Search
  • Follow NativePlanet
Share
» »శ్రావణ మాసంలో మన శరీరభాగాలను ఈ మురుగన్ కు అర్పిస్తే కోరినంత ధనం

శ్రావణ మాసంలో మన శరీరభాగాలను ఈ మురుగన్ కు అర్పిస్తే కోరినంత ధనం

కోలంజియప్పార్ దేవాలయానికి సంబంధించిన కథనం.

భారతదేశంలో దేవాలయాలకు కొదువు లేదు. అందుకే ఏ చిన్న గ్రామంలోనైనా ఒక దేవాలయం ఉంటుంది. అయితే కొన్ని దేవాలయాలు పురాణ ప్రధాన్యత కలిగినవి. అటువంటి దేవాలయాలను వేళ్ల పై లెక్కపెట్టవచ్చు. ఇక దేవాలయాల రాష్ట్రంగా పేరుగాంచిన తమిళనాడులో ఇటువంటి దేవాలయాల సంఖ్య మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే కొంత ఎక్కువగానే ఉందని చెప్పవచ్చు. అటువంటి కోవకు చెందినదే ప్రస్తుతం మనం తెలుసుకోబోయే దేవాలయం. ఈ దేవాలయం లో శ్రావణ మాసంలో ప్రత్యేక పూజలు జరుపుతారు. అటువంటి సమయంలో జంతుబలులు సర్వసాధారణం. అయితే ఇక్కడ మరో ప్రత్యేక ముడుపులు చెల్లించే కార్యక్రమం కొనసాగుతుంది. ఆ కనుకలను సమర్పించడానికి దేశ విదేశాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు. అదే శరీరభాగాలను ఆ దేవుడుకి సమర్పించడం. ఇది వినడానికి కొంత చిత్రంగా ఉన్న అనాదిగా ఈ ఆచారం కొనసాగుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో ఆ ఆలయానికి సంబంధించిన పూర్తి వివరాలు మీ కోసం....

కోలంజియప్పార్ దేవాలయం

కోలంజియప్పార్ దేవాలయం

P.C: You Tube

కోలంజియప్పార్ దేవాలయం తమిళనాడులోని కడలూరు జిల్లా ప్రముఖ శైవక్షేత్రమైన విరుదాచలం శివారున ఉన్న మనవల్లార్ అనే గ్రామంలో ఉంది.

కోలంజియప్పార్ దేవాలయం

కోలంజియప్పార్ దేవాలయం

P.C: You Tube

ఇక్కడ ప్రధాన దైవం సుబ్రహ్మణ్యస్వామి. ఈయన్ను మురుగన్ అని కూడా పిలుస్తారు. ద్రవిడియన్ శైలిలో నిర్మించిన ఈ దేవాలయం దూరం నుంచే భక్తులను ఆకర్షిస్తుంది.

కోలంజియప్పార్ దేవాలయం

కోలంజియప్పార్ దేవాలయం

P.C: You Tube

ఆలయం ఐదంతస్తుల గోపురంతో ఉంటుంది. ఈ దేవాలయం ఉదయం 6.30 గంటల నుంచి 8.30 గంటల వరకూ తెరిచి ఉంచుతారు. మధ్యాహ్న సమయంలో కొంత సేపు దేవాలయాన్ని మూసివేస్తారు.

కోలంజియప్పార్ దేవాలయం

కోలంజియప్పార్ దేవాలయం

P.C: You Tube

తమిళ సాహిత్యంలో పేరుగాంచిన ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ వాగ్గేయకారుడు సుందరార్ వల్లే ఇక్కడ సుబ్రహ్మణ్యస్వామి కోలంజియప్పార్ రూపంలో కొలువై ఉన్నాడని చెబుతారు.

కోలంజియప్పార్ దేవాలయం

కోలంజియప్పార్ దేవాలయం

P.C: You Tube

ఇందుకు సంబంధించిన స్థినక కథ ఒకటి ప్రచారంలో ఉంది. గొప్పశైవ భక్తుడైన సుందరార్ దేశాటన చేస్తూ శైవ తత్వాన్ని ప్రచారం చేసేవారు. ఇక ఆయనకు ముసలితనం వచ్చేసింది.

కోలంజియప్పార్ దేవాలయం

కోలంజియప్పార్ దేవాలయం

P.C: You Tube

అయినా కూడా దేశాటన చేస్తూ శివుడి గురించిన పాటలు, పద్యాలను సాధారణ భక్తులకు వినపిస్తూ చాలా మంది ప్రజలను శైవ భక్తులుగా మార్చేసేవాడు. ఆయన పాటలు చాలా మధురంగా ఉండేవి.

కోలంజియప్పార్ దేవాలయం

కోలంజియప్పార్ దేవాలయం

P.C: You Tube

ఈ క్రమంలోనే ఒకసారి ప్రస్తుతం కోలంజియప్పార్ దేవాలయం ఉన్న చోటుకు వస్తాడు. అక్కడ ఉన్న శివలింగాన్ని చూసి భక్తిపారవశ్యంతో శివుడి గురించి ఆశువుగా కొన్ని పాటలను అప్పటికప్పుడు రచిస్తాడు.

కోలంజియప్పార్ దేవాలయం

కోలంజియప్పార్ దేవాలయం

P.C: You Tube

అతేకాకుండా గానం చేస్తాడు. కొద్దిసేపు ఆ పరమేశ్వరుడిని ధ్యానించిన తర్వాత అక్కడి నుంచి బయలుదేరి సుందరార్ ముందుకు వెలుతాడు.

కోలంజియప్పార్ దేవాలయం

కోలంజియప్పార్ దేవాలయం

P.C: You Tube

ఆ గానమాధుర్యానికి ముగ్దుడైన పరమశివుడు తన కుమారుడైన సుబ్రహ్మణ్యస్వామిని పిలిచి తిరిగి ఆ సుందరార్ ను కొలంజియప్పార్ వద్దకు తీసుకువచ్చి మరోసారి ఆ పాటలను పాడించాల్సిందిగా కోరుతాడు.

కోలంజియప్పార్ దేవాలయం

కోలంజియప్పార్ దేవాలయం

P.C: You Tube

తండ్రి కోరిన వెంటనే ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడు ఓ బోయవాడి వేశంలో సుందరార్ ఉన్న చోటుకు వచ్చి ఆయన వస్తువులన్నీ లాక్కొంటాడు. ముఖ్యంగా శివుడి గురించి రచించిన పాటలతో కూడిన తాళపత్ర గ్రంథాలు అందులో ఉంటాయి.

కోలంజియప్పార్ దేవాలయం

కోలంజియప్పార్ దేవాలయం

P.C: You Tube

దీంతో సుందరార్ తన వస్తువులన్నీ ఇచ్చేయాల్సిందిగా ఆ బోయవాడి రూపంలో ఉన్నమురుగన్ ను సుందరార్ ను వేడుకొంటాడు. అయినా సుబ్రహ్మణ్యస్వామి వినడు. చివరికి ఒక షరత్తు విధిస్తాడు.

కోలంజియప్పార్ దేవాలయం

కోలంజియప్పార్ దేవాలయం

P.C: You Tube

దాని ప్రకారం తన వెంట కోలంజియప్పార్ కు రావాల్సిందిగా సుబ్రహ్మణ్యస్వామి సుందరార్ ను ఆదేశిస్తాడు. దీనిని దేవుడి ఆజ్జగా భావించి సుందరార్ కోలంజియప్పార్ వద్దకు వస్తాడు.

కోలంజియప్పార్ దేవాలయం

కోలంజియప్పార్ దేవాలయం

P.C: You Tube

అటు పై సుబ్రహ్మణ్యస్వామి తన నిజరూపాన్ని ప్రదర్శించి శివుడి గురించి పాటలు పాడాల్సిందిగా ఆదేశిస్తాడు. ఇందుకు సుందరార్ ఆనందంగా అంగీకరిస్తాడు.

కోలంజియప్పార్ దేవాలయం

కోలంజియప్పార్ దేవాలయం

P.C: You Tube

దీంతో సుందరార్ ఆనందంగా శివుడి గురించి పాటలు పాడుతాడు. అటు పై సుబ్రహ్మణ్యస్వామి ఇక్కడ కోలంజియప్పార్ గా కొలువై ఉండాలని సుందరార్ కోరుతాడు.

కోలంజియప్పార్ దేవాలయం

కోలంజియప్పార్ దేవాలయం

P.C: You Tube

భక్తుడితో పాటు తండ్రి ఆదేశాలను పాటిస్తూ ఆ సుబ్రహ్మణ్యుడు ఇక్కడ కోలంజియప్పార్ గా ఇక్కడ కొలువై ఉండిపోతాడు. ఇక ఇక్కడ ప్రతి రోజూ నాలుగుసార్లు పూజలు జరుగుతాయి.

కోలంజియప్పార్ దేవాలయం

కోలంజియప్పార్ దేవాలయం

P.C: You Tube

వాటిలో ఉదయం కాలసంది 8 గంటలకు, ఉచ్చికాల పూజ 10 గంటలకు జరుగుతుంది. అదే విధంగా సాయంకాలం 6 గంటలకు సాయరాక్షి 6 గంటలకు, ఆర్థజమ పూజ రాత్రి 8.15 గంటలకు జరుగుతుంది.

కోలంజియప్పార్ దేవాలయం

కోలంజియప్పార్ దేవాలయం

P.C: You Tube

అదేవిధంగా తమిళ పంగునీ మాసంలో (మార్చి-ఏప్రిల్) జరిగే ఉత్సవాలు, వైసాఖి ( మే-జూన్) తో పాటు తమిళ ప్రజలు ఎంతో పవిత్రంగా జరుపుకొనే ఆది ఉత్సవం చాలా బాగా జరుగుతుంది.

కోలంజియప్పార్ దేవాలయం

కోలంజియప్పార్ దేవాలయం

P.C: You Tube

ఆ సమయంలో పాలతో నిండిన కుండలతో కావడికి దేవుడికి సమర్పిస్తారు. అదే సమయంలో జరిగే రథోత్సవం చాలా వైభవంగా ఉంటుంది. ఆ సమయంలో భక్తులు తమ శరీరభాగాలను సుబ్రహ్మణ్యుడికి కానుకగా సమర్పిస్తారు. భయపడకండి ఆ శరీరభాగాలన్నీ కేవలం చిన్న లోహం ముక్కతో చేసినవే.

కోలంజియప్పార్ దేవాలయం

కోలంజియప్పార్ దేవాలయం

P.C: You Tube

ఇలా చేయడం వల్ల తమ ఇంట ఐశ్వర్యం పెరుగుతుందని స్థానక ప్రజల నమ్మకం. ఈ కానుకలు సమర్పించడానికి దేశంలోని నలుమూలల నుంచి కూడా భక్తులు ఎక్కువ సంఖ్యలో వస్తుంటారు.

కోలంజియప్పార్ దేవాలయం

కోలంజియప్పార్ దేవాలయం

P.C: You Tube

కడలూరు నుంచి ఈ దేవాలయానికి నిత్యం ప్రభుత్వ, ప్రైవేటు బస్సు సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. ఇక కడలూరుకు చెన్నైతో పాటు బెంగళూరు తదితర ప్రాంతాల నుంచి కూడా బస్సు సర్వీసులు ఉన్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X