• Follow NativePlanet
Share
» »చలా ‘మని’లోకి వచ్చిన నోటు పై ఉన్న ఈ క్షేత్రంలోనే సూర్యుడు తపస్సు చేశాడు. సందర్శిస్తే

చలా ‘మని’లోకి వచ్చిన నోటు పై ఉన్న ఈ క్షేత్రంలోనే సూర్యుడు తపస్సు చేశాడు. సందర్శిస్తే

Written By: Kishore

మాతృశ్రాద్ధకర్మలు నిర్వహించే ప్రపంచంలోని ఏకైక పుణ్యక్షేత్రం

బహిస్టు వస్త్రం, మద్యం ఇక్కడ ప్రసాదాలు

అమృత బిందువులు పడ్డ ప్రాంతం

కొత్తగా చలా'మని'లోకి వచ్చిన పది రుపాయాల నోటు పై మనకు ఒక పెద్ద చక్రం కనిపిస్తుంది. గమనించారా? ఆ చక్రం ప్రసిద్ధ పర్యాటక కేంద్రమైన కోణార్క్ సూర్య దేవాలయంలోనిది. సూర్య గమనానికి అనుగుణంగా నిర్మించిన ఈ కోణార్క్ దేవాలయం అద్భుత శిల్ప కళ సంపదకు నిలయం. అందువల్లే దీనిని యునెస్కో చేత పరిరక్షించబడే ప్రాంతాల జాబితాలో చేర్చబడింది. అన్నట్టు ఈ దేవాలయం సూర్య గమనానికి అనుగుణంగా నిర్మించబడింది. ఈ క్షేత్రం అటు హిందువులకూ ఇటు బౌద్దులకు కూడా పుణ్యక్షేత్రం. ఇక ఈ క్షేత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

1. పద్మపురాణంలోనే

1. పద్మపురాణంలోనే

Image Source:

కోణార్క్ లోని సూర్యదేవాలయం ప్రస్తావన పద్మపురాణంలో ఉంది. దీని ప్రకారం ప్రకారం సూర్య భగవానుడు ఇక్కడే తపస్సు చేశాడని చెబుతారు. అందువల్లే ఈ క్షేత్రానికి అంతటి పవిత్రత అనేది భక్తుల విశ్వాసం.

2. తమస్సు చేసిన ప్రాంతం

2. తమస్సు చేసిన ప్రాంతం

Image Source:

పురాణ కాలంలో శ్రీకృష్ణుని కుమారుడైన సాంబుడు ఒక శాపం వల్ల కుష్టు రోగం బారిన పడుతాడు. దీంతో శాప విముక్తి కోసం కోణార్క్ కు దగ్గరగా ఉన్న చంద్రభాగ తీర్థంలో సూర్యుడి గురించి తపస్సు చేస్తాడు.

3. ఆ విగ్రహం పై సమాచారం లేదు

3. ఆ విగ్రహం పై సమాచారం లేదు

Image Source:

ఆ సమయంలో తీర్థంలో సూర్యుడి విగ్రహం కనిపిస్తుంది. సూర్యుడి ఆదేశం మేరకు దీనిని ప్రస్తుతం సూర్య దేవాలయం ఉన్న చోట ప్రతిష్టించి పూజించి తన శాపం నుంచి విముక్తి అవుతాడు. అయితే ఆ విగ్రహం ప్రస్తుతం మనకు కనబడదు. అది ఏమయ్యిందన్న విషయం పై సరైన సమాచారం లేదు.

4. ఎర్రని ఇసుక రాయితో

4. ఎర్రని ఇసుక రాయితో

Image Source:

చరిత్ర పరంగా చూస్తే ఈ సూర్య దేవాలయం 13వ శతాబ్దానికి చెందినది. దీనిని ఎర్ర ఇసుక రాయి, నల్లటి గ్రానైట్ తో నిర్మించారు. గంగా వంశానికి చెందిన లాంగులా నరసింహదేవ హయాంలో ఈ దేవాలయ నిర్మాణం జరిగింది.

5. 1200 మంది 12 ఏళ్ల పాటు

5. 1200 మంది 12 ఏళ్ల పాటు

Image Source:

దాదాపు 1200 మంది శిల్పులు దాదాపు 12 ఏళ్లపాటు ఈ దేవాలయ నిర్మాణంలో పాల్గొన్నట్లు చరిత్రాత్మక కథనం. ఈ మందిరం ఎత్తు 230 అడుగులు. ఈ దేవాలయం బౌద్ధులకు కూడా పరమ పవిత్రమైనది. ఇక్కడ బుద్ధుని తల్లి అయిన మాయాదేవి మందిరం కూడా ఉంటుంది. దీనిని చూడటానికి వివిధ దేశాల నుంచి బౌద్దులు కూడా ఇక్కడికి తరుచూ వస్తూ ఉంటారు.

6. సూర్య గమనానికి అనుగుణంగా

6. సూర్య గమనానికి అనుగుణంగా

Image Source:

సముద్ర తీరంలో నిర్మించిన ఈ దేవాలయం సూర్య గమనమునకు అనుగుణంగా ఈ దేవాలయాన్ని నిర్మించారు. ఈ దేవాలయం రథం ఆకారంలో ఉంటుంది. దీనికి 12 జతల పెద్ద రాతి చక్రాలు ఏడు గుర్రాలు ఉంటాయి.

7. ఖచ్చితంగా సమయం

7. ఖచ్చితంగా సమయం

Image Source:

ఈ చక్రాలు 12 నెలలు, 12 రాశులకు చిహ్నాలు. ఏడు గుర్రాలు ఏడు రోజులకు చిహ్నాలుగా చెప్పబడుతాయి. ఈ చక్రాల పై పడే సూర్య కిరణాల ఆధారంగా స్థానికులు ఖచ్చితమైన సమయాన్ని చెబుతారు. దీన్ని బట్టి ఈ దేవాలయాన్ని ఎంత శాస్త్రీయంగా నిర్మించారో చెప్పడానికి వీలవుతుంది.

8. మూల విరాట్టు ఉండడు

8. మూల విరాట్టు ఉండడు

Image Source:

అలాగే ఇక్కడ ఆలయం పై ఖజురహో మాదిరి అనేక శృంగారభరిత శిల్పాలు సైతం చెక్కబడి ఉన్నాయి. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ సూర్య దేవాలయం గర్భ గుడిలో మూల విరాట్టు ఉండడు. ప్రతి ఏడాది ఇక్కడ రథసప్తమి పండుగను పెద్ద ఎత్తున జరుపుకుంటారు.

9. మిగిలిన దేవాలయాలు ఇవి

9. మిగిలిన దేవాలయాలు ఇవి

Image Source:

కోణార్క్ లోని సూర్యుని దేవాలయంతో పాటు అఖండాలేశ్వర దేవాలయం, అమరేశ్వర ఆలయం, గంగేశ్వరీ తదితర దేవాలయాలు ఎన్నో ఉన్నాయి. ఇక సూర్య దేవాలయానికి దగ్గరగా ఉన్న చంద్రభాగ తీర్థంలో స్నానం చేసి దేవాలయంలోని నవగ్రహాలను పూజిస్తే దోష నివారణ జరుగుతుందని ఇక్కడి వారి నమ్మకం.

10. పెద్ద ఎత్తున ఉత్సవాలు

10. పెద్ద ఎత్తున ఉత్సవాలు

Image Source:

ఇక్కడ చంద్రబాగ్ తీర్థమే కాకుండా మంగళాదేవి తీర్థం, పాల్మిలిబాంగ్ తీర్థం, చాయాదేవి తీర్థాలు ఉన్నాయి. కోణార్క్ లో ప్రతి ఏడాది మాఘ శుద్ధ సప్తమికి (రథసప్తమి) రోజున పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవాలకు ప్రపంచం నలుమూలల నుంచి వేలాది మంది పర్యాటకులు తరలి వస్తారు.

పర్యాటకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి
పర్యాటక చిట్కాలు, పర్యాటకానికి సంబంధించిన కథాలు తక్షణం పొందండి