Search
  • Follow NativePlanet
Share
» »కొల్లి హిల్స్ పర్యటన - ప్రకృతి ఒడిలో పరవశం !

కొల్లి హిల్స్ పర్యటన - ప్రకృతి ఒడిలో పరవశం !

చెన్నై నగరం నుండి ఒక వారాంతంలో చుట్టుపట్ల పర్యటించాలని భావిస్తున్నారా ? అయితే, కొల్లి హిల్స్ ఒక చక్కని ప్రదేశం. మంచు పొగలు, పొడవైన ఆటవీ మార్గాలు, దేవాలయాల గంటలు, ఆశ్రమాలు,అన్నీ చేరి మీకు నగర ఒత్తిడి తగ్గించి పూర్తి విశ్రాంతినిస్తాయి.

ఈ ప్రదేశంలో ఇంకనూ వాణిజ్య కార్యకలాపాలు చోటు చేసుకోలేదు. అందుకని ఎంతో ప్రశాంతంగా వుంటుంది. కొల్లి హిల్స్ పర్యటించాలంటే ఎలా ?

కొల్లి హిల్స్ ఎలా చేరాలి ?

కొల్లి హిల్స్ ఎలా చేరాలి ?

కొల్లి హిల్స్ మధ్య తమిళ నాడులోని నమక్కల్ జిల్లాలో కలవు. ఈ ప్రదేశం చెన్నై నగరానికి సుమారు 349 కి. మీ. లు. ఈ కొండలు సుమారు 1000 నుండి 1200 మీ. ల ఎత్తులో సుమారు 280 చ. కి. మీ. ల విస్తీర్ణంలో కలవు. ఈ ప్రదేశం చేరాలంటే సుమారు 70 కొండ మార్గ వంపులు తిరగాలి. కనుక డ్రైవింగ్ లో నిపుణులు అయి వుండాలి.

Photo Courtesy: Kurumban

అరపలీస్వరార్ టెంపుల్

అరపలీస్వరార్ టెంపుల్

కొల్లి హిల్స్ లో మాత ఎత్తుకాయ్ అమ్మన్ (కొల్లి పావాయ్ అని కూడా అంటారు) దేవాలయం కలదు. ఎవరికీ తెలియనంత కాలం నుండి ఈ మాత కొల్లి హిల్స్ ను రక్షిస్తోందని చెపుతారు. అరపలీస్వరార్ టెంపుల్ లో ఈమె ప్రధాన దేవత. ఇక్కడ నుండి రాసిపురంలోని శివ టెంపుల్ కు రహస్య సొరంగ మార్గం కలదని చెపుతారు.

Photo Courtesy: Karthickbala

గుహల అన్వేషణ మరియు రాపెల్లింగ్

గుహల అన్వేషణ మరియు రాపెల్లింగ్

ఇక్కడ కల గుహల గోడలపై కల లేఖనాలు ఈ ఆకర్షణ చోళుల కాలం నాటిదిగా సూచిస్తాయి. మీలోని సాహసికుడికి ఇక్కడ రాపెల్లింగ్ క్రీడా సరైనది. రాపెల్లింగ్ అంటే, ఎత్తైన పర్వతం ఏటవాలుల నుండి అతి నెమ్మదిగా కిందకు దిగటం.
Photo Courtesy: Karthick Bala

మసిలా ఫాల్స్

మసిలా ఫాల్స్

మసిలా జలపాతాలు ఇక్కడమరొక ఆకర్షణ. ఈ జలపాతాలు సుమారు 200 అడుగుల ఎత్తునుండి పడతాయి. ఎంతో సురక్షితం కనుక, కుటుంబాలు తమ సభ్యులతో స్నానాలు చేస్తూ ఆనందిస్తాయి. ఇక్కడ వాహన పార్కింగ్ కూడా కలదు. రుసుము రూ.10/-.

ఆకాశ గంగ

ఆకాశ గంగ

ఇక్కడ టెంపుల్ తరవాత ఇది మరొక ప్రధాన ఆకర్షణ. జలపాతాల కిందకు వెళ్ళాలంటే, సుమారు వేయి మెట్లు దిగాలి. మెట్లు ఏటవాలుగా వుండి కష్ట తరంగా వుంటాయి. చుట్టూ పరిశరాలు సుందరంగా వుంది ఆకాశ అనే పేరును సార్ధకం చేస్తాయి.

Photo Courtesy: KarthickBala

ఎత్తుక్కాయ్ అమ్మన్ టెంపుల్

ఎత్తుక్కాయ్ అమ్మన్ టెంపుల్

ఇది ఒక చెన్న దేవాలయం. కాని ఇందులోని మాత చాలా పవర్ఫుల్ అని స్థానికులు చెపుతారు.

Photo Courtesy: Rajeshodayanchal

సిక్కు పరాయి

సిక్కు పరాయి

సిక్కుపరాయి అంది ఒక వ్యూ పాయింట్. ఇక్కడ నుండి కిందకు చూస్తె, లోయ దృశ్యం అద్భుతంగా కనపడుతుంది. అయితే ఇక్కడి స్థానికులు దీనిని 'ఆత్మ హత్యా ప్రదేశం 'అని పిలుస్తారు.

Photo Courtesy: Dilli2040

ఆహారం, వసతి ఎలా ?

ఆహారం, వసతి ఎలా ?

ఈ ప్రదేశం లో కమ్మర్షియల్ టూరిజం లేక పోవటం వలన, సౌకర్యవంతమైన లాజ్ లు లేదా రిసార్ట్ లు అధికంగా లేవు. మీ వసతి కొరకు ముందస్తుగా నల్ల తంబి రిసార్ట్ లో బుక్ చేసుకోవాలి. పర్యావరణ స్నేహ పూరిత హోం స్టే ఒకటి కలదు. రాత్రి ఎనిమిది గంటలు అయితే చాలు పట్టణం నిద్రిస్తుంది. స్థానికంగా మీకు పసందైన పనస పండ్లు, పైనాపిల్స్ తాజా తాజా గా దొరుకుతాయి.

Photo Courtesy: Rajeshodayanchal

చెన్నై ఆకర్షణలకు క్లిక్ చేయండి

చెన్నై హోటల్ వసతులకు క్లిక్ చేయండి

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X