Search
  • Follow NativePlanet
Share
» »ఆంధ్రా పాలిట భూతలస్వర్గం ... 'కోనసీమ' !

ఆంధ్రా పాలిట భూతలస్వర్గం ... 'కోనసీమ' !

కోనసీమ ప్రకృతి రమణీయకతకు చాలా ప్రసిద్ధి చెందింది. ఇక్కడి ప్రధాన వృత్తి వ్యవసాయం.

By Mohammad

కోనసీమ తూర్పు గోదావరి జిల్లాలో గోదావరి పరీవాహక ప్రాంతంలోని త్రిభుజాకార ప్రదేశం. పచ్చని తీవాచీ పరిచినట్లుంటే కోనసీమలో నదీ సంగమ ప్రదేశాలు, ఓడరేవులు, ఆహారాలు విశిష్టంగా ఆకర్షిస్తాయి. కోనసీమ నాలుగు వైపులా గోదావరి, బంగాళాఖాతాలు చుట్టుముట్టి ఉన్నాయి.

కోనసీమ ప్రకృతి రమణీయకతకు చాలా ప్రసిద్ధి చెందింది. కోనసీమ పదం మూల (కోన) ప్రదేశం (సీమ) నుండి వచ్చింది. కోనసీమకు సరిహద్దులుగా ఉత్తరం వైపు గోదావరి పాయ అయిన గౌతమి, దక్షిణం వైపున వశిష్ట అనే గోదావరి పాయ ఉన్నాయి. ఇక్కడి ప్రధాన వృత్తి వ్యవసాయం. కోనసీమలో ఉన్న ప్రధాన ప్రదేశాలు అమలాపురం, రావులపాలెం, రాజోలు, ముమ్మిడివరం,ముక్తేశ్వరం, కొత్తపేట అంబాజీపేట. రాజమండ్రి కోనసీమకు పక్కనే పెద్ద నగరం.

ఇది కూడా చదవండి : రాజమండ్రి -సమీప పర్యాటక ప్రదేశాలు !

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కోనసీమ అందాలను, ఇక ఆలస్యం చేయకుండా చూసొద్దాం పదండి..!

పంటపొలాలు

పంటపొలాలు

కోనసీమలో పండించని పంట ఉండదు. కోనసీమలో వరి తర్వాత ఎక్కువగా అరటిని పండిస్తారు. పలురకలైన కొబ్బరి మొదలు, అరటి, మామిడి, పనస, సపోటా, బత్తాయి ఇలా పలురకాలు కానవస్తాయి. ఇవేకాక అన్ని రకాల కూరగయలు, పూలమొక్కలు, లంక గ్రామప్రాంతాలలో విస్తారంగా పండిస్తారు.

చిత్ర కృప : v s s n murthy manda

సంస్కృతి - సంప్రదాయాలు

సంస్కృతి - సంప్రదాయాలు

కోనసీమ ప్రాంతం పురాతన ఆంధ్ర సంస్కృతీ - సాంప్రదాయాల నిలయం. ఇక్కడ ఇంకా అంతరించని కొన్ని ఆంధ్ర సాంప్రదాయాలు చూడవచ్చు. అతిధి, అభ్యాగతులను ఆదరించడం, పండుగలను, పబ్బాలను సాంప్రదాయానుసారంగా నిర్వహించడం ఇక్కడ గమనించవచ్చు. తెలుగు సంవత్సరాది ఉగాది, సంక్రాంతి కోనసీమలో అత్యంత ప్రజాదరణ పొందిన పండుగలు.

చిత్ర కృప : Palavelli Resorts

పలకరింపులు

పలకరింపులు

కోనసీమ పలకరింపులు భలేగా ఉన్నాయి. చాలా సినిమాలలో అబ్సర్వ్ చెసింటారనుకోండి ..! ఇక్కడి వారు కొత్తవారిని అండీ, ఆయ్ " అంటూ ఒక ప్రత్యేక శైలిలో ఆప్యాయంగా పలకరించడం చూడవచ్చు. సంప్రదాయ అమ్మాయిలను పెళ్లి చేసుకోవాలంటే కోనసీమ రాక తప్పదు.

చిత్ర కృప : మన కోనసీమ అందాలు

దేవాలయాలు

దేవాలయాలు

కోనసీమ ప్రాంతంలో పర్యాటకులు ఎన్నో దేవాలయాలను చూడవచ్చు. వాటిలో ప్రధానమైనవి

మురమళ్ళలో గల శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారి గుడి

ర్యాలీ లో గల జగన్మోహిని కేశవ స్వామి గుడి

ముక్తేశ్వరం లోని క్షణ ముక్తేశ్వరాలయం, ముక్తేశ్వరాలయం

పలివెల లోని శ్రీ ఉమాకొప్పు లింగేశ్వర ఆలయం

మందపల్లి లోని శనీశ్వర ఆలయం

చిత్ర కృప : విశ్వనాధ్.బి.కె.

మురమళ్ళ

మురమళ్ళ

మురమళ్ళలో గల శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి చాలా నమ్మకం గల ఆలయం. అమలాపురం నుంచి కాకినాడ రూటులో ముమ్మిడివరం తరువాత మురమళ్ళ గ్రామం కలదు. ప్రధాన రహదారి నుంచి 1/2 కి.మీ. ప్రయాణించి ఈ గుడి కి వెళ్ళాలి.

చిత్ర కృప : Veerabhadrarao Katakam

రావులపాలెం

రావులపాలెం

రావులపాలెం కోనసీమ అరటిపండ్ల మార్కెట్ కి ప్రధాన కేంద్రం. దీనిని కోనసీమకు ముఖద్వారం అని పిలుస్తారు.

చిత్ర కృప : konaseema tourism

అమలాపురం

అమలాపురం

అమలాపురం కోనసీమలో ముఖ్యమైన ప్రదేశం. కాకినాడకు 65 కి. మీ ల దూరంలో కలదు . అమలేశ్వరస్వామి, వెంకటేశ్వర స్వామి, సుబ్రమ ణ్యేశ్వర స్వామి, చంద్రమౌళీశ్వర స్వామి, అయ్యప్పస్వామి, షిర్డీ సాయి స్వర్ణ మందిరం చూడదగ్గవిగా ఉన్నాయి.

చిత్ర కృప : Av9

కోనసీమ వంటలు

కోనసీమ వంటలు

కోనసీమ వంటలు ఆహా ..! అనిపించకమానవు. కోడికూర, కోడి పలావ్ లకు కోనసీమ పెట్టింది పేరు. ఆంధ్రా చేపల పులుసు, రొయ్యల ఇగురు, వేపుడు కూడా రుచిగా వండుతారు. అట్లు, పెసరెట్టు టిఫిన్ కు బాగుంటాయి. మధ్యాహ్నం లంచ్ కి పిక్కల్(చట్నీలు) లేకుండా ఇక్కడి వారి భోజనం పూర్తికాదు. ఇక్కడికి వెళితే పూతరేకులు తప్పక తినండి.

చిత్ర కృప : konaseema recipes

గోదావరి అందాలు

గోదావరి అందాలు

గోదావరి నది పై వంతెనలు నిర్మించక ముందు ప్రజారవాణా అంతాకూడా లాంచీలు, పడవల మీదుగానే సాగిపోయేవి. ఇప్పటికీ వాటిని కొనసాగిస్తూనే ఉన్నారు. గోదావరి నదిలో సుమారు 10-20 నిమిషాల లాంచీ ప్రయాణం (కోనసీమ పరిసర ప్రాంతాలలో .. ) పర్యాటకులకు గొప్ప అనుభూతిని ఇస్తుంది.

చిత్ర కృప : sasi_biotech

పాపికొండల ప్రయాణం

పాపికొండల ప్రయాణం

కోనసీమ నుండి పాపికొండల ప్రయాణం అనుభూతి వర్ణించలేనిది. బిజీ లైఫ్ నుండి రిలీఫ్ కాలావనుకొనేవారికి ఈ ప్రయాణం అనుకూలం.

చిత్ర కృప : Shrikanth Kurminaidu

కోనసీమ పర్యాటకం

కోనసీమ పర్యాటకం

కోనసీమ పర్యాటకం పర్యాటకులను ఆకర్శించటానికి ఎన్నోయాత్రలను అందిస్తున్నది. పాపికొండలు, కొల్లేరు సరస్సు, మారేడుమిల్లి, మంగ్రోవ్ ఫారెస్ట్ ఇక్కడి సమీప అందాలు.ఇక్కడికి వెళ్ళటానికి టూర్ ప్యాకేజీలను, వసతి కై రిసార్ట్ లు అనేకం కలవు.

చిత్ర కృప : Palavelli Resorts

సినిమా షూటింగ్లు

సినిమా షూటింగ్లు

కోనసీమ సినిమా షూటింగ్ లకు పెట్టింది పేరు. ఇప్పటివరకు ఇక్కడ ఎన్నో టాలీవూడ్ సినిమా లు చిత్రీకరించారు.

చిత్ర కృప : మన కోనసీమ అందాలు

కోనసీమ చేరుకోవటం ఎలా ?

కోనసీమ చేరుకోవటం ఎలా ?

వాయు మార్గం : కోనసీమ చేరుకోవటానికి సమీపాన రాజమండ్రి ఎయిర్ పోర్ట్ కలదు.

రైలు మార్గం : కోనసీమ పరిసరాల్లో రాజమండ్రి, కాకినాడ, కోటిపల్లి, గంగవరం, పాలకొల్లు, నరసాపూర్ రైల్వే స్టేషన్ లు కలవు.

చిత్ర కృప : Kartik Kumar S

కోనసీమ చేరుకోవటం ఎలా ?

కోనసీమ చేరుకోవటం ఎలా ?

బస్సు / రోడ్డు మార్గం : హైదరాబాద్ నుండి కోనసీమలోని ప్రతి నగరానికీ హైటెక్ బస్సు సర్వీసులు కలవు. రాజమండ్రి కోనసీమకు ప్రక్కనే కల పెద్ద నగరం. రాజమండ్రి కి రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాల నుండి బస్సు సౌకర్యం కలదు. అక్కడి నుండి కోనసీమప్రాంతాలకు ఆర్డినరీ బస్సు సర్వీసుల ద్వారా చేరుకోవచ్చు.

చిత్ర కృప : మన కోనసీమ అందాలు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X