది. ఇక్క‌డి చుట్టుపక్కల లోయలు చిత్రమైన పక్షి వీక్షణను అందిస్తాయి. ఖజ్జియార్ సరస్సులోని నీరు ఆకాశంలోని నీలి రంగుకు వ్యతిరేకంగా మెరుస్తుంది. సూర్యోద‌య‌, సూర్యాస్త‌మ‌య దృశ్యాలు మ‌న‌సును క‌ట్టిప‌డేస్తాయి. ప‌చ్చిక బ‌య‌ళ్లులాంటి కొండ‌ల చుట్టూ విస్త‌రించిన ఈ స‌ర‌స్సు ప్ర‌కృతి ప్రేమికుల మ‌దిని దోచేస్తుంది. చాలామంది ఇక్క‌డ నేచ‌ర్ వాక్ చేసేందుకు ఇష్ట‌ప‌డ‌తారు. ఇక్క‌డే క్యాంపింగ్ ఏర్పాటు చేసుకుని ఎంజాయ్ చేస్తారు కూడా. ఖజ్జియార్ సరస్సు నుండి కైలాస పర్వతాన్ని కూడా చూడవచ్చు. పొగ‌మంచుతో దుప్ప‌టి క‌ప్పేసిన‌ట్లు ఉండే ప‌రిశ‌రాలు ప‌ర్యాట‌కుల మ‌న‌సును ఉర‌క‌లెత్తేలా చేస్తాయి.

Read more about: khajjiar dalhousie
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X