Search
  • Follow NativePlanet
Share
» »రాజస్థాన్ లోని అతి భయంకరమైన గ్రామం - కుల్ ధారా

రాజస్థాన్ లోని అతి భయంకరమైన గ్రామం - కుల్ ధారా

By Venkatakarunasri

కుల్ ధారా జైసల్మేర్ నగరం నుండి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న చారిత్రిక గ్రామం. పర్యాటకులు సూర్యోదయం, సూర్యాస్తమయం మధ్యలో మాత్రమే సందర్శించడానికి అనుమతి౦చబడే భయానక గ్రామము.

200 సంవత్సరాల నాటి మట్టి ఇల్లు ఇక్కడ చూడవచ్చు. చరిత్ర ప్రకారం, ఈ గ్రామంలో 500 సంవత్సరాల పాటు పాలివాల్ బ్రాహ్మణులు వుండేవారు. అక్కడి క్రూరమైన పాలకులు వాళ్ళను గ్రామ౦ వదలివెళ్ళమని బలవంతం చేసారు.

అందువలన, ఆ గ్రామం పాలివాల్ బ్రాహ్మణులచే శపించ బడిందని ప్రజల నమ్మకం.

ఈ ఊరు ఎంత నిర్మానుష్యంగా భయంకరంగా కన్పిస్తుందో.ఈ వూరు రాజస్థాన్ లోని జైసల్మార్ జిల్లాలో వుంది.సాధారణంగా రాజస్థాన్ అంటే ఎక్కువగా ఎడారి ప్రాంతం ఇసుక దిబ్బలే కన్పిస్తాయి.

ఇక్కడ పురాతన ఇల్లు చూస్తుంటే ఏదో హర్రర్ సినిమా సెటప్ లా కన్పిస్తుంది కదా.

రాజస్థాన్ లోని దెయ్యాల దిబ్బ రహస్యం

రాజస్థాన్ లోని దెయ్యాల దిబ్బ రహస్యం

రాజస్థాన్ లోని దెయ్యాల దిబ్బ రహస్యం

ఈ గ్రామంలో ఎక్కడ చూసినా ఈ మొండిగోడలు, పిచ్చి మొక్కలు, ఆ ఇరిగిపోయిన ఇల్లు తప్ప ఇంకొక మనిషి గానీ, ఒక జంతువుగానీ కూడా కనిపించదు.

రాజస్థాన్ లోని దెయ్యాల దిబ్బ రహస్యం

రాజస్థాన్ లోని దెయ్యాల దిబ్బ రహస్యం

ఈ విధంగా ఈ మారుమూల గ్రామంలో సుమారుగా 600కు పైగానే ఈ ఇళ్ళు అక్కడున్నాయ్. ఈ రోజుల్లో ఈ ప్రాంతం ఒక పర్యాటకకేంద్రంగా ఇక్కడ రాజస్థాన్ లో ప్రఖ్యాతిగాంచినది.

రాజస్థాన్ లోని దెయ్యాల దిబ్బ రహస్యం

రాజస్థాన్ లోని దెయ్యాల దిబ్బ రహస్యం

కానీ ఇక్కడ సాయంత్రం 6 తర్వాత ఒక్క మనిషి గానీ కన్పించడు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ కొంతమంది కనిపించినా సాయంత్రం తర్వాత చీకటిపడే సమయానికి ఎవ్వరూ ఇక్కడ వుండరు.

రాజస్థాన్ లోని దెయ్యాల దిబ్బ రహస్యం

రాజస్థాన్ లోని దెయ్యాల దిబ్బ రహస్యం

ఇన్ని ఇళ్ళు వున్న ఈ ప్రాంతం ఈ విధంగా నిర్మానుష్యంగా మారటానికి గల కారణాలేంటో?అసలేంజరిగిందో మనం ఈ వ్యాసంలో తెలుసుకుందాం.

ఈ పురాతన గ్రామం ఎక్కడుంది?

ఈ పురాతన గ్రామం ఎక్కడుంది?

రాజస్థాన్ లోని జైసల్మార్ జిల్లాలో జన సంచారానికి దూరంగా ఈ పురాతన గ్రామం వుంది. దీని పేరు కుల్ధారా.

ఈ ప్రాంతంలోని ప్రజలందరూ ఏమైనారు?

ఈ ప్రాంతంలోని ప్రజలందరూ ఏమైనారు?

ఒకప్పుడు ఈ పల్లెటూరిలో సుమారుగా 1600ల మంది వరకు జనాలు నివశించేవారు.కానీ ఏమైందోఏమో కానీ ఒకే ఒక్క రాత్రిలో ఆ ప్రజలందరూ ఆ ప్రాంతం నుంచి కనిపించకుండా వెళ్ళిపోయారు.

ఈ ప్రాంతంలోని ప్రజలందరూ ఏమైనారు?

ఈ ప్రాంతంలోని ప్రజలందరూ ఏమైనారు?

ఆ మరసటిరోజు తెల్లారేసరికల్లా ఆ ప్రాంతంలో ఎవ్వరూ లేకుండా ఖాళీ చేసారు.ఒకప్పుడు జనాలతో ఎంతో అలికిడిగా వుండే ప్రాంతంలో ఇప్పుడు హోరుగాలీ,నిశ్శబ్దం తప్ప ఎవ్వరూ మీకు కన్పించరు.

స్థానికులు ఈ గ్రామం గురించి ఏం చెపుతున్నారు?

స్థానికులు ఈ గ్రామం గురించి ఏం చెపుతున్నారు?

ఈ రోజుల్లో ఈ ప్రాంతంలో ఇక్కడ వున్న పుకార్లనుబట్టి రాత్రుళ్ళు ఇక్కడ ఏవో ఆత్మలు తిరుగుతున్నాయని, ఏవేవో వింత శబ్దాలు వినిపిస్తున్నాయనీ, కొన్నిసార్లు ఏవో భయంకరమైన అరుపులు కూడా వినిపిస్తాయనీ అక్కడ వున్న చుట్టుపక్కల గ్రామాల ప్రాంతాలలో వుండే స్థానికులు చెప్తున్నారు.

ఎందుకీవిధంగా జరిగింది?

ఎందుకీవిధంగా జరిగింది?

ఈ వూరు సుమారుగా 11 వ శతాబ్దం నుంచి గూడా ఎంతో ప్రఖ్యాతిచెందినదిగా మనుగడలో వుండేది.కానీ ఎందుకీవిధంగా జరిగింది? ఈ వూర్ని మొత్తం అక్కడుండే ప్రజలు ఒక్కరాత్రిలోనే ఖాళీ చేసి ఎందుకు వెళ్ళిపోయారనేది కారణాలుగా ఆ చుట్టుపక్కల వుండే గ్రామస్థులు కొన్ని రకాల వాదనలని,విషయాలని చెబుతున్నారు.

PC:timeflicks

దీనికంతటికీ కారణమేమిటి?

దీనికంతటికీ కారణమేమిటి?

అవి ఏంటో తెలుసుకుంటే పూర్వం ఈ ప్రాంతంలో వుండే సలీం సింగ్ అనే మంత్రే దీనికంతటికీ కారణమని ఈ ఊరంతా క్రూరంగా ఒకే రోజులో ఒకే ఒక రాత్రిలో ఖాళీ చేయబడినదని అక్కడ ప్రజలు ఇప్పుడు కూడా చెపుతున్నారు.

PC:Tomas Belcik

అసలీ సలీం సింగ్ ఎవరు?

అసలీ సలీం సింగ్ ఎవరు?

ఈ వూరు వున్న జైసల్మేర్ ఒకప్పుడు సలీం సింగ్ అనే అతి క్రూరమైన దుర్మార్గమైన మంత్రియోక్క ఆధీనంలో వుండేది.

PC:nevil zaveri

అసలీ సలీం సింగ్ ఎవరు?

అసలీ సలీం సింగ్ ఎవరు?

అతని యొక్క కనుసన్నలలోనే,పాలనలోనే ఈ వూరి యొక్క ప్రజలంతా జీవిస్తూవుండేవారు.ఆ సలీంసింగ్ ఎంతో దుర్మార్గుడు.

PC: Tomas Belcik

అసలీ సలీం సింగ్ ఎవరు?

అసలీ సలీం సింగ్ ఎవరు?

అతను ఏదైనా వస్తువుని కోరుకున్నా,ఆడదాని కోరుకున్నా అవి దొరకకుండా విడిచి పెట్టడంట. అలాంటి అంత దుర్మార్గుడు ఒకప్పుడు ఆ గ్రామంలో నివసించే ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడట.

PC: chispita_666

 అసలీ సలీం సింగ్ ఎవరు?

అసలీ సలీం సింగ్ ఎవరు?

ఆ అమ్మాయిని ఎలాగైనా పొందాలని ఎన్నో విధాలుగా ప్రయత్నించాడు.కానీ ఆ వూరిలో వుండే వాళ్లు చాలా మంది అడ్డుకున్నారంట. ఆ అమ్మాయిని ఎలాగైనా తన వద్దకు తేవాలని,లేకపోతే ఆ వూరినంతా ఎలాగైనా నాశనం చేస్తానని,ఆ మంత్రి పట్టుబట్టాడట.

PC: Chandra

ప్రజలందరూ ఏం చేసారు?

ప్రజలందరూ ఏం చేసారు?

ఆ గ్రామస్థులంతా ఎంతో అభిమానించే ఆ అమ్మాయి ఆ దుర్మార్గుడి చేతిలో నలిగిపోవటం ఇష్టంలేక ప్రజలందరూ ఆమెను ఉదయాన్నే పంపిస్తామని చెప్పి ఆ మంత్రిని అక్కడినించి పంపించేసాడట.

PC: Chandra

 గ్రామస్థులు ఇప్పటికీ ఏం చెబుతున్నారు?

గ్రామస్థులు ఇప్పటికీ ఏం చెబుతున్నారు?

ఆ తర్వాత గ్రామంలో వుండేవారందరూ ఆ రాత్రికిరాత్రే ఆ అమ్మాయిని పట్టుకొని ఆ రాత్రికిరాత్రే ఆ గ్రామాన్ని ఖాళీచేసి వెళ్లిపోయారని,అందుకే ఆ గ్రామం మొత్తం ఖాళీ అయిపోయిందని ఆ చుట్టుపక్కల వుండే గ్రామస్థులు ఇప్పటికీ చెప్తున్నారు.

PC: Chandra

స్థానికులు ఏం చెబుతున్నారు

స్థానికులు ఏం చెబుతున్నారు

అదే విధంగా ఆ చుట్టుపక్కల గ్రామాలలో ఉండే ఇంకొంతమంది స్థానికులు ఏం చెబుతున్నారంటే భారతదేశంలో ఒకప్పుడు బ్రిటీషర్స్ పరిపాలించే కాలంలో ఈ రాజస్థాన్ లో కామన్ గా వుండేటట్లు ఇక్కడ గూడా చాలా కరువు ఏర్పడిందని తాగటానికి కనీసం చుక్కనీళ్ళు కూడా లేకుండా ప్రజలు ఎంతో బాధపడ్డారని,వ్యవసాయానికి వాళ్ళ దగ్గరుండే పశువులకి కూడా నీళ్ళు, ఆహారం దొరక్క చాలా మట్టుకుచనిపోయారని,ఈ వూరికి చుట్టుపక్కల క్కూడా ఆ రోజుల్లో ఎక్కడా నీళ్ళు లేకపోవడం వల్ల ఆ ప్రజలందరూ,ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసి వేరే వూళ్ళకి వలసపోయారని కొంత మంది స్థానికులు ఇంకొక కథ చెప్తున్నారు.

PC: Chandra

పుష్కలమైన నీరు

పుష్కలమైన నీరు

కానీ వాళ్ళు చెప్పేదాన్ని బట్టి చూస్తే నమ్మశక్యంగా లేదు. ఎందుకంటే ఈ గ్రామానికి చుట్టుపక్కల చిన్నచిన్న నీటి కొలనులున్నాయి. వాటిలో ఇప్పటికీ గూడా నీరు పుష్కలంగా వున్నాయి. ఈ ప్రాంతాన్ని ఎందుకు అక్కడుండే వారు ఒక్కరోజులో ఖాళీ చేసివెళ్ళారనేది ఖచ్చితంగా ఇప్పటికి గూడా ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు.

PC: Chandra

చెక్కుచెదరని ఇళ్ళు

చెక్కుచెదరని ఇళ్ళు

అక్కడగానీ మీరు ఆ నిర్మాణాలని చూస్తే అక్కడ వుండే ప్రజలు ఆ రోజుల్లో చాలా ద్రుఢంగా,చాలా పకడ్బందీగా అక్కడ వుండే ఇళ్లుని నిర్మించుకున్నారని అలాగే గుళ్ళ యొక్క,కొన్ని ఇళ్ళ యొక్క మండపాలు ఇప్పటికీ కూడా మీకు చెక్కుచెదరకుండా కన్పిస్తూవుంటాయి.

ఏవో అరుపులు శబ్దాలు

ఏవో అరుపులు శబ్దాలు

అయితే వీటినన్నిటినీ నమ్మని గౌరవ్ తివార్ అనే ఒక ఇండియన్ పారానార్మల్ సొసైటీ సభ్యుడు తన టీం తో కలిసి రాత్రివేళ ఈ గ్రామంలో ఏముందో తెలుసుకోవడానికి ఇక్కడే స్టే చేసి వాటిపైన రీసెర్చ్ చేసాడంట.కానీ మొదట్రోజు రాత్రే ఏవో అరుపులు శబ్దాలు వినిపించాయనీ, ఆత్మలు వెళ్తున్నట్టు కన్పించాయనీ దాంతో రిసెర్చ్ ని తర్వాత రోజు కంటిన్యూ చేయలేనని ఆ రోజుల్లో వెల్లడించాడంట.

చుట్టుపక్కల ప్రాంతాలవారి హెచ్చరిక

చుట్టుపక్కల ప్రాంతాలవారి హెచ్చరిక

అంత రీసెర్చ్ నే ఆ విధంగా చెప్పడంవల్ల గ్రామాన్ని దెయ్యాల గ్రామంగా ఆ చుట్టుపక్కల ప్రజలు పిలుచుకుంటూ ప్రచారం చేస్తూ వున్నారు.సాయంత్రం అయితే అటువైపు ఒక్క వాహనం గానీ, మనిషిగానీ వెళ్ళకుండా ఆ చుట్టుపక్కల ప్రాంతాలవారు వారిని హెచ్చరిస్తూవుంటారు.

దెయ్యాలవూరు

దెయ్యాలవూరు

ఇది ఒక దెయ్యాలవూరుగా పబ్లిసిటీ రావటం వల్ల ఆ చుట్టుపక్కల ప్రాంతాలనుంచి చాలామంది ప్రజలు ఇదొక టూరిస్ట్ స్పాట్ గా సెలెక్ట్ చేసుకుని వుదయం నుంచి సాయంత్రం వరకు ఈ ప్రాంతంలో తిరుగుతూ,ఫొటోలు తీసుకుంటూ,ఎంజాయ్ చేసుకుంటూ సాయంత్రం అయ్యే టైంకి తిరిగి ఎవ్వరిమట్టుకు వారు వెళ్లి పోతూ వుంటారు.

PC:chispita_666

ఒకేఒక్క రాత్రిలోనే ఖాళీ చేసి ఎందుకు వెళ్ళిపోయారు?

ఒకేఒక్క రాత్రిలోనే ఖాళీ చేసి ఎందుకు వెళ్ళిపోయారు?

ఏది ఏమైనా కూడా 13వ శతాబ్దం నుంచి ఆ గ్రామంలో ప్రజలు నివసిస్తూ అంట బాగా కట్టుకున్న ఆ ఊరిని 1600ల మంది ప్రజలు ఒక్కరోజులోనే అదీ కూడా ఒకేఒక్క రాత్రిలోనే ఖాళీ చేసి ఎందుకు వెళ్ళిపోయారో ఇప్పటికి కూడా మిస్టరీగానే మిగిలి వుంది.

PC: chispita_666

ఇక్కడ చూడవలసిన సమీపంలోని టూరిస్ట్ ప్రదేశాలు

ఇక్కడ చూడవలసిన సమీపంలోని టూరిస్ట్ ప్రదేశాలు

పోఖ్ రాన్ - ఎడారిలో వారసత్వ నగరం

పోఖ్ రాన్ రాజస్ధాన్ రాష్ట్రంలోని జైసల్మేర్ జిల్లాలో కల ధార్ ఎడారిలో ఒక వారసత్వ నగరం. దీని చుట్టూ అయిదు పెద్ద ఉప్పు కొండలు ఉంటాయి. అందుకే దీనిని అయిదు ఎండమావుల స్ధలంగా చెపుతారు. ఈ ప్రదేశం మొట్టమొదటి సారిగా భారతదేశం అనేక అణు పరీక్షలను ఇక్కడ చేయడంతో గుర్తింపులోకి వచ్చింది. టూరిస్టులు, విమానం, రైలు, రోడ్డు మార్గాలలో పొఖరాన్ తేలికగా చేరవచ్చు. జోధ్ పూర్ రైలు స్టేషన్ మరియు జోధ పూర్ విమానాశ్రయాలు పోఖరాన్ కు సమీప ప్రాంతాలు.

బార్మర్ - కళావృత్తులే ప్రాధాన్యతగా ....!

బార్మర్ - కళావృత్తులే ప్రాధాన్యతగా ....!

బార్మర్ ఒక పురాతన పట్టణం. ఇది రాజస్ధాన్ లోని బార్మర్ జిల్లాలో కలదు. ఈ పట్టణాన్ని 13వ శతాబ్దంలో బాహడ రావు లేదా బార్ రావు కనుగొన్నారు. కనుక అతని పేరుపై ఈ నగరం ఏర్పడింది. బహదామర్ అంటే బహద పర్వత కోట అని అర్ధం చెపుతారు. బార్మర్ ఇండియాలోని ఇతర భాగాలకు, రైలు, రోడ్డు మరియు విమాన మార్గాలలో చేరవచ్చు. బార్మర్ రైలు స్టేషన్ మీటర్ గేజ్ తో జోధ్ పూర్ కు కలుపబడి ఉంది. బస్సులు, టాక్సీలు రాజస్ధాన్ లోని అన్ని నగరాలనుండి బార్మర్ తేలికగా చేరుతాయి.

ఖిమ్ సార్ - ఇసుక దిన్నెల గ్రామం !

ఖిమ్ సార్ - ఇసుక దిన్నెల గ్రామం !

ఖిమ్ సార్ ఒక చిన్న కుగ్రామం. ఇది రాజస్ధాన్ రాష్ట్రంలోని ధార్ ఎడారి చివరిభాగంలో కలదు. ఈ గ్రామం మధ్యభాగంలో ఒక నీటి సరస్సు కలదు. ఎడారిలో ఒయాసి్సు వలే ఇది ఆ ప్రాంతానికి ఎంతో అందాన్నిచ్చింది. ఒకప్పుడు ఖిమ్ సార్ గ్రామం స్వంతంత్ర రాజ్యంగా ఆ ప్రాంతంలోని ఠాకూర్ ల చే పాలించబడింది.

 ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

ఎలా చేరాలి

సూరత్,అహమ్మదాబాద్ మార్గం గుండా 32 గంటలు పడుతుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X