Search
  • Follow NativePlanet
Share
» »ఖొడాల- ముంబై వారాంతపు ట్రెక్కింగ్ విహారం !

ఖొడాల- ముంబై వారాంతపు ట్రెక్కింగ్ విహారం !

ఖొడాల ప్రధానంగా కొండ ప్రాంతాల మధ్య దట్టమైన ప్రదేశంలో ఉండటం చేత ట్రెక్కింగ్ మరియు విహార స్ధలంగా కూడా పరిగణించబడుతుంది.

By Mohammad

మహారాష్ట్రలోని ధానే జిల్లాలో సముద్ర మట్టానికి సుమారు 1800 అడుగుల ఎత్తున కల ఖొడాల ఒక సుందరమైన గ్రామం. ప్రశాంత వాతావరణానికి ప్రసిద్ధి గాంచిన ఖొడాల దానిలోని ఆకర్షణలు అంటే వైతరణి సరస్సు, ఇగాత్ పురి - కాసర ఘాట్ మరియు ట్రింగల్ వాడి కోటలతో ఒక ప్రధాన పర్యాటక కేంద్రంగా మారింది.

ఖొడాల ప్రధానంగా కొండ ప్రాంతాల మధ్య దట్టమైన ప్రదేశంలో ఉండటం చేత ట్రెక్కింగ్ మరియు విహార స్ధలంగా కూడా పరిగణించబడుతుంది. ఖొడాల చాలా సాంప్రదాయక వాతావరణం కలిగి ప్రశాంతమైన అటవీ ప్రదేశంలో పర్యాటకుల వినోద విహారాలకు గమ్యస్థానం గా ఉన్నది. ముంబై, థానే ప్రాంతాలను సందర్శించే పర్యాటకులు ఖోడాల తప్పక సందర్శిస్తారు. ఇక్కడి ప్రధాన ఆకర్షణలు ఒకేసారి పరిశిలిస్తే ..

ఖోడాల-1

చిత్రకృప : Uncommonactivist85

అమల వైల్డ్ లైఫ్ శాంక్చురీ

అమల వైల్డ్ లైఫ్ శాంక్చురీ సుమారు 15 ఎకరాల స్ధలంలో విస్తరించి ఉంది. ఈ ప్రాంతంలో సహ్యాద్రి శ్రేణులలోని అరుదైన జంతువులు మరియు వృక్షతెగలు కలవు. ఈ ప్రాంతం వివిధ రకాల జంతువులకు, పక్షులకు, మొక్కలకు నివాసంగా ఉంటుంది. ఇక్కడ మచ్చల జంతువులు, వైల్డ్ బోర్, జింక, అడవి దున్న, హైనా మరియు నక్కలు చూడవచ్చు. పక్షులు, వృక్ష సంపద ఇక్కడి అదనపు ఆకర్షణలు.

ఖోడాల-2

చిత్రకృప : Michael Pravin

మౌంటెన్ రేంజ్ వైల్డ్ క్యాంపు

ఖొడాల వద్ద నిర్వహించే మౌంటెన్ రేంజ్ వైల్డ్ కేంప్ ఈ ప్రాంత ప్రధాన ఆకర్షణ. ఈ కేంప్ సుమారు 15 ఎకరాలలో నిర్వహిస్తారు. ఈ కేంప్ లో కొత్త వారికి మరియు అనుభవంకలవారికి సహ్యాద్రి కొండల అందమైన అడవులలో తిరిగేందుకు ట్రెక్కింగ్ సౌకర్యాలు కల్పిస్తారు.

ట్రెక్కింగ్ మాత్రమేకాక, దట్టమైన అడవులలో, ఉత్సాహాన్నిచ్చే జీపు సఫారీలు, జలపాతాలపైకి తాళ్ళతో అధిరోహించటం, మౌంటెన్ బైకింగ్ వంటి క్రీడలు సైతం ఇక్కడ కలవు.

ఖోడాల-3

చిత్రకృప : Anoop Kumar patel

సూర్యమాల్

సూర్యమాల్ ధానే జిల్లాలోని ఖొడాల ప్రాంతంలో కలదు. ఇది అత్యధిక ఎత్తుకల శిఖరంగా పేరొందింది. ఈ ప్రాంతంలోని దట్టమైన పచ్చదనం పర్యాటకులను బాగా ఆకర్షిస్తుంది. సూర్యమాల్ శిఖరం ట్రెక్కింగ్ అవకాశాలు కూడా కల్పిస్తుంది. ట్రెక్కర్ల స్వర్గం అని కూడా దీనిని పిలుస్తారు.

ఒక్కసారి శిఖరం చేరితే, అక్కడినుండి చుట్టుపట్ల ప్రదేశాల అందచందాలు, దిగువ భాగంలోని లోయ పర్యాటకులను అబ్బుర పరుస్తాయి. సూర్యమాల్ కు సమీపంలోనే న్యూరో ధిరపీ సెంటర్ కల మోగా ప్రదేశం కూడా కలదు.

ఖొడాల -6

చిత్రకృప : Moreshwar101

దేవబంధు దేవాలయం

దేవబంధు దేవాలయం నది ఒడ్డున మూడు వైపులా నీటితో అద్భుతంగా కనపడుతూంటుంది. ఇది ఖొడాలకు సమీపంలో ఒక చిన్న గ్రామంలో గంభీరమైన సహ్యాద్రి కొండలలో కలదు. ఇది కేర్వాడిలోని మౌంటెన్ రేంజ్ వైల్డ్ కేంప్ సమీపంలో కలదు. దేవ బంధు దేవాలయం లో గణేశుడి విగ్రహం కలదు.

గణేశ ఉత్సవాలు, వినాయక చవితి మొదలైన పండుగలకు భక్తులు ఈ దేవాలయానికి అధిక సంఖ్యలో వస్తారు. చుట్టుపక్కల ప్రదేశం అంతా కూడా ఒక వినోద విహార ప్రదేవంగా కూడా ఉంటుంది. వెనుక భాగంలో దేవ బంధు జలపాతాలను కూడా దర్శించవచ్చు.

ఖోడాల-4

చిత్రకృప : Mehulsg

ట్రెక్కింగ్ మరియు సంస్కృతి

ఖొడాల ట్రెక్కర్లకు ఆకర్షణీయ స్ధలం. ట్రెక్కింగ్, మౌంటెన్ బైకింగ్, కొండలను తాళ్ళతో అధిరోహించడం వంటి సాహస చర్యలు చేయాలనుకునేవారికి ఒక మంచి ప్రదేశం. ఖొడాల సంవత్సరం పొడవునా ఆహ్లాదకరంగానే ఉన్నప్పటికి శీతాకాల సమయం సందర్శనకు అనుకూలమైనది. గిరిజనుల నాట్యాలను చూడాలంటే వారి పండుగల సమయంలో సందర్శన మరింత బాగుంటుంది.

వసతి

ఖోడాలలో వసతి సదుపాయాలు మెరుగ్గా ఉన్నాయి. 3- స్టార్ హోటళ్ళు, రిసార్టులు వంటివి తక్కువ ధరలలోనే లభిస్తాయి. ఏసీ, నాన్ - ఏసీ, డీలక్స్, లగ్జరీ గదులు అందుబాటులో కలవు.

ఖోడాల-5

చిత్రకృప : Dharmadhyaksha

ఖోడాల ఎలా చేరుకోవాలి ??

ఖొడాల చేరాలంటే, వాయు, రైలు మరియు రోడ్డు మార్గాలు అనుకూలం. ఖొడాలకు సమీపంలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం దేశంలోని అన్ని నగరాలకు, మహారాష్ట్రలోని అన్ని ప్రాంతాలకు విమాన ప్రయాణాలకు అనుకూలం. రైలు ప్రయాణంలో ఖొడాల చేరాలనుకునేవారికి ఇగాత్ పురి రైలు స్టేషన్ దీనికి 30 కి.మీ.ల దూరంలో ఉంటుంది. ముంబై, థానే నుండి ప్రభుత్వ బస్సుల్లో లేదా ప్రవేట్ టాక్సీలలో ప్రయాణించి ఖోడాల చేరుకోవచ్చు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X